త్వరలోనే, రిలయన్స్ జియో కొత్త ఫీచర్ ఫోన్ను తీసుకురానున్నట్లు చాలా నివేదికలు ప్రకటించాయి. అయితే, జియో తీసుకురానున్న ఫోన్ ఎలా ఉంటుంది ? ఎంత రేటుతో వస్తుంది ? అని సర్వత్రా చర్చలు జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి, ఈ ఫోన్ గురించి అధికారికంగా జియో నుండి ఎటువంటి ప్రకటన కూడా బయటకి రాకపోయినా, ఈ ఫోన్ గురించిన వార్తలు ఆన్లైన్లో జోరందుకున్నాయి. కానీ, ఈ ఫోన్ గురించి ప్రస్తుతం వినిపిస్తున్న చాలా వార్తలు కూడా నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే, దీని ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాత, ఒరిజినల్ జియో ఫోన్ గురించి ఒకసారి గుర్తుచేసుకుంటే, ఈ మొబైల్ ఫోన్ ను LTE సర్వీస్ తో రూ .999 ధరకు అందించినట్లు మనకు తెలుసు. అయితే, జియో ఫోన్ 2 ని తీసుకొచ్చిన తరువాత, ఈ ఫోన్ కేవలం 699 రూపాయల రేటుకే అమ్మడువుతోంది . అయితే, ఇప్పుడు కొత్త జియో ఫోన్ మోడల్ Jio Phone 3 స్థానంలో Jio Phone 5 ను సరసమైన మొబైల్ ఫోన్ గా మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 91 మొబైల్స్ నివేదికలో, జియో సంస్థ ఈ Jio Phone 5 కోసం విస్తృతంగా పనిచేస్తున్నట్లు చెప్పబడింది. అయ...