పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెక్ పెట్టే దిశగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్‌బై చెప్పిన రావి రామనాథంబాబును జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరిక విషయంపై దగ్గుబాటికి కనీస సమాచారం కూడా లేదని తెలుస్తోంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ల సమక్షంలో రామనాథంబాబును పార్టీలో చేర్చుకున్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న దగ్గుబాటి అక్కడ కనిపించలేదు. ఈ చేరిక విషయంలో దగ్గుబాటితో చర్చించిన దాఖలాలు కూడా లేవంటున్నారు. గత ఫిబ్రవరి వరకూ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేసిన రామనాథంబాబు.. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కుమారుడితో కలిసి దగ్గుబాటి వైసీపీలో చేరడం, దగ్గుబాటికి టికెట్ కేటాయించడంతో.. రామనాథంబాబు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన చేరికతో.. టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు కొంత బలం వచ్చింది. దాంతో ఆయన విజయం సాధించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు రామనాథంబాబును స్వయంగా జగన్ కండువాకప్పి పార్టీలో చేర్చుకోవ...