ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్న వేళ... సంస్థ ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1987 బ్యాచ్‌కు ఐపీఎస్ అధికారి అయిన సురేంద్రబాబు డీజీపీ ర్యాంకు అధికారి కావడం విశేషం. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కృష్ణబాబు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలను ఏపీ ప్రభుత్వం అప్పగించింది. సురేంద్రబాబుకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనశాఖకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Post a Comment