Skip to main content

Posts

Showing posts from August 8, 2020

ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్న ముఖేశ్ అంబానీ

  భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన నాలుగో స్థానానికి ఎగబాకారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 80.6 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముఖేశ్ నాలుగో స్థానంలో నిలిచారు.  ఈ క్రమంలో లగ్జరీ వస్తువులను ఉత్పత్తి చేసే ఎల్వీఎంహెచ్ సంస్ష ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను ఆయన అధిగమించారు. ఇప్పటికే వారెన్ బఫెట్, ల్యారీ పేజ్, ఎలాన్ మస్క్ వంటి కుబేరులను ముఖేశ్ అధిగమించారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 187 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో ఉన్నారు. 121 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్, 102 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్ బర్గ్ ఆ  తర్వాతి స్థానాల్లో ఉన్నారు.  

ఆదిత్య 999 స్టోరీతో బాల‌య్య వార‌సుడి సినిమా !

ఆదిత్య 369 డిఫారెంట్ స్టోరీతో ఆక‌ట్టుకున్నద‌ర్శ‌కుడు సంగీతం శ్రీ‌నివాస‌రావు. ఈ చిత్రానికి శివ‌లంక  కృష్ణ  ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హించారు. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌,  మోహిని ,  అమ్రిష్ పూరి , టిన్ను ఆనంద్‌, త‌రుణ్ కుమార్లు లీడ్ రోల్స్ పోషించారు. సంగీతం, సినిమాటోగ్రాఫీల‌ను ఇళ‌య‌రాజా, వీఎస్ఆర్ స్వామి చూసుకున్నారు.  ఆదిత్య  369 చిత్రంలో టైమ్ మిష‌న్ ప్ర‌జెంట్ టైం నుంచి పాస్ట్ టైంలోకి తీసుకెళ్లుంది. సంగీతం శ్రీ‌నివాస్‌రావు ఆధ్వ‌ర్యంలో  ఆదిత్య  999 చిత్రం వ‌స్తుంద‌ని గ‌తంలో రూమ‌ర్స్ వినిపించాయి. అందులో బాల‌య్య న‌టిస్తున్న‌ర‌ని కూడా విన్నాం. బాల‌య్య‌కు అనుకున్న ప్రాజెక్టు  ఆదిత్య  999లో అనూహ్యంగా ఆయ‌న వార‌సుడు మోక్ష‌జ్ఞ వ‌చ్చారు. మ‌రి మోక్ష‌జ్ఞ న‌టిస్తారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు రూమ‌ర్‌గానే భావించాల్సి ఉంటుంది. ఆదిత్య 369 చిత్రం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు పెద్ద హిట్ ఇచ్చింది. రెండు నంది అవార్డులు, బెస్ట్‌ కాస్టూమ్స్ డిజైన్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ అవార్డుల‌ను ద‌క్కించుకుంది. ఇది అప్ప‌ట్లో ఇండ‌స్ర్టీ హిట్ చిత్రంగా న...

బెజవాడకు మరో మణిహారం - ఇంజనీరింగ్ అద్భుతం కనకదుర్గ ప్లే ఓవర్ పూర్తి- ఆగస్టు 15న ప్రారంభం..

  ఏపీలో ఆర్ధిక రాజధానిగా ఉన్న విజయవాడ నగరానికి మరో మణిహారంగా రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైవర్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైనా ఎన్నో ఆడ్డంకులు, నిధుల సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు దాటుకుంటూ తాజాగా నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో ఆగస్టు 15న దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంజనీరింగ్ అద్భుతంగానూ, అత్యంత పొడవైన నిర్మాణంతో పాటు మరెన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ ఫ్రైఓవర్‌ గురించి ప్ర్తత్యేక కథనం..

మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో స్టే వెకేషన్ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం

 పాలనా వికేంద్రీకరణ (మూడు రాజధానులు), సీఆర్డీఏ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే వెకేషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఇప్పటికే ఐకాస, అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు.

యోగి ఆదిత్య‌నాథ్ కు జ‌గ‌న్ లేఖ రాయాలి: సోము వీర్రాజు

  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని  అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ఇటీవ‌లే భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. రామాల‌య నిర్మాణం, అక్క‌డ భ‌క్తుల‌కు వ‌స‌తిపై అన్ని ప్ర‌ణాళిక‌లు వేసుకుంటోన్న నేప‌థ్యంలో  అక్క‌డ ఏపీ యాత్రికుల కోసం వ‌స‌తి  గృహ నిర్మాణం కోసం చొర‌వ‌చూపాల‌ని ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కోరారు. "ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి  అయోధ్యకు శ్రీరాముని దర్శనాని కోసం వెళ్లే యాత్రికుల కోసం వసతి గృహ నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయించమని కోరుతూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ గారికి జగన్ గారు లేఖ రాయాలి.  కర్ణాటక యాత్రికుల కోసం ఈ వ్యవస్థ‌ ఏర్పాటు కోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాసిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యె‌డియూర‌ప్ప  గారిని నేను అభినందిస్తున్నాను" అని ఆయ‌న పేర్కొన్నారు.  

225కే క‌రోనా వ్యాక్సిన్‌...ఎందుకు ఈ ధ‌ర‌లో ఇస్తున్నారో తెలుసా?

  . యూనివర్సిటీ ముందంజలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు త‌యారు చేసిన టీకా ట్ర‌య‌ల్స్‌లో సత్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు ఎంద‌రిలోనో ఆశ‌లు పుట్టించాయి. అయితే ఈ టీకా బ‌య‌టికి వ‌స్తే ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో కీల‌క   గుడ్ న్యూస్   వెలుగులోకి వ‌చ్చింది. ఆక్స్‌ఫర్డ్‌   యూనివర్సిటీ   తయారు చేసిన క‌రోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్   ఇండియా   ఉత్పత్తి చేయ‌నుంది. మ‌న దేశానికి చెందిన ఈ సంస్థ నేడు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త‌ దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను రూ.225కే అందించ‌నున్న‌ట్లు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ వెల్ల‌డించింది. ఆక్స్‌ఫర్డ్  యూనివర్సిటీ , ఆస్ట్రాజెనెకా సంస్థలు రెండు కలిసి క‌రోనా వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి భార‌త్‌కు చెందిన ఫార్మా కంపెనీ  సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభంలో 100 మిలియ‌న్‌ డోసుల‌ను ఉత్ప‌త్తి చేసి భారత్‌తోపాటు ఇతర దేశాలకు అందించ‌నుంది.  క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ప...

ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ నుంచే రేష‌న్ కార్డుకు అప్లై చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..? ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ నుంచే రేష‌న్ కార్డుకు అప్లై చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

  కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల కోసం వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ పేరిట సౌల‌భ్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం విదిత‌మే. దీని వ‌ల్ల దేశంలోని ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేద‌లైనా ఎక్క‌డి నుంచైనా రేష‌న్ పొంద‌వ‌చ్చు. రేష‌న్ కార్డు దారుల‌కు చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే రేష‌న్ స‌రుకుల‌ను అంద‌జేస్తారు. ఇక కార్డుల‌ను కేవ‌లం రేష‌న్ పొంద‌డం కోస‌మే కాకుండా ప‌లు అవ‌స‌రాల కోసం గుర్తింపు కార్డుల‌లా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే రేష‌న్ కార్డుల కోసం ఇక రోజుల త‌ర‌బ‌డి ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేదు. ఇంట్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ ద్వారానే ఆ కార్డుకు అప్లై చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే… దేశంలో దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న ప్ర‌జ‌ల‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు రేష‌న్ కార్డు సౌక‌ర్యాన్ని అంద‌జేస్తున్నాయి. రేష‌న్ కార్డును పొందేందుకు ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ అధికారుల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేదు. ఇక‌పై ఆన్‌లైన్‌లోనే ఆ ప్ర‌క్రియ అంతా పూర్త‌వుతుంది. అందుకు గాను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన రేష‌న్ కార్డు వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించాలి. వెబ్‌సైట్‌లో కొత్త‌గా రేష‌న్ కార్డుకు అప్లై చేసుకునే ...

జగన్‌కు మూడో స్థానం దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో   వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి   మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య  ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌(6), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(7), ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌(8), రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లట్‌(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేరరించారు. 

వైసీపీ ఎమ్మెల్సీకి చిక్కులు.. జగన్‌పై అభిమానంతో జడ్జిలపై నోరుజారినందుకు..

జడ్జిల మీద పరుష వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది హైకోర్టు సీజేకు లేఖ రాశ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కోర్టును, న్యాయమూర్తులను ఉద్దేశించి రవీంద్రబాబు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కొందరు ప్రణాళికాబద్ధంగా కోర్టులను విమర్శిస్తున్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఆక్షేపించారు. న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు ఇలా మాట్లాడటం సరికాదని లక్ష్మీనారాయణ అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో న్యాయవాది లక...