Skip to main content

Posts

Showing posts from September 26, 2019
గత కొద్దిరోజులుగా టెక్‌ ప్రియులను ఊరిస్తున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీ ఎట్టకేలకు భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. వివరాలు

ఆ ఇంట్లో నివసించడం ధర్మం కాదు..ఖాళీ చేయండి: చంద్రబాబుకు అంబటి సూచన

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటి ప్రశ్న వేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం రాజధాని అమరావతి ఏర్పడిందని, దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ లో మీరు ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు. నదీ గర్భంలో ఉన్న ఇంట్లో, అనుమతులు లేని ఇంట్లో ఎలా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు లేదా? అవినీతి నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అని ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణంలో ఇంకా నివసించాలని కోరుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు. అక్రమ నిర్మాణంలో నివసించడం ధర్మం కాదు అని, ఆ ఇంటిని ఖాళీ చేసి ఆదర్శంగా నిలవాలని చంద్రబాబుకు సూచించారు

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపిన కుటుంబరావు!

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) అంశంపై వైసీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ‘టీవీ9’ వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రవిరెడ్డి అనే వ్యక్తి, కుటుంబరావులు మధ్యవర్తులుగా వ్యవహరించారని, అక్రమ ఒప్పందాలు చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన కుటుంబరావు ఆ ఆరోపణలను ఖండించారు. ఇందుకు విష్ణువర్ధన్ రెడ్డి బదులిస్తూ, ఈ ఆరోపణలు తాను చేసినవి కావని, కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు ఇది అని స్పష్టం చేశారు. ఆ రవిరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఒక్క ఫొటో అయినా చూపించాలని, ఈ ఆరోపణలకు సంబంధించి ఏ ఆధారం ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బురదజల్లే కార్యక్రమానికి పూనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్న కుటుంబరావు, విష్ణువర్ధన్ రెడ్డిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అంతేకాదు, విష్ణువర్ధన్ రెడ్డికి ఇప్పటికిప్పుడే తన మొబైల్ ద్వారా వ్యక్తిగత లీగల్ నోటీసును పంపిస్తున్నానని,...

ఉదయ్ డబల్ డెక్కర్ రైలు ప్రారంభం.. జోష్‌లో విశాఖ, విజయవాడ ప్రయాణికులు..

విశాఖ, విజయవాడ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ రైలు ప్రారంభమైంది. ఈ రోజు రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ చెన్నబసప్ప అంగడి పచ్చ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ 1వ నంబరు ప్లాట్‌ఫామ్‌పై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ రైలులో విశాఖ టు విజయవాడకు టికెట్ ధర రూ.525గా నిర్ణయించారు. కాగా, శుక్రవారం నుంచి దీని సర్వీసులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయి.వాస్తవానికి ఈ రైలును ఆగస్టు 26న ప్రారంభించాల్సి ఉండగా.. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మరణంతో వాయిదా వేశారు. ఇటీవల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో విజయవాడ, వైజాగ్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది భారతీయ రైల్వే. విశాఖపట్నం, విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701) దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి రైల్వేస్టేషన్లల్లో ఆగుతుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజూ వైజాగ్‌లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 11.15 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజూ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయల్దేరి,...

జగన్ మరో కీలక నిర్ణయం... బాక్సైట్ అనుమతులు రద్దు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేశారు. 30 ఏళ్ల పాటు ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ)కి ఇచ్చిన బాక్సైట్ అనుమతులను రద్దు చేస్తూ గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని రెండేళ్ల క్రితమే విశాఖ మన్యంలోని గిరిజనులకు మాటిచ్చారు జగన్. ఎన్నికల ప్రచారంలోనూ దీనికి సంబంధించి హామీ ఇచ్చారు. ఆ హామీని అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.ప్రభుత్వ ఉత్తర్వులతో అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ 1,2,3, గాలిగొండ, చిత్తమగొండి, రక్తకొండ గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలను నిలిచిపోనున్నాయి. సీఎం జగన్ నిర్ణయంపై విశాఖ మన్యంలోని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్ల తమ పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పారు.

మిత్రులారా... వెన్నునొప్పి ఇబ్బందిపెడుతోంది: జనసేనాని పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. గత కొన్నిరోజుల క్రితం ఆయన ఎన్నికల పర్యటన సమయంలో ఇబ్బందిపెట్టిన బ్యాక్ పెయిన్ మళ్లీ వచ్చింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ లేఖను ట్విట్టర్లో పెట్టారు. చూడండి ఆయన మాటల్లోనే.. '' విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున, వ్యక్తిగతంగా నా తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.  ఐతే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నికల ప్రచారం సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల నొప్పి తీవ్రత మరింత పెరిగింది.  డాక్టర్లు సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ సాంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను. గత కొన్ని రోజులుగా మళ్లీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ కారణంగా గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాలలో పాల...

రివర్స్ టెండరింగ్‌లో రూ.200 కోట్లు ఆదా అయినా మంచిదే... జీవీఎల్ నర్సింహరావు

పోలవవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో కనీసం రూ.200 కోట్లు ఆదా అయినా ఆహ్వానించదగ్గ విషయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి ప్రాజెక్టులు నిర్మాణాలు చేస్తే అభ్యంతరం ఎవరికి ఉండదని అన్నారు. మరోవైపు పీపీఏల అనుమతుల్లో అవినీతీ లేదని తాము చెప్పలేదని, వాటిపట్ల సూచనలు మాత్రమే చేస్తున్నామని అన్నారు .పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్న సమయంలో గందరగోళం లేకుండా చూడాలని ఆయన సూచించారు. ఇక ఇటివల కేంద్రం ప్రకటించిన కార్పోరేట్‌లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పెట్టుబడులు రావటం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన వంద రోజుల్లో కేంద్రప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ప్రంశసిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇటివల టీడీపీ నుండి బీజేప...

పదవ తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు... ఏపీ విద్యాశాఖ మంత్రి

పదవ తరగతి పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పరీక్ష విధానంలో కూడ పలు మార్పులు చేశారు. ముఖ్యంగా వందమార్కుల పరీక్ష పేపరులో ఉండాల్సి బిట్ క్వశ్చన్ పేపరును ప్రత్యేకంగా ఇవ్వకుండా, జవాబు పత్రంతో పాటే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక పరీక్ష సమయాన్ని కూడ మరో 15 నిమిషాలు పొడగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విధానాలు రానున్న విద్యా సంవత్సరం నుండే అమలు కానున్నట్టు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవతరగతి పరీక్ష విధానంలో పలు కీలక మార్పులు తీసుకువచ్చింది. మాధ్యమిక విద్యావిధానంలో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించిన అనంతరం పలు నిర్ణయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇందులో భాగంగానే పదవ తరగతి పరీక్షలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల్లో కార్పోరేట్ పాఠశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే అభిప్రాయంతోనే వాటిని రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.

రానున్న 72 గంటలు వర్షాలే వర్షాలు..

రానున్న మూడు రోజులు వరుసగా వర్షాలు దంచికొడుతాయని వాతవరణ శాఖ తెలిపింది. రాయలసీమలో గురువారంతో మొదలై ఆదివారం వరకు వరుసగా భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) స్పష్టంచేసింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. 27వ తేదీన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 28వ తేదీ ఉత్తరాంధ్ర జిల్లాలు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే చాన్సు ఉందని చెప్పింది. ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో 48 గంటల తరువాత తేలికపాటి వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తెలిపింది. మరో వైపు హికా తుఫాన్ ప్రభావం కారణంగా ఎగువన కురిసే భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తాయని.. జీవనధులకు భారీగా వరద ముప్పు పొంచి ఉందని తెలిపాయి.

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పెద్దఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఉయ్యాలవాడ కుటుంబీకులు గత కొన్నిరోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ కుటుంబీకులు ఇటీవల సైరా చిత్రంపై.. చిరంజీవి, రాంచరణ్ పై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై విచారణ చేస్తున్న నేపథ్యంలో సెన్సార్ డైరెక్టర్ కోర్టుకు షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. సైరా చిత్రానికి ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని అన్నారు. చిత్ర యూనిట్ కి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయలేదని అన్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రం బయోపిక్ కాదని చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సైరాపై తమ నిర్ణయాన్ని ఈ నెల 30 లోగ చెబుతామని కోర్టుకు సెన్సార్ బోర్డు తెల...

వైసీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడింది : మాజీ మంత్రి దేవినేని ఉమా

పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడిందని, రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి వైసీపీకి నచ్చిన మెగా కంపెనీకి రిజర్వ్ టెండరింగ్ కట్టబెట్టారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .....ఇంతవరకు ఎవరు ఎంతకు కోడ్ చేసింది.. ఏ విధంగా అనుమతులు ఇచ్చిందీ ప్రభుత్వం చెప్పలేకపోయిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 38ని రద్దు చేయడం.. కోర్టు ఆదేశాలు కూడా పట్టించు కోకుండా రూ.7,980 కోట్లు రైతులకు లేకుండా చేశారని, జగన్ ప్రభుత్వం చేసిన మోసం‌పై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారని దేవినేని ఉమా అన్నారు

అద్భుతంగా పని చేస్తున్న ఆర్బిటర్‌ : శివన్‌

చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ అద్భుతంగా పని చేస్తోందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ చెప్పారు. పేలోడ్‌ ఆపరేషన్లన్నీ సక్రమంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. లాండర్‌ నుంచి తమకు ఎలాంటి సంకేతాలు అందలేదని ఆయన చెప్పారు. అయితే ఆర్బిటర్‌ మాత్రం బాగా పని చేస్తోందన్నారు. లాండర్‌ విషయంలో పొరపాటు ఏం జరిగిందనే విషయాన్ని విశ్లేషించడానికి జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

ఆ జీవో రద్దు చేయడం దారుణం: అయ్యన్నపాత్రుడు

రైతు రుణమాఫీకి ఇచ్చిన జీవోను రద్దు చేయడం దారుణమని, ఏ ప్రభుత్వం ఉన్న నడుస్తున్న పథకాలను కొనసాగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన జీవో 38పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అసలు వ్యవసాయం పట్ల అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తమ హయాంలో మొత్తం 14,124 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. వంద రోజుల తర్వాత కూడా చంద్రబాబు పాలన గురించి మాట్లాడుతున్నారని.. అసలు వైసీపీ పాలన ఏంటో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.  ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపిస్తే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని అంటూ.. వైసీపీ నేతలు తిరిగి విమర్శలు చేస్తున్నారని అయ్యన్న మండిపడ్దారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాలుకలు, పీకలు కోస్తామని బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే గొంతు పిసికి చంపేస్తారన్నారు. వైసీపీ నేతలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అయ్యన్న హెచ్చరించారు. అవంతి శ్రీనివాస్ మంచి వ్యక్తి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్...

విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు

టెండరింగ్‌ ప్రకియ వల్ల చంద్రబాబు నాయుడు అవినీతి సాక్ష్యాధారలతో సహా బయటపడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేశారు.‘రివర్స్ టెండర్లతో మీ అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోంది. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా రాసే బోగస్ వార్తలకు రెస్పాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా.. బాబు. టెండర్లలో పాల్గొనవద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారట. మరి ఇంత దిగజారి పోయారేంటి చంద్రబాబు గారు’ అంటూ విజయ్‌సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరంలో మూడు పనులకే ఇప్పటి వరకు టెండర్లు పూర్తయ్యాయని.. 50కి పైగా ఇరిగేషన్‌ పనులు టెండర్లకు రానున్నాయని విజయ్‌సాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు బానిసలు చూడాల్సింది ఇంకా చాలా ఉందని విజయ్‌సాయి రెడ్డి స్పష్టం చేశారు.పోలవరంలో మూడు పనులకే టెండర్లు పూర్తయ్యాయి. చంద్రబాబు బానిసలు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. విద్యుత్తు పీపీఏల సమీక్షతో ఏటా వేల కోట్లు ఆదా అవుతాయి. ఇంకా 50కి పైగా ఇరిగేషన్ పనులు టెండర్లకు రాను...