సినీ నటుడు వేణుమాధవ్ హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే వేణుమాధవ్ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా వేణుమాధవ్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. మహానాడులో మిమిక్రీ చేసి ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నారని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ ను, టీడీపీని ఎంతో అభిమానించేవారని చెప్పారు. ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేశారని తెలిపారు. వేణుమాధవ్ మరణం టిడిపికి కూడా తీరని లోటు అని చెప్పారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment