Skip to main content

Posts

Showing posts from October 11, 2019

చంద్రబాబు నిర్వాకం వల్లే ఇదంతా..

పవర్‌ ఫైనాన్స్‌ అప్పుపై ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం తగదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ రంగంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...గత ప్రభుత్వం డిస్కంలకు పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టిందని తెలిపారు. విద్యుత్‌ను ఎక్కువ రేటుకు తీసుకోవడం వల్ల రూ. 2700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు.  టీడీపీ ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిందని.. ఇప్పుడు తమపై అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘ హడావుడిగా పీపీఏలు కుదుర్చుకున్నారు. ధరలు తగ్గుతున్నాయని తెలిసినా ఎక్కువ రేట్లకు కొన్నారు. రూ. లక్షా 23వేల కోట్లుగా ఉన్న అప్పును 2.58 లక్షల కోట్లకు పెంచారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 9 నెలల జీతాలు పెండింగ్‌లో పెట్టారు. అయితే బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ. 3358 కోట్లు చెల్లించారు. అదే నెలలో రూ. 5 వేల కోట్లు అప్పులు తెచ్చారు. సివిల్‌ సప్లైయ్స్‌ కార్పొరేషన్‌ను నిండా అప్పుల...

ఉగ్రవాదులకు లొంగిపోదామా?’ ప్రజల్ని ప్రశ్నిస్తూ కశ్మీర్‌ ప్రభుత్వ ప్రకటన

జమ్మూకశ్మీర్‌లో ప్రజలు తమకు తాము విధించుకున్న స్వీయ నిర్బంధం నుంచి బయటికి రావాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం దాదాపు అన్ని ప్రాంతీయ దినపత్రికల్లో మొదటి పేజీ ప్రకటన ఇచ్చింది. అనేక ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు బయటికి రాకపోవడాన్ని ప్రభుత్వం అభివృద్ధి నిరోధక చర్యగా అభివర్ణించింది. అధికరణ 370రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని దశలవారీగా ఎత్తివేస్తూ వచ్చింది. కానీ, ఉగ్రవాదులు మాత్రం ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని.. పూర్తి స్థాయి బంద్‌ పాటించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు స్వీయ నిర్బంధం విధించుకొని ఇళ్లలోనే ఉండటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కశ్మీర్‌లో ఇంకా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం ప్రజలు బయటికి రావాలని కోరుతూ ప్రకటన ప్రచురించింది.  ఉగ్రవాదులకు లొంగిపోదామా? అంటూ ప్రకటనలో ప్రభుత్వం ప్రజల్ని ప్రశ్నించింది. 70 ఏళ్లుగా ప్రజలు మోసపోయారని.. విష ప్రచారంలో మగ్గిపోయారని పేర్కొంది. ఓవైపు వేర్పాటువాద నేతల పిల్లలు విదేశాల్లో విద్యనభ్యస...

పల్లవుల నగరంలో పర్యటించిన మోదీ, జిన్‌పింగ్‌

  చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ , ప్రధాని నరేంద్రమోదీ మహాబలిపురం పర్యటన కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం మహాబలిపురం చేరుకున్న ఇరుదేశాధినేతలు పలుచారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రాలను ధరించారు. మహాబలిపురంలోని పలు చారిత్రక కట్టడాలను వీక్షిస్తూ  ఇరువురు నేతలు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.  చారిత్రక కట్టడాల విశిష్టత, శిల్ప కళా సౌందర్యాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. పరమశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రం పొందే శిల్పాన్ని , కృష్ణుడి వెన్నముద్ద శిలను, ఏకశిలాకట్టడాలైన పంచరథాలు, ఇతర విగ్రహాలను ఇరువురు నేతలు సందర్శించారు. వెయ్యేళ్ల క్రితం వీటిని నిర్మించిన పల్లవరాజుల  గొప్పదనాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. ఆలయ ప్రాంగణంలోనే కొబ్బరి బోండాలు సేవిస్తూ పలు అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నారు.అనంతరం మహాబలిపురం సముద్రతీర ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాప్రదర్శనలను మోదీ, జిన్‌పింగ్‌ వీక్షించారు. చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. జిన్‌పింగ్‌ గౌరవార్థం రా...

భారత ఆర్మీ, వాయుసేన కోసం సైరా ప్రత్యేక ప్రదర్శనలు

  తెలుగు సినీ ఖ్యాతిని మరింత పెంచిన చిత్రంగా సైరా అభినందనలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చారిత్రక చిత్రం అక్టోబరు 2న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. వ్యాపారం కోసం భారతగడ్డపై అడుగుపెట్టిన బ్రిటీషర్లు ఆపై భారతీయులను బానిసత్వంలోకి నెట్టగా, నాటి తెల్లదొరలను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన గురించి చరిత్రలో ఎక్కువగా పేర్కొనకపోవడంతో, చిరంజీవి ఎంతో శ్రద్ధ తీసుకుని సైరా చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడీ చిత్రాన్ని భారత సైన్యం కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బెంగళూరులో ఆర్మీ, వాయుసేన సిబ్బంది కోసం దాదాపు 60 ప్రదర్శనలు కేటాయించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం విపరీతంగా ప్రచారం అవుతోంది.

చంద్రబాబుకు బుద్ధి, కంటిచూపు మందగించిందేమో!: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం చూసి సచివాలయ వ్యవస్థను తానే తీసుకొచ్చానని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. ఆ సచివాలయం వేరు, సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ వేరు అన్న బాబు తెలుసుకోవాలని సెటైర్లు విసిరారు. గ్రామ సచివాలయ వ్యవస్థను చంద్రబాబు తెచ్చాడా? అని ప్రశ్నించారు. ఏపీలో నిన్న ప్రారంభించిన ‘కంటి వెలుగు’ పథకం టీడీపీ హయాంలో ఉన్నదే అని బాబు వ్యాఖ్యానించడంపైనే ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబుకు బుద్ధి, కంటిచూపు మందగించి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజా రంజక పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

ఈ నెల 14కి మారిన చిరంజీవి-జగన్ ల లంచ్ భేటీ

సైరా సినిమాతో ఘన విజయం సాధించిన మెగా ఫ్యామిలీ సినిమా చూడటానికి ap సీఎం జగన్ ని ఆహ్వానించటానికి శుక్రవారానికి అపాయింట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. credit: third party image reference అయితే ఈ భేటీలో చిన్న మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఖరారైన భేటీ 14కి మారినట్టు తెలుస్తుంది. సీఎం జగన్ చిరంజీవిని, రామ్ చరణ్ ని లంచ్ కి ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి. credit: third party image reference అయితే ఈ భేటీ సినిమా వరకే పరిమితం అవుతుందా, లేక రాజకీయ చర్చకి తెరతీస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. కాగా చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తుండగా ఈ భేటీ రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది

ట్రంప్‌కు మోదీ స్పష్టంగా చెప్పారు: అమిత్‌ షా

కశ్మీర్‌ వ్యవహారం పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమనీ.. దీనిలో ఎవరి జోక్యమూ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు స్పష్టంగా చెప్పారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి వెల్లడించారు. కశ్మీర్‌లో ఎవరి జోక్యాన్ని సహించబోమని గత కొన్నేళ్లుగా తమ పార్టీ స్థిరమైన వైఖరితో ఉందన్నారు. ఒకవేళ ఏ దేశమైనా కశ్మీర్‌పై మాట్లాడితే.. అది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమనీ స్పష్టంగా చెప్పామనీ.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల ట్రంప్‌కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అమిత్‌ షా వివరించారు. మహారాష్ట్రలోని బుల్‌ధానాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్‌ షా ప్రసంగించారు. ఆర్టికల్‌ 370 రద్దును కాంగ్రెస్‌, ఎన్సీపీ వ్యతిరేకించాయన్నారు. కశ్మీర్‌ అంశంపై ఆ రెండు పార్టీల వైఖరి ఏమిటో ఓటర్లే అడగాలని సూచించారు. కశ్మీర్‌ను భారత్‌తో అనుసంధానించే ప్రక్రియకు ఆర్టికల్‌ 370 అనేది అతిపెద్ద అడ్డంకిగా ఉండేదన్నారు. దాన్ని రద్దుచేయడం ద్వారా గత 70 ఏళ్లుగా ఏ ప్రధాని చేయలేని సాహసాన్ని నరేంద్ర మోదీ చేశారని కొనియాడారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే నెత్తురు పారుతుందని కాంగ్రెస్‌ ...

దీక్ష కొనసాగిస్తున్న కొల్లు రవీంద్ర

 కృత్రిమ ఇసుక కొరతను నిరసిస్తూ చేపట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేసినప్పటికీ.. మచిలీపట్నంలోని ఇంటిదగ్గర కొల్లు రవీంద్ర దీక్షను కొనసాగిస్తున్నారు. ఇసుక కొరతపై గాంధీ అహింసా మార్గంలో దీక్ష పట్టాలని నిర్ణయం తీసుకుంటే.. పోలీసులు తమను రాత్రి నుంచి వేధిస్తూ దీక్షను అడ్డుకుంటున్నారని కొల్లు ఆరోపించారు. రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి‌ తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా సామాన్యులకు ఇసుక దొరకడం లేదని ఆరోపించారు. వైకాపా నాయకులకే ఇసుక కేంద్రాల నుంచి ఇసుక తరలిపోతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఈ విషయం తమ నిరసన ద్వారా చెప్పాలని చూస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ, పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టంచేశారు. 36 గంటల దీక్షత...

జిన్‌పింగ్‌ భోజనంలో తమిళ రుచులు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత పర్యటనలో భాగంగా ఇక్కడి స్థానిక  వంటకాలను ఆయన రుచి చూడనున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో లభించే స్థానిక రుచులను ఆయనకు వడ్డించనున్నారు. రాత్రి భోజనంలో భాగంగా టమోటా చారు, అరచువిట్టా సాంబార్‌, కడలాయ్‌ కుర్మా, కవణరాశి హల్వాతో పాటు మరికొన్ని భారతీయ వంటలను వడ్డిస్తారు. ఇప్పటికే జిన్‌పింగ్‌ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా స్థానిక ఐటీసీ హోటల్‌కు వెళ్లి బస చేస్తారు. అక్కడి నుంచి బయల్దేరి మహాబలిపురం చేరుకుంటారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు .

సీఎం కుర్చీలో పిచ్చోడిని కూర్చోబెట్టినా ఇంకా బాగా పాలిస్తాడేమో!: అయ్యన్నపాత్రుడు

  ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీలో పిచ్చోడిని కూర్చోబెట్టినా ఇంకా బాగా పాలిస్తాడేమోనని వ్యాఖ్యానించారు. ఇసుక కొరతను నిరసిస్తూ దీక్ష చేసిన వారిని అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని, పోలీసులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించిన అయ్యన్నపాత్రుడు, తాము కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు.   

మరో రికార్డును కొట్టిన విరాట్ కోహ్లీ!

  భారత పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు ఒదిగిపోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఢిల్లీ డైనమైట్ కు ఇది 7వ డబుల్ సెంచరీ. తద్వారా భారత్ తరఫున అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డుల పుటల్లోకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 6 డబుల్ సెంచరీల రికార్డును ఢిల్లీకే చెందిన కోహ్లీ బద్దలు కొట్టడం విశేషం. అంతేకాదు, ప్రపంచ క్రికెట్ లో అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో నాలుగోస్థానానికి ఎగబాకాడు. కేవలం 81 టెస్టుల్లోనే కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ (52 టెస్టులు) ఉన్నాడు. డాన్ ఖాతాలో 12 డబుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (134 టెస్టులు) 11 ద్విశతకాలతో రెండో స్థానంలోను, 9 డబుల్ సెంచరీలతో వెస్టిండీస్ బ్యాటింగ్ కింగ్ బ్రియాన్ లారా (131 టెస్టులు) మూడో స్థానంలోను ఉన్నారు. ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 7000 పరుగులు సాధించా...

వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న జియో

ఐయూసీ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలని జియో తీసుకున్న నిర్ణయం విమర్శలపాలైన నేపథ్యంలో, సదరు సంస్థ నుంచి వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. అక్టోబరు 9న, అంతకుముందు రీచార్జి చేసుకున్నవాళ్లు తమ ప్లాన్ గడువు ముగిసేవరకు ఇతర నెట్ వర్క్ లకు ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి నిమిషానికి 6 పైసల చార్జి తప్పదు. దీనికోసం ప్రత్యేకంగా టాప్ అప్ కూపన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయంతో టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే, ట్రాయ్ ఐయూసీ చార్జీల నిబంధన తీసుకురావడంతో జియో తన ప్రణాళికను సమీక్షించుకోవాల్సి వచ్చింది. ఒక నెట్ వర్క్ కు చెందిన యూజర్లు మరో నెట్ వర్క్ కు కాల్ చేస్తే... కాల్ అందుకున్న నెట్ వర్క్ కు కాల్ చేసిన నెట్ వర్క్ కొంత చార్జీ చెల్లించడమే ఐయూసీ (ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి). ఇప్పటివరకు జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు చేసుకునే కాల్స్ కు అయ్యే ఖర్చును జియోనే భరించింది. గత మూడేళ్లలో తన నెట్వర్క్ నుంచి ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ఇతర నెట్వర్క్ లకు వెళ్లే వాయిస్ కాల్స్ పై రూ.13,500 మేర ఐయూసీ చార్జీలు పడగా...

చెన్నైకి చేరుకున్న జిన్‌పింగ్‌

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, సీఎం పళనిస్వామిలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చూసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ జిన్‌పింగ్‌ ముందుకు సాగారు. జిన్‌పింగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఐటీసీ చోళ హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన మహాబలిపురం బయలుదేరుతారు. నేడు, రేపు రెండు రోజులపాటు చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇది మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక సమావేశం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురం చేరుకున్నారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలు పంచుకునేందు ఈ సమావేశాలు వీలు కల్పిస్తాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. జిన్‌పింగ్‌ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది.

పోలవరంలో ఏం అవినీతి జరిగిందో జగన్ ప్రభుత్వం ఇంత వరకు కనిపెట్టలేకపోయింది: కన్నా లక్ష్మీనారాయణ

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను ఈరోజు ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి వెళ్లేముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపారని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులను ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగానే చూసిందని... సీరియస్ గా పని పూర్తి చేయాలని అనుకోలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతోందని... ఈ నేపథ్యంలో, పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయో చూద్దామని అక్కడకు వెళ్తున్నామని కన్నా తెలిపారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం... ఆ అవినీతిని నిరూపించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తే బాగుండేదని అన్నారు. పోలవరంలో ఎక్కడ అవినీతి జరిగిందో వైసీపీ ప్రభుత్వం ఇంత వరకు కనిపెట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఎల్లుండి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి... అవినీతి ఆరోపణలపై నివేదికను అందజేస్తామని చెప్పారు. పోలవరంలో అవినీ...

విజయసాయిరెడ్డిపై రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేయనున్న రవిప్రకాశ్

 వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేయబోతున్నారు. ఈ విషయాన్ని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. రవిప్రకాశ్ పై అసత్య ఆరోపణలు చేసి, ఆయన పరువుకు భంగం కలిగించినందుకు దావా వేయబోతున్నట్టు వెల్లడించారు. టీవీ9లోకి మైహోం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి చట్ట వ్యతిరేకంగా ప్రవేశించారని... రవిప్రకాశ్ పై వారిద్దరే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారు. రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి అనుచరుడు రామారావు లిఖితపూర్వకంగా తమ ఆరోపణలను వివిధ శాఖలకు గత నెలలో పంపించారని... అయితే ఇవన్నీ గాలి ఆరోపణలని అధికారులు తేల్చారని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. రామారావు పంపిన లేఖ ప్రతినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజయసాయిరెడ్డి తన లెటర్ హెడ్ పై పంపించారని చెప్పారు. వీరు చేసిన నిరాధారమైన ఆరోపణలను ప్రసారం చేసిన చానళ్లపై కూడా కోర్టులను ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు.   

రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ విచారణను వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

   టీవీ9 నిధులను అక్రమంగా డ్రా చేసుకున్నారనే ఆరోపణల కేసులో ఆ చానల్ మాజీ సీఈవో చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నిన్న విచారించిన కోర్టు... తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు వాదనలను విన్న తర్వాత తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

సంప్రదాయాలపై నాకు విశ్వాసం ఉంది...అందుకే పూజలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వివరణ

ప్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానం మొట్ట మొదటిది అందుకున్న సమయంలో ఆయుధ పూజ నిర్వహించడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. బాల్యం నుంచి తనకు ఆచార, సంప్రదాయాలపై నమ్మకం ఉందని, ఆ నమ్మకంలో భాగంగానే కొత్త వస్తువు స్వీకరించి వినియోగిస్తున్న సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు. రాఫెల్ విమానాన్ని స్వీకరించిన సందర్భంగా మంత్రి పూజలు జరిపి చక్రాల కింద నిమ్మకాయలు ఉంచడం, పసుపు కుంకుమతో ఓం అని రాయడంపై విపక్షాలు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి స్పందించారు. మత విశ్వాసం ప్రకారం పూజలు చేసుకునే హక్కు భారతీయులకు ఉందని, అందువల్ల తాను చేసింది తప్పుకాదన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే చేస్తానన్నారు. వాస్తవానికి ఈ అంశంపై విమర్శల్లో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని ఎద్దేవా చేశారు. కాగా రాజ్‌నాథ్‌ పూజలకు పాకిస్థాన్‌ మద్దతు తెలపడం విశేషం. ఆ దేశ సైనిక విభాగం అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ స్పందిస్తూ మత విశ్వాసాల ప్రకారం పూజలు తప్పుకాదన్నారు. అయితే కేవలం ఆయుధాలతో మాత్రమే గెలవలేమని, వాటిని నిర్వహించే వ్యక్తుల సామర్థ్యంపై విజయం ఆధారపడి ఉంటుందని ...

నాటి పల్లవరాజు కుమారభిక్షువే... చైనీయుల ఆరాధ్యుడు బోధి ధర్ముడు... అందుకే మహాబలిపురాన్ని కోరిన జిన్ పింగ్!

తమిళనాడు సముద్ర తీర పట్టణమైన మహాబలిపురం... ఇండియాలో ఎన్నో నగరాలు, మరెన్నో చారిత్రక ప్రాంతాలూ ఉన్నప్పటికీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఈ ప్రాచీన నగరాన్ని ఇండియాలో పర్యటనకు ముఖ్య కేంద్రంగా ఎంచుకున్నారు. ఇదే పట్టణాన్ని సందర్శించాలని, ఇక్కడే భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని జిన్ పింగ్ భావించడం వెనుక పెద్ద కారణమే ఉంది. దాదాపు 1200 సంవత్సరాల క్రితం... అంటే 7, 8 శతాబ్దాల సమయంలో మహాబలిపురాన్ని పల్లవ రాజులు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని ఓ మహా నగరంగా మార్చారు. ఈ నగరానికి, చైనాకు ఓ చారిత్రక అనుబంధం ఉంది. మూడో పల్లవరాజు కుమార విష్ణువు ఎన్నో యుద్ధ విద్యల్లో, వైద్య కళల్లో నిష్ణాతుడు. ఆయన బౌద్ధమతం స్వీకరించి, ఓ పని నిమిత్తం చైనాకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతాడు. చైనాలో ఆయన బోధి ధర్ముడు. చైనాలో బోధి ధర్ముడు ఎంతో ఆరాధ్యుడు. అక్కడి ప్రజలు నిత్యమూ ఆయన్ను పూజిస్తుంటారు. ఈ కారణం చేతనే తమకు ఆరాధ్యుడైన కుమార విష్ణువు నడయాడిన ప్రాంతాన్ని తిలకించాలని భావించిన జిన్ పింగ్, మహాబలిపురాన్ని ఎంచుకున్నారు. కాగా, బోధి ధర్ముడి కథపై ఆ మధ్య సూర్య, శ్రుతి హాసన్ జంటగా ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

మరో వారంలో విమానయాన సంక్షోభం... నిలిచిపోనున్న ఎయిరిండియా సేవలు!

మరో వారం రోజుల తరువాత, అంటే, ఈ నెల 18 నుంచి భారత విమానయాన రంగంలో సంక్షోభం మొదలు కానుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు 18వ తేదీ నుంచి ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)ను సరఫరా చేయబోమని చమురు రంగ కంపెనీలు తేల్చి చెప్పాయి. పాత బకాయిలను చెల్లించేంత వరకూ ఏఐకి ఇంధనాన్ని అందించబోమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు చెప్పేశాయి. గడచిన 8 నెలలుగా ఈ కంపెనీలకు ఏఐ ఇంధనానికి డబ్బులు కట్టలేదు. దీంతో రూ. 5000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. గత ఆగస్టులోనూ ఇదే విధమైన నిర్ణయాన్ని చమురు కంపెనీలు తీసుకోగా, కేంద్ర పౌర విమానయాన శాఖ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దింది. ఆపైనా బకాయిలు వసూలు కాకపోవడంతో చమురు కంపెనీలు ఇప్పుడు అల్టిమేటం ఇచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎయిరిండియా రూ. 60 వేల కోట్ల అప్పుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏటీఎఫ్ సరఫరాను నిలిపివేస్తే, ఏఐ విమానాల సేవలు నిలిచిపోవడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే, భారత ఏవియేషన్ ఇండస్ట్రీలో సంక్షోభం మొదలైనట్టేనని, ప్రయాణికుల అవసరాలను, డిమాండ్ కు తగ్గట్టు ...

అయోధ్య వివాదాస్పద భూమిని హిందువులకు కానుకగా ఇచ్చేద్దాం!: ముస్లిం మేధావుల పిలుపు

దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య రామ మందిరం వివాదాస్పద భూమి కేసు సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా సెటిల్ మెంట్ చేసుకోవడమే మంచిదని ముస్లిం మేధావులు కొందరు తమ అంతరంగాన్ని బయటపెట్టారు. ఈ కేసులో ముస్లింల తరపు పిటిషన్ దారులు గెలుపొందినప్పటికీ... ఆ వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడమే బెటర్ అని వారు తెలిపారు. మరోవైపు, వీరు తమను తాము 'శాంతి కోసం భారత ముస్లింలు' అని పేర్కొన్నారు. వీరిలో ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ లెఫ్టినెంట్ జెనరల్ జమీర్ ఉద్దీన్ షా కూడా ఉన్నారు. ఆయన ఆర్మీ డిప్యూటీ చీఫ్ గా కూడా పని చేశారు. ఈ సందర్భంగా జమీర్ ఉద్దీన్ షా మాట్లాడుతూ, 'వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను వాస్తవవాదిని. ఒకవేళ ముస్లింలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించినా... మనం అక్కడ మసీదును నిర్మించగలమా? నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తే... మసీదును నిర్మించుకోవడం అనేది ఎన్నటికీ నెరవేరని కలగానే మిగిలిపోతుంది. ముస్లింలకు అనుకూలంగా తీర్పు వచ్చినా... ఆ భూమిని మెజారిటీ ప్రజలకు బహుమానంగా ఇవ్వడమే ...