Skip to main content

Posts

Showing posts from October 2, 2019

పాక్ నుండి మాజీ ప్రధానికి ఆహ్వానం

నవంబర్‌ 12న సిక్కు మతవ్యవస్థాపకుడు అయిన బాబా గురునానక్‌ 550వ జయంతి సందర్బంగా నవంబర్‌ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించాలని పాక్‌ నిర్ణయం తీసుకున్నది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ని భారత్,పాకిస్తాన్‌ మధ్య మైలురాయి అనే భావన ఉంది.కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి ప్రస్తుత భారతప్రధాని మోదీకే ఈ ఆహ్వానం అందాల్సింది కాని భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించాలని పాక్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్‌ 370 రద్దు కారణంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ మోదీని కాదని మన్మోహన్‌ను ఆహ్వానిస్తున్నారు.

సీఏసీ పదవికి కపిల్ దేవ్ రాజీనామా

సీఏసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వ్యాఖ్యాతగా, భారతక్రికెటర్లసంఘం సభ్యుడిగా కొనసాగుతున్న మాజీ ఆటగాడు కపిల్‌దేవ్‌ తెలిపారు.ఇందుకు కారణాలని తెలుపని కపిల్‌దేవ్‌ పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై నోటీసుల రావడం వల్లే అని అతని సన్నిహితవర్గాలు తెలిపాయి. బీసీసీఐ టీమిండియా హెడ్‌ కోచ్‌తో పాటు క్రికెట్‌ సలహా మండలి(సీఏసీ)ని ముగ్గురుసభ్యులతో జులైనెలలో ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ నైతిక విలువల అధికారి అయిన జస్టిస్‌డీకే పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై వివరణఇవ్వాలని కపిల్‌దేవ్‌కి నోటీసులుపంపారు.ప్రస్తుతం కపిల్‌దేవ్‌నేతృత్వంలో క్రికెట్‌సలహా మండలి సభ్యలుగా వ్యవహరిస్తున్నారు

జగన్ భగీరథ యత్నం కృష్ణా పై 3 బ్యారేజీలు

కాళేశ్వరం మూడు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ తాగు సాగు నీటి అవసరాలు తీరుస్తున్న కేసీఆర్ బాటలోనే నడిచేందుకు జగన్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం భారీ వరదలతో పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీ కిందకు వందల టీఎంసీల నీరు వృథాగా పోయాయి.. పైగా సముద్రంలోని నీరు కూడా గోదావరిలోకి వచ్చి ఆ నీటితో డెల్టాలోని భూమి చౌడుబారుతోంది. వీటన్నింటిని చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్ భగీరథ యత్నానికి పూనుకుంటున్నారు. ప్రస్తుతం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ చివరన ఏ ప్రాజెక్ట్ లేదు. దీంతో కృష్ణా నీరంతా సముద్రంలో కలుస్తోంది. అది రైతులకు ప్రజల తాగునీటికి ఉపయోగపడకుండా పోతోంది.  అందుకే ఇప్పుడు పులిచింతల నుంచి సముద్రంలో కలిసే వరకూ కొత్తగా మూడు బ్యారేజీలు నిర్మించాలని జగన్ ఆదేశించారు.ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు డీపీఆర్ కోసం 8.78 కోట్లను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ కు జగన్ సర్కారు విడుదల చేసింది. ప్రస్తుతం కృష్ణా నదిపై చోడవరం - గాజులలంక - ఓలేరు వద్ద మూడు బ్యారేజీల నిర్మాణం కోసం జగన్ సర్కారు డీపీఆర్ సిద్ధం చేస్తోంది. దీనివల్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో సాగు - తాగునీటి అవసరాలను తీర్చవచ్చని జగన్ సర్కారు యోచిస్తోంది. అంతేకా...

నాసా సంచలనం.. అంగారకుడిపైకి శ్రీవారి పేరు

2020 జూలైలో అంగారకుడిపైకి మిషన్ మార్స్ రోవర్ ను పంపబోతున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.  ఇప్పటికే అక్కడికి పంపే రోవర్ లో ఓ మైక్రోచిప్ ను అమర్చింది. ఆ చిప్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సూచించిన పేర్లను నిక్షిప్తం చేసింది. ఈ చిప్ లో పేర్లను నిక్షిప్తం చేయడానికి ‘సెండ్ యువర్ నేమ్ టు మార్స్ ’అని నాసా సెప్టెంబర్ 30వరకు పేర్లను ఆహ్వానించింది. ఇందులో కోటిమందికి పైగా ప్రజలను పేర్లను పంపారు. నేషనల్ మిషన్ ఆఫ్ మాన్యస్ర్కిప్ట్ మాజీ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి నాసా వెబ్ సైట్ లో శ్రీవారి పేరును ప్రతిపాదించారు.వీటిలో అత్యధికంగా ప్రతిపాదించిన ‘తిరుమల శ్రీవేంకటేశ్వరుని’ పేరును నాసా ఎంపిక చేసింది. దీంతో ఇప్పుడు అంగారక గ్రహంపై పంపే రోవర్ లో శ్రీవారి పేరును నాసా నిక్షిప్తం చేసింది. మన తిరుమలేషుడు పేరు ఇప్పుడు అంగారక గ్రహంపై వెళ్లనుందన్నమాట.. గ్రహాలు దాటి వెళుతున్న శ్రీవారి  అద్భుతం చూడాలంటే మనం 2020 జూలై వరకూ ఆగాల్సిందే..

జనసేనకు గుడ్ బై చెప్పిన చింతల పార్థసారథి

గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా జనసేన తరఫున పోటీచేసిన చింతల పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పంపారు. పార్థసారథి ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆయనకు చాలా తక్కువ శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పార్థసారథిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఎంతో నమ్మకం ఉంచి ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు. అయితే కొంతకాలంగా పార్థసారథి పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి, మానిటరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా, పార్థసారథి ఏ పార్టీలో చేరతారన్నది ఇంకా స్పష్టం కాలేదు.

బతుకమ్మను ఉద్యమరూపంగా మార్చిన ఘనత సోదరి కవితదేనట: కేటీఆర్ ప్రశంస

తెలంగాణ పూల సంబురం బతుకమ్మ పండుగను ఉద్యమరూపంగా మార్చిన ఘనత సోదరి కవితేనని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు నేడు బతుకమ్మను సగర్వంగా జరుపుకుంటున్నారంటే దాని వెనక కవిత సారథ్యంలోని జాగృతి సంస్థ ఆనాడు చేసిన పోరాటం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతేనని కేటీఆర్ కొనియాడారు. అప్పటి సమైక్య పాలకులు ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మను ఆడకుండా అడ్డుకుని తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. అప్పుడు జాగృతి సంస్థ హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను ట్యాంక్‌బండ్‌పై సంబురంగా నిర్వహించిందని గుర్తు చేశారు. తన సోదరి కవితతోపాటు దశాబ్దకాలంగా జాగృతి సభ్యులు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేశారని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

పాకిస్థాన్ ఖాతాలో మరో అవమానం... నిజాం సంపదపై బ్రిటన్ కోర్టు కీలకతీర్పు

ఇటీవల కాలంలో పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా ఏదీ కలిసిరావడంలేదు. ఐక్యరాజ్యసమితిలోనూ, అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ భారత్ వాదనలకే మొగ్గు కనిపిస్తోంది. తాజాగా, 70 ఏళ్ల నాటి నిజాం సంపద కేసులో కూడా పాక్ కు పరాభవం తప్పలేదు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే... 1948లో 7వ నిజాం పేరు మీద లండన్ లోని ఓ బ్యాంకులో ఒక మిలియన్ పౌండ్ల నగదు డిపాజిట్ అయింది. నిజాం అప్పట్లో బ్రిటన్ లో పాక్ రాయబారి హబీబ్ ద్వారా ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయించారు. అయితే ఆ నగదు తమకే చెందుతుందని నిజాం వారసులు ముఖరం ఝా, ముఫకం ఝా వాదిస్తుండగా, అప్పట్లో తాము నిజాంకు ఆయుధాలు సరఫరా చేశామని, అందువల్ల ఆ సొమ్ము తమకే చెందాలని పాకిస్థాన్ వాదిస్తోంది. ఈ కేసులో నిజాం వారసులకు భారత్ దన్నుగా నిలిచింది. గత 70 ఏళ్లుగా ఈ కేసు హైకోర్టు ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో విచారణలో ఉంది. హబీబ్ కూడా నిజాం తనపై నమ్మకంతోనే ఆ నగదు పంపారని గతంలోనే చెప్పారు. ఎన్నో దశాబ్దాల పాటు సాగిన విచారణలు, వాదోపవాదాల దరిమిలా బుధవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సంపద నిజాం వారసులకే చెందాలని, పాక్ కు దీనిపై హక్కు లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వెస్ట్ మినిస్టర్ బ్యాం...

రిక్షావాలాను లక్షాధికారిని చేసిన 'వర్షం'!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు! ఈ రిక్షావాలా విషయంలో అది నిజం అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన గౌర్ దాస్ వర్షం కారణంగా లాటరీలో రూ.50 లక్షలు గెలుచుకోవడం అదృష్టం కాక మరేంటి? గౌర్ దాస్ నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ లో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సెప్టెంబరు నెలాఖరులో ఇతర రిక్షావాలాలతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే, విహారయాత్రకు వెళ్లే రోజున భారీ వర్షం కురిసింది. దాంతో ఆ యాత్ర క్యాన్సిల్ అయింది. రిక్షా యూనియన్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా, లాటరీలు అమ్మే ఓ వ్యక్తి ఎదురొచ్చి లాటరీ కొనాలంటూ వెంటపడ్డాడు. లాటరీ విలువ రూ.30 మాత్రమే కావడంతో, సరేనని చెప్పి ఓ లాటరీ కొనుగోలు చేశాడు. వారం క్రితం లాటరీ ఫలితాలు రాగా, గౌర్ దాస్ కొన్న లాటరీ నంబర్ కు రూ.50 లక్షల బహుమతి వచ్చింది. ఈ విషయం తెలిసి ఆ రిక్షావాలా ఆనందం అంతాఇంతా కాదు. అయితే, ఎవరికన్నా తెలిస్తే, ప్రమాదం అని భావించిన గౌర్ దాస్ కేవలం తన భార్యకు మాత్రమే లాటరీ గెలిచిన విషయం చెప్పాడు. అప్పటికప్పుడు ఆ లాటరీ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, ఈ విషయం మీ...

ఏపీపీఎస్సీ పనితీరుపై కీలకవ్యాఖ్యలు చేసిన బొత్స

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ తన నియోజకవర్గంలో స్థానిక సచివాలయాన్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సచివాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ పనితీరుపై విమర్శలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ గనుక పరీక్షలు నిర్వహించి ఉంటే ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పట్టేదని అన్నారు. ఎప్పుడు నియామకాలు పూర్తిచేస్తారో వారికే తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరగలేదని తెలిపారు. సచివాలయ నియామకాలపై విపక్షాలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు.

జిమ్ చేసిన రోజా.. వీడియో చూడండి!

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కాసేపు జిమ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే చిత్తురు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నేడు ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలతో కాసేపు వ్యాయామం చేశారు.

ఉగ్రసంస్థలను పాక్ కట్టడి చేయాలి.. లేకపోతే భారత్ పై రెచ్చిపోతాయి: అమెరికా ఆందోళన

భారత్ తో పాకిస్థాన్, చైనా సంబంధాలపై అమెరికా రక్షణ శాఖ ఇండో-పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ ష్రివర్ మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ లో ఉగ్రమూకలు ఇష్టానుసారం రెచ్చిపోయే ప్రమాదం ఉందని, వాటిని పాక్ కచ్చితంగా నియంత్రించాలని సూచించారు. పాక్ కట్టడి చేయకపోతే ఆ ఉగ్రసంస్థలు భారత్ పై దాడులకు పాల్పడే అవకాశముందని రాండాల్ ష్రివర్ ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ కు చైనా కేవలం దౌత్య, రాజకీయపరమైన మద్దతు మాత్రమే ఇస్తుందని భావిస్తున్నామని, చైనా కూడా భారత్ తో సత్సంబంధాలనే కోరుకుంటోందని ఆయన వెల్లడించారు. కేవలం కొన్ని అంశాల్లోనే పాక్ తో చైనా సన్నిహితంగా ఉంటోందని స్పష్టం చేశారు. కానీ, ఉగ్రసంస్థలను నిలువరించే విషయంలో పాక్ వైఖరిపైనే ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయని ష్రివర్ తెలిపారు. ఉగ్రకళ్లాలు పాక్ చేతిలోనే ఉన్నాయన్న విషయం ష్రివర్ వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ సమాజానికి మరోసారి వెల్లడైంది.

సొంత పార్టీవాళ్లు ఇబ్బందిపెడుతున్నారు... వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలు..

సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీ ఆరోపణలు చేశారు. చిలకలూరి పేటకు పట్టిన పీడను వదిలించాలని... పేకాటపై వాలిన అవినీతి గద్దలను తరిమివేయాలని జగనన్న పార్టీలో తాను చేరానని ఆమె అన్నారు. అయితే... కొన్ని దుష్ట శక్తులు తన కలలను చిదిమివేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. పట్టణంలోని ఎస్‌ఎంఎస్‌ గార్డెన్స్‌లో వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రజిని మాట్లాడుతూ నాలుగు నెలలక్రితమే గెలుపు రుచిచూసినా ఏరోజూ ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదన్నారు. ప్రతిపక్ష పార్టీతోనూ, మాజీ మంత్రితో ఎందాకైనా పోరాడవచ్చు. వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదని, మీకు అన్నీ తెలుసన్నారు. ఆడపిల్లనైనా తాను నాలుగువైపుల నుంచి శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతపార్టీలోని కొందరు నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.  నా అనుకున్నవాళ్ళు సైతం తనను అడ్డుకోవాలని, నియంత్రించాలని చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అందరి అండదండలు తనకు కావ...

హైకోర్టులో నవయుగ సంస్థకు ఎదురు దెబ్బ

బందరు పోర్టు ఒప్పందాన్ని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 66ను నిలిపి వేయాలని కోరుతూ గతంలో ఈ కాంట్రాక్టు దక్కించుకున్న నవయుగ సంస్థకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము ఏరకంగాను జోక్యం చేసుకోలేమని, ప్రాజెక్టు పనులకు సంబంధించిన వ్యవహారాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించుకోవచ్చని జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టెండరు ప్రక్రియ నిర్వహించుకోవచ్చని, బిడ్‌ మాత్రం ఖరారు చేయవద్దని తెలిపింది. ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాత పూర్తి వాదనలు వింటామని తెలిపింది.రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో భాగంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల బాధ్యత నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వైసీపీ ప్రభుత్వం ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నవయుగ అభ్యంతరం వ్యక్తం చెస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఎటువంటి నోటీసులుగాని, వివరణగాని కోరకుండా పనులను ఏకపక్షంగా రద్దు చేశారని ఆ పిటిషన్ లో పేర్కొంది. వాస్తవానికి అడ్డంకులను తొలగించి పనులు సజావుగా సాగేందుకు అవసరమైన 5,324 ఎకరాల భ...

చంద్రబాబు అలా కూడా అంటాడేమో... వైసీపీ ఎంపీ సెటైర్లు

ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మరోసారి తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. ఏపీలో అద్భుతంగా సాగుతున్న సీఎం జగన్ పాలన చూసిన చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లు ఎక్కువై తర్కానికి అందకుండా మాట్లాడే వ్యక్తి మున్ముందు ఏ నిందలైనా వేస్తాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. గ్రామ వలంటీర్లు కోళ్లను ఎత్తుకు పోతున్నారనో, పిల్లల దగ్గర చాక్కెట్లు లాక్కుంటున్నారనో అనడం గ్యారంటీ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. స్త్రీ జాతినే అవమానించినోడికి ఇటువంటివో లెక్కా అంటూ విమర్శించారు.

మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలు: ఏలూరు రేంజ్‌ డీఐజీ ఖాన్‌

చట్టవ్యతిరేకంగా వ్యవహరించి తప్పించుకు తిరుగుతున్న అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, ఏ క్షణమైనా ఆయనని అరెస్టు చేస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ ఎ.ఎస్‌.ఖాన్‌ తెలిపారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించడం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం వంటి పలు కేసులు ఆయనపై ఉన్నాయని చెప్పారు. ఇటీవల రాజమహేంద్రవరం కోర్టు స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా హర్షకుమార్‌ ఘటనా స్థలికి వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుష పదజాలంతో దూషించారని, అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించారని తెలిపారు. అక్కడి మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. దీనిపై జిల్లా కోర్టు పరిపాలనాధికారి మూడో పట్టణ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఐజీ వివరించారు. అలాగే, ఇటీవల గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారంటూ ప్రజల్ని, వ్యవస్థను తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన వద్ద ఉన్న సమాచారం ఇస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. అ...

గడప గడపకూ అభివృద్ధి ఫలాలు: జగన్‌

 ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే తీసుకు వెళ్లి అందించేందుకు ఉద్దేశించిన గ్రామ, వార్డు సచివాలయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరప గ్రామంలో ముఖ్యమంత్రి జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగులను సీఎం పలకరించారు. అంకితభావంతో పనిచేయాలని ఉద్యోగులకు జగన్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఒక్కోచోట 12 మంది వరకూ ఉద్యోగులను నియమించింది. ఈ సందర్భంగా జగన్‌ ప్రసంగించారు. ‘మహాత్మాగాంధీ అంటే అహింసా, సత్యాగ్రహం పదాలు గుర్తుకువస్తాయి. మహాత్ముడి ఆశయాలను అందరం స్మరించుకోవాలి. పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చాం. ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశాం. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ఉద్యోగాలను తీసుకువచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చాం. ఈ నాలుగు నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరెక్కడా జరిగి ఉండదు. తూర్పుగోదావరి జిల్లాలోనే 44,198 ఉద్యోగాలు ఇవ...

మహాత్ముడికి మోదీ నివాళి

దేశ వ్యాప్తంగా గాంధీ 150వ జయంతి వేడుకలు జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని  రాజ్‌ఘాట్‌లో పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దేశ మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్‌ఘాట్‌లో మోదీ నివాళి అర్పించారు. కాగా దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. శాంతి, సేవకు మార్గాన్ని చూపిన గొప్ప దార్శనికుడు జాతిపిత మహాత్మాగాంధీ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. ప్రపంచానికి వెలుగు చూపిన వ్యక్తి మహాత్ముడుంటూ కొనియాడారు. రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవను కొనియాడారు.

జగన్ పాలనపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు విమర్శలు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు విమర్శలు గుప్పించారు. సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు ఎందుకని అడిగారు. జగన్ పాలనలో అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని సూచించారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఇటీవలే అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

సైరా’పై ప్రశంసల జల్లు.. పక్కా బ్లాక్ బస్టర్: ట్విట్టర్ రివ్యూ

ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల కానుంది. ఏపీలో ఇప్పటికే బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. తెలంగాణలో ఉదయం 8 గంటలకు తొలి షో ప్రారంభం కానుంది. బాలీవుడ్‌లో గత రాత్రే జర్నలిస్టులకు ప్రత్యేకంగా ‘సైరా’ సినిమాను ప్రదర్శించారు. ఇక, అమెరికాలో ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చూసినవారు సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన వారు చిరంజీవి నటనకు ముగ్ధులవుతున్నారు. సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. సినిమాలోని డైలాగులు రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యుద్ధ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి జీవం పోశారని కొనియాడుతున్నారు. నయనతార, తమన్నాల నటన కూడా అద్భుతమని ట్వీట్లు చేస్తున్నారు.