Skip to main content

సహకార బ్యాంకు కుంభకోణంలో శరద్‌పవార్‌పై కేసు నమోదు

Image result for SARAD PAWAR
మహారాష్ట్ర స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ కుంభకోణానికి సంబంధించి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌ఫవార్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) కేసులు నమోదు చేసింది. 25 వేల కోట్ల రూపాయిల కుంభకోణానికి సంబంధించి ఇ.డి. వీరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు (ఇసిఐఆర్‌) నమోదు చేసింది. ఇది పోలీసులు ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌తో సమానం. సహకార చక్కెర పరిశ్రమలకు రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Comments