సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతి మియాపూర్ మదీనగూడలోని ల్యాండ్‌మార్క్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని ఆ అపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తున్న తిరుపతిరావు కుమార్తె మహతి(28)గా గుర్తించారు. ఆమె గచ్చిబౌలిలోని టీసీఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం తన అక్కతో కలిసి కారులో బయటికి వెళ్లి వచ్చింది. అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకోగానే.. అక్కను కారులోనే ఉండమని చెప్పి ఐదో అంత స్తు ఎక్కిన మహతి అక్కడి నుంచి దూకింది. తలకు బలమైన గాయం కావడంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు కారణం వ్యక్తిగత సమస్యలా? కుటుంబ కలహాలా? ఉద్యోగపరమైన ఒత్తిళ్లా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment