Skip to main content

Posts

Showing posts from September 25, 2019

ఆయన తీహార్ లోనే.. సోనియా పరామర్శించలేదా!

కర్ణాటక మాజీమంత్రి డీకే శివకుమారకు మరోసారి భంగపాటు ఎదురైంది. ఆయనకు స్పెషల్ కోర్డు బెయిల్ నిరాకరించింది. ఇప్పటికే కొన్నాళ్లుగా పోలీస్ కస్టడీలో ఉన్న ఆయనకు మరికొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో డీకే శివకుమార అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. దక్షిణాదితో పాటు, గుజరాత్ వరకూ కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ ఉన్న డీకే శివకుమారను అరెస్టు చేసి కాంగ్రెస్ దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోందని.. కాంగ్రెస్  నేతలు వాదిస్తూ ఉన్నారు. ఇప్పటికే డీకే అరెస్టుపై కర్ణాటక కాంగ్రెస్ వాళ్లతో పాటు, వక్కలిగ కమ్యూనిటీ కూడా భగ్గుమంది. అయితే ఆయనకు న్యాయస్థానం మాత్రం ఊరటను ఇవ్వలేదు. ఆయనను తీహార్ జైలుకే పరిమితం చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తీహార్ జైలును సందర్శించారు. అక్కడ ఉన్న తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి  చిదంబరాన్ని ఆమె పరామర్శించారు. విశేషం ఏమిటంటే డీకే శివకుమార కూడా అక్కడే ఉన్నారు. ఆయన అరెస్టు పట్ల ఇప్పటికే సోనియాగాంధీ నిరసన వ్యక్తంచేశారు. అ...

వైఎస్ వల్లే పోలవరం ఆలస్యం, జగన్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం లేదు: సుజనా చౌదరి ఫైర్

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరి. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ లో పారదర్శకత కనిపించడం లేదని తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నట్లు ఉందన్నారు. ఇటీవల రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్వహించిన హైడల్ ప్రాజెక్టు చూస్తుంటే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి కనీసం మూడేళ్లు పట్టేయోచ్చన్నారు. 15వేల మెగా వాట్ల విద్యుత్ నష్టం వాటిల్లుతుందని వాటి విలువ 5వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.300 నుంచి 400 కోట్లు అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా చూస్తుంటూ పోతే ప్రాజెక్టు మరింత ఆలస్యం, అధిక ఖర్చు అవ్వడమే తప్ప రివర్స్ టెండరింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న సమస్యలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును రీ ఓపెనింగ్ చేయడంతోనే సమ...

సానుభూతి కోసమే చంద్రబాబు కదలడం లేదు: సుజనా చౌదరి ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం ఆరాటపడుతున్నారంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాలు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉండవల్లిలోని ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని కూల్చివేశారని ప్రచారం జరిగితే సానుభూతి వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. అద్దెకు ఉన్నప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేస్తే ఎలాంటి గొడవలు, వివాదాలు ఉండవు  కదా అంటూ హితవు పలికారు. ఇకపోతే ఏపీలో కొన్ని న్యూస్ ఛానెల్స్ ప్రచారాన్ని నిలిపివేయడంపై కూడా చంద్రబాబు నాయుడును వదల్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీడియా సంస్థలను రాకుండా అడ్డుకున్నారని అప్పుడు ఆయన చేసిన తప్పు ఇప్పుడు సీఎం వైయస్ జగన్ చేస్తున్నారంటూ సుజనా చౌదరి స్పష్టం చేశారు. మీడియాను నియంత్రించాలనుకోవడం సరికాదని హితవు పలికారు.

నేనైతే అలాంటి ఇంట్లో ఉండను.. చంద్రబాబు ఖాళీ చేయాలి!: బీజేపీ ఎంపీ సుజనా చౌద

ఉండవల్లి కరకట్టపై ఇంట్లో చంద్రబాబు నివాసం ఉండటంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏదైనా ఒక ఇంట్లో అద్దెకు ఉంటే, అక్కడ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టలేదని తెలిస్తే ‘నేను అయితే అలాంటి ఇంట్లో ఉండను. అప్పుడు వారు (చంద్రబాబు) ఉన్నారు. ఇప్పుడు ఖాళీ చేయాలి. దాని గురించి ఇంత చర్చ ఏంటి?’ అని ప్రశ్నించారు. ఆ ఇంటిని ప్రభుత్వం కనుక పడగొడితే సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటి గురించి లేదా రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయన్న ఆరోపణలపైనా మాట్లాడటమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాపైనా విమర్శలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ దొందూదొందేనని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.

బాబు నివాసం పై హైకోర్టుకు లింగమనేని.. విచారణ వాయిదా

చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేస్తామని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే దీనిపై తాజాగా వ్యాపార వేత్త లింగమనేని రమేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాము సమర్పిస్తున్న వివరణలు, పత్రాలు తీసుకోకుండా కూల్చేస్తామంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంపై లింగమనేని రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లింగమనేని పిటీషన్ పై హైకోర్టు ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది

మోదీ 'ఫాదర్ ఆఫ్ ఇండియా': అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

Image copyright EPA అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత ఆయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియా'గా వర్ణించారు. మోదీ, ట్రంప్ మధ్య మంగళవారం న్యూయార్క్‌లో అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు "భారత్‌లో ఇంతకు ముందు( మోదీ పాలనకు ముందు) ఎలా ఉండేదో నాకు గుర్తుంది. అక్కడ అనైక్యత, విభజన ఉండేది. మోదీ ఒక తండ్రిలా అందరినీ ఏకం చేశారు. ఆయన బహుశా ఇండియాకు తండ్రి లాంటి వారు. నేను మోదీని 'ఫాదర్ ఆఫ్ ఇండియా' అంటాను" అన్నారు. నరేంద్ర మోదీ అంటే తన మనసులో చాలా గౌరవం ఉందని, ఆయనంటే తనకు చాలా ఇష్టం అని ట్రంప్ అన్నారు. తీవ్రవాదం విషయంలో నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని ట్రంప్ చెప్పారు. దానికి సంబంధించిన పరిస్థితులు చక్కదిద్దే సామర్థ్యం ఆయనకు ఉందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

హైదరాబాద్‌‌పై వరుణుడు పగ... మరో మూడ్రోజులు కుండపోతే...!

హైదరాబాద్‌‌పై వరుణుడు పగబట్టాడు. రెండ్రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమవుతోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. కుంభవృష్టితో మొత్తం నగరమే అల్లకల్లోలంగా మారుతోంది. రోడ్లన్నీ కాలువల్లా, కాలనీలు చెరువుల్లా మారుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్ హోల్స్ ఉప్పొంగుతున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాలైతే జలమయం కాగా, పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. శివారు ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో హైదరాబాదీల బాధలు వర్ణణాతీతంగా మారాయి. ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, అమీ‌ర్‌‌పేట్‌, పంజగుట్ట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్‌, ముషీరాబాద్‌, గాం‎ధీనగర్‌, చిక్కడపల్లి, అశోక్‌నగర్, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, యూసుఫ్‌గూడ, బోరబండ, నాంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్‌, నేరేడ్‌మెట్, ఏఎస్‌రావు, తిరుమలగిరి, బాలానగర్‌, అల్వాల్‌, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్, దిల్‌సుఖ్‌‌నగర్‌,...

పీపీఏలపై కేంద్రం సీరియస్: జగన్ కు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రకి ఆర్కే సింగ్. ఏపీ హైకోర్టు, కేంద్రం ప్రభుత్వం పలుమార్లు పీపీఏలపై సమీక్ష వద్దని చెప్పినా వైయస్ జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.   పీపీఏల ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి జరగలేదంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు. పీపీఏల విషయంలో చంద్రబాబుపై ప్రధానికి జగన్ ఫిర్యాదు చేసిన అంశంపై కూడా లేఖలో ప్రస్తావించారు. డిస్కంల నష్టానికి అధిక టారిఫ్‌లే కారణమంటున్న జగన్ నిర్ణయాన్ని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తప్పుబట్టారు.   డిస్కంలు నష్టాల్లో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని అంతేగానీ దానికి టారిఫ్ లే కారణం కాదన్నారు. ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే అధిక ధరలు చెల్లిస్తున్నారని లేఖలో స్పష్టం చేశారు. పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర, థార్మికత, ప్లాంట్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.  టీడీపీ ప్రభుత్వం మూడు కంపెనీలకే 70 శాతం కేటాయింపులు చేశారంటూ చేస్తున్న వాదనల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను టేకోవర్ చేయడం వల్లే విద్యుత్ ఉత్పాదకత పెంచుకున్నాయ...

48 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్బన్ మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని  రేపటి నుండి 48 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలను బంద్ నిర్వహించడం జరుగుతున్నది.గత 15 సంవత్సరాలుగా అరకొర వేతనాలతో పని చేస్తున్నారు. కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలి మీ-సేవ కేంద్రాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలి.ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేయాలి. అర్బన్ మీ-సేవ కేంద్రాల భవనాలను మున్సిపల్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సచివాలయంలో మీసేవ ఉద్యోగుల్ని విలీనం చేయాలని డిమాండ్.రేపటి నుండి 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి: చంద్రబాబు

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి రెండు పేజీల లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని, రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు దిగజారాయన్నారు. ప్రాథమిక హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజలు, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ప్రతినిధులు, సంఘవిద్రోహ శక్తుల ద్వారా...శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చీరాలలో వైసీపీ నేత ఆమంచి వర్గీయులు విలేకరిపై దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, గతంలో ఏపీ పోలీసులకు సమర్థులు అనే పేరు ఉండేదన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని చంద్రబాబు సూచించారు.

చొక్కాకు బటన్స్‌ పెట్టుకోలేదని చలానా!

కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న వేలాది రూపాయల జరిమానాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటే.. అన్నీ ఉన్నా ఏదో సాకుతో చలానాలు రాస్తుండడం వాహనదారుల్లో గుబులు పుట్టిస్తోంది. అర్థంపర్థం లేకుండా విధిస్తున్న జరిమానాలతో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా విధిస్తే.. మరో వ్యక్తి లుంగీతో లారీ నడిపాడని భారీ జరిమానా వేశారు. తాజాగా రాజస్థాన్‌ లో ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు కారణమైంది. చెప్పులు ధరించి, చొక్కాకు గుండీలు పెట్టుకోలేదని ఓ ట్యాక్సీ డ్రైవర్‌ కు చలానా రాశారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటని ప్రశ్నస్తే.. కోర్టుకెళ్లాలని ఉచిత సలహా పడేశారు ట్రాఫిక్‌ పోలీసులు. ఈ నెల 6న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ ఇప్పటి వరకు కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురాకపోవడం విశేషం.

ఏపీ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ

ఏ పీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్న వేళ... సంస్థ ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1987 బ్యాచ్‌కు ఐపీఎస్ అధికారి అయిన సురేంద్రబాబు డీజీపీ ర్యాంకు అధికారి కావడం విశేషం. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కృష్ణబాబు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలను ఏపీ ప్రభుత్వం అప్పగించింది. సురేంద్రబాబుకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనశాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వేణుమాధవ్‌ మరణం టిడిపికి తీరని లోటు

సినీ నటుడు వేణుమాధవ్ హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే వేణుమాధవ్ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా వేణుమాధవ్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. మహానాడులో మిమిక్రీ చేసి ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నారని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ ను, టీడీపీని ఎంతో అభిమానించేవారని చెప్పారు. ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేశారని తెలిపారు. వేణుమాధవ్ మరణం టిడిపికి కూడా తీరని లోటు అని చెప్పారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పాక్‌ భూకంప మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం

పాకిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో పలువురు మరణించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు న్యూఢిల్లిలోని ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఒక పోస్టుచేసింది. భారత్‌లోనూ, పాకిస్తాన్‌లోనూ భూకంపం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయని తెలిసి తానెంతో బాధపడ్డానని మోడీ పేర్కొన్నారని ఆ ట్వీట్‌లో రాశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారని, గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ అన్నారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో భూకంపం వల్ల 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు.

కన్నా నిద్రపోతున్నారా? : సీపీఐ రామకృష్ణ

ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. గతంలో చంద్రబాబు అడిగితే నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తోందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. రాజధాని నిధులపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్ ను గాలికొదిలేశారని చెప్పారు. గతంలో చంద్రబాబు అడిగినా నిధులు ఇవ్వలేదని... ఇప్పుడు కేంద్రాన్ని జగన్ అడిగే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఏపీలో మాట్లాడేవారు లేరనేది కేంద్రం ధీమా అని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై బీజేపీ తెలుగు నేతలు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ నిద్రపోతున్నారా? జీవీఎల్ నోరు పడిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.

వేణుమాధవ్ కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉండేవి : శివాజీ రాజా

ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ చాలా గొప్ప వ్యక్తి అని నటుడు శివాజీ రాజా కొనియాడారు. వేణు మృతిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ...  వేణుమాధవ్ చనిపోయినప్పుడు తాను ఆస్పత్రిలోనే ఉన్నానని చెప్పారు. వేణు.. ఆర్టిస్టు కాకముందునుంచే ఆయన మిమిక్రీ చేసేవాడని అన్నారు. దర్శకుడు కృష్ణారెడ్డి వేణు టాలెంట్‌ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారని.. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. వేణు మానవతావాది అని, ఎంతో మందికి సహాయం చేశాడని శివాజీ రాజా చెప్పారు. వేణుమాధవ్ కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉంటాయని, పేదవాళ్లకు పంచిపెట్టేవాడని తెలిపారు. ‘మా’ అసోషియేషన్‌లో తనతో కలిసి వేణు పనిచేశాడన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించాడని, కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళదామని చెప్పినా రానన్నాడని, బలవంతంగా తీసుకువచ్చామని వారు చెప్పారని శివాజీ రాజా తెలిపారు.

వేణుమాధవ్ మృతి పట్ల సంతాపం తెలిపిన నారా లోకేష్

ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల సంతాపం తెలిపిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . హాస్యనటులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి శ్రీ వేణుమాధవ్ గారి మరణం విచారకరం. ఎన్టీఆర్ గారి హయాం నుంచి నేటి వరకు పార్టీకి వేణుమాధవ్ గారు చేసిన సేవలు వెలకట్టలేనివి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

టైమింగ్ ఉన్న నటుడు వేణుమాధవ్... పవన్ కళ్యాణ్ సంతాపం

సినీ నటుడు, టాలీవుడ్ కమెడియన్  వేణుమాధవ్ బుధవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్... ఈ రోజు తుది శ్వాస విడిచారు. కాగా.. వేణుమాధవ్ మృతిపై పవన్ స్టార్,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వేణుమాధవ్ మృతికి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చనిపోయారనే వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ చెప్పారు. హాస్యం పండించడంలో వేణుమాధవ్ టైమింగ్ ఉన్న నటుడని పవన్ కొణియాడారు.  కాగా... పవన్ కళ్యాణ్ కి ఉన్న స్నేహితుల్లో వేణుమాధవ్ కూడా ఒకరు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పవన్ చాలా సినిమాల్లో వేణుమాధవ్ స్నేహితుడి పాత్రలో నటించి అలరించారు. తొలి ప్రేమ చిత్రం నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం ఉంది. 1979లో సూర్య పేట్ జిల్లాలో కోదాడ మండలంలో జన్మించిన ఆయన నాల్గవ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన 'సంప్రదాయం' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వేణుమాధవ్. 'తొలిప్రేమ' సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

హైకోర్టును ఆశ్రయించిన లింగమనేని రమేష్: జగన్ సర్కార్ తీరుపై పిటీషన్

  వివాదాస్పదమైన తన నివాసంపై హైకోర్టును ఆశ్రయించారు వ్యాపార వేత్త లింగమనేని రమేష్. తనకు సమాచారం ఇవ్వకుండా తన ఇంటిని కూల్చివేస్తున్నారంటూ పిటీషన్ దాఖలు చేశారు. ప్రాపర్టీ స్టే కోసం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.  ఇకపోతే మంగళవారం లింగమనేని రమేష్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరకట్ట పై ఉన్న అతిధి గృహం కూల్చివేత నోటీసులపై 5పేజీలు లేఖ రాశారు.  కూల్చివేతల ధోరణి వల్ల ప్రభావితమయ్యేది తన ఒక్క కుటుంబం మాత్రమే కాదని చెప్పుకొచ్చారు.  సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అనేది రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశ నిస్పృహల్లోకి నెట్టివేస్తుందని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణాత్మకంగా సాగుతుంది అనుకున్న ప్రభుత్వం కూల్చివేతకే ప్రాధాన్యం ఇస్తుందా అనే ప్రశ్న ప్రజల్లో ఉదయించిందని చెప్పుకొచ్చారు.  కరకట్టపై మొదలైన ఈ ప్రక్రియ తమ ప్రాంతాలకు వేర్వేరు కారణాలతో వస్తుందనే ఆందోళన రాష్ట్రమంతా మొదలైందని లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోగలరని హితవు పలికారు. ఈ ప్రాంత సర్...

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

జగన్ సర్కార్ కి నిధుల కొరత: రైతు రుణమాఫీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న 4,5 విడతల బకాయిలను నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.  4, 5 విడతలకు సంబంధించి రూ.7959.12 కోట్లు చెల్లింపును నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు లేకపోవడంతో రుణమాఫీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గత ప్రభుత్వం మార్చిలో విడుదల చేసిన జీవోను నిలిపివేసింది. తాజాగా జీవో 99 విడుల చేసిన ప్రభుత్వం.  ఇకపోతే బుధవారం రైతు భరోసా పథకంపై సమీక్ష నిర్వహించారు సీఎం వైయస్ జగన్. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య రుణమాఫీ రద్దు చేస్తూ జీవో 38ను రద్దు చేస్తూ కొత్త జీవోను విడుదల చేశారు.  అయితే రైతు భరోసా పథకం అమలు చేస్తున్న నేపథ్యంలోనే రైతు రుణమాఫీని రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు తెలుపుతూ జీవో 99ని విడదుల చేశారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే తెలుగుదేశం...

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారని మంగళవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చికిత్స పొందుతూ ఆయన  మరణించినట్లు తెలుస్తోంది. 1979లో సూర్య పేట్ జిల్లాలో కోదాడ మండలంలో జన్మించిన ఆయన నాల్గవ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన 'సంప్రదాయం' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వేణుమాధవ్. 'తొలిప్రేమ' సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన 'లక్ష్మీ' సినిమాకి ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 'సంక్రాంతి, 'హంగామా', 'పోకిరి', 'దిల్' ఇలా పలు సినిమాలలో హాస్య నటుడిగా కనిపించి మెప్పించాడు. అతడికి భార్య శ...

గాంధీ సోలార్‌ పార్క్‌ ప్రారంభించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్‌ నేషన్స్‌ కేంద్ర కార్యాలయంలో 50 కిలోవాట్ల గాంధీ సోలార్‌ పార్క్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ తదితర ప్రపంచ నేతలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా సమకాలీన ప్రపంచంలో మహాత్మా గాంధీ ప్రాముఖ్యత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రంతో యునైటెడ్‌ నేషన్స్‌ పోస్టేజ్‌ స్టాంపును విడుదల చేశారు.

సహకార బ్యాంకు కుంభకోణంలో శరద్‌పవార్‌పై కేసు నమోదు

మహారాష్ట్ర స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ కుంభకోణానికి సంబంధించి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌ఫవార్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) కేసులు నమోదు చేసింది. 25 వేల కోట్ల రూపాయిల కుంభకోణానికి సంబంధించి ఇ.డి. వీరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు (ఇసిఐఆర్‌) నమోదు చేసింది. ఇది పోలీసులు ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌తో సమానం. సహకార చక్కెర పరిశ్రమలకు రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

మద్యం విక్రయానికి ప్రభుత్వం పరిమితులు విధించింది.పర్మిట్, లైసెన్స్ లేకుండా ఒక వ్యక్తి కలిగివుండే లిక్కర్‌పై పరిమితి విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం 3 సీసాలు, మితలేటెడ్ స్పిరిట్ 3 బల్క లీటర్లు, బీరు 6 సీసాలు, కల్లు 2 బల్క లీటర్లు అమ్మాలని ప్రభుత్వం పేర్కొంది.

లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

కృష్ణా నది కరకట్ట వెంబడి ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో లింగమనేని లేదా చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. బహిరంగ చర్చ ఎక్కడ ఏర్పాటు చేసినా తాను వస్తానని అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో దీనిపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు, మీడియా ముందు ఆధారాలతో వాస్తవాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

హాట్ టాపిక్... ప్రశాంత్ కిశోర్ తో రజనీకాంత్ భేటీ

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో సినీ నటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. కాగా... వీరి భేటీ ప్రస్తుతం తమిళనాడు  రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆయనను ఓ రాజకీయ నాయకుడిగా చూడాలని అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే... ఎప్పటి కప్పుడు  ఈ విషయం గురించి రజనీకాంత్ వాయిదా వేస్తూ వస్తున్నారు. సొంతంగా పార్టీ పెడతారని కొందరు.. ఏదైనా పార్టీలో చేరతారంటూ మరికొందరు చర్చించుకుంటున్నప్పటికీ.. దీనిపై ఆయన నోరు విప్పలేదు. కానీ అభిమానుల వత్తిడి మేరకో, లేక తన ఆలోచనల మేరకో ఎట్టకేలకు రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించాడు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా పేరు మార్చారు.  అభిమానులతో భేటీ అయ్యి వారికి రాజకీయపరమైన దిశా నిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యమైన వారికి నిర్వాహకులుగా బాధ్యతలను అప్పగించారు. తమిళనాడులో కోటికి పైగా సభ్యుత్వాన్ని నమోదు చేయాలని కూడా లక్ష్యంగా నిర్దేశించారు.ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి అన్న తరుణంలో పార్లమెంట్‌ ఎన్నికలు ...

రవి గాడు వెదవ అంటూ రెచ్చిపోయిన పునర్నవి

బిగ్ బాస్ సీజన్ 3 మంగళవారం నాటితో 66వ ఎపిసోడ్‌ లోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ లో సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రాసెస్ గురించి బాబా భాస్కర్, వరుణ్ చర్చించుకున్నారు. పునర్నవి తను హౌస్‌లో ఉండాలంటే ఉండొచ్చు కాని.. తనకు భాష రాదని విమర్శించడం తనకు నచ్చలేదని వరుణ్ తో అన్నారు బాబా భాస్కర్.  జనాలు, హౌస్ మేట్స్ పది వారాలుగా తనను చూస్తున్నారని.. అలాంటిది హౌస్ మేట్ లో ఒకరు ఆరోపణలు చేస్తుంటే క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదని అందుకే వదిలేశానని బాబా భాస్కర్ అన్నారు. మరోపక్క పునర్నవి కూడా రాహుల్ తో నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతుంది. సీన్ లోకి వరుణ్, వితికాలు ఎంటర్ అవ్వడంతో పునర్నవి రెచ్చిపోయింది. 'నువ్ రవితో మాట్లాడావా..?' అంటూ వరుణ్.. వితికాని అడగడంతో 'నేను ఎందుకు మాట్లాడతా..' అని వితికా చెప్పేలోపు పునర్నవి కల్పించుకుని 'వాడా...? ఆ రవిగాడా.. వాడొక వెదవ.. ఆ వెదవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు' అంటూ తెగ రెచ్చిపోయింది. సెన్స్ లెస్ ఆర్గ్యుమెంట్ చేసే అలాంటి వెధవతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడి బతుకులో ...

మహిళ ‘సాఫ్ట్‌వేర్‌’ మేనేజర్‌ ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతి మియాపూర్‌ మదీనగూడలోని ల్యాండ్‌మార్క్‌ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని ఆ అపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తున్న తిరుపతిరావు కుమార్తె మహతి(28)గా గుర్తించారు. ఆమె గచ్చిబౌలిలోని టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం తన అక్కతో కలిసి కారులో బయటికి వెళ్లి వచ్చింది. అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకోగానే.. అక్కను కారులోనే ఉండమని చెప్పి ఐదో అంత స్తు ఎక్కిన మహతి అక్కడి నుంచి దూకింది. తలకు బలమైన గాయం కావడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు కారణం వ్యక్తిగత సమస్యలా? కుటుంబ కలహాలా? ఉద్యోగపరమైన ఒత్తిళ్లా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సైరా సెట్లో అమితాబ్ పలకరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది: పవన్ కల్యాణ్

నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అమితాబ్ కీర్తికిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ కలికితురాయి అని అభివర్ణించారు. నటనలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్నారని, అంతటి గొప్ప వ్యక్తి సైరా సెట్లో ఎంతో నిరాడంబరంగా కనిపించారని పవన్ కొనియాడారు. సైరా సెట్లో ఆయన తనను పలకరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసిందని, మర్చిపోలేనిదని పేర్కొన్నారు.