Skip to main content

Posts

Showing posts from October 19, 2019

బోటు వెలికితీత ప్రయత్నంలో.. బలంగా లాగడంతో వంగిపోయిన లంగరు

  తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం సర్వశక్తులు ఒడ్డి శ్రమిస్తున్నా బోటు వెలికితీత అత్యంత కష్టంగా పరిణమిస్తోంది. బోటు రెయిలింగ్ లంగరుకు తగులుకుని బయటికి రావడంతో ధర్మాడి సత్యం బృందంలో ఉత్సాహం రెట్టించింది. అయితే, ఓ పెద్ద లంగరుతో బోటును చుట్టి బయటికి లాగేందుకు ప్రయత్నించినా ఈసారి లంగరు వంగిపోయింది. ఈ పరిణామంతో ధర్మాడి సత్యం బృందం నిరాశకు గురైంది. ఎవరైనా నదిలో దిగి బోటుకు సరైన ప్రాంతంలో లంగరు ఫిక్స్ చేస్తే తప్ప బోటు బయటికి రాదని సత్యం భావిస్తున్నారు. ఇప్పటికే కొందరిని సంప్రదించినా నదిలో లోతుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.    

అలా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదు: ధర్మాన ప్రసాదరావు

   ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన అనుకూల మీడియా, ఆయన తాబేదారులు, కొంతమంది సహచరులు కలసి, ఏపీలో పత్రికాస్వేచ్ఛ నశించిపోయిందని మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవిధంగా మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదని భావిస్తున్నట్టు చెప్పారు. గడచిన ఐదేళ్లలో బాబు పాలన చూశామని, అనేక చట్టాలను మోసగించి, కోర్టులకు దొరకకుండా, ఎత్తుగడలతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన తాబేదారులకు, అనుకూలమైన సంస్థలకు చంద్రబాబు దోచిపెట్టిన విషయం బహిరంగ రహస్యం అన్నారు. ఆనాడు తనకు అనుకూలంగా ఉన్న అనేక పత్రికలను అడ్డంపెట్టుకుని అనేక మంది జీవితాలతో ఆడుకున్నారని, రాజకీయంగా పతనం చేయాలని, రాజకీయపార్టీలను సర్వనాశనం చేయాలని చూశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ నాలుగు నెలల పాలనలో ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్ఛ హరించుకుపోయిందని, ఈ రాష్ట్రంలో గూండాయిజం సాగుతోందని, బీహార్ లా అయిపోయిందని మాట్లాడుతున్న చంద్రబాబు, నాడు తన పాలన ఎలా సాగిందో ఆయన చూసుకున్నారా? టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంత అప్రతి...

అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు!

సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న అగ్రిగోల్డ్ ఖాతాదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల కోసం రూ.264 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పది వేల రూపాయల లోపు డిపాజిట్ దారులక తొలుత చెల్లింపులు చేయనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు వైసీపీ నేతలు తమ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులో ర్యాలీలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు విడదల రజిని, షేక్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవీ, వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.   

రాజకీయ విలువలు లేని టీడీపీతో బీజేపీ ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు: కన్నా

ఏపీలో విపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. టీడీపీని వెనక్కినెట్టి తాను బలోపేతం కావాలన్నది బీజేపీ ప్రణాళికగా కనిపిస్తోంది. ఆ దిశగానే పావులు కదుపుతోన్న కాషాయదళం టీడీపీపై మాటల యుద్ధంలో మరింత పదును పెంచింది. రాజకీయ విలువలు లేని టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అ మిత్ షా టీడీపీకి శాశ్వతంగా తలుపులు ఎప్పుడో మూసేశారని తెలిపారు. అవినీతే అజెండాగా అవకాశవాద రాజకీయాలతో యూటర్న్ లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన పార్టీగా టీడీపీని అభివర్ణించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకోసం వెంపర్లాడుతున్నారో చెప్పాలని కన్నా నిలదీశారు.   

పోలీసులు వున్నది ప్రజాసేవ, ప్రజా భద్రత కోసమే: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

  పోలీసులు ఉన్నది ప్రజాసేవ, ప్రజా భద్రత కోసమేనని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గుంటూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారోత్సవాల సందర్భంగా సాధారణ ప్రజలకు కూడా పోలీసుల గురించి తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు పోటీలు నిర్వహించామని చెప్పారు. పోలీస్ స్టేషన్ అంటే భయపడే పరిస్థితి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ఇప్పటి వరకూ 1.4 లక్షల మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్లను సందర్శించారని అన్నారు. కాగా, పోలీస్ అమరవీరుల వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి.     

గూగుల్ ఆధ్వర్యంలో.. ఇక డ్రోన్ల ద్వారా డెలివరీ!

డోర్ డెలివరీ ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గూగుల్ సంస్థ ఈ దిశగా తొలి అడుగులు వేసింది. వినూత్న ఆవిష్కరణలకు పేరుగాంచిన గూగుల్  కంపెనీ ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి మనుషులకు బదులుగా డ్రోన్ లను ఉపయోగించడంలో విజయవంతమైంది. ఈ సౌకర్యాన్ని అమెరికాలో అప్పుడే ప్రారంభించింది కూడా. ఇక దేశంలో ఈ తరహా సర్వీస్ ను అందించడానికి గూగుల్ సంస్థ అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందింది. సంస్థకు చెందిన ఆల్ఫాబెట్ యూనిట్ ఈ సేవలను అందిస్తోంది. ఈ సేవలకు ‘వింగ్’ అని పేరు పెట్టి అక్కడి ఫెడ్ ఎక్స్ ఎక్స్ ప్రెస్, వాల్ గ్రీన్స్ కంపెనీల వస్తువులను డ్రోన్ల ద్వారా వినియోగదారులకు డెలివరీ చేస్తోంది. సాధారణంగా మనుషులను డెలీవరీకి వినియోగిస్తే ట్రాఫిక్ చిక్కులతో సమయం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది.  డ్రోన్ డెలివరీ ఇలాంటి అవరోధాలు అధిగమించి వస్తులను అతి తక్కువ సమయంలో డెలివరీ చేస్తుంది. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో డ్రోన్ ప్రయాణిస్తుంది. విమానాల్లో ఉపయోగించే  సాఫ్ట్ వేర్, సెన్సార్లను డ్రోన్లలో అమర్చడంతో వీటి ప్రయాణం సాఫీగా స...

టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల అరెస్ట్

హైదరాబాద్:  బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్టేషన్‌లో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, అలాగే ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని లాలగూడా పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో లాలగూడ పోలీస్ స్టేషన్‌లోకి మీడియాను అనుమతించకుండా పోలీసులు గేట్లను మూసి వేశారు.

పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్న చంద్రబాబును అరెస్టు చేయాలి: వైసీపీ నేతల డిమాండ్

పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈమేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ నాయకులు విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వారు మాట్లాడుతున్నరని, డీజీపీ గౌతం సవాంగ్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వర్ల రామయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని విమర్శించారు.

ఈ నెల 22న ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 22న దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపు నిచ్చాయి. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఈ) నేతలు తెలిపారు. కాగా, ఆర్థికంగా బలోపేతం చేయాలనే పేరుతో బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుంచి 12కు తగ్గిపోతాయని, తద్వారా ఉపాధి పోతుందని, ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. కాగా, విజయవాడలో ఆంధ్రా బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యాంకుల విలీనం ఆపాలని, ఆంధ్రాబ్యాంకును కొనసాగించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు.

విజయసాయిరెడ్డి గారూ! ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదు: బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఆంధ్రా బ్యాంక్ ఇచ్చిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యలు  చేసిన సంగతి తెలిసిందే . ఈ వ్యాఖ్యలపై శ్రీభరత్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ట్రాన్స్ కో సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే వాయిదాలు సమయానికి చెల్లించేవాళ్ళం, కానీ ఆర్దిక ఇబ్బందులు కారణంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న విషయం తమకు స్పష్టంగా తెలిసి కూడా, ప్రజల డబ్బును తాను దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం అని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచివికావనేది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. మన రాష్ట్రంలో చాలా మంది వ్యాపారస్తులు బిల్లులు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు కనుక విజయసాయిరెడ్డి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరూ అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాం. కానీ, అందుకు భిన్నంగా మీరు చేస్తున్న ...

అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి: అశ్వత్థామరెడ్డి డిమాండ్

తెలంగాణలో బంద్ కొనసాగుతోందని టీఎస్సార్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బంద్ కు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వారిని, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

ఈ ప్రశ్నకు సీఎం జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలి!: జీవీఎల్

ఓడిపోయిన తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఓ శక్తిగా ఎదగాలని తాము అనుకుంటామే తప్పా వేరే పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఏ పార్టీతో కలిసి వెళ్లే ఉద్దేశం బీజేపీకి కచ్చితంగా లేదని అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగాయని గతంలో తాము చెప్పామని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అన్నారు. రూ.2,200 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మరోమారు ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రశ్నకు సీఎం జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ డిమాండ్ ఇదే అని, గత ప్రభుత్వం ఎక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి, తక్కువ ధరకు ఈ భూములను ఎవరికి కేటాయించారన్న సమాచారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కదా, తప్పు ఎవరైతే చేశారో వారిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు నీళ్లు నములుతోంది? అని ప్రశ్ని...

కేంద్రం నిధులను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉంది: బీజేపీ నేత సునీల్ దేవధర్

జలశక్తి అభియాన్ ద్వారా కేంద్రం ఏపీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. తిరుపతిలో గాంధీ సంకల్ప యాత్రను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఏపీలో బీజేపీ ప్రయాణం సజావుగా సాగుతోందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయితీ సహా ఏపీలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో 48 వేలకు పైగా బూత్ కమిటీల్లో ప్రస్తుతం 11 వేల బూత్ కమిటీలు పూర్తయ్యాయయని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు.   

హుజూర్ నగర్ లో నా అక్కను గెలిపించుకుంటాను: రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన చెల్లి కవితను గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మావతి రెడ్డిని అక్క అని సంభోదించిన ఆయన.. ఆ నియోజక వర్గంలో ఆమెను గెలిపించుకుంటానని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూర్యాపేటలో కార్మికులకు మద్దతు తెలిపిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలన రాచరికానికి పరాకాష్టలా ఉందని విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఆదేశాలను కేసీఆర్ లైట్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ న్యాయస్థానాలతో ఆటలాడితే మొట్టికాయలు తప్పవని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేతలు ఎవరూ ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడడం లేదని, దీన్ని బట్టి టీఆర్ఎస్ లో చీలిక వచ్చినట్లు అర్థమవుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారనే హక్కు కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంపై రూ.2.5 లక్షల అప్పుల భారం పడి...

బోటు వెలికితీత మళ్లీ విఫలం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన ‘రాయల్‌ వశిష్ట’ బోటును వెలికితీసేందుకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బోటు ఎక్కడ ఉందన్న విషయాన్ని స్పష్టంగా గుర్తించిన ఆ బృందం ఈ రోజు దాన్ని వెలికితీసే పనుల్లో మరోసారి విఫలమైంది. యాంకర్‌కు చిక్కిన బోటు దాన్ని పైకి లేపే క్రమంలో పట్టు కోల్పోయింది. మరోవైపు, బోటులోనే మృతదేహాలు ఉన్నాయని భావిస్తున్న ఈతగాళ్లు ఈ కారణంగా ఈదుతూ బోటు దగ్గరికి వెళ్లేందుకు ఒప్పుకోవట్లేదు. దీంతో విశాఖపట్నం నుంచి కొందరు గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు. ఈ పని మీదే ధర్మాడి సత్యం విశాఖకు వెళ్లారు.    

జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం.. పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోకు వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాలాభిషేకం చేయడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకంపై ఆటో, క్యాబ్ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి, సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పినిపె విశ్వరూప్, జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో కలిసి జగన్ ఫొటోకు రాపాక పాలాభిషేకం నిర్వహించారు. అంతే, ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆయన పార్టీ మారబోతున్నారని, అందుకు ఈ ఫొటోనే నిదర్శనమంటూ వార్తల హోరు మొదలైంది. దీంతో రాపాక స్పందించక తప్పలేదు. ఇదంతా తప్పుడు ప్రచారమని, నమ్మొద్దని కోరారు. తనను నమ్మి అధినేత పవన్ కల్యాణ్ టికెట్ ఇస్తే, అభిమానులు, జనసైనికులు కష్టపడి తన గెలుపునకు కృషి చేశారని, వారిని వంచించబోనని స్పష్టం చేస్తూ తన ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.