Skip to main content

Posts

Showing posts from August 18, 2020

చుట్టూ వరద.. బయటకు వెళ్లలేని పరిస్థితి. చెట్టుకొమ్మ ఒక్కటే దిక్కైంది

ఎడతెరిపి లేకుండా వానలు , చుట్టూ వరద నీరు … ఆసరా గా ఒక చెట్టుకొమ్మ.. వివరాలు లో కి వెళ్ళితే ఈ ఘటన చండీఘడ్ లో బిలాస్ పూర్ లో జరిగింది. ఇక్కడ ఉన్న ఖూటఘాట్ డ్యామ్ కు ఆదివారం సాయంత్రం జితేందర్ కశ్యప్ అనే వ్యక్తి స్నానానికి వచ్చాడు, అయ్యితే అదే సమయానికి డ్యామ్ నుంచి నుంచి వరద నీరు ప్రవాహం పెరగడం తో అయన అక్కడ నుంచి బయటకి రాలేకపోయారు , అక్కడే ఉన్న బండరాళ్లను , చెట్టుకొమ్మని ఆధారం గా పట్టుకొని 16 గంటల సేపు తన ప్రాణాలను కాపాడుకున్నాడు విషయం తెలుసుకోన్న ఐఏఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ తో వచ్చి.సోమవారం తెల్లవారు జామున. కిందికి తాడును వదిలి జితేందర్ కశ్యప్ ను రక్షించింది

ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు

 ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. యూనివర్శిటీలు, కాలేజీలు, పాఠశాలలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, విశాఖలోని తిరుమలగిరి గిరిజన పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. వాస్తవానికి ఆగస్ట్ 15వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, పట్టాల కేటాయింపుల్లో పలు అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.  

ప్రభాస్‌.. రాముడిగా కనిపించనున్నారా?

  అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 3డీ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌’. ఓం రౌత్‌ దర్శకుడు. మంగళవారం ఉదయం టైటిల్‌తో పాటు, కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో ఈ సినిమాపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పోస్టర్‌లో రామాయణ పాత్రలు కనిపించడంతో అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ దీనిపైనే చర్చ మొదలైంది. ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తాడా? లేదా? ఆ పాత్ర లక్షణాలతో ప్రభాస్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందా? ఇలా అనేక ప్రశ్నలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. తాజాగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన ట్వీట్‌తో ప్రభాస్‌ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది. ‘‘ప్రభాస్‌గారిని రాముడిగా చూసేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. ఆ పాత్రను వెండితెరపై చాలా కొద్దిమంది నటులు మాత్రమే పోషించారు. చిత్ర బృందానిఇక శుభాకాంక్షలు’’ అని నాగ్‌ అశ్విన్ ట్వీట్‌ చేయడంతో ‘ఆది పురుష్‌’లో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తాడని అర్థమవుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం మాత్రం ఎక్కడా స్పందించ లేదు. దీనిపై దర్శకుడు ఓం రౌత్‌ మాట్లాడుతూ..‘‘నా విజన్‌ను గుర్తించి సినిమాలో భాగస్వామి అయింనందుకు ప్రభాస్‌కు...

ప్లాస్మా దానానికి భయపడొద్దు: రాజమౌళి

 ప్లాస్మా దానంపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని సూచించారు. సకాలంలో కరోనాను గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కరోనా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. పౌష్ఠికాహారం తీసుకుంటూ.. వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చన్నారు.  కీరవాణి మాట్లాడుతూ.. ప్లాస్మా దానంపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవినితో సమానమన్నారు. తమ కుటుంబం, సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.  సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ...కరోనా బాధితులపై వివక్ష చూపొద్దని, వారే రేపటి ప్రాణదాతలని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు రావాలని కోరారు. ప్...

నాన్న ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు:ఎస్పీ చరణ్‌

 ప్రముఖ గాయకుడు, తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. వెంటిలేటర్‌ తొలగించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. సోమవారం ఏవిధంగానైతే ఉందో నేడూ అలాగే ఉంది. నాన్నగారికి వెంటిలేటర్‌ తొలగించినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజం కాదు. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆ రోజు రావాలని మేమూ ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుంది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము దృఢంగా నమ్ముతున్నాం. మీ దీవెనలు ఆయనకు కావాలి. ఇలాగే మీ ప్రేమాభిమానులను కొనసాగించండి. ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌లోనూ టిక్‌టాక్‌ తరహా షార్ట్ వీడియోస్ ఫీచర్!

 సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ కొత్తగా 'షార్ట్‌ వీడియో' అనే ఫీచర్‌ను‌ తీసుకురానుంది. షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం విధించడంతో పాటు అమెరికాలోనూ నిషేధం విధించే అవకాశాలు ఉండడంతో ఫేస్‌బుక్‌ కూడా ఆ తరహా షార్ట్ వీడియో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది.  న్యూస్‌ఫీడ్‌ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్‌ ఫీచర్ ఉంటుంది. ఇందులో చిన్న వీడియోలను యూజర్లు రూపొందించుకోవచ్చు. ఇందులో మనం పోస్ట్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్‌ వచ్చాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ అనే ఓ ఆప్షన్ తీసుకువచ్చి షార్ట్ వీడియోలను పోస్ట్ చేసుకునేలా సౌలభ్యం కలిగించిన విషయం తెలిసిందే. షార్ట్ వీడియోలకు అత్యధిక ఆదరణ వస్తుండడంతో యూట్యూబ్ కూడా షార్ట్‌ పేరుతో వీడియో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, షార్ట్ వీడియో యాప్‌లను తీసుకురావడానికి ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. షార్ట్ వీడియోలు యూజర్ల సమయాన్...

అన్నయ్యకు వెంటిలేటర్ తొలగించారు.. క్రమంగా కోలుకుంటున్నారు: బాలు సోదరి ఎస్పీ శైలజ

 కరోనాతో తీవ్రపోరాటం సాగిస్తున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. తన అన్నయ్య ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ వెల్లడించారు. మునుపటితో పోల్చితే ఎంతో కోలుకున్నారని తెలిపారు. ఇవాళ  వైద్యులు ఆయనకు వెంటిలేటర్ తొలగించారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకోగలుగుతున్నారని వివరించారు. తన సోదరుడు చికిత్సకు స్పందిస్తున్న తీరు పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తన సోదరుడి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని ఎస్పీ శైలజ పేర్కొన్నారు. ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనా చికిత్స కోసం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే కొన్నిరోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ఏపీలో 'ఫోన్‌ ట్యాపింగ్' కలకలంపై‌ హైకోర్టులో విచారణ.. సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషనర్

 ఆంధ్రప్రదేశ్‌లో 'ఫోన్ ట్యాపింగ్‌' ఆరోపణలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఏపీ‌ హైకోర్టులోని కొందరు జడ్జీల ఫోన్‌ నంబర్లను ట్యాప్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ యత్నించారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని విశాఖపట్నం జిల్లాకు చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందుకోసం సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి హైకోర్టు తెలిపింది. అలాగే, ఈ అంశంపై ఎందుకు విచారణ జరపకూడదో చెప్పాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.  

పెను ప్రమాదం నుంచి బయటపడిన ట్రంప్

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్-1 విమానం ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎగురుకుంటూ వచ్చిన ఓ డ్రోన్ ఒకటి విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్ విమానాన్ని దాదాపు ఢీకొట్టేంత పని చేసిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది.

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ 'ఆదిపురుష్'!

 ప్రభాస్ నటించే హిందీ చిత్రం టైటిల్ ఎనౌన్స్ అయింది.  ఈ ఉదయం తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రభాస్ తన సినిమాకు 'ఆదిపురుష్' (సెలబ్రేటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఆన్ ఈవిల్) అని టైటిల్ పెట్టినట్టు ఆయన తెలిపారు. టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ లోగో విడుదల కాగానే వైరల్ అయిపోయింది.  'ఎ' అనే అక్షరంలో వీర హనుమాన్ చిత్రం, కొందరు రాక్షసుల చిత్రాలు ఎంబోజ్ అయి ఉన్నాయి. కొన్ని పురాతన ఆలయాల చిత్రాలు, విల్లెక్కు పెట్టిన యోధుడి నీడ కనిపిస్తోంది. కాగా, ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనిని త్రీడీ ఫార్మాట్ లో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రాన్ని ఆ ఆ తర్వాత ఇతర భాషల్లోకి డబ్ చేస్తారు. ఇది పౌరాణిక చిత్రంగా, మహా విష్ణువు తొలి అవతారం ఆధారంగా రూపొందుతుందని సమాచా

నిత్యానందుడి కైలాస విలాసం |

 కైలాస పురుష పుంగ‌వుడు నిత్యానంద మామూలోడు కాదు. ఆయ‌న గారి లీల‌లు చూడ‌త‌రం కావ‌డం లేదు. ఆధ్యాత్మిక గురువుగా ప్రాచుర్యం పొందిన నిత్యానంద గుట్టు ర‌ట్టు అయ్యే స‌రికి దేశం విడిచాడు. ఆ త‌ర్వాత కైలాస వాసిగా స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు. ఈక్వెడార్ నుంచి చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు నిత్యానంద లేటెస్ట్ అప్‌డేట్‌కు వ‌స్తే...దిమ్మ తిరిగేలా ఉన్నాయి. ఆధ్యాత్మిక వేత్త నుంచి ఆర్థిక‌వేత్త‌గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్నారు. త‌న దేశంలో కైలాస రిజ‌ర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఆయ‌న తాజా ప్ర‌క‌ట‌న సారాంశం. ఇప్ప‌టికే త‌న దేశానికి పాస్‌పోర్ట్‌, ప్ర‌త్యేక జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసిన విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు, ప్ర‌త్యేక కేబినెట్ ఏర్పాటుతో స్వ‌యం పాల‌న సాగిస్తున్న‌ట్టు నిత్యానంద ప్ర‌క‌టించి ఔరా అనిపించారు. ప్ర‌స్తుతానికి వ‌స్తే రిజ‌ర్వ్ బ్యాంక్ ఏర్పాటుతో పాటు ప్ర‌త్యేక క‌రెన్సీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ క‌రెన్సీ ప్ర‌పంచ వ్యాప్తంగా చెల్లుబాటు ...