Skip to main content

Posts

Showing posts from August 14, 2020

పక్షి కోసం రూ.2 కోట్ల కారును పక్కన పెట్టేశాడు

  పక్షి కోసం రూ.2 కోట్ల కారును పక్కన పెట్టేశాడు.. పక్షి కట్టుకున్న గూడే కదా అని దాన్ని తీయలేదు దుబాయ్ యువరాజు.. వివరాలు చూస్తే ఓ పక్షి కోసం రూ.2 కోట్ల విలువైన కారును వాడకుండా పక్కన పెట్టారు దుబాయ్ యువరాజు షేక్ రషీద్ అల్ మఖ్దూం. ఇటీవల రూ.2 కోట్ల ఖరీదైన తన మెర్సిడెస్ AMG G63 కారుపై ఓ పక్షి గూడు కట్టుకుని పొదగడం ప్రారంభించింది. దానికి హాని కల్గించడం ఇష్టం లేక కారును వాడకుండా పక్కన పెట్టేశాడు. పక్షి ఆటంకం కల్గించకుండా ఆ ప్రదేశానికి దూరంగా ఉండాలని తన సిబ్బందిని ఆదేశించాడు. యువరాజు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు

కత్తి మహేష్ అరెస్ట్

  అభ్యంతరకర పోస్ట్ పెట్టినందుకు కత్తి మహేష్ అరెస్ట్ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఫేస్ బుక్ లో శ్రీరాముడికి సంబంధించి అభ్యంతరకర పోస్ట్ పెట్టినందుకు కొందరి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శ్రీరామ నవమికి ముందు అతడు శ్రీరాముడిని కించపరిచేలా పోస్టులు పెట్టగా.. హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వీటిపై కేసులు నమోదు చేసి, విచారణ జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు… ఆ పోస్టులను మహేశ్ పోస్ట్ చేశారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించి, హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. మహేశ్ పై 2018 నుంచి సైబర్ క్రైమ్ స్టేషన్ లో దాదాపు 5 కేసులు నమోదయ్యాయి.

విజయసాయిరెడ్డి ట్వీట్స్

  కేవలం 14 నెలల కాలంలో పేదల సంక్షేమం మీద జగన్ గారి ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.59,425 కోట్లు. 73 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక రికార్డు. బాబూ... మీ 14 ఏళ్ల పాలనలో ఇదే తరహాలో ఏం చేశారో అధికారికంగా లెక్కలు విడుదల చేసే ధైర్యం ఉందా..? pic.twitter.com/aG5YFKrPVH — Vijayasai Reddy V (@VSReddy_MP) August 14, 2020 Our Hon. CM YS Jagan garu is COMMITTED to developing 3 CAPITALS. His review on AMRDA is a testimony of his commitment. Unlike CBN for whom capital has been a PROFITABLE REAL ESTATE BUSINESS, FOR US CAPITAL IS A PLACE which will really benefit people. — Vijayasai Reddy V (@VSReddy_MP) August 14, 2020

చంద్రబాబు ట్వీట్

  రాజధానిగా అమరావతి అయితే రాష్ట్రంలోని ప్రజలందరికీ సమాన దూరంలో ఉంటుంది. అంతేకాదు అమరావతిలో జరిగే అభివృద్ధిని అందుకునే అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి. అంతేకాకుండా అమరావతి ఒక సంపద సృష్టి కేంద్రం అదెలాగో @ncbn మాటల్లో వినండి https://t.co/g2lNazRBns — Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) August 14, 2020

సోము వీర్రాజు ట్వీట్

  కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో సరైన ప్రజా రవాణా, విద్యా ప్రమాణాలు, పూర్తి భద్రతనిచ్చే తరగతి గదులు అత్యవసరం. అవి చేపట్టిన తరువాతే ముందుగా కళాశాలలు, తర్వాత జూనియర్ కళాశాలలు, తర్వాత పాఠశాలలు విడతలవారీగా ఆంధ్రప్రదేశ్ @ysjagan ప్రభుత్వం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాము. pic.twitter.com/gABOEjSFsa — Somu Veerraju (@somuveerraju) August 14, 2020

ఏపీలో వివిధ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ప్రకటించినఏపీ విద్యా మంత్రి

  అనేక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పలు ఎంట్రన్స్ టెస్టులకు ఏపీ సర్కారు తేదీలు నిర్ణయించింది. ఖరారు చేసిన తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రవేశ పరీక్షల నిర్వహణ సందేహాస్పదంగా మారింది. సెట్ లు జరుగుతాయా లేదా అన్న అయోమయం విద్యార్థుల్లో నెలకొంది. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్న ఏపీ సర్కారు దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది. ఎంసెట్- సెప్టెంబరు 17 నుంచి 25 వరకు ఐసెట్- సెప్టెంబరు 10, 11 ఈసెట్- సెప్టెంబరు 14 ఏపీ పీజీఈసెట్- సెప్టెంబరు 28, 29, 30 ఎడ్ సెట్- అక్టోబరు 1 లాసెట్- అక్టోబరు 1 ఏపీ పీఈ సీఈటీ- అక్టోబరు 2 నుంచి 5 వరకు  

ఆన్ లైన్ లో ఇక మందుల విక్రయం కూడా... అమెజాన్ సరికొత్త నిర్ణయం!

   ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లాక్ డౌన్ పరిస్థితుల్లో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఔషధాలను కూడా ఆన్ లైన్ లో విక్రయించాలని భావిస్తోంది. అమెజాన్ ఫార్మసీ పేరిట అందించే ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. నోటి మాటతో అడిగి తీసుకునే మందులనే కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై మాత్రమే లభించే ఔషధాలను కూడా అమెజాన్ తన ఆన్ లైన్ దుకాణంలో విక్రయించనుంది. అంతేకాదు, సాధారణ స్థాయి వైద్య పరికరాలు, సంప్రదాయ భారత మూలికా ఔషధాలు కూడా అమెజాన్ ఫార్మసీలో లభించనున్నాయి. భారత్ లో వాల్ మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్ కార్ట్, ముఖేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్, మరికొన్ని ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో అమెజాన్ తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. కాగా, అమెజాన్ ఫార్మసీ సేవలను తొలుత బెంగళూరులో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  

ఆన్ లైన్ లో ఇక మందుల విక్రయం కూడా... అమెజాన్ సరికొత్త నిర్ణయం!

 ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లాక్ డౌన్ పరిస్థితుల్లో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఔషధాలను కూడా ఆన్ లైన్ లో విక్రయించాలని భావిస్తోంది. అమెజాన్ ఫార్మసీ పేరిట అందించే ఈ సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. నోటి మాటతో అడిగి తీసుకునే మందులనే కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై మాత్రమే లభించే ఔషధాలను కూడా అమెజాన్ తన ఆన్ లైన్ దుకాణంలో విక్రయించనుంది. అంతేకాదు, సాధారణ స్థాయి వైద్య పరికరాలు, సంప్రదాయ భారత మూలికా ఔషధాలు కూడా అమెజాన్ ఫార్మసీలో లభించనున్నాయి. భారత్ లో వాల్ మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్ కార్ట్, ముఖేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్, మరికొన్ని ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో అమెజాన్ తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. కాగా, అమెజాన్ ఫార్మసీ సేవలను తొలుత బెంగళూరులో అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  

ఎస్పీ బాలు పరిస్థితి విషమం... వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స

  ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఇటీవలే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయనకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఐసీయూలో వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తనకు కరోనా సోకిందని బాలు కొన్నిరోజుల కిందట స్వయంగా వెల్లడించారు. ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్యులు గుర్తించడంతో వెంటిలేటర్ పై చికిత్స ప్రారంభించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్ లో తెలిపాయి.

గ్రాఫిక్స్‌ కాదు.. ఇది నిజమైన అమరావతి: వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ

ఎన్నికలకుముందే ఏకగ్రీవంగా @PrajaRajadhani గా అమరావతి, సీఆర్డీఏచట్టం నిర్ణయంజరిగింది. జీవో ఇచ్చి రెండునెలలైనా 186కోట్ల రైతులకౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడంలేదు? రైతులత్యాగంతో కూడిన భూమితోసహా రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారంఇచ్చారు @ysjagan గారు pic.twitter.com/b4ZzkaIhaA — Devineni Uma (@DevineniUma) August 14, 2020 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి గ్రాఫిక్స్ కాదని, ఇది నిజమైన రాజధాని అంటూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. రైతులు త్యాగం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కౌలు ఇవ్వట్లేదని విమర్శించారు.  'ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ప్రజా రాజధానిగా అమరావతి, సీఆర్డీఏ చట్టం నిర్ణయం జరిగింది. జీవో ఇచ్చి రెండు నెలలైనా 186 కోట్ల రైతుల కౌలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడంలేదు? రైతుల త్యాగంతో కూడిన భూమితో పాటు రెసిడెన్షియల్ ఫ్లాట్లు అమ్మడానికి మీకెవరు అధికారం ఇచ్చారు వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు.

రాజధాని పై తరలింపు పై ఆగస్ట్ 27 వరకు స్టేటస్ కో

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ఈనెల 27వ తేదీ వరకూ యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ ప్రకటనలు, చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన దాఖలైన దాదాపు 55 పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావన మాత్రమే ఉందని వివరించారు. పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోరగా... కొవిడ్‌ వల్ల ప్రత్యక్ష విచారణకు హాజరుకాలేమని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వుల గడువు ఇవాళ్టితో ముగుస్తుందని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. స్టేటస్‌కో ఉత్తర్వులు ఈనెల 27వరకు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాల అమలుపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని రాష్ట...

త్రిభుజాకారంలో కొత్త పార్లమెంట్.. 21 నెలల్లో పూర్తి చేయాల‌ని టార్గెట్..!

  2022 నాటికి భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ (వజ్రోత్సవ) వేడుకల్ని జరుపుకోబోతోంది. ఆ సమయానికి కొత్త పార్లమెంటు భవనంలో ఉభయ సభల సమావేశాలు జరగాలని కేంద్రం భావిస్తోంది. అయితే, కరోనా వైరస్ కారణంగా దీనికి సంబంధించిన ప్రక్రియ ఆలస్యమైంది. వాస్తవానికి, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి యూపీఏ-2 హయాంలోనే ప్రతిపాదన వచ్చింది. నాటి స్పీకర్ మీరా కుమారి దీనిపై సూచనలు కోరుతూ ఓ కమిటీని కూడా నియమించారు. 85 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో నిర్మించిన పార్లమెంటు బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదన్న కారణంతో పాటు పురాతన భవనాల్ని కాపాడుకోవాలని నాటి ప్రభుత్వం అభిప్రాయపడింది. అయితే, ప్రస్తుత మోడి ప్రభుత్వం కూడా “పురాతన భవనాలు అంత క్షేమదాయకంగా లేవని,  వాటిని పరిరక్షించుకునే చర్యలు తీసుకుంటూనే, అధునాతన సౌకర్యాలతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ” సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.  పురాతన భవనం బాహ్యరూపానికి అనుగుణంగానే, కొత్త పార్లమెంట్ భవనానికి కూడా రూపకల్పన చేయడం జరిగింది. గుజరాత్ కు చెందిన బిమల్ పటేల్ ...

దేశంలో ఒక్కరోజులో వెయ్యికి పైగా కరోనా మరణాలు.. అంతకంతకు పెరిగిపోతోన్న కేసులు

  దేశంలో కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. భారత్‌లో 24 గంటల్లో 64,553 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1007 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.        దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 24,61,191కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 48,040 కి పెరిగింది. ఇక 6,61,595 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 17,51,556 మంది కోలుకున్నారు.

రష్యా టీకా సమర్థతపై సమాచారం లేదు: డబ్ల్యూహెచ్ఓ

  ఈ వారం ప్రారంభంలో రష్యా రిజిస్టర్ చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై తమ వద్ద ఎటువంటి సమాచారమూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై రష్యా కూడా ఎటువంటి సమాచారం అందించలేదని, అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆ దేశంతో చర్చిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు డాక్టర్ బ్రూస్ అయల్వార్డ్ వ్యాఖ్యానించారు.  ప్రపంచంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 9 వ్యాక్సిన్లు ప్రయోగదశలో ముందున్నాయని, వాటిల్లో స్పుత్నిక్ లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారీ డీల్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కోసం తయారవుతున్న వ్యాక్సిన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఈ 9 టీకాలూ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని గుర్తించామని తెలిపారు.  

నాని 'వి'కి అమెజాన్ భారీ ఆఫర్... ఓకే చెప్పేసిన దిల్ రాజు!

 దిల్ రాజు నిర్మాతగా నాని నటించిన 25వ చిత్రం 'వి' షూటింగ్ పూర్తయినా, కరోనా, లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీకి విక్రయించేందుకు గతంలో వచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ ను దిల్ రాజు తిరస్కరించారని, ఈ చిత్రాన్ని సినిమా హాల్స్ లోనే విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని వార్తలు రాగా, ఇప్పుడాయన మనసు మారినట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్ రాగా, తాజాగా దిల్ రాజు, సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్ లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి వస్తుందని, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరీ హీరోయిన్లుగా నటించారన్న సంగతి తెలిసిందే.  

పనికి రాలేదని మైనర్ బాలుడిని చితకబాదిన వ్యాపారి

 ఈ వీడియో వైరల్ అయ్యింది..

సంక్షోభానికి ముగింపు పలికిన అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్... కెమెరాలకు నవ్వుతూ పోజులు!

  రాజస్థాన్ లో తీవ్ర రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలెట్ ఇవాళ సీఎం అశోక్ గెహ్లాట్ ను కలిశారు. రాజస్థాన్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే ప్రథమం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొనేందుకు తన ఇంటికి రావాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి సచిన్ పైలట్ కు ఆహ్వానం అందింది. అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ లో చేసిన పోస్టు కూడా సుహృద్భావ వైఖరికి దర్పణం పట్టింది. మర్చిపోదాం, క్షమించుదాం... ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చేయి కలుపుదాం అంటూ ఆయన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించిందో చెప్పనక్కర్లేదు. ఇక, ఇరువురి భేటీ విషయానికొస్తే, కరోనా ప్రభావం నేపథ్యంలో మాస్కులతో హాజరయ్యారు. అనేక అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఎంతో ఆప్యాయంగా పలుకరించుకుంటూ, కరచాలనం చేస్తూ, చిరునవ్వులతో ఫొటోలకు పోజులిచ్చారు. రేపటినుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.   అటు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించగా, బలం నిరూపించుకుంటామని సీఎం గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, రేపటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇద్దరు కాంగ...

AP ప్రభుత్వ ఉద్యోగులు ,ఉపాధ్యాయులు eSR పూర్తి చేయుటకుఆగస్ట్ 14న ఇచ్చే శిక్షణ లైవ్ చూడవచ్చు.

APHRDI బాపట్ల వారు  ఆగస్టు 14న ఉదయం 11:00 నుంచి 12:30 వరకు ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో registration అవకాశం లేని వారు నిరాశ పడనవసరం లేదు. మీరు మీ ఫోన్ లొనే చూడవచ్చు. ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించటానికి యూట్యూబ్ లింకు ద్వారా చూడవచ్చును.  కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు. లింక్ కొరకు క్లిక్ చేయండి: https://bit.ly/30TYA0P