నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అమితాబ్ కీర్తికిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ కలికితురాయి అని అభివర్ణించారు. నటనలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్నారని, అంతటి గొప్ప వ్యక్తి సైరా సెట్లో ఎంతో నిరాడంబరంగా కనిపించారని పవన్ కొనియాడారు. సైరా సెట్లో ఆయన తనను పలకరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసిందని, మర్చిపోలేనిదని పేర్కొన్నారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment