తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం ఆరాటపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివాదాలు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉండవల్లిలోని ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని కూల్చివేశారని ప్రచారం జరిగితే సానుభూతి వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు.
అద్దెకు ఉన్నప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేస్తే ఎలాంటి గొడవలు, వివాదాలు ఉండవు కదా అంటూ హితవు పలికారు. ఇకపోతే ఏపీలో కొన్ని న్యూస్ ఛానెల్స్ ప్రచారాన్ని నిలిపివేయడంపై కూడా చంద్రబాబు నాయుడును వదల్లేదు.
గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీడియా సంస్థలను రాకుండా అడ్డుకున్నారని అప్పుడు ఆయన చేసిన తప్పు ఇప్పుడు సీఎం వైయస్ జగన్ చేస్తున్నారంటూ సుజనా చౌదరి స్పష్టం చేశారు. మీడియాను నియంత్రించాలనుకోవడం సరికాదని హితవు పలికారు.
Comments
Post a Comment