Skip to main content

Posts

Showing posts from August 25, 2020

తనపై తానే బయోపిక్ని నిర్మిస్తున్న రాంగోపాలవర్మ

బొమ్మాకు మురళి నిర్మాణంలో RGV పర్యవేక్షణలో "దొరసాయి తేజ" ఈ చిత్రానికి దర్శకత్వం చేయనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుంది.... ఒక్కో పార్టు రెండు గంటల నిడివితో..‌.మొత్తం మూడు భాగాలు నిర్మితం కానుంది... వివిధ దశల్లోని మొదటి రెండు భాగాల్లో *రాము* క్యారెక్టర్ ను ఇతర నటులు పోషించనుండగా... కీలకమైన మూడవ భాగంలో స్వయంగా *రాంగోపాల్ వర్మ* నటించనున్నారు

K.రామచంద్రరావు రాజీనామా

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా* చేసిన ప్రముఖ జర్నలిస్ట్ K రామచంద్రరావు... ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ను సచివాలయం లో కలిసి తన రాజీనామాను సమర్పించిన రామచంద్రరావు

ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచనలేదు: కేంద్రం స్పష్టీకరణ

  త్వరలోనే దేశంలో అన్ లాక్ 4.0 ప్రక్రియ షురూ కానుంది. తాజా అన్ లాక్ తీరుతెన్నులపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ ప్రకటించబోయే ఆంక్షల సడలింపులో స్కూళ్లు ఉండవని వెల్లడించారు. అటు, మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు, బస్సులు తిరుగుతుండగా, అనేక రాష్ట్రాల నుంచి మెట్రో సేవలపై డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, స్కూళ్లు, సినిమా థియేటర్లు, బార్లు తెరుచుకునేందుకు మరికొంతకాలం వేచిచూడకతప్పదు. అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్రం ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశాలున్నాయి.

సూపర్ యాప్'ను సిద్ధం చేస్తున్న టాటా... రిలయన్స్, అమెజాన్ పై పోటీకే!*

  గుండు సూది నుంచి కారు వరకూ ఒకే వేదికపై, డిసెంబర్ లేదా జనవరిలో విడుదల దాదాపు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న టాటా సన్స్ ఇప్పటికే టాటాకు దేశవ్యాప్తంగా కస్టమర్లు

ఉద్యోగంతో పాటు ఇల్లు కూడా ఇస్తున్న సోనూ సూద్

  సోనూ సూద్ మరోసారి హీరో అనిపించుకున్నాడు వేల మంది వలస కార్మికులకు ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపాడు ప్రవాసీ రోజ్ గార్ ద్వారా 20 వేల మంది కూలీలకు గార్మెంట్ యూనిట్లలో ఉపాధి దొరికింది. ఇప్పుడు వారికి వసతి సౌకర్యం కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని సోను తెలిపాడు. వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకుప్రవాసీ రోజ్ గార్' అనే వెబ్ సైట్, యాప్ ప్రారంభించిన సంగతి తెలిసిందే

శ్రీశైలం స్పిల్‌వే గేట్లన్నీ మూసివేత

 శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా తగ్గింది. దీంతో స్పిల్‌వే గేట్లన్నీ మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫో 73,583 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ ఫ్లో 30, 986 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.20అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.99 టీఎంసీలకు చేరింది. కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

స్వర్ణ ప్యాలెస్‌ బాధితులకు పరిహారం అందజేత

 విజయవాడ స్వర్ణాప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. బాధిత కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెక్కులను రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, సామినేని ఉదయభాను తదితరులు అందించారు.  ఈ సందర్భంగా  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ... ప్రైవేటు ఆసుపత్రులు అనుమతుల్లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొవిడ్‌కేర్‌ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపత్కర సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు తమ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రైవేటు ఆసుపత్రుల యాజమన్యాలు వైఖరి మార్చుకోవాలని సూచించారు.

రమేశ్‌ ఆస్పత్రి ఎండీపై చర్యలు నిలిపివేయండి’ ఏపీ హైకోర్టు ఆదేశం

 విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం వ్యవహారంలో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్‌పై తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆస్పత్రి ఎండీ రమేశ్‌బాబు, సీతారామ్మోహన్‌రావు వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  స్వర్ణప్యాలెస్‌లో రమేశ్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహించారు. ఈనెల 9న అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన ప్రభుత్వం రమేశ్‌ ఆస్పత్రికి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అనుమతులు రద్దుచేసి ఎండీ డాక్టర్‌ రమేశ్‌ బాబు సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రమేశ్‌బాబు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఏళ్లతరబడి స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. అధికారులు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణకు అనుమతి ఇచ్చారని పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీని...