విశాఖ భూకుంభకోణంలో ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కుంభకోణంలో టీడీపీ నేతలే ఎక్కువ ఉన్నారన్నారు. దీనిపై సిట్ విచారణ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలు కావని పేర్కొన్నారు. జిల్లాలో పెద్ద స్థాయిలో ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగిందన్నారు. టీడీపీ హయంలో సిట్ వేసినప్పుడు బాధ్యులపై ఎందుకు విచారణ జరగలేదని అడిగారు. ఈ సిట్ విచారణ ప్రజలకు నమ్మకం కలిగేలా పారదర్శకంగా ఉంటుందని వివరించారు. ఎప్పుడూ జరగని భూ కుంభకోణం విశాఖలో గత ప్రభుత్వ హయంలో జరిగిందని విమర్శించారు. మద్యం పాలసీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. మద్యాన్ని కట్టడి చేస్తున్న నేపథ్యంలో బయట రాష్ట్రం నుండి మద్యం రాకుండా కట్టడి చేస్తామని తెలిపారు.