Skip to main content

Posts

Showing posts from August 21, 2020

సోనూసూద్ కు ఒక్క రోజే.. 31 వేల మెసేజ్లు

  సాయమంటే నేనున్నా అంటున్నాడు బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్. ఎవరికి ఏ ఆపద వచ్చినా తీరుస్తున్నాడు దీంతో మమ్మల్ని ఆదుకోవాలంటూ అతడికి చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో కలిపి 31,690 మెసేజ్లు వచ్చాయని సోనూ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. అందరిని చేరుకోవడం అసాధ్యమైనా, తన వంతు ప్రయత్నం చేస్తానని, సాయం పొందలేనివాళ్లు క్షమించాలని పేర్కొన్నాడు  #sonusood

మోపిదేవి కారు కి రోడ్డు ప్రమాదం

  విశాఖపట్నం జిల్లా  కసిం కోట మండలం తాళ్ల పాలెం వద్ద ఎంపీ మోడిదేవి కి తప్పిన ప్రమాదం మోపిదేవి కుటుంబ సభ్యులు సురక్షితం, మోపిదేవి కుటుంబానికి సహాయపడ్డ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దంపతులు అదే మార్గంలో వెళుతున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి కాన్వాయ్

శ్రీశైలం ఘటనలోతొమ్మిది మంది మృతి*

తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఏఈ మోహన్‌కుమార్‌, ఏఈ ఉజ్మ ఫాతిమా, ఏఈ సుందర్‌గా గుర్తించారు. సహాయక చర్యల్లో సీఐఎస్‌ఎఫ్‌, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు.

రోహిత్ శర్మకు ఖేల్ రత్న

  క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదుగురు భారత క్రీడాకారులు ఖేల్ రత్నకు ఎంపికయ్యారు రోహిత్ శర్మ'(క్రికెట్), మరియప్పన్ (పారా అథ్లెటిక్స్) మణికబాత్రా(టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫొగట్(రెజ్లింగ్), రాణి ('హాకీ) ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు

కేంద్రం గుడ్ న్యూస్.. వారికి నిరుద్యోగ భృతిగా 50 శాతం శాలరీ..

  కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వాళ్లకు నిరుద్యోగ భృతిగా 50 శాతం శాలరీని మూడు నెలల పాటు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో సభ్యులుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు కరోనా విపత్తు కారణంగా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారికి ఈ నిరుద్యోగ భృతిని చెల్లించనున్నారు. అయితే ఈ పధకాన్ని 2021, జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని ఈఎస్ఐసీ నిర్ణయించింది. ఈ ఏడాది చివరన దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ”ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ స్కీంని పొడిగించడంతో పాటు.. నిరుద్యోగ భృతిని కూడా పెంచాలని అధికారులు నిర్ణయించారు”. దీనితో 30 లక్షల నుంచి 35 లక్షల మందికి లబ్ది చేకూరే అవకాశాలు ఉన్నాయి. కరోనా కాలంలో నిరుద్యోగులను ఆదుకోవాలని చాలా సెక్టార్ల నుంచి డిమాండ్లు రావడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది.

ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండవు.. బయటపడతాం: వీడియో విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి

వీడియో చూడండి:  https://youtu.be/gJbsi9f6GZk సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారికి సాయం చేసేందుకు  క‌రోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. సినీ ప్ర‌ముఖుల నుంచి విరాళాలు సేకరించి కార్మికులకు సాయం చేస్తున్నారు. మరోసారి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చిరు చెబుతూ... ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండబోవని అన్నారు. త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడతామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు పదివేల మంది సినీ కార్మికులకు  తాము సరుకులు అందిస్తున్నామన్నారు.   'కరోనా మనకేం రాదులే.. మనకేం కాదులే' అన్న నిర్లక్ష్య ధోరణి ఎవ్వరికీ వద్దని ఆయన చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గణనాథుడు గట్టెక్కించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ వినాయక చవి...

ఎస్పీ బాలుకు మాళవిక వల్లే కరోనా సోకిందంటూ ప్రచారం... పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయని

ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. అయితే ఆయనకు కరోనా సోకడానికి తానే కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రముఖ గాయని మాళవిక వాపోయారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై నెలాఖరులో ఎస్పీ బాలు హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి మాళవిక కూడా వచ్చిందని, అప్పటికే మాళవికకు కరోనా పాజిటివ్ అని తేలినా నిర్లక్ష్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నదంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మాళవిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు గారికి కరోనా సోకడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు.  

శ్రీశైలం ఎడమ పాతాళగంగ వద్ద భారీ అగ్నిప్రమాదం... పలువురు గల్లంతు!

  తెలంగాణ పరిధిలోని టీఎస్ జెన్ కో అధీనంలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం, దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు పాతాళగంగ వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరుగగా, పది మంది వరకూ గల్లంతయ్యారు. విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో 17 మంది వరకూ లోపల ఉన్నారని తెలుస్తోంది. ప్యానల్ సర్క్యూట్ లో తొలుత మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం తరువాత 8 మంది బయటకు పరుగులు తీయగా, డీఈ శ్రీనివాస్, ఏఈ సుందర్, ఉద్యోగులు మోహన్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్ రావు, రాంబాబు, కిరణ్ ల కోసం గాలిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకుని ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.  

పోలవరం సకాలంలో పూర్తయివుంటే ఇంతటి వరద పరిస్థితులు ఉండేవి కావు: పవన్ కల్యాణ్

  గోదావరి వరదల నేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆవేదన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దాదాపు 200 గ్రామాలు, లంకలు నీట మునిగాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితులపై పరిశీలనకు వెళ్లిన జనసేన బృందాలు చెబుతున్న వివరాలు ఎంతో బాధ కలిగిస్తున్నాయని, పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు కూడా లేవని, పసిపిల్లలకు పాలు కూడా అందడంలేదని వెల్లడించారు. వైద్యసిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేరని, పసిబిడ్డలకు పాల కోసం అడిగితే పాలు అత్యవసర వస్తువుల జాబితాలో లేవన్న నిర్లక్ష్యపూరితమైన సమాధానం అధికారుల నుంచి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పాలను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చి పసిబిడ్డల ఆకలి తీర్చాలని పవన్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని స్పష్టం చేశారు. వరదల కారణంగా 10 వేల ఎకరాల్లో వరి పంట, 14 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ...

డియర్‌ సూపర్‌మ్యాన్ సోను సూద్‌.. నాకు హెల్ప్‌ చేయి!: సినీనటుడు బ్రహ్మాజీ ఆసక్తికర పోస్ట్

 కరోనా కష్టకాలంలో సాయం చేయాలని కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ సినీనటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకుంటోన్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ ఆయనకు ప్రతిరోజు  వేలాది మంది నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. వీలైనంత మేరకు సోను సూద్ సాయం చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయనను చాలామంది సూపర్‌మ్యాన్‌తో పోల్చుతున్నారు.  ఈ క్రమంలో తాజాగా, సినీనటుడు బ్రహ్మాజీ సోను సూద్‌కు ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'డియర్ సూపర్‌మ్యాన్‌ సోను భాయి.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను.. మానసికంగా లాక్‌డౌన్ అయ్యాను. హైదరాబాద్‌లో ఇరుక్కుపోయాను.. నన్ను ఈ ప్రాంతానికి తీసుకెళ్లు..' అంటూ ఆయన క్రొయేషియాలోని ఓ బీచ్‌ ఫొటోను పోస్ట్ చేశాడు. ఎంతో విలాసవంతంగా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లాలని ఉందంటూ ఆయన సరదాగా చెప్పాడు. ఆయన చేసిన పోస్ట్ పట్ల నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తనపై ఓ నెటిజన్ వేసిన సెటైర్‌కు సంబంధించిన వీడియోను కూడా బ్రహ్మాజీ పోస్ట్ చేయడం గమనార్హం.

హైద్రాబాద్ లో పాలను అపరిశుభ్రం చేస్తున్న డైరీ ఫామ్ యజమాని అరెస్ట్

 

SP.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై మెగాస్టార్ చిరంజీవి స్పందన