విజయదశమి సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లు జల విహారం చేయనున్నారు. ఇవాళ కృష్ణానది లో నిర్వహించిన తెప్ఫోత్సవ ట్రైల్ రన్ సక్సెస్ కావడంతో రేపటి ఆది దంపతుల విహారంకు మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పలువురు క్రింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసారు. దీంతో పున్నమిఘాట్, ప్రకాశం బ్యారేజి, సీతానగరం ప్రాంతాల నుంచి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దుర్గాఘాట్ లో ఫ్లై ఓవర్ పనులతో విఐపి పాస్ ల కుదించాలని నిర్ణయించిన అధికారులు కేవలం వెయ్యి పాస్ లు మాత్రమే జారీ చేసారు.