రాజధాని పర్యటన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ... చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘‘ డ్రీమ్ క్యాపిటల్ ఎక్కడ కట్టారో చంద్రబాబు చెప్పాలి? ప్రతిసారి ఆయన మాట మారుస్తున్నారు. తాత్కాలిక భవనాలని చంద్రబాబే చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు శాశ్వత భవనాలు కడతామని మీరే చెప్పారు. మహిష్మతి కోసం రాజమౌళి సలహాలు తీసుకోవాలని అనుకున్నారు. ఎప్పుడో రాచరికం ఉన్నప్పుడు రాజధాని కేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వికేంద్రీకరణ జరుగుతోంది. మహారాష్ట్రలో ముంబయి, తమిళనాడులో చెన్నై, కర్ణాటకలో బెంగళూరుతో పాటు అనేక రగాలు అభివృద్ధి చెందాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ నిజమే అయితే నెలకో నగరం కట్టొచ్చు. బ్యాంకులు, బాండ్ల ద్వారా రూ.5వేల కోట్లకుపైగా అప్పు తెచ్చారు. ఐదేళ్లపాటు అమరావతిని ఎందుకు నోటిఫై చేయలేదు?రాజధానిలో జరిగిన అన్ని అవినీతి పనులను బయటపెడతాం. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు సమయం పడుతుంది. అమరావతిపై విచారణ చేయాల్సిన అవసరం లేదని మీరె...