Skip to main content

Posts

Showing posts from September 28, 2019

బ్యాంకర్లతో పలు అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిపిన సీఎం జగన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న‌ రెడ్డి అధ్యక్షతన 208 వ ఎస్ఎల్ బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. వివిధ పథకాల కింద ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు జగన్. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించుకోకూడదని అందుకోసం అన్ ఇన్ కంబర్డ్ బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. వడ్డీ లేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తుంది. ఈ విషయం లో బ్యాంకులు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సీఎం జగన్ తెలిపారు. మా ఆర్థిక శాఖతో టచ్ లో ఉండండి వడ్డీ లేని రుణాల కింద చెల్లించవలసిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం అని జగన...

త్వ‌ర‌లోనే స‌మ‌యం కుదింపుః రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయ‌ణ‌స్వామి

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామి తెలిపారు. ఈ సంద‌ర్భంగా శనివారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ మద్యం వలన అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం 450 షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అక్టోబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో 3500 షాపులను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీటిని నిర్వహించడానికి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలను చేసినట్లు మంత్రి తెలిపారు. ఎక్కడా అవినీతి జరగకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు వీటిని పర్యవేక్షిస్తారు. 678 కొత్త ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రపోజల్ పంపాము. మహిళలు, ప్రతిపక్షం వారు కూడా మద్య విధానానికి, దశలవారీ మద్య నిషేధానికి సహకరించాలి. బెల్టు షాపులు నిర్వహించే వారికి వేరే ఉపాధి కోసం కలెక్టర్లతో మాట్లాడాము. ధరల విషయంలో త్వరలో ఓ మంచి నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నిర్వహించే దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తాము. బార్ షాపుల సమయంపై కూడా చర్చిస్తున్నాము. త్వరలోనే కచ్చితంగా సమయం కుదింపు ఉంటుంది. బెల్టు షాపులు పెట్టకుండా కఠినమైన నిర...

బోటును వెలికితీసే పనులు కాకినాడకు చెందని ధర్మాడి సత్యానికి అప్పగింత

ఇటీవలే గోదావరి నదిలో బోటు మునిగిపోయి పెద్ద సంఖ్యలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొందరి ఆచూకీ తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద నిండు గోదావరిలో బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగింది సెప్టెంబరు 15న కాగా, గోదావరి నదీ గర్భం నుంచి ఇప్పటివరకు బోటును వెలికితీయలేకపోయారు. దాదాపు 300 అడుగుల లోతున ఉన్న బోటును వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా వెనుకంజ వేశాయి. అయితే కొందరు ప్రయివేటు వ్యక్తులు బోటును బయటికి తీస్తామంటూ ముందుకు వచ్చినా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే, తమపై విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బోటును ప్రయివేటు వ్యక్తులతోనే వెలికితీయించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. రేపటినుంచే బోటు వెలికితీత పనులు మొదలుకానున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రూ.22.70 లక్షలకు వర్క్ ఆర్డర్ జారీ చేశారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ లో కేసు నమోదు

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత్ పై నోరు పారేసుకున్నారంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ లో కేసు నమోదైంది. బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాకు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది ఇమ్రాన్ ఖాన్ పై చీఫ్ జ్యుడిషియల్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. అణుయుద్ధం తప్పదంటూ భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డారని ఓఝా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేవిగా ఉన్నాయని, ఓ వర్గానికి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ మేరకు పాక్ ప్రధానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్ల విచారణ... ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన దరిమిలా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనేకమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబరు 1 నుంచి పిటిషన్లపై విచారణ జరపనుంది.

పాన్ తో ఆధార్ అనుసంధానం... మరో మూడు నెలలు గడువు పొడిగింపు

కాస్త హెచ్చు స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయితే పాన్ కార్డు లావాదేవీలను మరింత భద్రతతో నిర్వహించేందుకు వీలుగా దాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వ ఇటీవలే నిర్ణయించింది. ఆ మేరకు పాన్ తో ఆధార్ అనుసంధానానికి సెప్టెంబరు 30 వరకు గడువు విధించింది. ఇప్పుడా గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో మూడు నెలలు గడువు పెంచుతూ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా విధించిన గడువు ప్రకారం వినియోగదారులు తమ పాన్ కార్డులను డిసెంబరు 31 లోపు ఆధార్ తో అనుసంధానించుకోవాలి.

కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ విధానాలను గమనించి మాట్లాడాలి: మల్లాది విష్ణు

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలకు దిగారు. వైసీపీ విధానాలను కన్నా గమనించి మాట్లాడాలని హితవు పలికారు. పూర్తిస్థాయిలో సామాజిక న్యాయం చేస్తున్నామని కన్నా గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో పారదర్శకమైన ఇసుక విధానం తీసుకువచ్చామని, తాము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 2 నెలల పాటు వర్షాలు కురిశాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి కన్నా ఎందుకు మాట్లాడరు? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ భవనంలో ఉన్నా కన్నా నోరువిప్పలేదని మండిపడ్డారు. వైసీపీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ చేస్తున్న విమర్శలకు జిరాక్స్ కాపీలా బీజేపీ విమర్శలు చేస్తోందని విష్ణు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుపై బురద చల్లేందుకే గవర్నర్ కు ఫిర్యాదు చేశారని అన్నారు.

మద్యం దుకాణాలు వద్దంటున్నా తెరుస్తారా? జగన్ ని మహిళలు నిషేధించడం ఖాయం: నారా లోకేశ్

ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని మహిళలు వేడుకొంటున్నా పట్టించుకోవడం లేదంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని ఆందోళనకు దిగినందుకు మహిళలనీ కూడా చూడకుండా వారిని రోడ్డుపైకి ఈడ్చి కొట్టిస్తారా? ‘మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమ్మల్ని మహిళలు నిషేధించడం ఖాయం జగన్ గారూ!’ అంటూ విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ఇళ్ల మధ్యలోనే సారా దుకాణాలు తెరుస్తున్నారని విమర్శించారు. తమ ఇళ్లల్లో పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు ఉన్నారని మహిళలు చెబుతున్నా జగన్ కనికరించడం లేదని విమర్శించారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 30న అపాయింట్ మెంట్ ఆర్డర్లు

వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సాయంతో పరిపాలన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఉద్యోగుల కోసం నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. కొన్నిరోజుల క్రితమే పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది. దీనిపై మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 30న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీఎం జగన్ చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇకపై ప్రజాపాలన స్థానిక సచివాలయాల ద్వారానే అందిస్తామని చెప్పారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాల్లో పౌరసేవలు ప్రారంభమవుతాయని, 72 గంటల్లో పూర్తయ్యేలా 10 సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఆ తర్వాత సేవలను మరింత పెంచుకుంటూ పోతామని విజయ్ కుమార్ వివరించారు. పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు మూడ్రోజుల్లోనే ఇస్తామని, డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలను వెంటనే ఇచ్చేస్తామని తెలిపారు. వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అమ్మ...

చంద్రబాబుకు ఎంతైనా అత్తని కదా! ఇల్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: లక్ష్మీపార్వతి సెటైర్లు

కేవలం నాలుగు నెలల పాలనలో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత జగన్ దేనని కొనియాడారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో చేసింది శూన్యం అని విమర్శించారు. పీపీఏలలో, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పైనా విమర్శలు చేశారు. ‘ట్విట్టర్’ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబు దే నంటూ సెటైర్లు విసిరారు. తెలుగులో మంచి సామెత ఉంది ‘ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటే, ఏం చెయ్యాలో తెలియక నక్క తోక ఎండబెట్టుకుందట’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. తాడేపల్లిలో ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని విమర్శించారు. కరకట్టపై ఉన్న ఇంట్లో చంద్రబాబు నివసించడంపై ఆమె విమర్శలు చేశారు. ‘కరకట్ట మీద ఉన్న నీ ఇల్లు పోతుందా? అది నీ ఇల్లా? నువ్వు కట్టావా? ఎవరిచ్చారో చెప్పు? మీ అమ్మగారు ఏమన్నా రాసిచ్చారా? లేకపోతే మీ నాన్న గారు ఏమన్నా వారసత్వ హక్కుగా తెచ్చి నీ పేరుతో రిజిష్టర్ చేసి పోయా...

అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1న జరపాలి

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న జరపాలంటూ ‘ఆంధ్ర మేథావుల ఫోరం’ ముఖ్యమంత్రి జగన్మోహన్ కి వినతిని సమర్పించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతిలో క్రింది అంశాలను ప్రస్తావించారు... అవి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేటి వరకూ విభజన తరువాత అవతరణ దినోత్సవం జరపటం ఆపివేసినదని.. మొదటగా జూన్ 2న ఆ దినోత్సవం జరపాలని నిర్ణయించగా తమ వేదిక నాడే తీవ్రంగా వ్యతిరేకించినదని తెలిపారు. వ్యవహారికంగా చూస్తే అక్టోబర్ 1 , 1953 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా ఆరోజు పుట్టినరోజుగా, నవంబర్ 1, 1956లో తెలంగాణతో వివాహదినం, అదే జూన్ 2 విడాకుల దినంగా మాత్రమే అవుతుందని తెలిపారు. అక్టోబర్ 1న ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా మేము గత ప్రభుత్వాన్ని అనేకసార్లు అడిగాము. స్పందన లేదని,  ఈ విషయమై తక్షణ చర్య తీసుకుని అవతరణ దినోత్సవం జరపవలసిందిగా జ‌గ‌న్‌ని కోరుతున్న‌ట్టు  ఫోరం ప్ర‌తినిధులు చెప్పారు.

గోదావరిలో మునిగిన బోటును అందుకే బయటికి తీయట్లేదు

గత కొద్దీ రోజుల కిందట గోదావరిలో బోటు ప్రమాదం గురించి మనకు తెలిసిందే. ఇన్ని రోజులు అయినా ప్రభుత్వం ఇంకా బోటును ఎందుకు బయటికి తీయలేదు అన్న విషయం పై మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ.. గోదావరిలో మునిగిన బోటును ఎందుకు బయటకు తీయట్లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బోటు బయటకు వస్తే లోపాలు బయటపడతాయనే భయపడుతున్నారని ఆరోపించారు.

జగన్ సర్కార్‌కు హెచ్చరిక.. సేవ్ ఆళ్లగడ్డ అంటున్న అఖిల!

జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం యాదవాడలో జరుగుతున్న యురేనియం ఖనిజం అన్వేషణ పనులను మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిల ప్రియ అడ్డుకున్నారు. ఆమె ఘటనాస్థలికి రావడంతో వెంటనే కాంట్రాక్ట్ సిబ్బంది పనులను ఆపేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన అఖిల.. ఏపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా యాదవాడలో యురేనియం ఖనిజాన్వేషణ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. యురేనియం కోసం సర్వే చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాగా.. వారం రోజులుగా యురేనియం ఖనిజం అన్వేషణ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని అఖిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి క్యాంపెయిన్! " యురేనియం వల్ల కడప జిల్లాలో వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు.. నీరంతా కలుషితమైంది. ‘సేవ్ నల్లమల... సేవ్ ఆళ్లగడ్డ’ క్యాంపెయిన్ నేటి నుంచే మొదలైంది. గతంలో వైసీపీ నాయకులు యురేనియం తవ్వకాలను వ్యతిరేకించారు. ఇప్పుడు మౌనంగా ఉండడం శోచనీయం.. అసలెందుకు మౌనంగా ఉంటున్నారు..?. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో యురేనియం ఖనిజాన్వేషణ పనులను ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలి. లేకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాను ...

చిరంజీవి రాజకీయ సలహాపై కమలహాసన్ స్పందన!

తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లకు మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక సూచన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యల పట్ల కమల్ స్పందించారు. గెలుపు, ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని కమల్ అన్నారు. మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయరంగంలోకి ప్రవేశించానని చెప్పారు. చిరంజీవి గతంలో తనకెప్పుడూ సలహాలు ఇవ్వలేదని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచన ధోరణిపై అవగాహన పెరిగిందని చెప్పారు.

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును పరామర్శించిన చంద్రబాబు

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అశోక్ గజపతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు అశోక్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చిక్కుల్లో లక్ష్మీ విలాస్ బ్యాంకు.. భారీ కుట్ర జరిగిందంటూ రెలిగేర్ ఫిర్యాదు

ప్రైవేటు రంగానికి చెందిన లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్‌ను బ్యాంకు దుర్వినియోగం చేసిందంటూ రెలిగేర్ ఫిన్‌వెస్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీలోని కన్నాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు బోర్డు డైరెక్టర్లపై మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. బ్యాంకుపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయమై బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్‌ఈ)కి సమాచారం అందింది. తాము చేసిన డిపాజిట్ దుర్వినియోగం వెనక భారీ కుట్ర ఉన్నట్టు అనిపిస్తోందని రెలిగేర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఎల్‌వీబీ కేంద్రంగా ఇది నడిచినట్టు ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు మొత్తం బ్యాంకు బోర్డుపైనా, లేక కొందరు డైరెక్టర్లపైనేనా అన్నది తెలియరాలేదు. ఎల్‌వీబీపై ఫిర్యాదుతో ఆ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా పతనం చెందాయి. ఎన్ఎస్‌ఈలో షేరు విలువ రూ.36.50 వద్ద, బీఎస్‌ఈలో రూ.36.55 వద్ద ముగిసింది.

తల్లి సుష్మా స్వరాజ్ చివరి కోర్కెను తీర్చిన కుమార్తె

బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చివరి కోరికను ఆమె కుమార్తె బన్సూరి తాజాగా నెరవేర్చారు. పాకిస్థాన్ చెరలో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించినందుకు గాను ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన రూపాయి ఫీజును చెల్లించి తల్లి చివరి కోరికను నెరవేర్చారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. కన్నుమూయడానికి గంట ముందు హరీశ్ సాల్వేతో మాట్లాడిన సుష్మా స్వరాజ్.. కేసు గెలిచినందుకు గాను చెల్లించాల్సిన ఫీజు ఒక రూపాయిని వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని ఇటీవల హరీశ్ గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుష్మ కుమార్తె బన్సూరి ఆ రూపాయి ఫీజును చెల్లించి తల్లి చివరి కోరికను తీర్చారు.

50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 రిజర్వేషన్లను కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా రిజర్వేషన్ల అమలుకు విధివిధానాలతో కూడిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ 50 శాతం రిజర్వేషన్లలో బీసీ, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పదవులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా... ఈ 50 శాతం రిజర్వేషన్లలో 50 శాతాన్ని మహిళలకు కేటాయించింది. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఈ రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలను జారీ చేసింది.

ఉగ్ర‌వాదుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న‌దెవ‌రు ?

ఐక్యరాజ్య‌స‌మితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర‌వాదుల‌కు పాకిస్థాన్ నెల‌నెల పెన్ష‌న్ ఇస్తున్న‌ద‌ని భార‌త్ ఆరోపించింది. యూఎన్‌లో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్ర‌సంగాన్ని భార‌త్ ఖండించింది. యూఎన్ లిస్టులో ఉన్న ఉగ్ర‌వాదుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న ఏకైక దేశం పాకిస్థాన్ అని భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి విదిశా మైత్రా తెలిపారు. ఆల్‌ఖ‌యిదా, దాయిశ్ సంస్థ‌ల‌కు నిధులు ఇవ్వ‌కూడ‌దని యూఎన్ ఆంక్ష‌లు విధించినా.. పాక్ మాత్రం ఆ సంస్థ ఉగ్ర‌వాదుల‌ను ఆదుకుంటోంద‌ని విదిశా తెలిపారు. ఇమ్రాన్ ప్ర‌సంగానికి ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా భార‌త్ రిప్లై ఇచ్చింది. అణుయుద్ధం వ‌స్తుంద‌ని హెచ్చ‌రించిన ఇమ్రాన్ వ్యాఖ్య‌లు ఆ దేశం అనుస‌రిస్తున్న ప్ర‌మాద‌క‌ర విధానాన్ని మాత్రం స్ప‌ష్టం చేస్తున్న‌ద‌ని, దాంట్లో ఎటువంటి రాజ‌నీతి లేద‌ని భార‌త్ ఆరోపించింది. యూఎన్ బ్యాన్ చేసిన 130 మంది ఉగ్ర‌వాదులు పాక్‌లోనే ఉన్నార‌ని, 25 ఉగ్ర సంస్థ‌లు కూడా అక్క‌డే ఉన్నాయ‌ని, దీన్ని ఆ దేశం అంగీక‌రిస్తుందా అని విదిశా ప్ర‌శ్నించారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి చెప్ప‌డం కాదు అని, 1971లో స్వంత ప్ర‌జ‌ల‌ను ఊచ‌కోత కోసిన తీరును ఇమ్రాన్ గుర్తు చేసుకోవాల‌ని భార...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భ సిద్ధం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమం కోసం టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో పవిత్రమైన దర్భను సిద్ధం చేశారు. దర్భతో తయారుచేసిన చాప, తాడును  టిటిడి డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్‌నాయుడు ఆధ్వర్యంలో అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌కు అందించారు. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో దర్భను వినియోగిస్తారు. ఈ దర్భను తిరుమలలోని కల్యాణవేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో పండిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది. ఈ దర్భను తిరుపతి సమీపంలోని వ‌డ‌మ‌ల‌పేట‌ వ్యవసాయ పొలాల గట్ల నుండి సేకరించారు. ఈ దర్భను సేకరించిన తరువాత 15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. ఈ దర్భతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడ‌ల్పు చాపను, 200 అడుగుల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.

జాతీయ స్ధాయిలో కీర్తి పతాకాన్నిఎగురవేసిన ప‌ర్యాట‌క శాఖ‌

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం జాతీయ స్ధాయిలో మరోసారి కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డులలో మూడింటిని కైవసం చేసుకోవటం ద్వారా రాష్ట్ర పర్యాటకం తన సత్తా చాటింది. కొత్త డిల్లీ వేదికగా జరిగిన ప్రత్యేక వేడుకలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఆంద్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆంధ్రప్రదేశ్ పర్యటక అభివృద్ది సంస్ధ నిర్వహణ సంచాలకులు ప్రవీణ్‌కుమార్  ఈ అవార్డులు అందుకున్నారు. మొత్తం మూడు విభాగాలలో జాతీయ స్ధాయి అవార్డులు దక్కించుకోగా ఉత్తమ పర్యటక రాష్ట్రంగా అత్యున్నత స్ధాయి పురస్కారం రాష్ట్రానికి రావటం విశేషమని ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక , క్రీడా యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామని, ఆ క్రమంలోనే తమ శాఖ ఈ పురస్కారాలను దక్కించుకుందన్నారు. ఆంగ్ల భ...