Skip to main content

Posts

Showing posts from November 5, 2019

మెగా హీరో జోడీగా కైరా అద్వాని

బాలీవుడ్ అందాల తారగా ప్రస్తుతం కైరా అద్వాని ఒక వెలుగు వెలుగుతోంది. వరుసగా హిందీ సినిమాలు చేస్తూనే,  'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అలాంటి కైరా అద్వాని తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ ఒక సినిమాను నిర్మించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కైరాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.  

సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు: మోదీ

  భవిష్యత్ అంతా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సాయం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. ప్రపంచానికి భారత్ ఎందరో గొప్ప సైంటిస్టులను అందించిందని తెలిపారు. కోల్ కతాలో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు తమ ప్రభుత్వం సంస్థాగత సాయం అందిస్తుందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడూ ఓటమి ఉండదని, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయని అన్నారు. చంద్రయాన్-2 కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని, కానీ వారు అనుకున్నది సాధ్యపడలేదని తెలిపారు. కోరుకున్న ఫలితాలు రాకపోయినా మిషన్ మాత్రం విజయవంతమైందని పేర్కొన్నారు.

ప్రతిభా పురస్కారాల పేరు మార్చుతూ ఇచ్చిన జీవో రద్దు

  అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. 'అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది' అని అన్నారు. 'ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను' అని జగన్ ట్వీట్ చేశారు.  

ఆజాద్ ముందే వీహెచ్, షబ్బీర్ అలీ మాటలయుద్ధం

    కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇవాళ హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ నేతలతో భేటీ అయ్యారు. అయితే, ఆజాద్ సమక్షంలో సీనియర్ నేతలు వీహెచ్, షబ్బీర్ అలీ వాగ్యుద్ధానికి దిగారు. తాను రిటైర్మెంట్ దశకు వచ్చానని షబ్బీర్ అలీ పదేపదే అంటున్నారని వీహెచ్ ఆరోపించగా, వీహెచ్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని అలీ బదులిచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలైన తమను శవాలంటున్నారని, మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో షబ్బీర్ అలీ కూడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆజాద్ చూస్తుండగానే ఇద్దరు నేతలు పరస్పరం దూషించుకున్నారు. ఆజాద్ సర్దిచెప్పడంతో ఇరువురు శాంతించినా, కాసేపటికి వీహెచ్ అక్కడ్నించి వెళ్లిపోయారు.  

స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారు: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

  స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం పై తిరువంతపురం సమావేశంలో చర్చించడం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని, కేరళలో ప్లాస్టిక్ నిషేధం అమలు జరుగుతుందన్నారు.  కేరళలో నవంబరు 17 నుంచి మండల, మకరవిలక్కు ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఈ రోజు తిరువనంతపురంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల సీఎంలు, దేవాదాయశాఖల మంత్రుల సమావేశం జరిగిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా తాను పాల్గొన్నానన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాముల కోసం శబరిమలైలో కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి  స్థలం కేటాయించమని కేరళ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.  సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలపై కేరళ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ప్రతి రాష్ట్రంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ డెస్క్ లను అనుసంధానిస్తూ  కేరళ లో జాయింట్ గా ఐదు ...

మీరు త్వరగా కోలుకోవాలి... నటుడు గొల్లపూడికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పరామర్శ

   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గొల్లపూడి చికిత్స పొందుతున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గొల్లపూడి మారుతిరావు వృద్ధాప్య కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.  

ఒక్కసీటొస్తేనే మిడిసిపడుతున్నారు:కన్నబాబు

   ఇసుక కొరతను ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని మంత్రి కన్నబాబు విమర్శించారు. వరదల కారణంగా కొంతమేర ఇసుక కొరత ఉండటం వాస్తమేనని.. 10, 15 రోజుల్లో ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిన తెదేపా నేతలతో కలిసి లాంగ్‌మార్చ్‌ నిర్వహించిన పవన్‌కు ఇసుక కొరతపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఒక్క సీటు వస్తేనే ఆయన మిడిసిపడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌ సినిమాలు వదిలేసినా.. యాక్టింగ్‌ వదలడం లేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా జగన్‌నే విమర్శించడమేంటని ఆయన ప్రశ్నించారు. ‘‘నన్ను తిట్టడం పవన్‌కు ఫ్యాషన్ అయిపోయింది.  నా బతుకులో దాపరికం లేదు.  మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు జనం బతుకులు చూసుకోవాలి. చిరంజీవి గారి వలనే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటుంటా.  రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఏనాడైనా చిరంజీవి పేరు చెప్పారా?  గాజువాకలో పవన్ పోటీ చేస్తే...

మోదీకి లేఖ రాసిన జగన్

  ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఏపీ జెన్ కో థర్మల్ ప్లాంట్ కు ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సింగరేణి కాలరీస్ ను తెలంగాణకు కేటాయించారని... బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఏపీకి ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రతి ఏటా 7.5 ఎంఎంటీఏలు అవసరమని తెలిపారు. జగన్ లేఖపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.