Skip to main content

Posts

Showing posts from October 10, 2019

రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయించాం: జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి

టీఎస్సార్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. అనంతరం, మీడియాతో జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయించామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజా రవాణాను కాపాడుకునేందుకే సమ్మెకు దిగామని, ఎల్లుండి అన్ని డిపోల దగ్గర మౌన ప్రదర్శన నిర్వహిస్తామని, అన్ని ఉద్యోగ సంఘాలు తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, సమ్మెకు మద్దతుగా ఉండాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు రేపు లేఖలు అందజేస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, పార్టీలు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు. రేపు, ఎల్లుండి ఆర్టీసీ డిపోల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి పాల్గొని తమ నిరసన తెలిపాలని కోరారు. సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టే నిరసన కార్యక్రమాలకు మద్దతుగా తమ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని తెలంగాణ సీపీఐ  కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు. కాగా, సీపీఐ (ఎంఎల్) న్యూ...

ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం

సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణను అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో కొనుగోళ్లు, సేవలకు ఆన్ లైన్ లో టెండర్లు పిలిచేలా కొత్త విధానం రూపకల్పన చేశారు. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలు చేసేలా కార్యాచరణకు దిగనుంది. ఇకపై ప్రభుత్వ కొనుగోళ్లన్నీ ఈ-ప్లాట్ ఫాం వేదికగానే జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, అన్ని ప్రభుత్వ శాఖల కొనుగోళ్లకు ఏకరూప విధానాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. ప్రతి ఏటా సామగ్రి కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు, సేవలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. ప్రస్తుతం ఇ-ప్రొక్యూర్ మెంట్ లో రూ.3,181 కోట్ల మేర కొనుగోలు చేస్తున్నట్టు, టెండర్లు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నట్టు, నాసిరకం సామగ్రి సరఫరా అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. కొనుగోళ్లు, చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఇ-ప్రొక్యూర్ మెంట్ విధానాన్ని అమలు చేయనుంది.

ఎప్పటి నుంచో వున్న ఈ పథకానికి జగన్ తండ్రి పేరు పెట్టడం విడ్డూరం: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఏపీలో ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రభుత్వం ఈరోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు  విమర్శలు గుప్పించారు. ఈ పథకం ఎప్పటి నుంచో వున్నదేనని, దీనికి కేంద్రమే అరవై శాతం నిధులిస్తోందని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వమే అమలు చేస్తున్నట్టుగా భావించి దీనికి సీఎం జగన్ తన తండ్రి పేరు పెట్టడం విడ్డూరంగా వుందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సరైన విధానమంటూ లేదని, పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడం సరికాదని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. ఏపీలో పోలీసుల దుర్నీతి గురించి బాబు ప్రశ్నిస్తున్నారని, టీడీపీ హయాంలో బీజేపీ నేతలపై రాళ్లు వేయించలేదా? కేసులు పెట్టించలేదా? అని విమర్శించారు. ఆనాడు ఏం చేశారు? ఇప్పుడు కళ్లు తెరిచారా?’ అని బాబును ప్రశ్నించారు

టీఎస్సార్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ఈ నెల 15కు వాయిదా

టీఎస్సార్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి, ప్రభుత్వం తరపు న్యాయవాది రామచందర్ రావు, కార్మిక సంఘాల తరపు న్యాయవాది రచనారెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలతో మరోమారు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానానికి రచనారెడ్డి విన్నవించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టారే తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాదని అన్నారు. సమ్మె విషయమై ముందస్తుగా గత నెలలో మూడు సార్లు ఆర్టీసీకి, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆమె న్యాయస్థానానికి తెలిపారు. కార్పొరేషన్ ఫండ్స్ రూ.545 కోట్లతో పాటు ఇతర రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఉద్యోగుల జీతభత్యాలు తదితర కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే, కార్మికులు సమ్మెకు దిగారని న్యాయస్థానానికి వివరించారు. గత నెలలో ఆర్టీసీ కార్మ...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ అడ్డుపడలేదు: చంద్రబాబునాయుడు

రాజధాని అమరావతిని అభివృద్ధి చెందకుండా చేసేందుకు చూస్తున్నారని, అలా జరగనివ్వమని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. విశాఖపట్టణంలో నిర్వహించిన టీడీపీ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని బతికించుకునే శక్తి తెలుగు ప్రజలకు ఉందని అన్నారు. గతంలో వైఎస్ తనను చాలా సార్లు విమర్శించారు కానీ, తాను ప్రారంభించిన కార్యక్రమాలకు ఆయన ఏనాడూ అడ్డుపడలేదని, అందుకే, హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. ఏపీలో వున్నవి గ్రామ సచివాలయాలా? వైసీపీ కార్యాలయాలా? అని ప్రశ్నించిన చంద్రబాబు, శ్మశాన వాటికలకు కూడా వైసీపీ రంగు వేసుకుంటే బాగుంటుందని విమర్శించారు. ప్రజలే మీ ముఖాలకు రంగు వేసి బజార్లో తిప్పే రోజు వస్తుంది అని వైసీపీ నేతలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

మహిళను హిప్నటైజ్ చేసి, అత్యాచారయత్నం చేసిన అమెజాన్ డెలివరీ బాయ్!

ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన అమెజాన్ డెలివరీ బాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, 43 ఏళ్ల ఓ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. అమెజాన్ లో ఆమె ఐదు బాక్స్ లను బుక్ చేసింది. పార్సిల్ డెలివరీ అయిన తర్వాత చూస్తే అవి ఆమెకు నచ్చలేదు. దీంతో, వాటిని వెనక్కి తీసుకెళ్లాలంటూ రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో, వాటిని తీసుకునేందుకు ఓ డెలివరీ బాయ్ (30)ను అమెజాన్ పంపింది. కస్టమర్ నివాసానికి వెళ్లిన సదరు డెలివరీ బాయ్ ఐదు బాక్సులను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. నాలుగు బాక్సులు మాత్రమే తీసుకోవాలని తనకు చెప్పారని తెలిపాడు. ఈ నేపథ్యంలో, ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో బాధితురాలు కస్టమర్ కేర్ తో ఫోన్ ద్వారా మాట్లాడి... ఐదు బాక్సులను తీసుకోవడానికి డెలివరీ బాయ్ నిరాకరిస్తున్నాడని తెలిపింది. నాలుగు బాక్సులు తీసుకోవడానికే అతనికి అనుమతి ఉందని... ఐదు బాక్సులను తీసుకునేందుకు మరో వ్యక్తిని పంపుతామని కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పాడు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఐదు బాక్సులనూ ...

నేడు పోస్ట్‌డే- ఎస్‌బిఐకి ధీటుగా ఎదుగుతున్న త‌పాలా శాఖ‌

పోస్టల్ శాఖ‌ తరపున ప్రజలకి ఎన్నో‌ సేవలు అందిస్తున్నామ‌ని, విదేశాలు వెళ్లేందుకు కావాల్సిన పాస్ పోర్ట్ కూడా తపాలాశాఖ ద్వారా పొందవచ్చన్నారు  విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలీషా..‌. మీడియాకు చెప్పారు. గురువారం వరల్డ్ పోస్ట్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న కార్యాల‌యంలో మీడియాలో మాట్లాడుతూ  ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే పోస్ట్‌డేని  ఈనెల 9 నుంచి 15 వరకు వారోత్సవాలు గా రోజువారీ కార్య‌క్ర‌మాల‌తో నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. 10న  పోస్ట‌ల్‌ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రజలకు తెలుపుతారు. SBI తర్వాత పోస్టల్ లోనే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్నారని, వీటిని మ‌రింత పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు.11వ తేదీన గ్రామీణ ఇన్సూరెన్స్ స్కీంపై అవగాహన కల్పిస్తామ‌న్నారు. 12వ తేదీన పాఠశాలల్లో పిల్లలకు స్టాంపుల పై త‌మ సిబ్బంది తెలియ‌జేస్తార‌ని,14న వ్యాపార వేత్తలకు పోస్టల్ శాఖ అందించే సేవలను తెలిపి కొత్త ఖాతాదారుల పెంపుకు కృషి చేస్తార‌న్నారు.  అలాగే15న పోస్టల్ మెయిల్ కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళతామ‌ని తెలిపారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఎపి లో 575 ఆధార్ కేంద్రాలు పోస్టల్ శాఖ తరపున ఏర...

సీబీఐ ప్రత్యేక కోర్టు విజయవాడకు తరలింపు

విశాఖలోని సీబీఐ ప్రత్యేక కోర్టును విజయవాడ తరలించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ మేరకు కోర్టు తరలింపుపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సిఫారసుల మేరకు సీబీఐ కోర్టును ప్రభుత్వం తరలించనుంది. కేసుల విచారణ పరిధి విజయవాడకు తరలిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

విమానంలో కపిల్ దేవ్ కు కనిపించిన చంద్రబాబు... పక్కన కూర్చుని ముచ్చట్ల వీడియో!

తాను ప్రయాణిస్తున్న విమానంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబును చూసిన లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్, ఆయన పక్కన కూర్చుని కాసేపు ముచ్చట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఓ అవార్డుల బహుకరణ కార్యక్రమానికి వచ్చిన కపిల్ దేవ్, తిరుగు ప్రయాణంలో విజయవాడ చేరుకుని విమానం ఎక్కారు. అదే విమానంలో చంద్రబాబు కూడా ప్రయాణిస్తున్నారు. చంద్రబాబును చూసిన కపిల్ దేవ్, ఆయన పక్కన కూర్చుని, కాసేపు మాట్లాడారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తాను తీసుకున్న చర్యలను గురించి ఈ సందర్భంగా చంద్రబాబు, కపిల్ కు వెల్లడించారు. కాగా, రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కపిల్ హాజరై, పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారికి బహుమతులను అందించారు.

20 ఏళ్లలో నేను చూసిన రెండో సినిమా 'సైరా': తెలంగాణ గవర్నర్ తమిళిసై

గడచిన 20 సంవత్సరాల్లో తాను చూసిన రెండో చిత్రం చిరంజీవి నటించిన 'సైరా' అని తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. మెగాస్టార్ కోరిక మేరకు సినిమాను చూసిన ఆమె, ఆపై మీడియాతో మాట్లాడారు. చిత్రంలో చిరంజీవి అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. 1999 తరువాత తాను 2018లో రజనీకాంత్ నటించిన 'కాలా' చూశానని, ఆపై తాను చూసిన రెండో చిత్రం ఇదేనని ఆమె అన్నారు. తమిళిసై కోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా, ఆమె కుటుంబ సభ్యులతో పాటు, చిరంజీవి కుటుంబీకులు కూడా సినిమా చూశారు. కాగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'సైరా' విజయవంతంగా నటుస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవే... Read more at: https://telugu.asianetnews.com/andhra-pradesh/bus-accident-in-anantapuram-pz53wsఅనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవే... Read more at: https://telugu.asianetnews.com/andhra-pradesh/bus-accident...

కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందనే వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రచార సభలో కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. షోలాపూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో షిండే మాట్లాడుతూ, త్వరలోనే కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో పెద్ద చర్చకే దారి తీశాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్పందిస్తూ, షిండే కాంగ్రెస్ పార్టీకి చెందిని వ్యక్తి అని... ఆయన పార్టీ గురించి ఆయన ఏమైనా చెప్పుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనం కాదనే విషయాన్ని తాను స్పష్టంగా చెబుతున్నానని తెలిపారు. శరద్ పవార్ క్లారిటీ ఇచ్చిన తర్వాత... షిండే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారా? అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. రెండు పార్టీలు కలిస్తేనే బీజేపీని ఎదుర్కోగలమనే ఉద్దేశంతో షిండే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారా? అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.