Skip to main content

Posts

Showing posts from August 26, 2020

జియో బంపర్ ఆఫర్..ఏడాదిపాటు ఉచితంగా

AddThis Sharing Buttons  అభిమానులకు రిలయన్స్‌ జియో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) నేపథ్యంలో తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్‌లను ఆవిష్కరించింది.జియో క్రికెట్‌ ప్లాన్ల పేరుతో రూ.499, రూ.777 రీఛార్జ్‌ ప్యాక్‌లను లాంచ్‌ చేసింది. రెండు ప్లాన్లు ఏడాది పాటు కాంప్లిమెంటరీ   డిస్నీ + హాట్‌స్టార్  వీఐపీ  సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి.  దీంతో  డిస్నీ + హాట్‌స్టార్‌లో రాబోయే ఐపీఎల్‌ సీజన్‌ మ్యాచ్‌లను వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉచితంగా వీక్షించొచ్చు. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభమవుతుంది. రూ.499 క్రికెట్‌ ప్లాన్‌ కింద జియో తన వినియోగదారులకు రోజువారీ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటాను 56 రోజులు అందిస్తుంది. ఇది క్రికెట్‌ సీజన్‌ అయిపోయే వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో  వినియోగదారులకు ఎటువంటి కాలింగ్ లేదా ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు రావు.   మరో కొత్త ప్లాన్ రూ.399తో    డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాది పాటు లభించనుంది.   రూ. 777   జియో క్రికెట్ ప...

గులాం నబీ అజాద్ ను సముదాయించిన సోనియాగాంధీ?

 సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన గులాం నబీ అజాద్ తీవ్రంగా నొచ్చుకున్నారు. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో అజాద్ ను శాంతింపజేసే పనుల్లో హైకమాండ్ నిమగ్నమైంది. అజాద్ కు సాక్షాత్తు సోనియాగాంధీనే ఫోన్ చేసినట్టు సమాచారం. రాహుల్ వ్యాఖ్యలకు నొచ్చుకోవద్దని ఈ సందర్భంగా సోనియా కోరినట్టు తెలుస్తోంది. అసమ్మతివాదుల డిమాండ్లను వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు సమాచారం.

పోలవరం ప్రాజక్టుపై ప్రధాని మోదీకి సీఎం వైయస్ జగన్ లేఖ

 ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని లేఖలో కోరారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.   కాగ్ ఆడిట్ రిపోర్టు, సవరించిన అంచనా వ్యయాలను ఇప్పటికే అందించామని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పనుల కోసం ఈ ఏడాది జూన్‌ వరకు రూ.12,312.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని... ఇందులో రూ.8,507.26 కోట్లను పీపీఏ ద్వారా కేంద్రం రీయింబర్స్‌ చేసిందని... మిగిలిన రూ.3,805.62 కోట్లను తక్షణమే రియింబర్స్ చేయాలని కోరారు. సకాలంలో నిధులను విడుదల చేసేలా కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం పనులకు రూ. 15 వేల కోట్లు అవసరమని జగన్ తెలిపారు. విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరంను కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు పనులు 33.2...

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత

 మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది.  ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని కోరుతూ కేసులు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.  సుప్రీంకోర్టులో ఈ కేసు ఈరోజు విచారణకు వచ్చింది.  జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం ఆర్ షా ధర్మాసనం ముందుకు వచ్చిన కేసును విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.  మధ్యంతర ఉత్తరువుల పై స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొన్నది.  సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను ముగించాలని హైకోర్టు కు సుప్రీంకోర్టు సూచించింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు రేపు ఏపీ హైకోర్టులో ఈ కేసును విచారించబోతున్నారు.   పరిపాలన సౌలభ్యం, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.  దీనికి సంబంధించిన బిల్లులపై గవర్నర్ కూడా సంతకం చేశారు.  దీంతో అమరావతి రైతులు హైకోర్టులో కేసులు దాఖలు చేయగా, హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింద...

అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్‌

 అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్‌ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్‌ కామెంట్ చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.                            

పేద మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. సాయం చేస్తున్న సోను సూద్

 కరోనా కష్టకాలంలో సాయం చేయాలని కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ సినీనటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకుంటోన్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ తనకు వస్తోన్న ఫోన్లు, మెసేజ్‌లపైనే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన ప్రజల కష్టాలను గురించి తెలుసుకుని ఆయన సాయం చేస్తున్నారు. కర్ణాటకలో యాదగిరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మ అనే ఓ పేద మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. అయితే, రెక్కాడితే కానీ డొక్కాడని పద్మ-నాగరాజ్‌ దంపతులకు ఆ బిడ్డలను పెంచడం తలకు మించిన భారమైంది. వారు ఓ చిన్న ఇంట్లో ఉంటున్నారు. ముగ్గురు పిల్లలను ఎలా పెంచాలన్న ఆందోళనలో వారు ఉన్నారు. వారి బాధల గురించి మీడియాలో వచ్చిన వార్తలు సోను సూద్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన దీనిపై స్పందించారు. తాను ఆ ముగ్గురు శిశువుల పోషణ కోసం సాయం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, వారి ఇంటికి మరమ్మతులు కూడా చేయిస్తానని చెప్పారు.  

పది రోజుల్లోనే రూ. 5 వేలకు పైగా తగ్గిన పది గ్రాముల బంగారం ధర...మరింత తగ్గే అవకాశం !

 దాదాపు 10 రోజుల క్రితం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో రూ. 56,200 వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆపై ధరలో కరెక్షన్ ట్రెండ్ ప్రారంభం కాగా, ప్రస్తుతం రూ. 51,100 వరకూ ధర దిగి వచ్చింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 14 వేలకు పైగా పడిపోయింది. ఓ దశలో రూ. 78 వేలను దాటిన వెండి ధర ఇప్పుడు రూ. 64 వేలకు చేరింది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. కరోనాకు వ్యాక్సిన్ వస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తిరిగి స్టాక్ మార్కెట్ వైపు మళ్లించాయి. దీంతో బులియన్ మార్కెట్ డీలా పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ ఉన్నప్పటికీ, రెండో దశ కరెక్షన్ రానుందని, బంగారం ధర మరింతగా తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎంసీఎక్స్ లో ప్రస్తుతం బంగారం ధర ధర రూ. 50,924గా ఉండగా, వెండి ధర రూ. 64,007 వద్ద నిలిచింది. న్యూయార్క్ కామెక్స్ లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 1,934 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 26.64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. యూఎస్, చైనాల మధ్య ఒప్పందం కుదరడం కూడా బంగారం ధరలు పతనం కావడానికి...

మన రెండు దేశాల ఘనమైన చరిత్రలో అదో చిన్న ఘటన మాత్రమే: చైనా

 ఈ సంవత్సరం జూన్ 15న భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ ఘటనను చైనా ప్రతినిధి సున్ వీడోంగ్ చాలా చిన్నదైనదని అభివర్ణించారు. తాజాగా నిర్వహించిన చైనా - ఇండియా యూత్ వెబినార్ లో మాట్లాడిన ఆయన, ఇదే అవాంఛనీయ ఘటనని, ఇరు దేశాల ఘనమైన చరిత్రలో అతి చిన్నదని, విభేదాలు పరిష్కరించుకుని, ముందుకు సాగాల్సిన సమయం ఇదని అన్నారు. ఆగస్టు 18న ఈ వెబినార్ జరుగగా, నిన్న చైనా ఎంబసీ ఆయన ప్రసంగాన్ని విడుదల చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్యా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చైనా తక్షణం స్పందించాలని, సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తున్న వేళ, సున్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన ప్రసంగం యావత్తూ, రెండు దేశాల మధ్యా ఉన్న చరిత్ర గురించే ఎక్కువ సేపు సాగింది. వేలాది ఏళ్ల చరిత్ర, పౌర సమాజం, రెండు దేశాల మధ్యా రాకపోకలు, ప్రజల మధ్య సహకారం తదితరాలను ప్రస్తావించిన ఆయన, బేసిక్ చైనా విదేశాంగ విధానం, ఇండియాకు సంబంధించినంత వరకూ ఏ మాత్రమూ మారలేదని స్పష్టం చేశారు.  జూన్ 15 నాటి ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, "ఎంతో కాలం క్రితమేమీ కాదు. ఇటీవలే దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనే ఇది. సరిహద్దు...

బిగ్ బాస్ షో ఆపాలంటూ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనూ బిగ్ బాస్ రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఓ వైపు నిర్వాహకులు సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు ఆ షో ఆపాలంటూ కొందరు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్-4ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ ముక్తల, తల్లిదండ్రుల సంఘం నేత గడ్డం మురళి, తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత అమన్ గల్ రాజు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షోపై ఫిర్యాదులు ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక పర్యాయాలు ఫిర్యాదులు వచ్చినా, బిగ్ బాస్ షోకు మాత్రం ఎలాంటి అడ్డంకి ఏర్పడలేదు. మరి ఈసారి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి! కాగా, ఆగస్టు 30న బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రసారం అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.