Skip to main content

లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి


కృష్ణా నది కరకట్ట వెంబడి ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ కు ఒక్క అనుమతి కూడా లేదని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో లింగమనేని లేదా చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. బహిరంగ చర్చ ఎక్కడ ఏర్పాటు చేసినా తాను వస్తానని అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో దీనిపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు, మీడియా ముందు ఆధారాలతో వాస్తవాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

Comments