Skip to main content

కన్నా నిద్రపోతున్నారా? : సీపీఐ రామకృష్ణ

ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. గతంలో చంద్రబాబు అడిగితే నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తోందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. రాజధాని నిధులపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్ ను గాలికొదిలేశారని చెప్పారు. గతంలో చంద్రబాబు అడిగినా నిధులు ఇవ్వలేదని... ఇప్పుడు కేంద్రాన్ని జగన్ అడిగే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఏపీలో మాట్లాడేవారు లేరనేది కేంద్రం ధీమా అని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై బీజేపీ తెలుగు నేతలు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ నిద్రపోతున్నారా? జీవీఎల్ నోరు పడిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.