Skip to main content

Posts

Showing posts from October 17, 2019

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోండి... ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఇటు కార్మికులు, అటు ప్రభుత్వం పట్టువిడకపోవడంతో ప్రజా రవాణా మందగించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తాజా పరిస్థితిపై స్పందించారు. ఆర్టీసీ సమ్మెతో సామాన్యులు ఇబ్బంది పడకుండా చూడాలని రాష్ట్ర యంత్రాంగానికి స్పష్టం చేశారు. సమ్మె కారణంగా సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కార్యదర్శిని ఆదేశించారు. సమ్మెపై పలు ఫిర్యాదులు అందాయని తమిళిసై తెలిపారు. సమ్మెపై అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్ కు తెలిపారు. సామాన్యులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా చూస్తున్నామని ఆయన వివరించారు.

ప్రత్యర్థులను విమర్శించడమే సమస్యలకు పరిష్కారమా?: కేంద్రానికి మన్మోహన్ సింగ్ సూటిప్రశ్న

ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని సంకల్పించినప్పుడు ముందుగా లోపాలు గుర్తించి..  కారణాలను అన్వేషించాల్సి ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రస్తుత దుస్థితికి కారణం యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అనుసరించిన విధానాలే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు మన్మోహన్ బదులిచ్చారు. ‘సమస్య పరిష్కారం కోసం కృషి చేయడానికి బదులుగా ఎన్డీఏ నిరంతరంగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తోంది. అదే పరిష్కారమని భావిస్తున్నట్లుంది’ అని మన్మోహన్ సింగ్  మీడియాతో భేటీలో అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల వెలుగు చూసిన మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ సమస్యను ఎత్తి చూపుతూ.. మీ హయాంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఏమంటారు? అంటూ మన్మోహన్ నిలదీశారు. పీఎంసీ తనపై భరోసా ఉంచిన 16 లక్షల డిపాజిట్ దారుల భవిష్యత్తును కష్టాల్లోకి నెట్టిందని చెప్పారు. ‘నేను ప్రధానిగా ఉన్నప్పుడు పీఎస్ బీలు సమస్యల్లో కూరుకుపోయాయని అంటున్నారు. మేము 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నాము. అంతకు ముందు మీరు అధికారంలో ఉన్నారు. మళ్లీ   2014 నుంచి మీరు ఐదేళ్లు పాల...

చంద్రబాబు మాట మార్చారు... మోదీ మెడలు వంచుతామన్నది నిజం కాదా?: సోము వీర్రాజు

  ప్రధాని నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు గతం మర్చిపోకూడదని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మోదీని తిట్టడం కోసం ధర్మపోరాట దీక్షలు పెట్టించింది ఎవరు? మోదీపై నందమూరి బాలకృష్ణ, గల్లా జయదేవ్ లతో విమర్శలు చేయించింది ఎవరు? మోదీ మెడలు వంచుతామని అన్నది చంద్రబాబు కాదా? రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ పవిత్రజలాలు పంపితే అవమానించింది చంద్రబాబు కాదా? అంటూ విమర్శల జడివాన కురిపించారు. ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే మరోవైపు మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయించారని సోము వీర్రాజు ఆరోపించారు. గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో చంద్రబాబులో అభద్రతా భావం ఎక్కువైందని, అందుకే ఇప్పుడు స్వరం మార్చారని వ్యాఖ్యానించారు.   

కశ్మీర్ యాపిల్స్‌పై భారత వ్యతిరేక నినాదాలు

కశ్మీర్:  మార్కెట్లోకి కొత్త కశ్మీర్ యాపిల్ పండ్లు వచ్చాయి. వ్యాపారులు వాటిని కొనుగోలు చేశారు. బాక్సులు ఓపెన్ చేసి... ఒక్కసారిగా షాక్ అయ్యారు. పండ్లపై భారత్ వ్యతిరేక నినాదాలు బ్లాక్ స్కెచ్‌తో రాసి ఉండటమే దీనికి కారణం. కశ్మీర్‌లోని కథువా హోల్‌సేల్ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై వ్యాపారులు మార్కెట్ ఎదుట నిరసనకు దిగారు. పండ్లపై ‘బుర్హాన్ వనీ’, ‘పాకిస్థాన్ జిందాబాద్’, ‘గో బ్యాక్ ఇండియా’ నినాదాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మార్కెట్ ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా.. చర్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

ఏపీపీఎస్సీ నియామకాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్... ఇంటర్వ్యూలకు చెల్లుచీటీ

ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలు ఉండవు. ఏపీపీఎస్సీ పనితీరు, నియామకాలపై సీఎం జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూ పద్ధతి తొలగించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రావాలని ఆదేశించారు. అంతేగాకుండా, నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి పొరబాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తి పారదర్శకత ఉండేలా వ్యవహరించాలని స్పష్టం చేశారు. 

రాఫెల్ పై 'ఓం' కాకుండా మరేం రాయాలి రాహుల్ జీ!: రాజ్ నాథ్

 రాఫెల్ యుద్ధ విమానంపై తాను 'ఓం' అని రాసిన విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. హర్యానాలోని భవానీలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... విజయ దశమి రోజున ఆయుధ పూజలు చేయడం మన సంప్రదాయమని అన్నారు. తాను రాఫెల్‌ యుద్ధ విమానంపై ఓం రాశానని, అయితే, అలా ఎందుకు రాశావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. 'నేను రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ రోజు శస్త్ర పూజలో రాఫెల్ పై 'ఓం' కాకుండా మరేం రాసి ఉండాల్సింది?' అని ప్రశ్నించారు. ఇటీవల ఫ్రాన్స్ లో పర్యటించిన రాజ్ నాథ్ సింగ్.. తొలి రాఫెల్ విమానాన్ని అందుకుని, దానికి శస్త్ర పూజలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.. ఇటీవల 'డ్రామా' అంటూ విమర్శించారు. 'ఇటువంటి మూఢనమ్మకాలు తొలగిపోయినప్పుడే భారత్ సొంతంగా రాఫెల్ వంటి యుద్ధ విమానాలను తయారు చేసుకోగలదు' అని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. కాగా, హర్యానాలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగను...

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. 

బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లకు పైగా బకాయి పడింది: విజయసాయిరెడ్డి

  వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మరోసారి వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లకు పైగా బకాయి పడినట్టు ఆంధ్రా బ్యాంకు దినపత్రికల్లో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందని వెల్లడించారు. చంద్రబాబునాయుడి దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపినవాళ్లు అందరూ కలిసి లక్ష కోట్ల మేర బ్యాంకులను ముంచారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.   
 టీవీ9 రవిప్రకాశ్‌పై మరో కేసు చానల్ నిర్వహణకు సంబంధించిన కీలక పత్రాల పోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై  మరో కేసు నమోదైంది.  నకిలీ ఐడీ కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో ఐటీ యాక్ట్‌ కింద సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. చంచల్గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన్ను పీటీ వారెంట్‌తో మియాపూర్‌ కోర్టుకు తీసుకెళ్లారు. ఏబీసీఎల్‌ నుంచి అక్రమంగా నిధులు తీసుకుంటున్నట్లు రవిప్రకాశ్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.రవి ప్రకాశ్‌తోపాటు టీవీ9లో పనిచేసిన మరో ఉద్యోగి కేవీఎన్‌ మూర్తిపైనా అలందా మీడియా ఫిర్యాదు చేసింది. ఛానల్ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోవడంతోపాటు, కీలక పత్రాలు ఫోర్జరీకి సంబంధించిన కేసులో గతంలోనూ పోలీసులు రవిప్రకాశ్‌ను విచారించారు.

కల్కి ఆశ్రమంలో అక్రమాలు బట్టబయలు... కోట్లాది రూపాయలు, కీలక పత్రాలు స్వాధీనం

  కల్కి భగవాన్ కు చెందిన ప్రధాన ఆశ్రమంతో పాటు, పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు జరుపుతున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 400 మంది అధికారులు 16 బృందాలుగా విడిపోయి సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున డబ్బు బయటపడుతోంది. ఇప్పటి వరకు రూ. 33 కోట్లను అధికారులు గుర్తించారు. ఇందులో 9 కోట్ల విదేశీ కరెన్సీ కూడా ఉంది. దీంతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో కంప్యూటర్లను సీజ్ చేశారు. చెన్నై, బెంగళూరుల్లో భారీగా భూములు కొన్నట్టు గుర్తించారు. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లో కూడా ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు భాగంగా గుడివాడ ఒన్ టౌన్ పోలీస్ స్టేషను లో    రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి  వెంకటేశ్వరరావు (నాని) , జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్  బాబు పోలీస్   అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకున్నా...ఈ దేశాన్ని రక్షించేది సైన్యం మనకు ఉన్నటువంటి అత్యున్నత  వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.పోలీస్ అంటే ప్రజలకు భయముంటుంది అదేవిధంగా మనకు ఎదైన అవసరమయినప్పుడు మొట్టమొదటి గుర్తుకు వచ్చేది పోలీస్.ఈ సమాజంలో సంఘం లో ప్రజలను రక్షించేటువంటి వ్యవస్థ అటువంటి పోలీసు విది నిర్వహణ వారి ప్రాణాలు సైతం పోగోట్డుకునే వ్యవస్థ , పోలీస్ మిలటరీ.వీది నిర్వహణ లో అమరులైన పోలీసులు ను ప్రతి సంవత్సరం అక్టోబర్ లో వారం రోజుల పాటు వారి స్మరించుకుంటున్నాం.పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకుంటూ వివిధ కారణాలు తో రక్తం కావలసిన ప్రజానీకానికి వారి రక్తదానం కార్యక్రమం ఇవ్వడం పోలీసులు ను అభినందిస్తున్న.ఇటువంటి కార్యక్రమం లో నేను కూడా భాగస్వామి గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డ...

కరకట్ట వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత

కరకట్ట వెంట అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. తుళ్లూరు మండలం శైవక్షేత్రం తాళ్లాయపాలెంలో కట్టడాలను సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూల్చివేస్తున్నారు. క్యాంటిన్‌లు, బాత్‌ రూంలను సిబ్బంది కూల్చివేశారు.

జేడీయూతో విభేదాలు లేవు: అమిత్‌ షా

బీహార్ లోని తమ బీజేపీ-జేడీయూ కూట‌మిలో విభేదాలు ఉన్నాయ‌ంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యకుడు అమిత్ షా కొట్టిపారేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసే పోటీ చేస్తాయని ఆయన స్పష్టతనిచ్చారు. అలాగే, ఆ ఎన్నికల్లో తమ కూటమి నాయకత్వ బాధ్యతలను ముఖ్యమంత్రి నితీశ్ కుమారే చేప‌డతార‌ని తెలిపారు. అలాగే, ఈ ఎన్నికల అనంతరం కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.   కొంతకాలంగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మిత్రపక్షం బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఈ ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందేహాలకు అమిత్ షా తెరదించారు.

చిన్న పరిశ్రమల అభివృద్ధికి ‘వైఎస్సార్‌ నవోదయ' : ప్రారంభించిన సీఎం జగన్‌

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి ఈరోజు శ్రీకారం చుట్టింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభ్యున్నతి లక్ష్యంగా ‘వైఎస్సార్‌ నవోదయ’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల రుణాలను ఒకే విడతలో రీషెడ్యూల్‌ చేస్తారు. ఇందుకు సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను గుర్తించేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది  మార్చి 31లోగా ఎంఎస్‌ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణాల రీ షెడ్యూల్‌ నాటికి పరిశ్రమలు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేసుకోవాలి. ఈ రుణాలు 2019 జనవరి నాటికి రూ.25 కోట్లు దాటి ఉండకూడదని రిజర్వ్‌ బ్యాంకు ఇప్పటికే నిబంధన విధించింది. కాగా పథకం ప్రారంభోత...

వారు మీ లోకేశ్ లా మొద్దబ్బాయిలు కాదు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిప్పికొట్టారు. నారా లోకేశ్ లా గ్రామ వాలంటీర్లు మొద్దబ్బాయిలు కాదంటూ ఎద్దేవా చేశారు. 'గ్రామ కార్యకర్తలుగా ఎంపికైన వారిలో ఎవరికీ ఓనమాలు రావట. ఇవి చంద్రబాబు చేసిన కడుపు మంట మాటలు. అందరూ తన కొడుకు లోకేశ్ లా మొద్దబ్బాయిలనుకుంటున్నాడు. లోకేశ్ తో పరీక్ష రాయించండి.. ఆయన కనీసం పది మార్కులు కూడా తెచ్చుకోలేరని ఉద్యోగాలు సాధించిన యువత ఇప్పటికే సవాలు చేశారు' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు. 'ఎవరిచ్చారు మీకీ అధికారమంటూ చంద్రబాబు పదే పదే శోకాలు పెడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎక్కడ మాట్లాడినా ఒక కమెడియన్ తరహాలో కార్యకర్తలను అహ్లాదపరచడం పైనే ఆయన దృష్టి పెట్టినట్టున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించరాదనే కనీస సృహ కూడా లేదు' అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో మద్యంతో బాలిక పుట్టిన రోజు వేడుకలు.. మందలించినందుకు ఆత్మహత్య

ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మద్యంతో జరుపుకోగా, విషయం తెలిసిన ఉపాధ్యాయిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని సేలం ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది బాలికలు చదువుతున్నారు. మంగళవారం ఉదయం స్కూల్‌లో అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. ప్లస్ టు చదువుతున్న ఓ విద్యార్థిని బర్త్‌డే కూడా అదే రోజు కావడంతో ఐదుగురు విద్యార్థులు కలిసి తరగతి గదిలో ఆమెతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. అదే సమయంలో తరగతి గదిలోకి వచ్చిన టీచర్ వారి చేతుల్లోని బీర్ బాటిళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ఎదుటే విద్యార్థులను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని ఒకరు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండానే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కేసు నమోదు...

ఇలాంటి ఆలోచనలకు సిగ్గుపడండి.. లేదా మునిగి చావండి: మోదీ

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాలపై ప్రధాని మోదీ పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. విదర్భ ప్రాంతంలోని అకోలా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టికల్ 370 రద్దుకు, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధం ఏమిటంటూ విపక్షాలు ప్రశ్నిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ కు, మహారాష్ట్రకు సంబంధం లేదని వారు ఎలా అనగలరని ప్రశ్నించారు. ఇలాంటి ఆలోచనలకు సిగ్గు పడండి... లేదా మునిగి చావండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ జన్మించిన గడ్డపై రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు తనకు దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు.

పట్టపగలు నడిరోడ్డుపై హత్య... ప్రాణాలు కోల్పోయిన డ్రిల్‌ మాస్టర్‌

పట్టపగలు నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడిని హత్య చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మినీ బైపాస్‌ రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యాయామ ఉపాధ్యాయుడు ఈ రోడ్డులో వెళ్తుండగా అటకాయించిన దుండగులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. అతని వద్ద ఉన్న 15 కాసుల బంగారం, రూ.2 లక్షలను కూడా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

క్రికెట్ మ్యాచ్ చూడడానికి రండి.. మోదీ, షేక్‌ హసీనాలను 'క్యాబ్‌' ఆహ్వానం

వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు మ్యాచ్ సిరీస్ జరగనుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాలకు ఆహ్వానం పంపాలని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడటం బంగ్లాదేశ్‌ కు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని క్యాచ్ నిర్ణయించింది.  క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈడెన్‌లో గంట కొట్టి మ్యాచ్‌ ప్రారంభించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టాడు. గతంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్‌కు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ను క్యాబ్‌ ఆహ్వానించింది. ప్రపంచకప్‌-2011 సెమీఫైనల్‌లో మొహాలీలో జరిగిన మ్యాచ్ కు అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూసఫ్‌ రజా గిలానీలు హాజరై మ్యాచ్ ను చూసిన విషయం తెలిసిందే.

సరిహద్దులో పాకిస్థానీ చొరబాటుదారుడి హతం

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దులో భారత్‌ బగాలు నిన్న ఓ చొరబాటుదారుడిని కాల్చిచంపాయి. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు అతను చేసిన ప్రయత్నాన్ని నిలువరించేందుకు సరిహద్దు బలగాలు చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో కాల్చిచంపారు. వివరాల్లోకి వెళితే...నిన్న సాయంత్రం భద్రతా బలగాలు చెక్‌పోస్టు వద్ద కాపలా కాస్తుండగా గేట్‌ నంబర్‌ 103 ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన బలగాలు అతన్ని వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయినా అతను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే చనిపోగా, అతని వద్ద భించిన బ్యాగులో జత దుస్తులు, సిమ్‌ కార్డు, మెమరీ కార్డు లభించాయి. చనిపోయిన వ్యక్తిని గుల్నవాజ్‌గా జవాన్లు గుర్తించారు. ఘటనపై సరిహద్దులోని పాకిస్థాన్‌ జవాన్లకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. అయితే చొరబాటు దారుడిని కాల్చి చంపిన నేపథ్యంలో సరిహద్దులో హై అలర్ట్‌ ప్రకటించారు. అట్టారి రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.