Skip to main content

Posts

Showing posts from September 2, 2020

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన రాంచరణ్

 

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున అందించాలని పవన్ నిర్ణయం

  తమ ఆరాధ్య హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతంతో మృతి చెందడం తెలిసిందే. చిత్తూరు జిల్లా శాంతిపురం ఏడో మైలు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ విషాదం పవన్ ను కదిలించివేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలంటూ పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు, ప్రమాదం వివరాలు తెలుసుకున్న ఆయన క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. దూరమైన బిడ్డలను తీసుకురాలేను కానీ, బిడ్డలు కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు నేను బిడ్డనై నిలుస్తానంటూ వ్యాఖ్యానించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు... టీఎస్ కు కీలక ప్రతిపాదన చేసిన ఏపీ!

 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, తెలంగాణ నుంచి ఏపీకి తిరిగే బస్సుల సంఖ్యతో పోలిస్తే, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే బస్సుల సంఖ్యే అధికంగా ఉండేదన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా బస్సులు ఆగిపోయిన తరువాత, తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనలో రెండు రాష్ట్రాలూ ఉన్నప్పటికీ, సమాన కిలోమీటర్ల మేరకు బస్సులను తిప్పేలా అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలని టీఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేస్తూ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.12 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరుగుతున్నాయని, ఆ మేరకు తగ్గించుకోవాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ వచ్చింది. తాము 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, ఆ మేరకు తెలంగాణ బస్సు సర్వీసులను పెంచుకోవాలని ఈ లేఖలో ప్రతిపాదించారు. దీనిపై వెంటనే చర్చించి, బస్సులను నడిపిద్దామని ఈ లేఖలో రవాణా శాఖ చీఫ్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు సూచించారు. దీనిపై ఇంకా టీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించలేదు.  

చూస్తుండగానే దుస్సాహసం... 1000 చదరపు కిలోమీటర్లను ఆక్రమించిన చైనా!

ఓ వైపు చైనా దురాక్రమణలను అడ్డుకునే పనిలో భారత సైన్యం నిరంతరం నిఘా పెట్టి, పోరాడుతూ ఉంటే, ఇప్పటికే ఎల్ఏసీ వెంబడి పలు ప్రాంతాల్లో సుమారు 1000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించేసినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారంటూ, 'ది హిందూ' వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించడం చర్చనీయాంశమైంది. ఓ వైపు చర్చలంటూనే, మరోవైపు చైనా పీపుల్స్ ఆర్మీ, చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చేసిందని ఆ అధికారి వెల్లడించారట. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి దెప్సాంగ్ ప్రాంతం నుంచి చుశుల్ వరకూ ఈ ఆక్రమణలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా దెప్సాంగ్ మైదానంలోని 10వ నంబర్ పెట్రోలింగ్ పాయింట్ నుంచి 13వ నంబర్ పాయింట్ వరకూ సుమారు 900 చదరపు కిలోమీటర్లు చైనా అధీనంలోకి వెళ్లిపోయాయని, గాల్వాన్ లోయలో 20 చదరపు కిలోమీటర్లు పాంగ్యాంగ్ సరస్సు వద్ద 65 చదరపు కిలోమీటర్లు, హాట్ స్ప్రింగ్ సమీపంలో 12 చదరపు కిలోమీటర్లు, చుశుల్ వద్ద 20 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించిందని ఆ అధికారి వెల్లడించినట్టు 'ది హిందూ' పేర్కొంది. ప్రస్తుతం చైనా మరిన్ని ప్రాంతాలపై కన్నేసిందని వివరించిన ఆ ఆఫీసర్, పాంగ్యాంగ్ సమీపంలోని ఫింగర్ ...