Skip to main content

Posts

Showing posts from October 25, 2019
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ మీ స్టేటస్ ఇక ఫేస్ బుక్ లోనూ చూడవచ్చు. వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాట్సాప్‌లో స్టేటస్ పోస్ట్ చేస్తే ఫేస్‌బుక్‌ స్టోరీల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మీరు బీటా వెర్షన్ వాడుతున్నట్లైతే ఈ ఫీచర్‌ను వాడవచ్చు.వాట్సాప్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్‌కు చెందినదే అయినా దాని పాలసీ ప్రకారం అకౌంటుకు లింక్ చేయలేదు. ఇలా వాట్సాప్ స్టేటస్ ను facebook లో కూడా చూడవచ్చు.

సీఎం జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ!

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు కలిసిన విషయం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరో ఆసక్తికర ఘటన కూడా ఈరోజు జరిగింది. ఏపీ సీఎం జగన్ ను వల్లభనేని వంశీ కలిశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి జగన్ ని ఆయన కలిశారు. వారి వాహనంలోనే వంశీ వచ్చినట్టు సమాచారం. దాదాపు అరగంట పాటు వారిద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. కాగా, వల్లభనేని వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో వల్లభనేని వంశీ నిన్న భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం.   

జగన్ పై విమర్శలు చేయడమే పవనిజమా?: ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘జగన్ పై విమర్శలు చేయడమేనా పవనిజం? తెలుగుదేశం పార్టీతో లాలూచీ పడ్డ మీరు జగన్ తో పేచీ పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల వైఖరిని విమర్శిస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటి? అన్న మీరు ఇప్పుడు తెదేపాతో కలిసి చేస్తున్నదేమిటి?’ అని నిలదీశారు. జగన్ పై కేసులున్నాయని చెబుతున్న పవన్ అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులని గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎలాంటి కేసులు లేని పవన్ బీజేపీని ఇప్పటివరకు ఒక్కసారైనా ప్రశ్నించారా? అని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రం ఏ రకంగా వెనక్కి వెళ్లిందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం తప్పులు మీకు కన్పించడం లేదా? అని పవన్ ను సూటిగా ప్రశ్నించారు. నిజాయతీ రాజకీయాలు చేయాలన్నారు.   

ధర్మాడి సత్యంకు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని విమర్శిస్తారా?: చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం

  గోదావరిలో మునిగిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యంకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించారు. దీనిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోటు వెలికితీసిన ధర్మాడిని టీడీపీ సన్మానించాల్సింది పోయి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేఖ రాస్తారా అని ఈ లేఖలో ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన చంద్రబాబుకు మతిపోయినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మాడి సత్యం లాంటి వ్యక్తి తమ కాకినాడలో వుండటాన్ని గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. బోటు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని విమర్శించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన వరి పొలాలను అధికారులతో కలిసి కన్నబాబు పరిశీలించారు. కరప మండలం వేములవాడ, వాకాడ గ్రామంలోని పొలాలను పరిశీలించారు. తమకు జరిగిన నష్టం గురించి మంత్రికి చెప్పిన కౌలు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.   

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాంకేతికంగా వీలు కాదు: కన్నా స్పష్టీకరణ

  బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాంకేతికంగా వీలుకాదని స్పష్టం చేశారు. హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమే చేయాలని, ఇప్పడు రాష్ట్రాభివృద్ధికి అన్ని పార్టీలు కలసి రావాలని కన్నా పిలుపునిచ్చారు.  రాష్ట్రంలో సమస్యలపై స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఇసుక సమస్య ఉత్పన్నమైందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పనుల ఆలస్యం, రీటెండరింగ్ పై కేంద్రం నివేదిక కోరిందని, నివేదిక తర్వాత రాష్ట్రంపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.

నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

పనామా పేపర్స్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నవాజ్‌ షరీఫ్‌ ప్రస్తుతం లాహోర్‌ జైల్‌లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో  నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా  మెడికల్‌ పర్మిటెన్స్‌ కింద నవాజ్‌ షరీఫ్‌కు లాహోర్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో జైలు అధికారులు షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నవాజ్‌ షరీఫ్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ

బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ అయ్యారు. కరణం బలరాం నివాసంలో సుజనా చౌదరి భోజనం చేసినట్టు సమాచారం. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సుజనా చర్చలు జరిపారు. సుజనాతో టీడీపీ నేతల వరుస భేటీలతో తెలుగుదేశం అధిష్ఠానం తలపట్టుకుంటోందని సంబంధిత వర్గాల సమాచారం.

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ఆ ఎమ్మెల్యే వ‌ద్దు.. గ‌ళ‌మెత్తిన‌ ఉమాభార‌తి

హ‌ర్యానా అసెంబ్లీ ఫ‌లితాలు ర‌స‌వ‌త్త‌రంగా వెలుబ‌డిన విష‌యం తెలిసిందే. బీజేపీ 40 సీట్ల‌తో ఆధిక్యంలో ఉన్నా.. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన బ‌లం లేదు. దీంతో స్వ‌తంత్య్ర ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్నారు. ఆ జాబితాలోనే ఎమ్మెల్యే గోపాల్ కండా కూడా ఉన్నారు. గ‌తంలో బీజేపీలోనే ఉన్న అత‌ను.. లైంగిక దాడి ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆ పార్టీకి దూరం అయ్యారు. సిర్‌సా నుంచి గెలిచిన గోపాల్ కండా ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. మ‌ద్ద‌తు ఇస్తానంటూ ముందుకువ‌చ్చాడు. కానీ ఆ పార్టీ మ‌హిళా నేత‌లు ఆ ఎమ్మెల్యేను తీసుకోవ‌ద్దు అంటూ త‌మ అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. హ‌ర్యానాలో ప్ర‌భుత్వ ఏర్పాటును స‌మ‌ర్థిస్తున్నా.. గోపాల్ లాంటి ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకోరాదు అని సీనియ‌ర్ నేత ఉమాభార‌తి ట్వీట్ చేశారు. పార్టీలో మోదీ లాంటి శ‌క్తివంత‌మైన నేత ఉన్న‌ప్పుడు .. గోపాల్ లాంటి ఎమ్మెల్యేలు ఎందుకు అని ఆమె ప్ర‌శ్నించారు. రేప్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గోపాల్ కండాను బీజేపీ స్వాగ‌తిస్తోంద‌ని, అంటే ఆ పార్టీకి మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప‌ట్ల చిత్త‌శుద్ధి లేద‌ని మ‌హిళా కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్ విమ‌ర్శించారు. 90 సీట్లు ఉ...

అశ్వత్థామరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్...

ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కూకట్‌పల్లి డిపోకు చెందిన కోరేటి రాజు అనే డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటూ.. వారి ఆత్మహత్యకు అశ్వత్థామరెడ్డి కారణమవుతున్నాడని డ్రైవర్ ఆరోపించాడు. కార్మికుల కోసం కొట్లాడేందుకు చాలా మంది నాయకులు ఉన్నారు. సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీల్లో జాయిన్ అయితే తమకు అభ్యంతరం లేదని.. ఇష్టమున్న వారు దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించారని.. అందుకనుగుణంగా అందరూ విధుల్లో చేరాలని రాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి మన కోరిక వినిపించడానికి రెండు మూడు రోజులు సమ్మె చేయాలి, కానీ నెలల తరబడి సమ్మె చేయడం భావ్యం కాదని తెలిపారు. అశ్వత్థామరెడ్డి వంటి నాయకులకు సత్తా ఉంటే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వద్దకు వెళ్లి డిమాండ్లు సాధించాలి, కానీ కార్మికులను విధులకు వెళ్లద్దనడం సమంజసం కాదన్నారు. నాయకుల మాటలు విని కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. మనకు అన్నం పెట్టిన సంస్థ ఆర్టీసీని కాపాడుకోవాలని తోటి కార్మికులకు డ్రైవర్ రాజు విజ్ఞప...

ముకేశ్‌ అంబానీ ఇంట దీపావళి సందడి

  ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ ఇంట మరోసారి సందడి మొదలైంది. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముంబయి ఇండియన్స్‌ జట్టు ఆటగాళ్లకు ఆహ్వానం అందింది. ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, జహీర్ ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌ తదితరులు వారి సతీమణులతో ఈ వేడుకకు హాజరయ్యారు. వీరితో పాటు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, మహేలా జయవర్దనే, ఆకాశ్‌ అంబానీ- శ్లోకా మెహతా, ఇషా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌, అజయ్‌-స్వాతి పిరమాల్‌లు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

అమరావతిలో రాజధాని కడతారా?లేదా?:పవన్‌

రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక బాధపడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని అన్నారు. అసలు అమరావతిలో రాజధాని కడతారా? లేదా? స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన్ను ఇసుక లారీ యజమానులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌  మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఇసుక లారీల యజమానులు తనను కలిసి బాధపడ్డారనీ.. ఇసుక రవాణా ఆగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారని వెల్లడించారు. ప్రభుత్వ విధానం వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన చెందుతున్నారని పవన్‌ తెలిపారు. ఇసుక కొరత ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైనా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జనసేనాని స్పష్టంచేశారు. ప్రభుత్వ పరిపాలన తీరు చాలా బాధను కల్గిస్తోందన్నారు. ప్రజల సమస్యల్ని దృ...

చిదంబరం, డీకే శివకుమార్ ల బెయిల్ రద్దు చేయాలి: సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీ పిటిషన్లు

 ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఇటీవల సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్.. ఢిల్లీ హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొందారు. అయితే, వీరిద్దరి బెయిల్ లను రద్దు చేయాలని ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. చిదంబరం, డీకే శివకుమార్ ల బెయిల్ లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ, ఈడీ విడివిడిగా పిటిషన్ లు దాఖలు చేశాయి. కాగా, ఇటీవల రూ.లక్ష వ్యక్తిగత పూచి కత్తుపై సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ ఆయన జైలునుంచి విముక్తి అయ్యే అవకాశం లేకుండాపోయింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకి సంబంధించిన ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. మరోవైపు, ఈడీ విచారణలు ఎదుర్కొంటోన్న డీకే శివకుమార్‌ ఢిల్లీలోనే ఉంటున్నారు.  ఈ కేసులో తన తల్లి, భార్యకు ఈడీ జారీ చేసిన నోటీసుల నుంచి మినహాయింపు ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ల విచారణలు ఈ నెల 31కు వాయిదా పడ్డాయి. ఆయన నిన్న సాయంత్రం కాంగ్...

ఉగ్రరూపం దార్చిన కృష్ణమ్మ.. నీట మునిగిన ఇల్లు..

మరో సారి విజయవాడ వద్ద కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ఈ ఉదయం ఆరున్నర లక్షలకు పైగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు ప్రవహిస్తూ ఉండటంతో, విజయవాడ, రామలింగేశ్వర నగర్ లోకి నీరు ప్రవేశించింది. దీంతో వందలాది పేదల ఇళ్లు నీట మునిగాయి. వరద నీరు నగరంలోకి ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన గోడకు లీకులు ఏర్పడటం కారణంగానే నీరు వచ్చిందని అధికారులు తెలిపారు. వరద తగ్గిన తరువాత మాత్రమే మరమ్మతులకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈలోగా నీటిని తోడివేసేందుకు భారీ మోటార్లతో కూడిన యంత్రాలను వినియోగిస్తామని తెలిపారు. కాగా, ఇళ్లలోకి నీరు రావడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరద మరింతగా పెరగవచ్చన్న అంచనాలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రేపటికి ప్రకాశం బ్యారేజ్ కి 8 లక్షల క్యూసెక్కుల వరకూ వరద రావచ్చని అంచనా.

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఇకపై అలా కుదరదు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇస్తున్న హామీలు, తీసుకుంటున్న నిర్ణయాల అమలులో జాప్యం జరుగుతుందనే విషయాన్ని గమనించిన సీఎం జగన్... ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎంవో... సీఎం ఆదేశాలు సమయానుగుణంగా అమలు కాకపోవడంతో సంక్షేమ పథకాల అమల్లో ఇబ్బందులు తలెత్తున్నాయని భావిస్తోంది. ఈ కారణంగా వాటి తీవ్ర తగ్గుతుందనే భావనలో సీఎంవో కార్యాలయం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ బిజినెస్ రూల్స్ 2018లో సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యదర్శుల నుంచి సీఎంకు ఈ-ఆఫీస్ ద్వారా పంపే ఫైళ్లు మూడు కేటగిరీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేరోజు లేదా మోస్ట్ ఇమీడియేట్, ఇమీడియేట్‌గా విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ శాఖ నుంచి వచ్చే ఫైళ్లకు ఆర్ధిక, న్యాయశాఖల నుంచి క్లియరెన్స్ తీసుకునేందుకు గడువు విధించింది. వివిధ శాఖల నుంచి వచ్చే ఫైళ్లను ఆర్ధిక, న్యాయశాఖలు రెండు రోజుల్లో క్లియర్ చేసేలా ఆదేశించింది. మిగతా శాఖలు ఒక రోజులో క్లియర్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. నిర్ణీత సమయంలో క్లియర్ కాకపోత...

హుజూర్‌నగర్‌ ఫలితం చూసైనా విపక్షాలు నోరు జారడం మానాలి: మంత్రి తలసాని సూచన

అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కంటే ప్రజల్లో పరపతిని సాధించి సత్తా చాటేందుకు విపక్షాలు ప్రయత్నం చేయాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ చురకంటించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పేట్రేగిపోయిన విపక్ష నాయకులకు ఈ ఫలితాలు చెంపపెట్టన్నారు. తామే ప్రత్యామ్నాయమంటూ భీషణ ప్రతిజ్ఞలతో రెచ్చిపోయిన బీజేపీకి కనీసం ఓ వార్డు సభ్యునికి వచ్చిన ఓట్లు కూడా రాని విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల ముందు విపక్షాలు ప్రజల్లో పార్టీని బలపర్చుకుని అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు.

హర్యాణాలో కాంగ్రెస్ కు షాక్.. బీజేపీకి మద్దతు పలికిన స్వతంత్ర అభ్యర్థులు

హర్యాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 40 సీట్లను గెల్చుకున్న బీజేపీకి అధికారాన్ని చేపట్టేందుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన వేళ... ఇండిపెండెంట్లుగా గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు ప్రకటించారు. వీరి మద్దతుతో బీజేపీ సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ (46) కంటే ఒకటి ఎక్కువగానే ఉండబోతోంది. మరోవైపు, ఢిల్లీలో ఈరోజు పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్ లో చండీఘడ్ లోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయల్దేరే ముందు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామనే ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఢిల్లీకి చేరకుని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో భేటీ అయ్యారు. మరోవైపు, ఇండిపెండెంట్లు గోపాల్ ఖండా, రణధీర్ గోలన్, బల్రాజ్ కుందూ, రంజిత్ సింగ్, రాకేశ్ దౌలతాబాద్ లు బీజేపీకి ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తున్నామని ప్రకటించారు. వీరంతా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంవీర్ సంఘ్వాన్, ధరంపాల్ గోండార్ లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కాసేపట్లో బీజేపీ అగ్ర నేతలతో వ...

వైసీపీ, టీడీపీల మధ్య క్విడ్ ప్రోకో నడుస్తోందని అందుకే చెబుతున్నాం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య క్విడ్ ప్రోకో నడుస్తోందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి జరిగిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 900 కోట్లు ఆదా చేసినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆయన అన్నారు. పోలవరంలో అవినీతి చోటు చేసుకున్నట్టైతే... సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ కేంద్రానికి లేఖ రాస్తే... 24 గంటల్లో చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజాధనాన్ని మింగేసిన దొంగలను జైల్లో పెడతామని అన్నారు. పోలవరమే కాకుండా, ఇతర పనుల్లో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని విష్ణు ప్రశ్నించారు. అందుకే వైసీపీ, టీడీపీల మద్య క్విడ్ ప్రోకో ఉందని తాము అంటున్నామని తెలిపారు. కేంద్ర విచారణ సంస్థలు జోక్యం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు లేఖ రాయాలని చెప్పారు. లేఖ రాస్తే తాము వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు.

నకిలీ మెయిల్ ఐడీ' కేసులో రవిప్రకాశ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు

'నకిలీ మెయిల్ ఐడీ' కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీవీ 9లో రూ.18 కోట్ల నిధుల అవకతవకల కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయనకు ఆ కేసులో బెయిల్ వచ్చింది. ఆయనపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించడంతో ఇటీవల సీసీఎస్ పోలీసులు 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఐ ల్యాబ్స్‌ గ్రూప్‌ అధ్యక్షుడు టి.కృష్ణప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు. నకిలీ ఈ-మెయిల్‌ సృష్టించి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఈ రోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు... కూకట్ పల్లి కోర్టులో పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది.

ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన జగన్ 'రాజధాని'పై స్పందించాలి: సుజనా చౌదరి

ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర గందరగోళం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. దీనిపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని... గందరగోళానికి తెరదించాలని చెప్పారు. ఈ అంశంపై జాతీయ పార్టీగా తాము ఇప్పుడే స్పందించలేమని అన్నారు.  భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. ఏపీ, తెలంగాణల్లో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోబోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ.. పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం!

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వంశీ పార్టీ మారే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒంగోలు వెళ్తున్న సుజనా చౌదరి గుంటూరులోని ఓ బీజేపీ నేత ఇంటి వద్ద కాసేపు ఆగారు. ఈ సమయంలో వంశీ అక్కడకు వచ్చి సుజనా చౌదరిని కలిశారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత... ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలుకు బయల్దేరారు. కొంత కాలం క్రితమే సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు, టీడీపీపై కొంత కాలంగా వంశీ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వీరిద్దరి భేటీ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. వంశీ పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

బీజేపీతో చేరే ఇండిపెండెంట్లను జనాలు చెప్పులతో కొడతారు: దీపేందర్ సింగ్ హుడా

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో... బీజేపీ, కాంగ్రెస్ లు ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. 10 సీట్లను గెల్చుకున్న జేజేపీ అధినేత దుష్యంత్ కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి మద్దతిచ్చే ఆలోచన తమకు లేదని చెప్పారు. ఈ పరిణామాలను ముందే ఊహించిన బీజేపీ అధిష్ఠానం ఇండిపెండెంట్లను ఆకర్షించే ప్రయత్నంలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తెలిపితే... వారిని జనాలు చెప్పుతో కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జతకలిసే ఇండిపెండెంట్లు వారి గొయ్యి వారే తవ్వుకున్నట్టని చెప్పారు. అలా చేసే ఇండిపెండెంట్లను ప్రజలు క్షమించరని... సరైన సమయంలో చెప్పులతో సమాధానం చెబుతారని అన్నారు.

ప్రమాణ స్వీకారం వేళ హర్యానాలో బీజేపీకి షాక్‌.. ఆ పార్టీకి మద్దతివ్వమన్న దుష్యంత్‌!

హర్యానాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో కింగ్‌ మేకర్‌గా మారిన జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) మద్దతుపై కోటి ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ అధినేత దుష్యంత్‌ చౌతాలా భారీ షాక్‌ ఇచ్చారు. బీజేపీకి మద్దతు ఇచ్చే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఫలితాలు వెలువడిన అనంతరం మా ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించాం. మేము ఓ సిద్ధాంతం ప్రకారం పార్టీని స్థాపించాం. అదే సిద్ధాంతాన్ని కొనసాగిస్తాం’ అని దుష్యంత్‌ స్పష్టం చేశారు. ఫలితాల అనంతరం బీజేపీ అధినాయకులు ఎవరూ తమను సంప్రదించలేదని, తాను కూడా ఎవరితోనూ మాట్లాడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 46 కాగా బీజేపీ 40 మార్కువద్ద ఆగిపోయింది. కాంగ్రెస్‌కు 31, జేజేపీకి 10, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందారు. అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయింది. ఈరోజు ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మరోపక్క, బేరసారాలపై ఆశలు పెట్టుకునే బీజేపీ ప్రభుత్వం...