Skip to main content

Posts

Showing posts from August 16, 2020

Xiaomi.Redmi9 prime విడుదల అయ్యింది

  మరికొన్ని వివరాలకు ఆర్డర్ బుక్ చేయుటకు https://amzn.to/3kK8iuB

మా నాన్న అందరినీ గుర్తుపడుతున్నారు... అమ్మ రెండ్రోజుల్లో డిశ్చార్జి అవుతారు: ఎస్పీ చరణ్

 గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. బాలు అర్ధాంగి కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరారు. తన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎస్పీ చరణ్ వివరాలు తెలిపారు. తన తండ్రి ఎస్పీ బాలును ఆసుపత్రిలోని మూడో ఫ్లోర్ లో ఉన్న జనరల్ ఐసీయూ నుంచి ఆరో ఫ్లోర్ లో ఉన్న ప్రత్యేక ఐసీయూ రూమ్ కు మార్చారని వెల్లడించారు. ఇప్పుడు కాస్త స్పృహలో ఉన్నారని, డాక్టర్లను గుర్తిస్తున్నారని, బొటనవేలు పైకెత్తి తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇస్తున్నారని చరణ్ ఓ వీడియోలో వివరించారు.  డాక్టర్లు కూడా ట్రీట్ మెంట్ కు ఆయన స్పందిస్తున్న తీరు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం ఉందని తెలిపారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో తన తండ్రికి సంబంధించిన తాజా సమాచారం తెలియాల్సి ఉందని అన్నారు. ఇక, తన తల్లి కరోనా నుంచి కోలుకుంటోందని, ఆమె మంగళవారం కానీ, బుధవారం కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు.  

అన్న‌య్య త్వ‌ర‌గా కోలుకుని రండి, మీకోసం ఎదురు చూస్తున్నాః క‌మ‌ల్

  సీనియ‌ర్‌ సింగ‌ర్ ఎస్పీ బాలసుబ్ర‌మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితిపై స్పందించారు.. ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌. ఈ మేర‌కు ఆయ‌న‌కు సంబంధించి క‌మ‌ల్ హాస‌న్‌ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ”ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య త్వరగా కోలుకోని రండి, మీకోసం ఎదురుచూస్తు నాను. నా సినీ జీవితంలో ఎన్నో సినిమాలకు మీ గాత్రం ద్వారా వన్నె తెచ్చారు. నా గొంతులో మీ స్వరం కలిసిపోయింది. అన్నయ్య మీరు మరిన్ని చిత్రాలకు పాటలు పాడాలని కోరుకుంటున్నాను” అంటూ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు క‌మ‌ల్ హాస‌న్‌. కాగా ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. క‌రోనా నుంచి కోలుకునేందుకు బాలుకి ప్లాస్మా ట్రీట్మెంట్ చేశారు ఎంజీఎం ఆస్పత్రి డాక్ట‌ర్లు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో లైఫ్ స‌పోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కంటే ప్ర‌స్తుతం ఆయ‌న‌ ప‌రిస్థితి కాస్త మెరుగ్గా ఉందని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఆయ‌న‌ కుమారుడు ఎస్పీ చరణ్ సూచించారు.

మహేష్ ను వదలనంటున్న డైరెక్టర్...

 సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో మహేష్ తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసి కడుపుబ్బా నవ్వించారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అదే నమ్మకంతో ‘ఆగడు’ సినిమాకు ఒకే చెప్పాడు మహేష్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్ల పడింది. ఆ దెబ్బతో శ్రీను వైట్ల అంటే బాబోయ్ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ‘ఆగడు’ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. 'ఆగడు' సినిమా నుండి శ్రీను వైట్ల తన హిట్ ఫార్ములాతో తీసిన ప్రతి సినిమా ప్లాఫ్ అవుతూనే ఉంది. రామ్ చరణ్ తో తీసిన 'బ్రూస్ లీ'.. వరుణ్ తేజ్ 'మిస్టర్'.. రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.ఇప్పుడు 'దూకుడు' సినిమాకి సీక్వెల్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట శ్రీను వైట్ల. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కి 'దూకుడు 2' స్టోరీ నేరేట్ చేయడానికి వైట్ల శ్రీను ప్రయత్నాలు చేస్తున్నారట. శ్రీను వైట్ల ప్రయత్నానికి మహేష్ ఓకే చెప్తాడా లేదా అనేది చూడాలి. దీంతో ...

ఎనిమిది నెలల కింద గల్లంతై మంచు కింద మృతదేహంలా కనిపించిన ఆర్మీ జవాను

  భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల పరిస్థితి ఎంత దారుణమో చెప్పే సంఘటన ఇది. ఎనిమిది నెలల కిందట గల్లంతైన ఓ జవాను ఇన్నాళ్ల తర్వాత నియంత్రణ రేఖ వద్ద మంచు కింద విగతజీవుడై కనిపించాడు. కశ్మీర్ గుల్మార్గ్ లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వరిస్తున్న రాజేంద్ర సింగ్ నేగి అనే ఈ జవాను జనవరి నుంచి ఆచూకీ లేకుండా పోయాడు. రాజేంద్ర సింగ్ ఆచూకీ లేకపోవడంతో అతడు మృతి చెందినట్టు భార్యకు ఆర్మీ అధికారులు లేఖ రాశారు. అయితే తన భర్త మృతదేహాన్ని చూసేంతవరకు తాను అతడి మృతిని నిర్ధారించుకోలేనని ఆమె సమాచారం అందించారు.  ఈ నేపథ్యంలో, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం తనిఖీలు చేపడుతుండగా, మంచు కింద రాజేంద్ర సింగ్ మృతదేహాన్ని చూశారు. పోస్టుమార్టం అనంతరం జవాను మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజేంద్ర సింగ్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని చమోలి గ్రామం. రాజేంద్రసింగ్ 2001లో సైన్యంలో చేరాడు.  

శ్రీశైలానికి భారీ వరద... 870 అడుగులకు నీటిమట్టం!

  ఎగువన కర్ణాటక రాష్ట్రంతో పాటు, కృష్ణా పరీవాహక ప్రాంతమైన నల్లమల అడవులు, ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలో భారీ వరద పారుతోంది. ఆల్మట్టి మినహా మిగతా జలాశయాలన్నీ ఇప్పటికే నిండిపోగా, శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద వస్తోంది. మొత్తం 885 అడుగుల నీటిమట్టం సామర్థ్యమున్న జలాశయంలో ప్రస్తుతం 870 అడుగుల నీటిమట్టం ఉంది. రిజర్వాయర్ లో 141 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందని, 1.22 లక్షలకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా, జల విద్యుత్ కేంద్రాల ద్వారా 43,048 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నీరు నాగార్జున సాగర్ జలాశయానికి పోటెత్తుతోంది. కాగా, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుకోవడంతో, అధికారులు 70 గేట్లనూ ఎత్తివేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 1.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 91 వేలను నది ద్వారా సముద్రంలోకి, మిగతా నీటిని కాలువల ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ పనుల నిమిత్తం వదులుతున్నారు. మున్నేరుతో పాటు కట్టలేరు, వైరాల ద్వారా ప్రకాశం బ్యారేజీకి వరద నీర...

ట్రంప్ కుటుంబంలో విషాదం... సోదరుడి కన్నుమూత

 ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం నెలకొంది. ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో కన్నుమూశారు. రాబర్ట్ ట్రంప్ వయసు 71 సంవత్సరాలు. పారిశ్రామికవేత్త అయిన రాబర్ట్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్నినెలలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో శనివారం రాత్రి మృతి చెందారు. సోదరుడి మృతి పట్ల ట్రంప్ కదిలిపోయారు. "రాబర్ట్ నా తమ్ముడు మాత్రమే కాదు, నాకు ఆప్త మిత్రుడు కూడా. తమ్ముడి జ్ఞాపకాలు నా మనసు నుంచి వీడిపోవు. రాబర్ట్ ఎంతో శాంత స్వభావి. నా లైఫ్ లో నేను హనీ అని పిలిచే ఏకైక వ్యక్తి రాబర్ట్ మాత్రమే. మళ్లీ కలుసుకుందాం తమ్ముడూ!" అంటూ విషాద ప్రకటన చేశారు. కాగా, రాబర్ట్ ట్రంప్ చివరి క్షణాల్లో ఉన్నారని వైట్ హౌస్ అధికారులు ట్రంప్ కు తెలియజేయగా, శుక్రవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి తమ్ముడ్ని కడసారి పరామర్శించారు.

పవన్‌ అభిమానికి సీఎం జగన్‌ ఆర్థిక సాయం

పవన్‌కల్యాణ్ అభిమానికి ముఖ్యమంత్రి జగన్  రూ.10 లక్షలు మంజూరు చేశారు.  పవన్ కళ్యాణ్  అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం జగన్ పవన్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు.

నేటి ట్వీట్లు

ధోని రిటైర్మెంట్ పై మహేష్ ట్వీట్...ఎలా మరచిపోగలం అంటూ వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన మహీ... రీఎంట్రీపై వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఉహించని విధంగా షాకిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు ధోని. ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యావాదాలు అంటూ తెలుపుతూనే..ఆదివారం రాత్రి 7 గంటల 29 నిమిషాల నుంచి రిటైర్ అయినట్లుగా భావించాలని తన కామెంట్‌లో పోస్టు చేశాడు ధోని. అయితే.. ధోని రిటైర్మెంట్ పై ప్రిన్స్ మహేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యంకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు అంటూ మహేష్ ట్వీట్ చేశారు.   How can I ever forget the iconic sixer!! World cup champions 2011 India!! Was in the stands at Wankhede, proud and tears rolling down... Cricket will never ...

ఎస్పీ బాలు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల..!

ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఎంజీఎం  ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య సమాచారం పై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. బాలు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు శనివారం సాయంత్రం తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ బాలు ను పరామర్శించారు. బాలుకు అందుతున్న వైద్య చికిత్స వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బాలుకు కరోనా నుండి కోలుకోవడానికి ప్లాస్మా చికిత్స అందిస్తున్నారని మరో రెండు రోజులు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తారని తెలిపారు.   

ఫ్లిప్‌ కార్ట్‌ నుంచి ఆల్కహాల్‌ డెలివరీ

  ఆల్కహాల్‌ ను హోం డెలివరీ చేయడానికి ఫ్లిప్‌ కార్ట్‌‌‌‌ రెడీ అవుతోంది. ఇందుకోసం ఇండియన్‌ ఆల్కహాల్‌ హోం డెలివరీ యాప్‌ హిప్‌ బార్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆల్కహాల్‌ బెవరేజెస్‌ ను తయారు చేసే డియోజియో హిప్‌ బార్‌ లో 26 శాతం వాటా ఉంది. హిప్‌ బార్‌ కు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌ గా ఫ్లిప్‌ కార్ట్‌‌‌‌ పనిచేయడానికి పశ్చిమ బెంగాల్‌ , ఒడిశా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయని నేషనల్‌ మీడియా పేర్కొంది. ఈ భాగస్వామ్యం వల్ల ఫ్లిప్‌ కార్ట్‌‌‌‌ యూజర్లు హిప్‌ బార్‌ యాప్‌ ను యాక్సె స్‌ చేసుకోవచ్చు. కస్టమర్లు తమకు కావాల్సి న ఆల్కహాల్‌ ను ఆర్డర్‌ పెట్ టు కుంటే హిప్‌ బార్‌ హోం డెలివరీ చేస్తుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు.

వ్యాక్సిన్ అవసరం లేకుండానే... కరోనాను ఖతం చేసే ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు!

  కరోనా సోకకుండా టీకాను కనుగొనేందుకు ఎన్నో దేశాలు తలమునకలై ఉన్న వేళ, కరోనా సోకిన వారి శరీరంలో నుంచి వైరస్ ను పారద్రోలే ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన కంప్యూటర్ సిములేషన్స్ ను వినియోగించి, ఇప్పటికే అందుబాటులో ఉన్న 'ఎబ్సెలీన్' కరోనా శరీరంలో పునరుత్పత్తి కాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తేల్చారు. ఈ ఔషధాన్ని ఇప్పటికే పలు రకాల రుగ్మతలకు వినియోగిస్తున్నారు. ఇది యాంటీ వైరల్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడేటివ్ గా, బ్యాక్టీరిసైడల్ గా శరీరంలోని కణజాలాన్ని కాపాడేదిగా గుర్తింపు తెచ్చుకుంది. వినికిడి సమస్యలు ఉన్నవారితో పాటు, బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వారికి ఇస్తున్నారు. శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలను 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్ ప్రచురించింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగో రీసెర్చర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, వైరస్ ఆర్ఎన్ఏ జన్యువుల్లో ఎంప్రో ప్రొటీన్లను తయారు చేయడం ద్వారా, అది ఆశ్రయించుకుని ఉన్న శరీరంలోని కణజాలంలో మరో వైరస్ ను పుట్టిస్తోంది. వేలాది బయొలాజికల్ మాలిక్యూల్స్ మోడల్స్ ను వినియోగించి, శాస్త్రవేత్తలు, వైరస్ కు వ్...

త్వరలో కోలుకుంటా.. ప్రజాసేవకు సిద్ధమవుతా! అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ కౌర్‌

కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ కౌర్‌ రాణా కోలుకుంటున్నారు. తనను ఐసీయూ నుంచి ఈ రోజు జనరల్‌ వార్డుకు మార్చారనీ.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు ట్విటర్‌లో వెల్లడించారు. అభిమానుల ఆశీస్సులు తనతో ఉన్నాయన్న నవనీత్‌ కౌర్‌.. త్వరగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తంచేశారు. మళ్లీ ప్రజాసేవకు సిద్ధమవుతానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో పోస్ట్‌ చేశారు.