Skip to main content

Posts

Showing posts from August 12, 2020

ఈ నెల 31 తర్వాత సమీక్ష జరిపి స్కూళ్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటాం: ఏపీ మంత్రి సురేశ్

 కరోనా కారణంగా విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కరోనా ప్రభావంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్ లైన్ లో క్లాసులను ప్రారంభించినప్పటికీ... ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం క్లాసులు ప్రారంభం కాలేదు. వచ్చే నెల 5వ తేదీన పాఠశాలలను ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలను, యూనిఫాంలను అధికారులు సిద్దం చేశారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభమవుతాయని జగన్ చెప్పారని... లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఈనెల 31వ తేదీ వరకు పాఠశాలలను ప్రారంభించకూడదనే కేంద్ర ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 31 తర్వాత కరోనా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవం సందర్భంగా నాడు-నేడు పనులను పూర్తి చేసి స్కూళ్లను ప్రారంభించాలనేది తమ ఆలోచన అని చెప్పారు. అయితే, 31వ తేదీన పరిస్థితిని సమీక్షిస్తామని మంత్రి చెప్పడంతో... కరోనా నియంత్రణలోకి రాని పక్షంలో స్కూళ్లు ప్రారంభం కాకపోయే పరిస్థితుల...

ఇక నా తండ్రి భారం ఆ భగవంతుడిదే!: ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ

 బ్రెయిన్ సర్జరీ తరువాత ఆసుపత్రిలో విషమ ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్న వేళ, ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. ప్రస్తుతం ప్రణబ్, న్యూఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. "గత సంవత్సరం ఆగస్టు 8. నా జీవితంలోని ఓ అత్యంత ఆనందకరమైన రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఆయన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఏడాది తిరిగేసరికి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఇక నా తండ్రి భారం ఆ దేవుడిదే. తనవంతుగా ఏం చేయాలో ఆ భగవంతుడు అన్నీ చేయాలి. జీవితంలో ఏర్పడే సంతోషాన్ని, కష్టాలను సమానంగా స్వీకరించేలా నాకు బలాన్నివ్వాలి. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని ఆమె ట్వీట్ చేశారు. కాగా, ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించిందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగిన తరువాత, వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాస్పిటల్ కు వ...

శ్రీదేవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి: ఉద్యమం ప్రారంభించిన అభిమానులు

 ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ ప్రారంభమైంది. అయితే, ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల క్రితం దుబాయ్‌లో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి కేసులో కూడా సీబీఐ విచారణ జరపాలని ఆమె అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ప్రారంభించారు.     దుబాయ్‌లో ఓ వేడుకకు వెళ్లి అక్కడే తాను ఉన్న హోట‌ల్ గదిలోని బాత్ ట‌బ్‌లో ప‌డి శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సందర్భంగా ఆమె మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె అభిమానులు ఇప్పటికీ  అనుమానాలను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.   సుశాంత్ మృతిలో సీబీఐ విచారణ కొనసాగుతుండడం, ఆగ‌స్టు 13న శ్రీదేవి జయంతి ఉండడం వంటి అంశాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులు సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి హ్యాష్ ట్యాగ్‌తో ఆమె మృతిపై విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఈ డిమాండ్ ఊపందుకోవడం గమనార్హం.  

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. వీరమరణం పొందిన జవాన్ -

 జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కంరాజీపొరా ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్‌ వీరమరణం పొందారు. మరో జవాన్ గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే గాయపడ్డ జవాన్‌ను స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. కంరాజీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. మిగతా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

మా వ్యాక్సిన్ ను పంపాలని ఇండియా కోరింది... పరిశీలిస్తున్నామన్న రష్యా!

  కరోనా మహమ్మారిని జయించే దిశగా తాము ముందడుగు వేశామని, తొలి వ్యాక్సిన్ తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పనితీరుపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు, ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ, రష్యాపై నమ్మకంతో ఈ వ్యాక్సిన్ ను తమకు అందించాలని ఇండియా సహా 20 దేశాలు కోరాయి. ఈ విషయాన్ని రష్యా స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, క్యూబా తదితర దేశాలు 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ ను కోరాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్డీఐఎఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) సహకారంతో ఈ వ్యాక్సిన్ తయారు కాగా, నేడు తొలిసారిగా 2 వేల మంది ప్రజలకు దీన్ని ఇవ్వనున్నారు. సెప్టెంబర్ లో వ్యాక్సిన్ తయారీని భారీ ఎత్తున ప్రారంభించి, ఈ ఏడాది చివరకు 20 కోట్ల డోస్ లను తయారు చేసి అందించాలని రష్యా లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ వ్యాక్సిన్ ఫార్ములాను అందిస్తే, తాము కూడా తయారు చేస్తామంటూ పలు దేశాల ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ర...

గడచిన వారం రోజులుగా భారత్ లో కరోనా వీర విజృంభణ: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

 గడచిన వారం రోజుల వ్యవధిలో ప్రపంచంలోని మొత్తం కరోనా కేసుల్లో 23 శాతం, మరణాల్లో 15 శాతం ఇండియాలోనే సంభవించడం ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాఖ్యానించింది. ఇండియాలో ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోందని, రోజువారీ కేసుల్లో, తొలి రెండు స్థానాల్లో ఉన్న అమెరికా, బ్రెజిల్ లను ఇండియా దాటేసిందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వెల్లడించాయి.  ఈ నెలలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ భారత్ లో 4,11,379 కొత్త కేసులు, 6,251 మరణాలు సంభవించాయని, ఇదే సమయంలో అమెరికాలో కేసుల సంఖ్య 3,69,575 కాగా, 7,232 మంది చనిపోయారని తెలిపింది. బ్రెజిల్ లో 3,04,535 కేసులు, 6,914 మరణాలు నమోదయ్యాయని, మరణాల విషయంలో మాత్రమే ఇండియా కొంత మెరుగైన గణాంకాలను చూపుతోందని వ్యాఖ్యానించింది. కాగా, నాలుగు రోజుల పాటు సగటున 60 వేలను దాటిన కేసులు నిన్న మాత్రం 52 వేలకు పరిమితం కాగా, మొత్తం కేసుల సంఖ్య 22.68 లక్షలకు చేరిన సంగతి తెలిసిందే. తొలి లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పట్టగా, ఆపై 10 లక్షల మార్క్ ను చేరుకునేందుకు 59 రోజులు మాత్రమే పట్టింది. ఆపై కేవలం 24 రోజుల్లోనే కేసుల సంఖ్య 22 లక్షలను దాటింది...

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

నిన్న మొన్నటి వరకూ కొండెక్కి కూర్చున్న విలువైన లోహాల ధరలు కొద్దిగా దిగొచ్చాయి. న్యూఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 1,317 తగ్గి రూ. 54,763కు చేరుకోగా, కిలో వెండి ధర ఏకంగా రూ. 2,943 తగ్గి, రూ. 73,600కు చేరింది. ఇదే సమయంలో ముంబైలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,564 తగ్గి, రూ. 53,951కి, వెండి ధర రూ. 2,397 తగ్గి రూ. 71,211కుచేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశవాళీ మార్కెట్ పైనా పడిందని బులియన్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ బలపడటం కూడా బంగారం ధరలను తగ్గేలా చేశాయని వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై నేడు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం

కరోనాకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని రష్యా ప్రకటించుకున్న నేపథ్యంలో, కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ నేడు కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇదే ప్యానల్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్దన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తదితరులు సభ్యులుగా ఉంటారు. కాగా, రష్యా చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆరోగ్య శాఖ నిరాకరించింది. రష్యా వ్యాక్సిన్ ను ఇండియాకు దిగుమతి చేస్తారా? అన్న ప్రశ్నపై భూషణ్ స్పందిస్తూ, వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడం, తయారీకి అవసరమైన నిధులు, ఎన్ని డోస్ లు అవసరపడతాయి అనే విషయాలను చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. అంతర్గత చర్చల ద్వారానే ...

కరోన టీకా వచ్చేసింది...

ఏటువంటి దుష్ప్రభావాలు లేవు.. త్వరలో అందరికి.. వీడియో చూడండి https://youtu.be/lcsrjXHE3uo