Skip to main content

Posts

Showing posts from August 15, 2020

జియో బంపర్ ఆఫర్: ఐదు నెలలు ఫ్రీ డేటా

రి యన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెంన్స్ డే ఆఫర్‌లో భాగంగా జియోఫై 4G వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలలపాటు ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ ఆఫర్ కల్పించింది.  జియోఫై ధర రూ. 1,999 మాత్రమే. అయితే ఈ ఆఫర్‌ను పొందేందుకు వినియోగదారులు మొదట జియోపై కోసం ఇప్పటికే ఉన్న ప్లాన్లలో ఒక దానిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేసి జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు చేయాలి. సిమ్ యాక్టివేట్ అయిన గంట తర్వాత ప్లాన్ అమల్లోకి వస్తుంది. మై జియో యాప్ ద్వారా యాక్టివేషన్ స్టేటస్‌ తెలుస్తుంది. అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో రూ.199 అత్యంత తక్కువ ప్లాన్. మరో ప్లాన్.. రూ. 249తో అందుబాటులో ఉన్న రెండో ప్లాన్‌లో రోజుకు 2GB డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇది రూ. 349తో అందుబాటులో ఉన్న మూడో ప్లాన్‌లో 28 రోజులపాటు రోజుకు 3GB డేటా లభిస్తుంది

రైనా కూడా గుడ్‌ బై

   టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడం గమనార్హం. ‘‘ధోనీ నీతో కలిసి ఆడడం ఓ మధురానుభూతి.. ఈ ప్రయాణంలో నేనూ మీతో చేరాలని నిర్ణయించున్నా. జైహింద్‌’’ అంటూ  ధోనీతో కలిసి ఉన్న చిత్రాన్ని జతచేసి రైనా తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఎం.ఎస్‌.ధోనీ గుడ్‌బై!

  టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు! తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ సందేశం ఉంచాడు. ‘కెరీర్‌ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.  19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని ఓ వీడియో పెట్టాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

65మంది సింగర్స్‌ 5 భాషలు.. ఒక పాట!

  వీడియో చూడండి: https://youtu.be/vVrdWGNUy04 భారత స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. బానిస సంకెళ్లు తెంచుకున్న భారత్‌ సగర్వంగా నిలబడిన ఈ రోజును అత్యంత ఘనంగా జరుపుకోవాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ చేసుకోవాల్సి వస్తోంది. అయితే, దేశభక్తికి ఏ నిబంధనలు వర్తించవు. మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించారు మన సినీ గాయకులు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం  ‘రోజా’. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’ పాటను 5 భాషల్లో 65మంది గాయకులు ఆలపించారు. ‘టుగెదర్‌ యాజ్‌ వన్‌’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ‘టుగెదర్‌ యాజ్‌ వన్‌’ ట్రాక్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది మనలోని ఏకత్వాన్ని చూపిస్తోంది. ఒక ముఖ్యమైన కారణం కోసం 65మంది సింగర్లు కలిసి ఈ పాట పాడటం విశేషం’ అని ట్వీట్‌చేశారు. తెలుగులో ఈ పాటకు రాజశ్రీ సాహిత్యం అందించగా, తమిళంలో వైరముత్తు, హిందీలో పీకే మిశ్రా, ...

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై స్పందించిన కుమారుడు చరణ్‌

కరోన తో పోరాడుతూ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. శుక్రవారం ఆయన ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ తన తండ్రి అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆడియో సందేశాన్ని పంపారు. ‘‘అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్‌డేట్‌ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న వెంటిలేటర్‌‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను అప్‌డేట్‌ ఇస్తాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని ఆడియో సందేశంలో పేర్కొన్నారు. ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు సైతం బులిటెన్‌ విడుదల చేశాయి. ‘‘కరోనాతో బాధపడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం ఆ...

రష్యా వ్యాక్సిన్‌పై భారత్‌ చర్చలు ఫేజ్‌-1, 2 సమాచారం కోరిన ఇండియన్‌ కంపెనీలు

  కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి మొట్టమొదటి టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని.. కీలకమైన మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెడుతోంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన కంపెనీలు కూడా ఫేజ్‌-1, ఫేజ్-2 క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారం కోరినట్లు ఆ దేశ మీడియా స్పుత్నిక్‌ పేర్కొంది. వ్యాక్సిన్‌ దేశీయ ఉత్పత్తికి, ఎగుమతికి కూడా అనుమతి కోరినట్లు  తెలిపింది. ఈ మేరకు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌)తో చర్చించినట్లు పేర్కొంది.  ‘‘స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్‌-1, ఫేజ్‌-2 సాంకేతిక వివరాలను ఆర్‌డీఐఎఫ్‌ను భారత కంపెనీలు అడిగాయి. అన్ని అనుమతలూ పూర్తి చేసుకున్న అనంతరం దేశీయంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, ఎగుమతి చేసేందుకు అనుమతి కోరాయి’’ అని స్పుత్నిక్‌ వెల్లడించింది. మాస్కోలోని రాయబార కార్యాలయ వర్గాలు ఈ వివరాలు తెలిపినట్లు పేర్కొంది. మరోవైపు మాస్కోలోని భారత రాయబా...

టిక్‌టాక్‌కు ట్రంప్‌ 90రోజుల డెడ్‌లైన్‌

  ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు ట్రంప్‌ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్‌ 12 వరకు గడవు లభించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్‌ అమ్మకం ప్రక్రియను బైట్‌డ్యాన్స్‌ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అమెరికన్ యూజర్ల డేటాను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అమెరికా జాతీయ భద్రతను బైట్‌డ్యాన్స్‌ ప్రమాదంలోకి నెట్టివేస్తుందనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ట్రంప్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌ కార్యకలపాలను కూడా కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు ట్విటర్‌ కూడా టిక్‌టాక్‌ కొన...

ధవళేశ్వరం వద్ద ప్రమాదకర స్థితికి చేరుకున్న గోదావరి

  ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి తీవ్రమైంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడక్కడ ఔట్ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. గోదావరి ప్రవాహ తీవ్రత అంతకంతకు అధికమవుతుండడంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధం తెగిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం కాజ్ వే మునిగిపోవడంతో సమీప లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఎగువన ఇప్పటికే భద్రాచలం వద్ద  మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. ప్రస్తుతం అక్కడ 45 అడుగులు ఉన్న నీటిమట్టం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

జగన్ గారూ.. మీకు తెలియకుండా పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది: హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు

  టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ఉరుముల్లేని పిడుగులా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ గారూ పెద్ద కుట్ర జరుగుతోన్నట్టుంది అంటూ ట్వీట్ చేసి తీవ్ర కలకలం రేపారు. "సీఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. వైఎస్ జగన్ గారూ, మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్ఠకు, మేం మీమీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. అలాంటి వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం" అంటూ రామ్ ట్విట్టర్ లో స్పందించారు. అంతేకాదు, "ఏపీ గమనిస్తోంది" అంటూ హ్యాష్ టాగ్ కూడా పెట్టారు.

కరోనా భయాలు లేకుండా వినాయక చవితి జరుపుకోండి.. ఒక్క క్లిక్ తో వినాయకుడు, పూజ సామగ్రి, పత్రులు మీ చెంతకే!

 విఘ్నాలకు అధిపతి, అన్ని ఆటంకాలను నివారించే దైవం గణపతి. శివపార్వతుల ప్రథమ పుత్రుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనిని కూడా ప్రారంభించరు. వినాయకుడి అనుగ్రహం ఉంటే అన్నింటా విజయమే లభిస్తుందనేది హిందువుల నమ్మకం. భక్తుల ఇష్టదైవం గణనాయకుడి పుట్టినరోజైన వినాయకచవితి వచ్చేస్తోంది.  హిందువులంతా వినాయకచవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో వినాయకుడి బొమ్మను ప్రతిష్టించి... పువ్వులు, పత్రులతో భక్తితో పూజించి... ఆ తర్వాత నిమజ్జనం చేయడం ఆనవాయతీ. మరో వారం రోజుల్లో వినాయకచవితి ఉండటంతో... సర్వత్ర పండుగ హడావుడి మొదలైంది. సాధారణంగా వినాయక చవితి వస్తోందంటే పెద్ద సందడి కనిపిస్తుంటుంది. కానీ, ఈ ఏడాది పరిస్థితులు కరోనా వైరస్ కారణంగా పూర్తిగా మారిపోయాయి. జనాలు ఎప్పటి మాదిరి స్వేచ్ఛగా మార్కెట్లోకి వెళ్లి కావాల్సినవి కొనుక్కొని వచ్చే పరిస్థితులు లేవు. మరోవైపు వినాయకుడి పూజకు కావాల్సిన అన్ని రకాల పత్రులను సేకరించడం కూడా అంత ఈజీ కాదు. అంతేకాదు పూజకు ఏయే పత్రులను వినియోగించాలో కూడా మనలో చాలా మందికి అవగాహన ఉండదు. రోడ్లపై రకరకాల ఆకులు అమ్ముతుంటారు. రెండో ఆలోచన లేకుండా అడగినంత స...

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర మరియు వివిధ జిల్లాల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వీడియోలు

*AP State Independence Day2020 Celebrations at  h ttps://youtu.be/s2THm9MDKww Dist.wise  IndependenceDay Celebrations SrikakulamDist. h ttps://youtu.be/qScBPLegk5M *VizianagaramDist. https://youtu.be/0PkC4h-8Lro *VisakapatnamDist https://youtu.be/TmnukADHu8k *WestGodavariDist. https://youtu.be/_SPvsQZ3WsE *Guntur Dist. https://youtu.be/iMhuPIVpPgs *Prakasam Dist. https://youtu.be/Mp3UE4H2VDM *YSR Kadapa Dist https://youtu.be/49NY-6PWfDA *Kurnool Dist. https://youtu.be/BvsdAT4fero

మూడు ప్రాంతాలకు సమన్యాయం : జగన్‌

ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో 74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. సమానత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్న సీఎం .. ఎస్సీ, బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 30లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు అందిస్తున్నాం... రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్థికసాయం చేస్తున్నామని వివరించారు. పేద పిల్లలు  ఆంగ్లమాధ్యమంలో చదవకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.   వికేంద్రీకరణే సరైన విధానం.. ‘‘రాష్ట్ర విభజన ద్వారా  అయిన గాయాలు మానాలన్నా, అలాంటి గాయం మరెన్నడూ తగలకుండా జాగ్రత్తపడాలన్న రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. వికేంద్రీకరణే సరైన విధానం అని నిర్ణయించి సమన...

ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు: మోదీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని

74 వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా  ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు లభిస్తుంది. వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది’ అని మోదీ వెల్లడించారు. ఈ ఎన్‌డీహెచ్‌ఎం.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుంది. ఇది దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అలాగే సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్‌ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొంద...

యువతుల పెళ్లి వయసుపై త్వరలో నిర్ణయం: ఎర్రకోట పైనుంచి మోదీ

  స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్, జీఎస్టీ, నూతన విద్యావిధానం వంటి వాటిపై సమగ్రంగా మాట్లాడారు. యువతుల పెళ్లి వయసుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపిన మోదీ.. మహిళల్లో పోషకాహార లోపాల నివారణకు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. వెయ్యి రోజుల్లో ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌ను తీసుకెళ్లామని, ఆరేళ్లలో లక్షన్నర గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. జీఎస్టీతో చాలా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని అన్నారు. ప్రపంచానికి గొప్ప వృత్తి నిపుణులను అందించిన ఘనత భారత మధ్యతరగతిదేనని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రధాని మాట్లాడుతూ.. కరోనాను అంతమొందించే టీకా కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు తపస్సులా పరిశోధనలు చేస్తున్నారని కొనియాడారు. వారి శ్రమ త్వరలోనే ఫలిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు వ్యాక్సిన్లు తుది దశ పరీక్షల్లో ఉన్నాయని ప్రధాని వివరించారు.  

ఎపి ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు eSR శిక్షణ వీడియో

వీడియో కోసం క్లిక్ చేయండి: https://youtu.be/g1c3VC-gSpw ఎపి ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు ఆగస్ట్ 25 నాటికి eSR ను పూర్తి చేయవలసి ఉన్నది.దానికి సంబంధించి APHRDI బాపట్ల వారు  ఆగస్టు 14న ఉదయం 11:00 నుంచి 12:30 వరకు ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమం చూడని వారికి కోసం ఈ వీడియో.