Skip to main content

Posts

Showing posts from October 4, 2019

గరుడసేవకు ఒక్కరోజు ముందే తిరుమలలో లక్షలాది మంది భక్తులు..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం గరుడ సేవ. స్వామివారికి ఎంతో ఇష్టమైంది గరుత్మంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని గరుడ సేవరోజు తిలకిస్తే సకల పాపాలు తొలగిపోయి మంచి జరుగుతుందన్నది భక్తుల నమ్మకం. అందుకే ఆ స్వామిని చూసేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్నారు అంతే కాదు రేపు గరుడ సేవ జరుగనుండగా ఈరోజుకే లక్షలాదిమంది జనం తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గోవింద మాలలు ధరించిన భక్తులు సేదతీరుతున్నారు. ఆ స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోతండాలుగా తరలివస్తున్నారు. ప్రతి యేడాది గరుడోత్సవం రోజు 4నుంచి 5లక్షలమంది జనం శ్రీవారిని దర్సించుకుంటారు. అలాంటిది ఈ యేడాది ఆ సంఖ్య పెరిగే అవకాశముందని టిటిడి అంచనా వేస్తోంది. ఒకరోజు ముందుగానే భక్తజనం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో టిటిడి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందనేది ప్రశ్నార్థంకంగా మారుతోంది.

మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడారంటే!

ఢిల్లీ: రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం జరిపిన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి 22 అంశాలపై లేఖలు ఇచ్చారు. అభివృద్ధిపథకాలు, పలు సంక్షేమ పథకాలతోపాటు, ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు సహకరించాలని కోరారు. ఇందులో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌ విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా 450 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని, గత ఐదేళ్లలో నాలుగుసార్లు విడుదలయినప్పటికీ ఒక ఏడాది కి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన లేఖల్లోని మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. -నేషనల్‌ హై వేస్‌ అధారిటీ సహకారంతో ఆదిలాబాద్‌ జిల్లాలో సిమెంట్‌ కార్పొరేషన్‌ఆఫ్‌ ఇండియా పరిశ్రమను పునరుద్దరించాలి. -తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచాలి. -తెలంగాణలో ఐఐఎంను నెలకొల్పాలి. -తెల...

జగన్ ఢిల్లీ టూర్ …మోదీకి క్రెడిట్ ఇవ్వనున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఢిల్లీపర్యటన ఖరారయ్యింది.శనివారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ఒక రోజు ముందే మోదీతో భేటీ అయ్యారు. ఇద్దరు సీఎంలు వరుసగా భేటీ అవడం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం, రివర్స్ టెండరింగ్, పీపీఏల పున:పరిశీలన, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన అంశాల గురించి మోదీతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం. అక్టోబర్ 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తోన్న జగన్.. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు భోరోసా పథకంపై భాజాపా నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో స్టిక్కర్ సీఎం బాబు లాగా మీరు అయ్యారంటూ విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు రూ.12500 అందజేస్తుండగా.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నుంచి వచ్చే రూ.6 వేలను కూడా అందులో కలుపుతారు. దీంతో ఈ పథకానికి మోదీ పేరు పెట్టాలని జగన్‌ను రాష్ట్ర బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. వారి నోళ్లు మూయించే దిశగా జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు ఇలాగే కేంద్రం నిధులిచ్చిన పథకాలకు ...

దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన చంద్రబాబు..నేడు జగన్ కి నీతులు చెపుతున్నాడు: సి.రామచంద్రయ్య

సి రామచంద్రయ్య వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయున సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.. చంద్రబాబు కు ప్రజలు 23 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారు.. తిరుపతి కి సీఎం వెళ్ళినప్పుడు సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు.. మనిషికి భక్తి ఉందో లేదా అనేది ముఖ్యం.. జగన్మోహన్ రెడ్డి ఒక్క తిరుపతి నే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు పులిష్ గా మాట్లాడుతున్నారు.. కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా.. దుర్గమ్మ గుడిలో క్షద్ర పూజలు చేయించింది నువ్వు కదా.. తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కదా.. తిరుపతి లో సంతకం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గతం.. ప్రజలకు హామీ ఇచ్చిన సంతకం అమలు చేయకపోతే తప్పు.. నువ్వు చేసిన సంతకాలు పరిస్థితి ఏమిటో చంద్రబాబు సమాధానం చెప్పాలి.. రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపులు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చంద్రబాబు చేశారు.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క సంతక...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మండిపడ్డ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి

అమరావతి సచివాలయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ఎన్నిసార్లు రద్దు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. 2015 నవంబరు 5న టీడీపీ ప్రభుత్వమే జీవో నెంబరు 97 తీసుకు రాలేదా... బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసినట్టు మీ అధికారంలో ఏదయినా జీవో వచ్చిందా. చింతపల్లిలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారానికి వచ్చిన వందరోజుల్లోనే జీవో నెంబరు 97 ను ప్రభుత్వం రద్దు చేసింది.. నాలుగు నెలల పాలనలో ప్రజలకు నరకం చూపామని చంద్రబాబు అన్నారు.  మీకు అయిదేళ్ళు టైం ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారో అందరికి తెలుసు. ఎస్సీ , ఎస్టీ, బిసి, మైనార్టీ లకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత జగన్ ది. మహిళలకు సైతం 50శాతం రిజర్వేషన్లు ఈ సర్కార్ ఇచ్చింది. సచివాలయ పోస్టులను కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నరు.  గత అయిదు ఏళ్ళలో ఉద్యోగాలు తీయ్యమని యువత అడిగితే లాఠీ చార్జి చేసారు. లక్షా 20 వేల ఉద్యోగాలు తీసిన జగన్ ను ఎలా చంద్రబాబు ఎలా వ...

సోషల్ మీడియాలో కామెంట్లపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: వైసీపీ నేత సుధాకర్ బాబు

నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు వైస్సార్సీపీ కుటంబ సభ్యలుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.. టీడీపీ కార్యాలయం, బాలకృష్ణ ఆఫీస్ నుంచి 2000 మందితో తప్పుడు పోస్టింగ్ లు చేయిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటంబపై చేయిస్తున్న ప్రచారంపై మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు చూసి ఆ పార్టీ నాయకులే అసహ్యచుకుంటున్నారు.. మహిళలు వినలేని మాటలు మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.. చంద్రబాబు మీద ఎవరైనా తప్పుడు పోస్టింగ్ లు పెడితే  పోలీసులకు పిర్యాదు చేయాల్సింది.. ఎవరో పెట్టిన పోస్టింగ్ ను పట్టుకొని చంద్రబాబు వైస్సార్సీపీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్నారు..  ఎన్నికల్లో ఓడిపోవడం, కొడుకు పనికిమాలిన వాడు కావడంతో చంద్రబాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు.. చంద్రబాబును వెంటనే వైద్యలకు చూపించాలి.. చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షం.. చంద్రబాబు సోషల్ మీడియాలలో చివరకి ఎన్టీఆర్ ను కూడా వదలలేదు.. జగన్మోహన్ రెడ్డి నలుగున్నార లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని చంద్రబాబు జీర...

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

చిరంజీవి 'సైరా' చిత్రంపై నారా లోకేశ్ వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ మూవీగా పేర్కొంటున్న 'సైరా' చిత్రంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటాన్ని వెండితెరపై చూస్తుంటే ఒళ్లు గగుర్పొడించిందని తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చిన చిత్రంగా 'సైరా'ను అభివర్ణించారు. 'సైరా' సినిమా చిరంజీవి 12 ఏళ్ల కలకు ప్రతిరూపం అని, ఆయన తన స్వప్నాన్ని అద్భుతమైన రీతిలో సాకారం చేసుకున్నారని లోకేశ్ కితాబిచ్చారు. అంతేకాదు, చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పారు. చిత్రయూనిట్ కు తన అభినందనలు తెలియజేశారు. ఎంతో కష్టపడి, 'సైరా' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, ఘనవిజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి, ఇతర టెక్నీషియలన్లు, యూనిట్ సభ్యులకు హార్దికాభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద మూడు మృతదేహాలు... బోటు ప్రమాదంలో గల్లంతైన వారివిగా భావిస్తున్న అధికారులు

కొన్ని రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునక ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడమే కాకుండా, అనేకమంది గల్లంతయ్యారు. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్దకు ఇవాళ మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఆ మృతదేహాలను వెలికితీయించిన అధికారులు జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. ఆ మృతదేహాలను బోటు ప్రమాదంలో గల్లంతైన వారివిగా భావిస్తున్నారు. బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాలను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం అవి ఎవరి మృతదేహాలన్నది గుర్తించే అవకాశాలున్నాయి. ఈ మేరకు గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించనున్నారు.

రాజకీయ కక్షలతో కేసులు నమోదు చేయొద్దు: ఏపీ డీజీపీకి ‘జనసేన’ నేత నాదెండ్ల విజ్ఞప్తి

అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు చిలకం మధుసూదనరెడ్డిపై గత నెలలో పోలీస్ కేసు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ లేఖ రాశారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన అక్రమ కేసుగా భావిస్తున్నామని అన్నారు. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 30న ఆయనపై కేసు దాఖలైందని, ఎఫ్ఐఆర్ నెంబర్ 327/2019తో ఈ కేసు ఉందని పేర్కొన్నారు. ఆరోజు సాయంత్రం ధర్మవరం పట్టణంలో మున్సిపల్ సిబ్బంది విధులకు మధుసూదనరెడ్డి ఆటంకం కలిగించారంటూ ఎఫ్ఐఆర్ లో రాశారని, వాస్తవానికి ఆ సమయంలో తాను పట్టణంలోనే లేనని, బెంగళూరులో ఉన్నట్టు మధుసూదనరెడ్డి తగిన ఆధారాలు చూపిస్తున్నారని డీజీపీ దృష్టికి తెచ్చారు. బెంగళూరులో ఉన్న వ్యక్తి ఏవిధంగా ధర్మవరం మున్సిపల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించగలరని అన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ కేసు నుంచి మధుసూదనరెడ్డికి విముక్తి కలిగించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. రాజకీయ కక్షలతో కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

చర్చలు విఫలం.. ఈరోజు అర్ధరాత్రి నుంచి టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె!

టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ ల కమిటీ ఈరోజు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లకు ఐఏఎస్ ల కమిటీ అంగీకరించలేదని, దీంతో, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నట్టు సమాచారం. ఈరోజు అర్ధరాత్రి నుంచే సమ్మెకు పిలుపు నివ్వనున్నట్టు తెలుస్తోంది.  కాగా, దసరా పండగ కోసం ప్రజలు తమ ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతామని టీఎస్సార్టీసీ ఇప్పటికే ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు నివ్వడంతో ప్రత్యేక బస్సుల సంగతి అటుంచి, రెగ్యులర్ గా తిరిగే బస్సులైనా తిరుగుతాయో లేదో అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది.

మధ్యలో ఉద్యోగం వదిలేస్తే జీతాలు వెనక్కి ఇవ్వాల్సిందే..

మూడేళ్లు పనిచేయాల్సిందే..!  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందుకున్న అనేక మంది అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. నోటిఫికేషన్‌లో రెండే ళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ పనిచేయాలని పేర్కొన్నారని, మూడేళ్లు కచ్చితంగా పనిచేయాలన్న నిబంధన అందులో లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువ మంది గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులే ఉన్నారు. ఇప్పటికే గ్రూప్‌-2, 3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో మంచి మార్కులొస్తే ఆ ఉద్యోగాలకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ఈ నిబంధనలు పెట్టడంతో అభ్యర్థులు డీలా పడుతున్నారు. కొ...

జనసేన మద్దతుకోరిన విహెచ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ భేటీ అయ్యారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని పవన్‌ను వీహెచ్‌ కోరారు. హుజూర్‌నగర్‌ ఉపెన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీచేస్తున్నారు. యురేనీయం ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ ఇటీవల పవన్‌ను వీహెచ్‌ కలిసిన సంగతి తెలిసిందే. వీహెచ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశానికి పవన్‌కల్యాణ్‌ హాజరై మద్దతు తెలిపారు.

ఆటోలపై జగన్ ఫొటోలు పెట్టుకోండి.. ఆర్టీఏ అధికారులు ఇబ్బంది పెట్టరు: అవంతి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద సొంత ఆటో, కారు ఉన్న డ్రైవర్లకు ప్రతి ఏటా రూ. 10 వేలను ప్రభుత్వం అందించనుంది. మరోవైపు విశాఖలో ఈ కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విశాఖలోనే 25 వేల మంది డ్రైవర్లకు సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆటోలపై జగన్ ఫొటోలను పెట్టుకోవాలని సూచించారు. జగన్ ఫొటో పెట్టుకుంటే ఆర్టీఏ అధికారులెవరూ ఇబ్బంది పెట్టరని అన్నారు

మన హెలికాప్టర్ ను మన క్షిపణే బలిగొంది!... అసలు విషయాన్ని బయటపెట్టిన వాయుసేన చీఫ్

పుల్వామా దాడులకు ప్రతీకారంగా పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ భీకర వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జమ్మూకశ్మీర్ లోని బద్దాం ప్రాంతంలో ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన సిబ్బంది, ఓ సాధారణ పౌరుడు మృతి చెందారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయిందని, పాక్ క్షిపణి దాడిలో కుప్పకూలిందని భిన్న వాదనలు వినిపించాయి. కానీ, ఇటీవలే కొత్తగా వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్కే భదౌరియా అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ వేళ బద్గాంలో క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నారని, అయితే ఎంఐ-17 హెలికాప్టర్ ను పాక్ కు చెందినదిగా భావించి పొరబాటున క్షిపణిని దానిపైకి సంధించారని భదౌరియా వివరించారు. ఈ దుర్ఘటనకు కారకులైన అధికారులపై న్యాయపరమైన విచారణ పూర్తిచేశామని, వారిపై కఠినచర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మున్ముందు ఇలాంటి ఘోరతప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపారు.

అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది: బొత్సా సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడింది ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం credit: third party image reference గత ప్రభుత్వం మునిసిపల్ శాఖలోనే 15 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది ప్రభుత్వ హాస్పటల్ ల వద్ద క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తాం credit: third party image reference రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న విషయం వాస్తవమే బొగ్గు కొరత వలనే విద్యుత్ కోతలు ప్రభుత్వం పై కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు సరికాదు కన్నా ఏ దృష్టితో చూసి విమర్శలు చేస్తున్నారో ఆయనే సమాధానం చెప్పాలి రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ తో సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయి credit: third party image reference గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది. 110 మునిసిపాల్టీలలో రాబోయే కాలంలో ఎన్నికల నిర్వహణకు సన్నా

టీడీపీ శ్రేణుల ఓపికను పరీక్షించొద్దు..- టీడీపీ మాజీమంత్రి హెచ్చరిక

నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నాయకుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, బీద రవిచంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు..కావలి టీడీపీ ఆఫీసులో కూర్చోవున్న కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గమన్నారు..ఐదు నెలలుగా కావలిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, బెదిరిస్తుంటే ఇప్పటి వరకు పోలీసుల చర్యలు లేవంటూ ఆరోపించారు. వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారన్నారు..ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు చేయిదాటిపోతున్నాయని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, వారి పక్కనే ఉండే చోటా నేతలు చెప్పిందే చేస్తామనే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తుంటే ప్రజాస్వామ్యం బతికేవుందా అనే అనుమానాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పది సీట్లు ఇచ్చి మంచిగా పరిపాలించండయ్యా అంటే దొంగ కేసులు పెట్టడంతో పాటు దౌర్జన్యాలు, అరాచకాలు, ఆస్తుల విధ్...

అభినందించాల్సింది పోయి.. బండలు వేస్తున్నారు: చంద్రబాబుపై జగన్ విమర్శలు

గాంధీ జయంతి రోజున రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో అందరూ చూస్తున్నారని... మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత అభినందించాల్సింది పోయి, బండలు వేస్తున్నారని విమర్శించారు. ఏలూరులో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి రోజున దేశంలో కనీవినీ ఎరుగని విధంగా గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను ప్రారంభించామని... ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని తట్టుకోలేక, గాంధీ జయంతి రోజున మందు అమ్ముతున్నారంటూ చంద్రబాబు అభాండాలు వేశారని జగన్ అన్నారు. గాంధీ జయంతి రోజున ఎక్కడైనా మందు షాపు తెరిచి ఉందా? అని మీ అందరినీ అడుగుతున్నానని ప్రశ్నించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్టపగలే అబద్ధాలు మాట్లాడటం సబబేనా అని అడుగుతున్నానని చెప్పారు. ఇలాంటి రాజకీయాలను చూసినప్పుడు మనసుకు బాధ కలుగుతుందని... కానీ, మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూసినప్పుడు సంతృప్తి వస్తుందని అన్నారు.

నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను.. నాలుగు నెలల్లోనే హామీ నిలబెట్టుకున్నాను: జగన్

నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నా'నంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా తాను అండగా ఉంటానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు 'వైయస్సార్ వాహన మిత్ర' పథకాన్ని జగన్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆటోవాలా చొక్కా వేసుకుని ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు. ఏలూరులోనే ఈ హామీని ఇచ్చానని, ఇప్పుడు ఏలూరులోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు. సొంత ఆటో, కారు ఉన్నవారికి ఏటా రూ. 10 వేల సాయాన్ని అందిస్తామని జగన్ చెప్పారు. ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్ధి పొందుతారని చెప్పారు. డ్రైవర్ల అకౌంట్లలోకి ఈ డబ్బును నేరుగా జమ చేస్తామని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశిస్తున్నానని అన్నారు

పోలవరం ఎడమకాలువ ప్యాకేజీ-5 పనులు రద్దు

ప్రతిపక్ష టీడీపీ ఎంతగా విమర్శిస్తున్నా రివర్స్‌ టెండరింగ్‌తో ముందుకు వెళ్లాలనుకుంటున్న జగన్‌ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పోలవరం టెండర్లలో మరోదాన్ని రద్దు చేసింది. ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ప్యాకేజీ-5లో 65 కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీఎస్కే-హెచ్‌ఈఎస్‌ ఇన్ఫ్రా కంపెనీలు ప్రస్తుతం చేస్తున్న పనులకు అగ్రిమెంట్‌ ప్రకారం చెల్లింపులు చేయనుంది. అనంతరం కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగించేందుకు వీలుగా టెండర్‌ ప్రక్రియను నిర్వహించనుంది.

బాలకృష్ణను దండించి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?: చంద్రబాబు వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందన

సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై పెడుతున్న పోస్టులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి వెధవ మాటలు వినడానికా రాజకీయాల్లోకి వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు బాధపడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు హాజరైన ధర్మపోరాట దీక్ష వేదికపై దేశ ప్రధాని మోదీ గురించి మీ బావ బాలకృష్ణ పిచ్చికూతలు కూశారు. బాలకృష్ణను మీరు దండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? తాను తీసుకున్న గోతిలోనే పడ్డట్టుంది మీ పరిస్థితి. ఇప్పటికైనా కళ్లు తెరవండి' అంటూ ట్వీట్ చేశారు

ఆర్టీసీ చర్చలు విఫలం.. సమ్మె తప్పదన్న

తెలంగాణ  ఆర్టీసీ కార్మిక సంఘాలతో గురువారం జరిగిన మలిదశ చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి సమ్మె తప్పదని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఫలితంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. మరోవైపు, సమ్మెకు వెళ్తే ‘ఎస్మా’ తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఇటువంటి వాటికి తాము భయపడబోమని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె కనుక కొనసాగితే, ప్రత్యామ్నాయంగా ఆరేడు వేల బస్సుల్ని నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైల్వే శాఖ అదనపు రైళ్లు నడుపుతున్నా అవి సరిపోవన్నది ప్రభుత్వం యోచన. ప్రస్తుతం ఆర్టీసీలో తిరుగుతున్న 2100 అద్దె బస్సుల్ని యథాతథంగా నడపడంతోపాటు మరో 2 వేల బస్సులకు రోజువారీ పర్మిట్లు ఇచ్చి నడపాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, ప్రస్తుతం విద్యాసంస్థలకు దసరా సెలవులు కావడంతో ఆ బస్సులను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.   పండుగ సమయాల్లో నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి సిటీ బస్సులను కూడా దూర ప్రాంతాలకు కేటాయించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రైవేటు, విద్యాసంస్థల బస్సులను సమీకరించే బాధ్యతను ప్రభుత్వం రవాణా ...

వంట నూనె కంపెనీకి సినీ నటి అంజలి ప్రచారం.. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు

నిబంధనలు పాటించకుండా తయారుచేస్తున్న ఓ వంటనూనె కంపెనీకి ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి అంజలిపై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు అందింది. ఈరోడ్ ప్రధాన కార్యాలయంగా నడుస్తున్న కంపెనీ నూనెను పరిశోధనలకు పంపగా అది ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలిందని కోవైకి చెందిన కోవై సుడర్‌పార్వై మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన  కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించకుండా తయారుచేస్తున్న నూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని, తయారీదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఆ నూనె వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నటి అంజలిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.  

కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు.. స్కాన్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు

కడుపు నొప్పితో విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడికి పరీక్షలు చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. అతడి శరీరంలోని చాలా అవయవాలు వాటివాటి స్థానాల్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉండడం వారిని షాక్‌కు గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ పాద్రౌనాలో జరిగిందీ ఘటన. జమాలుద్దీన్ ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతూ గోరఖ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేశారు. ఆయా రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడి గుండె కుడివైపు, కాలేయం ఎడమవైపున ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, చాలావరకు భాగాలు నిర్ధారిత స్థానాల్లో కాకుండా వేర్వేరు చోట్ల ఉండడంతో విస్తుపోయారు. జమాలుద్దీన్ పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టు గుర్తించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించామని అయితే, అది అందరికీ భిన్నంగా ఎడమ వైపున ఉండడంతో ఆపరేషన్ చాలా కష్టమైందని వైద్యుడు శశాంక్ దీక్షిత్ తెలిపారు. మూడు రకాల ల్యాప్రోస్కోపిక్ యంత్రాలను ఉపయోగించి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కేసును చూడడం తన కెరియర్‌లో ఇదే తొలిసారని తెలిపారు.