Skip to main content

Posts

Showing posts from November 25, 2019

రాజధాని నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్: సీఎం జగన్

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం సానుకూల ధోరణి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాజధాని నిర్మాణ పనుల కొనసాగింపునకు నిర్ణయం తీసుకోవడమే అందుకు నిదర్శనం. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు పచ్చజెండా ఊపారు. రాజధాని పరిధిలో ప్రాధాన్యతల పరంగా నిర్మాణ పనులు కొనసాగించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగ్గట్టుగా పనులు ఉండాలని సీఎం సూచించారు. సీఆర్డీఏ పరిధిలో ఎక్కడా ప్లానింగ్ లో పొరబాట్లు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఇక్కడ కూడా ఖజానాపై భారం తగ్గించుకోవడానికి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భూములిచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని భావిస్తున్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిపోయిన భూమిని బ్యూటిఫికేషన్ చేయాలని సూచించారు. నిలిచిపోయిన నిర్మాణ పనులకు నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళతామని వెల్లడించారు.

ఆర్టీసీ సమ్మె విరమణ

 తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు చేపట్టిన సమ్మె విరమించారు. ఈ మేరకు కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈయూ కార్యాలయంలో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు కార్మికులంతా డిపోల వద్దకు చేరుకుని విధుల్లో చేరేందుకు సిద్ధం కావాలని అశ్వత్థామ పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దశల వారీగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరగుతుందనే నమ్మకముందని అశ్వత్థామరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామన్నారు. ఇన్ని రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలవలేదని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. తమ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని.. సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. మొదటి షిఫ్ట్‌ కార్మికులతో పాటు రెండో షిఫ్ట్‌ కార్మికులు కూడా రేపు ఉదయం డ...

రాజధాని రైతులూ..తెదేపా మాయలో పడొద్దు’

 రాజధాని ప్రాంతంలో 57 శాతం నుంచి 90 శాతం వరకే కట్టిన నాలుగు భవనాలు తప్ప ఇంకేమీ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం రూ.4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. రాజధానిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి జరిగిన పనులపై ఆరా తీశారని చెప్పారు. ఈనెల 28న అమరావతిలో పర్యటిస్తానంటున్న తెదేపా అధినేత చంద్రబాబు.. రాజధానికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా అని ప్రశ్నించారు. 5 శాతం పనులే పూర్తి చేసి దాన్ని రాజధాని కట్టేయడం అంటారా? అని బొత్స నిలదీశారు. ఈ విషయంలో రైతులు చంద్రబాబును నిలదీయాలన్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి రైతులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు కౌలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు.  తెదేపా మాయలో రాజధాని రైతులు పడొద్దని బొత్స విజ్ఞప్తి చేశారు. అమరావతి పట్టణమా? గ్రామమా? అన్నది త్వరలోనే నోటిఫై చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా 14400 కాల్ సె...

పాదయాత్రలో తెలుగుకు బదులు ఇంగ్లీషులో మాట్లాడాల్సింది: మండలి బుద్ధప్రసాద్ వ్యంగ్యం

ఏపీలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించుకోవడం పట్ల విమర్శలు వస్తుండడం తెలిసిందే. దీనిపై అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాతృభాష తెలుగును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే, తెలుగులో చదివితే ఏం ప్రయోజనం అని చెప్పడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ బాష చాలా గొప్పదన్న తరహాలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటప్పుడు పాదయాత్రలో కూడా ఇంగ్లీషులో మాట్లాడాల్సిందని ఎద్దేవా చేశారు. ఓట్లను కూడా తెలుగుకు బదులు ఇంగ్లీషులోనే అడిగితే బాగుండేదని అన్నారు. అప్పుడు ఓట్లన్నీ వైసీపీకే వచ్చుంటే ప్రజలు ఇంగ్లీషుకు సమ్మతం తెలిపినట్టుగా భావించవచ్చని వ్యాఖ్యానించారు, ఇంగ్లీషుకు ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ మాతృభాషను చిన్నచూపు చూడడం ఎందుకని మండలి ప్రశ్నించారు.

సమ్మెపై మరోసారి వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై జేఏసీ  మరోసారి వెనక్కి తగ్గింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీజేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు, ఆర్టీసీని బతికించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 52 రోజులపాటు కొనసాగిన పోరాటంలో ఎవరమూ ఓడిపోలేదన్నారు. తాము చేపట్టిన ఈ పోరాటం ఆర్టీసీని బతికించుకోవడానికి, కార్మికుల డిమాండ్లను నేరవేర్చుకోడానికి నాంది పలుకుతుందన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావద్దని ఆయన కోరారు. రేపు ఉదయం 6 గంటలకు కార్మికులందరూ విధులకు హాజరై యాజమన్యంపై ఒత్తిడి తేవాలని పిలుపు నిచ్చారు.  విధుల్లోకి చేరే కార్మికులను ఎవరూ అడ్డుకోవద్దని ఆయన సూచించారు. సెకండ్ షిఫ్ట్ ఉద్యోగులు కూడా విధుల్లో చేరాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తోందని ఆశించిన జేేఏసీ అటువంటి ప్రకటన రాకపోవడంతో.. విధుల్లో చేరాలని నిర్ణయించామని చెప్పారు. హైకోర్టు చేసిన సూచన ప్రకారం, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రేయస్సుకోసమే సమ్మె విరమణ చేస్...

హ్యపీనెస్ట్‌పై రివర్స్‌టెండరింగ్‌లో ముందడుగు

ఏపీ రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌పై రివర్స్‌టెండరింగ్‌ అంశంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీచేయాలని సీఆర్‌డీఏకు తాజాగా ఆదేశాలిచ్చింది. అమరావతిలోని నేలపాడు వద్ద హ్యాపీ నెస్ట్ ద్వారా 1200 ఫ్లాట్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ గతంలోనే టెండర్లు పిలిచింది. ఈ మేరకు పనులు కూడా మొదలు పెట్టింది. 300 ఫ్లాట్లకు నవంబరు 9న సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేపట్టింది. తొలివిడతలో అనూహ్య స్పందన రావడంతో మిగతా 900 ఫ్లాట్లకు ఒకే విడతలో బుకింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని చూస్తోంది.

నా 50ఏళ్ల రాజకీయంలో ఇలాంటివెన్నో చూశా!

శివసేన- కాంగ్రెస్‌- ఎన్సీపీల కూటమే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కరాడ్‌లో మీడియాతో మాట్లాడారు. భాజపాతో చేతులు కలిపింది తన సోదరుడి కుమారుడు అజిత్‌ పవారే తప్ప ఎన్సీపీ కాదని పునరుద్ఘాటించారు. ఇది ఎంతమాత్రం  తమ పార్టీ నిర్ణయం కాదనీ..  ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని తాము అంగీకరించబోమని పవార్‌ స్పష్టంచేశారు. ఎన్సీపీ- కాంగ్రెస్‌- శివసేన కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. తమ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాలూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌తో తాను టచ్‌లో లేనన్నారు. అజిత్‌ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరించే అంశంపై పార్టీ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ శనివారం ఉదయం అనూహ్యంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్ర...

ఫడ్నవీస్ బలపరీక్షపై తీర్పును రేపటికి రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.. వేడెక్కిన 'మహా' రాజకీయం

మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై ఈరోజు సుప్రీంకోర్టు వాదనలు విన్నది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వ్ లో ఉంచింది. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది.   రాజ్ భవన్ మెజార్టీని నిర్ణయించలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం అసెంబ్లీ మాత్రమే మెజార్టీని నిరూపిస్తుందని... శాసనసభలోనే బలపరీక్ష జరగాలని తెలిపింది. ఫడ్నవీస్ ప్రభుత్వానికి అవసరమైనంత సంఖ్యాబలం ఉందా? అని ప్రశ్నించింది. ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.  

మరో ట్విస్ట్.. అజిత్ పవార్ కు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఆఫర్ చేసిన శివసేన?

మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతివ్వడంతో... ఫడ్నవిస్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పరిణామంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు షాక్ కు గురయ్యాయి. మరోవైపు, ఎలాగైనా అధికారాన్ని చేపట్టేందుకు శివసేన కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అజిత్ పవార్ ను ఆకర్షించేందుకు శివసేన యత్నిస్తోంది. తమకు మద్దతు పలికితే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని అజిత్ పవార్ కు శివసేన ఆఫర్ చేసినట్టు ముంబై పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే బీజేపీతో చేయి కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది

54 మంది ఎమ్మెల్యేల సంతకం ఉంది..కానీ, వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారా?: సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో ఎన్సీపీ తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఎన్సీపీ నేతలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు కవరింగ్ లెటర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు. అది కేవలం 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమేనని తెలిపారు.  బల పరీక్షకు రెండు పక్షాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ అదెప్పుడనేదే ఇప్పుడు ప్రశ్న అని అభిషేక్ సింఘ్వి చెప్పారు. గవర్నర్ కు అజిత్ పవార్ సమర్పించిన లేఖలో 54 మంది ఎమ్మెల్యేల సంతకం ఉంది.. కానీ, వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారా? అని ప్రశ్నించారు. ఆ లేఖలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. రెండు పక్షాలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నప్పుడు అఫిడవిట్లు, సమాధానాలు ఎందుకని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ పాటకి డ్యాన్స్ ఇరగదీసిన సీఎం రమేశ్.. వీడియో ఇదిగో!

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తె పూజ నిశ్చితార్థం నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరి కోసం 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. మరోవైపు, నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని 'అమ్మో... బాపుగారి బొమ్మో' పాటకు అదిరిపోయే రేంజ్ లో వీరు స్టెప్పులేశారు. వీడియో చూడండి.