ఏపీ సీఎం జగన్ కు లింగమనేని రమేశ్ ఓ లేఖ రాశారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న తమ ఇంటిని కూల్చివేస్తారన్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాక, అన్ని నిబంధనల మేరకే ఆ ఇంటిని నిర్మించామని తెలిపారు. దీనిపై గతంలోనే సీఆర్డీఏ అధికారులకు వివరణ ఇచ్చినట్టు వివరించారు. బాధ్యత గల ఓ పౌరుడిగానే చంద్రబాబుకు తన ఇంటిని ఇచ్చానని, తనను చంద్రబాబు బినామీగా పేర్కొంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని మానసిక వ్యథకు గురిచేస్తున్నారని ఆ లేఖలో వాపోయారు.