Skip to main content

Posts

Showing posts from October 26, 2019

విడుదల చేయాలంటూ జైల్లోనే నిరహార దీక్షకు దిగిన నళిని

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలి తమిళనాడులోని వేలూరు జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ తనను విడుదల చేయాలంటూ  నిరసనకు దిగింది. శుక్రవారం రాత్రి నుంచి ఆహారం తీసుకోకుండా తన డిమాండ్ ను నెరవేర్చాలని కోరుతోంది. తాను, తన భర్త మురుగన్ 28 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నామని.. తమను విడుదల చేయాలంటూ జైలు అధికారులకు లేఖ రాసింది. ఇటీవల కుమార్తె వివాహంకోసం కొన్ని రోజులపాటు పెరోల్ పై నళిని బయటకు వచ్చింది. ఇప్పుడు తన మామ ఆరోగ్యం క్షీణించిందని మరో నెలరోజులు పెరోల్ కావాలని కోరింది. రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని విడుదల చేయాలని గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. గవర్నర్ ఈ సిఫారసుపై స్పందించలేదు.  

బొత్సపై టీడీపీ నేతల ఎదురుదాడి... 25 ప్రశ్నలతో లేఖ

టీడీపీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై ధ్వజమెత్తారు. ప్రజా రాజధానికి కులతత్వం ఆపాదించి, ప్రాంతీయ తత్వం ఎగదోసి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా మంత్రి స్థాయిని దిగజార్చారంటూ ఆరోపించారు. ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని అని, ఇది ముంపు ప్రాంతం అని రోజుకో విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోతే ఇక్కడికి వచ్చి ఎవరు పెట్టుబడి పెడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పోషించగల, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించగల రాజధాని అవసరం లేదా? అని నిలదీశారు. ఈ మేరకు బొత్సకు రాజధాని అంశంపై 25 ప్రశ్నలతో ఒక బహిరంగ లేఖ రాశారు.  

మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ, బండ్ల గణేశ్ పై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి: పీవీపీ

  ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని నిర్మాత పీవీపీ ఫిర్యాదు చేయడంతో నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ’టెంపర్’ సినిమా తీయడానికి చేసిన ఖర్చు నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ మధ్య కుంపటి రాజేసింది. ఈ నేపథ్యంలో తాను ఫైనాన్స్ చేసిన డబ్బులు పూర్తిగా ఇవ్వలేదంటూ పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు పీవీపీ మీడియాతో మాట్లాడారు.   ‘ఈ సినిమాకోసం రూ.30 కోట్లు ఫైనాన్స్ చేస్తే అందులో రూ.23 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారు. మిగతా రూ.7 కోట్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చారు కానీ, వాటి వల్ల ప్రయోజనం లేకపోయింది. ఐదేళ్లు గడిచినా డబ్బులు తిరిగి రాలేదు. దీంతో మేము గణేశ్ పై లీగల్ చర్యలు చేపట్టాలనుకున్నాం, అదే చేశాం’ అని పీవీపీ అన్నారు. అంతకు ముందు గణేశ్ చర్చలకోసం మనుషులను పంపిస్తూ.. బంజారాహిల్స్ కేసులో మాపై కేసు నమోదు చేయించాడు. ఈ సందర్భంగా ఒక్క విషయం తెలుసుకోవాలి. మాపై ఒక్క చెక్ బౌన్స్ కేసు లేదు కానీ ఆయనపై 58 చెక్ బౌన్స్ కేసులున్నాయి' అని పీవీపీ  పేర్కొన్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో గణేశ్ సంబంధాలపై పీవీపీ మాట్లాడుతూ ‘బొత్సకు బినామీ గణేశ్ అనే విషయం తె...

ఏపీ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య సిబ్బందికి దీపావళి కానుక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు పెంచింది. ఈ పెంచిన వేతనాలను వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం కొత్త పథకం

  ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాలకు చెందిన రోగులు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్స చేసుకున్న ప్రతీ పేద రోగికి భత్యం కింద రోజుకు రూ. 225 అందజేస్తారు. ‘పోస్ట్ ఆపరేటివ్ సస్టెయినెన్స్ అలవెన్స్’గా పిలుస్తున్న ఈ పథకంలో నెలకు గరిష్ఠంగా ఒక రోగికి రూ.5 వేల వరకు ఇస్తారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమలు కానున్న ఈ పథకానికి  నిధులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు  నుంచి చెల్లించనున్నట్లు  పేర్కొంది.  

ఇక 'నాగార్జున సాగర్' ఆయకట్టుపై దృష్టి సారిస్తా: సీఎం కేసీఆర్

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించిన సందర్భంగా  ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి సమస్యలను తొలగిస్తామని చెప్పారు. అనేక అవమానాలు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నో లక్ష్యాలతో పనిచేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని, తెలంగాణలో కోటీ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. ‘నాగార్జున సాగర్ ఆయకట్టుపై దృష్టి సారిస్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలి. గోదావరి నీళ్లతో సాగర్ ఎడమ కాల్వ పొంగిపొర్లాలి. రైతులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించి నీటి కష్టాలను తొలగిస్తాం. ఐడీసీ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న దాదాపు 600 లిఫ్టుల నిర్వహణ వ్యయాలను ప్రభుత్వమే భరిస్తుంది. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది’ అని కేసీఆర్ అన్నారు. అంతకు ముందు తన ప్రసంగంలో కేసీఆర్ హుజూర్ నగర్ నియోజక వర్గ వాసులపై వరాల జల్లు కురిపించారు. సైదిరెడ్డిని గెలిపించినందుక...

తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లిన జేఏసీ నేతలు ఇప్పటివరకు రాలేదు: ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి మధ్య ఇవాళ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చల సరళి పట్ల ఆర్టీసీ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తమ వాదన వినిపించారు. హైకోర్టు ఆదేశించిన మేరకే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపామని వెల్లడించారు. హైకోర్టు చెప్పినట్టే 21 అంశాలపై చర్చలు జరిపామని, అయితే తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లిన కార్మిక సంఘాల నేతలు మళ్లీ రాలేదని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప మిగతా డిమాండ్లపై చర్చిద్దామని తాము ప్రతిపాదించామని, కానీ జేఏసీ నేతలు అంగీకరించలేదని సునీల్ శర్మ తెలిపారు. ఇతర ముఖ్యులతో మాట్లాడి వస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు చర్చల మధ్యలోనే నిష్క్రమించారని వివరించారు. చాలాసేపు వారికోసం చూసినా తిరిగి రాలేదని అన్నారు. ఇక, చర్చల మధ్యలో అంతరాయం కలిగిస్తాయన్న ఉద్దేశంతోనే జేఏసీ నేతల మొబైల్ ఫోన్లు అనుమతించలేదని సునీల్ శర్మ వివరణ ఇచ్చారు.

మా సెల్ ఫోన్లు లాక్కుని చర్చలు జరిపారు: ఆర్టీసీ జేఏసీ నేతల అసంతృప్తి

ఆర్టీసీ యాజమాన్యంతో తాము జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇంతటి నిర్బంధ చర్చలు తాను చూడలేదని చెప్పారు. ఆర్టీసీ సమ్మె ఆగదని, కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము డిమాండ్ చేసిన అన్ని అంశాలను యాజమాన్యం పట్టించుకోలేదని కొన్ని డిమాండ్లనే వారు పరిగణనలోకి తీసుకున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు  ఎర్రమంజిల్ లోని ఈఎన్ సీ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన ఈ చర్చల్లో అశ్వత్థామరెడ్డి, మరో ముగ్గురు సహ కన్వీనర్లు కార్మికులకు ప్రాతినిధ్యం వహించారు. చర్చల అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ చర్చల ప్రారంభానికి ముందే మా మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఇవి నిర్బంధ చర్చలు. మేము 26 డిమాండ్లను వారి ముందుంచగా యాజమాన్యం 21 డిమాండ్లపైనే మాట్లాడతామంది. యాజమాన్యం ముందే ఒక ఎజెండాతో సమావేశస్థలికి వచ్చింది. లోపల జరిగిన సంభాషణలపై మా కార్మికులతో కలిసి చర్చిస్తాం. తిరిగి చర్చలకు ఆహ్వానిస్తే సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఈ చర్చలు కోర్టును తృప్తి పరిచేందుకు జరిపినట్...

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వర్ల రామయ్య

  టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ పరాజయంపాలైన వెంటనే ఆయన ఆర్టీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారని భావించారు. కానీ ఆయన పదవికి రాజీనామా చేయకపోవడంతో ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య తన రాజీనామా లేఖను ఏపీ రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి పంపారు. వర్ల రామయ్య పదవీకాలం 2019 ఏప్రిల్ 24తో ముగిసింది. దాంతో సెప్టెంబరులో ఆయనకు నోటీసులు పంపారు.  

ఆర్టీసీ కార్మికులతో ముగిసిన చర్చలు

 ఆర్టీసీ కార్మికులతో ముగిసిన చర్చలు ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. తొలి విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, మళ్లీ ఎప్పుడు చర్చలకు పిలిస్తే అప్పుడు హాజరవుతామని చెప్పారు. అన్ని అంశాలపై తాము చర్చలు జరపాలని కోరామని, కానీ కొన్ని అంశాలకు మాత్రమే వారు పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మికుల తరఫున ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి, మరో ముగ్గురు కో-కన్వీనర్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇవి నిర్బంధ చర్చలు. మా సెల్ ఫోన్లు లాక్కున్నారు. 21 అంశాలపై మాట్లాడుతామని యాజమాన్యం అంది. మేం 26 అంశాలపై చర్చలను జరపాలని కోరాం. 21 అంశాలు ఆర్థిక అంశాలకు సంబంధం లేదని కోర్టు చెప్పింది. యాజమాన్యం ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని మాట్లాడింది. అన్ని అంశాలపై చర్చలు జరపాలని కోరాం. మా వాళ్లతో లోపల జరిగిన అంశాలపై చర్చిస్తాం. మళ్లీ చర్చలు జ...

రేపు ఖట్టర్‌ ప్రమాణస్వీకారం..!

 రేపు ఖట్టర్‌ ప్రమాణస్వీకారం..! హరియాణా ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి మనోహర్ లాల్‌ ఖట్టర్‌ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఖట్టర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భాజపా వర్గాలు తాజాగా వెల్లడించాయి. మరోవైపు భాజపా శాసనసభాపక్షం నేడు భేటీ అయి ఖట్టర్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.   గోపాల్‌ కందా మద్దతు తీసుకోం.. వివాదాస్పద నేత, ఎమ్మెల్యే గోపాల్‌ కందా మద్దతు తీసుకునే ఆలోచనే లేదని భాజపా స్పష్టం చేసింది. ‘ఎవరికైనా మద్దతిచ్చే స్వేచ్ఛ గోపాల్‌ కందాకు ఉంది. కానీ మేం ఆయన మద్దతు తీసుకోవాలని అనుకోవట్లేదు. ఆయనను ప్రభుత్వంలోకి తీసుకుంటామనే ప్రశ్నే లేదు’ అని భాజపా నేత అనిల్‌ విజయ్‌ తెలిపారు.  ఏ పార్టీకి సరైన ఆధిక్యం రాని హరియాణాలో జన్‌నాయక్‌ జనతా పార్టీ మద్దతుతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వానికి మళ్లీ ఖట్టరే నేతృత్వం వహించనున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఖట్టర్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ప్రమ...

వైసీపీలోకి వల్లభనేని వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ వర్గం

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయమనే చెప్పుకుంటున్నారు. దీపావళి తర్వాత ఈ విషయంలో క్లారిటీ ఇస్తానని వంశీ ఇప్పటికే చెప్పారు. వంశీకి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు, వంశీ రాక గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. గత ఎన్నికల్లో వంశీ చేతిలో ఓటమిపాలైన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాకను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంకట్రావు ఇంటికి చేరుకుంటున్నారు. వంశీ వైసీపీలో చేరితే... యార్లగడ్డ భవితవ్యం ఏమిటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కుండపోత వర్షాలు కురుస్తుంటే నిర్మాణాలెలా జరుగుతాయి పచ్చకామెర్ల రోగుల్లారా?: విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మళ్లీ తానే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చంద్రబాబు కలవరిస్తున్నారని... తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి ఆయనను అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమేనని ఎద్దేవా చేశారు. పోలైన ఓట్లలో ఒక్క శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడంటూ సెటైర్ వేశారు.   'ఎయిర్ పోర్టులో చిరు తిండ్ల ఖర్చు 25 లక్షలు, ఒక్క రోజు ధర్నాకు 10 కోట్లు... ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాలా పెద్దది వస్తుంది. కొందరు పదవిలో ఉన్నది అనుభవించడానికే అనుకుంటారు. ఇసుక కొరత అని ఆందోళనకు దిగుతున్న పచ్చ పార్టీ, బానిస పార్టీలు కోరుకునేదేమిటంటే... వర్షాలు కురవొద్దు. నదులు, వాగులు ఉప్పొంగకూడదు. రిజర్వాయర్లు నిండొద్దు. నదులన్నీ ఎండిపోయి ఇసుక రాశులు తేలి ఉంటే ఏ కొరతా ఉండదు. ఇటువంటి తిరోగమన ఆలోచనలున్న వాళ్లు భూమికి భారం కాక మరేమిటి? అధికారంలో ఉన్నప్పుడు ఇసుకనే నమ్ముకున్నారు. అమ్ముకున్నారు. ఇప్పుడు దాని పైనే రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తాత్కాలిక సమస్యపై ...

వారిది న్యాయమైన డిమాండ్‌ : శివసేనకు మద్దతు పలికిన ఎన్‌సీపీ అధినేత పవార్‌

మహారాష్ట్రలో అధికారం పంచుకోవాలని ఆశిస్తున్న శివసేనకు  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్‌ మద్దతుగా నిలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరిసగం రోజులు పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌లో న్యాయం ఉందని అన్నారు. శివసేన చేస్తున్న డిమాండ్‌ కొత్తదేమీ కాదని, 1990లో కూడా ఈ ఫార్ములాను అనుసరించిన కారణంగా తాజాగా వారీ డిమాండ్‌ చేస్తున్నారని వెనకేసుకొచ్చారు ఈ సీనియర్‌ నేత. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి సిద్ధమైనా ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు కూడా ఇవ్వాలని శివసేన డిమాండ్‌ చేస్తుండడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్‌పవర్‌ స్పందన చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న ఊహాగానాలు చెలరేగినా అదేం లేదని ఎన్సీపీ కొట్టిపారేసింది. మరి సీనియర్‌నేత పవార్‌ తాజా ప్రకటన ఎందుకు చేశారన్నది తెలియాల్సి ఉంది.

టీడీపీ పతనం వల్లభనేని వంశీతో ప్రారంభమైంది.. ఎంతదాకా వెళ్తుందో చూడాలి: విష్ణువర్ధన్ రెడ్డి

ఇప్పటి వరకు నీతులు చెప్పిన వైసీపీ మాట మార్చిందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కునే పనిలో పడిందని అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీలో వల్లభనేని వంశీతో కొత్త రాజకీయాలను ప్రారంభించిందని చెప్పారు. చంద్రబాబు మీద టీడీపీ ఎమ్మెల్యేలకు విశ్వాసం కొరవడిందని అన్నారు. ఏపీలో టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. వల్లభనేని వంశీతో ప్రారంభమైన ఈ పరిణామం... రానున్న రోజుల్లో ఎంత దూరం వెళ్తుందో చూడాలని అన్నారు. తన గోతిని తానే తీసుకోవడం అంటే ఇదే చంద్రబాబుగారూ అంటూ సెటైర్ వేశారు. వల్లభనేని వంశీ నిన్న ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీతో అంటీముట్టనట్టు ఉన్న వంశీ... వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.   

గుంటూరులో మంత్రి బొత్సకు చేదు అనుభవం.. నిలదీసిన భవన నిర్మాణ కార్మికులు

  గుంటూరు నగరంలో ఈరోజు పర్యటించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. గత కొన్నాళ్లుగా ఇసుక అందుబాటులో లేక పనులు నిలిచిపోవడంతో ఆగ్రహోదగ్రులుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు నగరానికి వచ్చిన బొత్సను అడ్డుకుని నిలదీశారు.  ప్రభుత్వ విధానం వల్ల పనుల్లేక అర్ధాకలితో బతుకుతున్నామని, మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులను సముదాయించి బొత్స ముందుకు సాగారు. అనంతరం నగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్లు, కాలువల నిర్మాణంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇలా తయారయ్యాయని, తమ ప్రభుత్వం వీటిని పూర్తి చేస్తుందని తెలిపారు.   

మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించిన జనసేన

  ఇసుక కొరతతో ఏపీలోని భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వంపై విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. తాజాగా భవన నిర్మాణ కార్మికులతో కలసి జనసేన నేతలు విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, తమకు ఉపాధి కల్పించాలని నినదించారు.  ఈ సందర్భంగా కార్మికులు, జనసేన నేతలతో అవంతి మాట్లాడారు. తమ కష్టాలను మంత్రికి కార్మికులు వివరించారు. అనంతరం అవంతి మాట్లాడుతూ, వీలైనంత త్వరలో ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు కావాలనే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని, రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని విమర్శించారు.   

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు కేసీఆర్ ఓకే.. నేడు చర్చలు?

  ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆ సంస్థ ముఖ్యకార్యదర్శి, ఇన్‌చార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తదితరులతో  ప్రగతి భవన్‌లో నిన్న సాయంత్రం నాలుగు గంటలపాటు జరిపిన సుదీర్ఘ సమీక్ష అనంతరం కార్మికులను చర్చలకు పిలవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో నేడు కార్మిక సంఘాల నాయకులతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ బస్‌భవన్‌లో సమావేశం కానుందని సమాచారం. నేటి ఉదయం కార్మిక సంఘాలకు చర్చలకు సంబంధించిన సమాచారం ఇవ్వనున్నారు. అయితే, చర్చలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. చర్చల విషయమై ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.   

దుష్యంత్ చౌతాలాపై మండిపడ్డ కాంగ్రెస్

  జేజేపీతో పాటు ఇండిపెండెంట్ల మద్దతుతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నిన్న ఉదయం జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో మాట్లాడుతూ, బీజేపీకి మద్దతు పలికే అవకాశమే లేదంటూ కుండ బద్దలు కొట్టారు. కానీ, సాయంత్రానికల్లా మాట మార్చేసి, బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో, దుష్యంత్ చౌతాలాపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, జేజేపీ, లోక్ దళ్ పార్టీలు ఎప్పుడూ బీజేపీ తొత్తులేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేవారు. దుష్యంత్ చౌతాలా మాట తప్పారని మండిపడ్డారు. హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారనేది నిజమనే విషయం అందరికీ తెలుసని సూర్జేవాలా అన్నారు. బీజేపీని వ్యతిరేకించడం వల్లే జేజేపీ 10 సీట్లను గెలుచుకుందని... బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఆ పార్టీ ప్రకటించిందని... ఇప్పుడు అధికార కాంక్షకే ఆ పార్టీ పెద్ద పీట వేసిందని మండిపడ్డారు. సమాజాన్ని చీల్చి అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పుడు ప్రయత్నించినా... జేజేపీ, లోక్ దళ్ పార్టీలు దానికి తొత్...

హానీ ట్రాప్ ఉచ్చులో పడి లక్షలు సమర్పించుకున్న విశాఖ వాసులు

కిలాడి గ్యాంగ్ విసిరిన హానీ ట్రాప్ ఉచ్చులో పలువురు విశాఖ వాసులు చిక్కుకున్నారు. వారి మాటలకు పడిపోయి లక్షలు సమర్పించుకుని, లబోదిబో మంటున్నారు. ఫేక్ డేటింగ్ సైట్లతో కిలాడి గ్యాంగ్ జనాలను ట్రాప్ చేస్తోంది. కోల్ కతా కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది బలవుతున్నారు. అందమైన అమ్మాయిన ఫొటోలను పెట్టి, పలు ఆకర్షనీయమైన ఆఫర్లతో జనాలను ఈ గ్యాంగ్ ట్రాప్ చేస్తోంది. గ్యాంగ్ కు చెందిన అమ్మాయిలు తీయని మాటలతో కస్టమర్లను ఆకట్టుకుని, వారి జేబులను గుల్ల చేస్తున్నారు. ఓస్లాం ఐటీ ముసుగులో ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. విశాఖలో ఒకరి నుంచి రూ. 18 లక్షలు, మరొకరి నుంచి రూ. 3 లక్షలను ఈ గ్యాంగ్ కాజేసింది. ఇంకా బయటపడని బాధితులు చాలా మందే ఉంటారని అనుమానం. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. తీగ లాగితే కోల్ కతాలో డొంక కదిలింది. దీంతో కోల్ కతాకు వెళ్లిన విశాఖ పోలీసులు... అక్కడున్న 24 మంది టెలికాలర్లతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. 3 ల్యాప్ టాప్ లు, 40 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు వీరిని కోల్ కతా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పీటీ వా...

ఆత్మగౌరవం ఉన్న ప్రతీ మహిళ మొదట చేయాల్సింది ఇదే: ప్రియాంక గాంధీ పిలుపు

  ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారత మహిళ బీజేపీని, ఆ పార్టీ నేతలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకగాంధీ పిలుపునిచ్చారు. మహిళలంటే ఆ పార్టీ నేతలకు గౌరవం లేదన్న ప్రియాంక.. వారిని దూరంగా పెట్టాలన్నారు. బీజేపీ నేతలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుల్దీప్‌సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద, గోపాల్ కందా.. వీరందరూ మహిళలను వేధించిన వారేనని ఆరోపించారు. ఇటువంటి వారిని బహిష్కరించాలని మహిళల కోరారు. ఉన్నావో బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ అరెస్టయ్యాక ఆయనను బీజేపీ సస్పెండ్ చేసిందని, ఆ తర్వాత స్మామి చిన్మయానంద కూడా ఇదే తరహా కేసులో అరెస్టయ్యారని పేర్కొన్నారు. తన విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్యకు గోపాల్ కందా కారణమన్న ఆరోపణలు ఉన్నాయని ప్రియాంక అన్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. కాగా, ప్రస్తుతం గోపాల్ కందా మద్దతుతోనే హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి

జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు కొత్త గవర్నర్లు వచ్చేశారు!

జమ్మూకశ్మీరు, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లు వచ్చేశారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేసిన కేంద్రం.. జమ్మూకశ్మీర్‌కు గరీశ్‌చంద్ర ముర్ము, లడఖ్‌కు రాధాకృష్ణ మాధుర్‌లను నియమించింది. ఈ మేరకు నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర వ్యయ విభాగ కార్యదర్శిగా ఉన్న గిరీశ్‌చంద్ర వచ్చే నెలలో రిటైర్ కానున్నారు. ఆయన గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఇక, రాధాకృష్ణ మాధుర్  త్రిపుర కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. గతంలో రక్షణశాఖ కార్యదర్శిగా, ముఖ్య సమాచార కమిషనర్‌గా పనిచేశారు. బీజేపీ కేరళ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు.

వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపాను.. హెచ్చరికలు జారీ

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 12 గంటల్లో తుపానుగా మారుతుందని, ఆపై అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.