Skip to main content

Posts

Showing posts from August 3, 2020

కరోనా బారినపడిన దర్శకుడు తేజ

  తెలుగు చిత్ర పరిశ్రమ లో కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి కరోనా బారినపడ్డారు. తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బాధితుల్లో ఒకరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే తేజ కు తప్ప అందరికి నెగిటివ్ వచ్చింది .  ప్రస్తుతం తేజ హోమ్ క్క్వరంటీన్లో ఉన్నట్టు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ చేతికి టిక్ టాక్

టిక్ టాక్ ను కొనుగోలు చేస్తున్నాం సెప్టెంబర్ 15 కల్లా చర్చలను పూర్తి  చేస్తాం వాటాల కోసం ఇతర సంస్థలు కూడా ఆహ్వానిస్తుంది టిక్ టాక్ ను అమ్మేందుకు దాని మాతృ సంస్థ బైట్ డాన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. ఇప్పుడు అది నిజమవుతోంది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజి ల్యాండ్ లలో టిక్ టాక్ నిర్వహణ బాధ్యతలను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 15 నాటికి ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశముందంది. వాటాల కోసం ఇతర సంస్థలు కూడా ఆహ్వానిస్తుంది సమాచార భద్రతకు ముప్పు రాకుండా టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అమెరికాకు ఆర్థిక లాభం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అమెరికా పౌరుల డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలతో పంచుకోబోమని స్పష్టం చేసింది. అమెరికా సమాచారం పొరపాటున ఇతర దేశాల్లోని సర్వర్లలోకి వెళ్లి ఉంటే… వాటిని శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.

కరోనా ‘ఖతమైందా?’, చైనాలో ఇక బీర్ ఫెస్టివల్

చైనాలో ఏటా జరిగే బీర్ ఫెస్టివల్ ఈ నెల 1 న ప్రారంభమైంది. వేల మంది చైనీయులు కరోనా భయాన్ని, ఫేస్ మాస్కులను వదిలేసి బీర్ రుచి కోసం తహతహలాడుతున్నారు. ‘కింగ్ డావో ‘ పేరిట ఈ ‘బీరోత్సవం’ ఈ నెలాఖరు వరకు జరుగుతుందట. సుమారు 1500 రకాల బీర్ రుచులను ఆస్వాదించే చైనీయులు తాగుతూ, తింటూ షో లు చూస్తూ ఎంజాయ్ చేయడమే పనిగాపెట్టుకోనున్నారు. కేవలం ఒక్క సాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోనే వందలాది స్థానికులు పొడవాటి టేబుల్స్ ముందు కూర్చుని ‘బీరు పానం’ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి చైనాలో అసలు కరోనా వైరస్ ‘ఖత’మైనట్టే ఉందని విదేశీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తన దేశంలో కరోనా వైరస్ ని చాలావరకు నియంత్రించుకున్న చైనా.. ఇక వినోద కార్యక్రమాల పైనా దృష్టి పెట్టింది. అయితే రష్యా నుంచి వచ్చే తమ దేశీయులే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. ఇంపోర్టెడ్ కేసులతో తల్లడిల్లుతోంది.

రాముడి గుడి భూమి పూజకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా..!

    రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై... అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సరయూ నది ఒడ్డున ఉన్న సాకేతపురి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వెలుగు జిలులుగులతో ప్రకాశిస్తున్నశ్రీరామనగరిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నగరం మొత్తం స్వాగత తోరణాలు కడుతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి విచ్చేస్తున్న అతిరథ మహారథుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రామ జన్మభూమి శంకస్థాపన కార్యక్రమానికి తొలి ఆహ్వానం మాత్రం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి రామజన్మభూమి ట్రస్ట్ అందించినట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా వాదన వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. ఇక్బాల్ అన్సారీకి ముందు ఆయన తండ్రి హషీమ్ అన్సారీ.. బాబ్రీ మసీదు- రామజన్మభూమి వివాదంపై న్యాయ పోరాటం చేశారు. ఆయన 95 ఏళ్ల వయ...

ఇవాళ చేసిన రెండు పనులు మనసుకు ఎంతో

ఈ-రక్షాబంధన్ ప్రారంభించడానికి ముందు ఇవాళ ఉదయం ఆసరా, చేయూత వంటి మహిళలకు సాధికారత కల్పించే కార్యక్రమాలకు ఉపయోగపడే కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గేంబుల్, అమూల్ వంటి సంస్థల సహకారంతో బ్యాంకుల ద్వారా ప్రతి ఇంట్లో ఓ మహిళకు నాలుగేళ్ల పాటు నికర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇక ఈ-రక్షాబంధన్ లోగో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,  సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ-రక్షాబంధన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు రక్షణ ఎలాగన్నదానిపై నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై మహిళలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు ఉంటాయని అన్నారు. అందుకోసం 4ఎస్ 4యూ అనే పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సైబర్ నేరాలకు గురయ్యే మహిళలకు సైబర్ మిత్ర యాప్ ద్వారా, లేక దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేకపోతే నిర్దేశిత టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.  అంతేకాదు, ఈ-రక్షాబంధన్ కార్యక్రమంపై షార్ట్ ఫిలింలు, యానిమేషన్ క...

గెజిట్ పై హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును ఇటీవలే గవర్నర్ ఆమోదించగా, ఆ వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాజధాని రైతు పరిరక్షణ సమితి స్పందించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గెజిట్ అమలు నిలిపివేయాలని, సీఎం కార్యాలయం, రాజ్ భవన్, సెక్రటేరియట్ ను ఇక్కడి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును కోరింది. కాగా, ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.  

జనసేన ఎమ్మెల్యేతో పవన్ కల్యాణ్

అమరావతి రైతులకు టీడీపీ నేత బీటెక్ రవి సంఘీభావం ప్రకటించారు. ఈరోజు ఆయన అమరావతి ప్రాంతంలోని రైతుల నిరసన శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానులను నిరసిస్తూ తాను ఇప్పటికే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించానని... ఇప్పుడు ఛైర్మన్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా పదవులకు రాజీనామా చేయాలని కోరారు. రాజధాని ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారని... ముందు జనసేన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని అన్నారు. అమరావతి విషయంలో పవన్ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు

ఏపీ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా... భార్యకు కూడా పాజిటివ్..

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా బారినపడ్డారు. స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది.  కోన రఘుపతి భార్యకి కూడా కరోనా సోకింది. మైల్డ్ గా వచ్చిందని ఎవ్వరూ కంగారు పడొద్దని వైద్యుల సూచన మేరకు వారం రోజులు హోమ్ క్వారన్టైన్  లో ఉంటున్నామని ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని తెలిపారు

టిక్ టాక్ పై అధికారిక ప్రకటన చేసిన మైక్రోసాఫ్ట్

సస్పెన్స్ కు తెరపడింది. ప్రముఖ వీడియో మెసేజింగ్ యాప్ టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఓ మైక్రో బ్లాగ్ పోస్ట్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని తెలిపింది. టిక్ టాక్ ను కొనుగోలు చేసే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సవివరంగా ప్రకటనను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరాలను అర్థం చేసుకున్నామని... సమాచార భద్రతకు ముప్పు రాకుండా టిక్ టాక్ కార్యకలాపాలను స్వాధీనం చేసుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అమెరికాకు ఆర్థిక లాభం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అమెరికా పౌరుల డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలతో పంచుకోబోమని స్పష్టం చేసింది. అమెరికా సమాచారం పొరపాటున ఇతర దేశాల్లోని సర్వర్లలోకి వెళ్లి ఉంటే... వాటిని శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.  

Xiaomi కొత్త ఎత్తుగడ : స్మార్ట్ ఫోన్ లోపలే ఇయర్ ఫోన్స్

 కొత్త కొత్త ప్రయోగాలతో, ఇప్పటి వరకూ చాలా వినూత్నమైన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే తీసుకొచ్చిన షియోమీ, ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ ఫోన్ తీసుకురానున్నట్లు పక్కగా తెలుస్తోంది. ఎందుకంటే, Xiaomi కొత్త తరహాలో కనిపించేలా ఒక స్మార్ట్ ఫోన్ తయారు చెయ్యడానికి తీసుకున్న పేటెంట్స్ లో, వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ను ఫోన్ లోపలే అమర్చే విధంగా కొత్త విధానం పరిచయం చేయనున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, అండర్ స్క్రీన్ కెమెరా విధానాన్ని తీసుకొస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం, ఇటువంటి ప్రత్యేకతలతో, పూర్తి స్క్రీన్ స్మార్ట్ ‌ఫోన్ కోసం షియోమి పేటెంట్ చేస్తోంది. ఈ పేటెంట్ రెండర్స్ (నమూనా) ఫోన్‌ పైభాగంలో ఇయర్‌ బడ్స్‌ స్లాట్ ‌ను స్థూపాకార షాఫ్ట్ ‌లుగా చూపిస్తాయి, ఇది లౌడ్‌స్పీకర్ ‌గా కూడా ఉపయోగపడుతుందని కూడా అనిపిస్తుంది. ఊహించని విధంగా, చాలా చమత్కారంగా కనిపించే బోల్డ్ డిజైన్ ఐడియాల పైన ఆసక్తి చూపడం, షియోమికి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాల సార్లు కూడా సాధారణ స్మార్ట్ ‌ఫోన్ డిజైన్లను పక్కన పెట్టి,  Mi Mix మరియు Mix Alpha వంటి ఫోన్ ‌లను విడుదల ...

Vivo V19 : రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో అమ్మడవుతోంది

ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో విడుదల చేసినటువంటి Vivo V 19 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs.4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. Vivo V19 స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా పెద్దర్యామ్ మరియు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చెయ్యబడింది. ప్రస్తుతం అఫర్ చేస్తున్న Rs. 4,000 డిస్కౌంట్ తరువాత చాలా తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. Vivo అభిమానులకు శుభవార్త ! వివో సంస్థ, ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో విడుదల చేసినటువంటి Vivo V 19 స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు Rs.4,000 రూపాయల భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ Vivo V19 స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటుగా పెద్దర్యామ్ మరియు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చెయ్యబడింది. అంతేకాదు, ప్రస్తుతం అఫర్ చేస్తున్న Rs. 4,000 డిస్కౌంట్ తరువాత చాలా తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.             Vivo V 19  లేటెస్ట్ ప్రైస్ వివో వి 19 యొ...

త్రిభాషా సూత్రం అమలు చేయం : సీఎం పళనిస్వామి

కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంలోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఈ విధానం తమకు అత్యంత బాధా, విచారాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విధానాన్ని ఎంత మాత్రమూ అమలు చేయమని స్పష్టం చేశారు. ఆ నూతన విధానంపై మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘‘నూతన విద్యా విధానంలోని త్రి భాషా సూత్రం అత్యంత బాధాకరం. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయా విధానాల ప్రకారం రాష్ట్రాలను అమలు చేయనివ్వండి’’ అని సీఎం పళని స్వామి సూచించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

  నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుందన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తొడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానన్నారు. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియ చేశామని రమేష్ కుమార్ వెల్లడించారు.  హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీగా తిరిగి రమేష్ కుమార్‌ను నియమిస్తూ గత గురువారం అర్థారత్రి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. దీంతో ఆగ్రహించిన ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీ పదవీకాలాన్ని ‘సంస్కరణల’ పేరిట కుదిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తక్షణమే నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిందని ఆయనను తొలగించింది. అంతే కాదు.. మరో అడుగు ముందుకేసి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించింది. దీంతో నిమ్మగడ్డ న్యాయపోరాటానికి దిగారు. ఆయన విషయంలో ...

పవన్ కల్యాణ్ కు ఫ్రెండ్షిప్ డే శుభకాంక్షలు తెలిపిన రామ్ గోపాల్ వర్మ

ఇటీవలే పవర్ స్టార్ అనే చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తీవ్ర కలకలం రేపాడు. ట్విట్టర్ వేదికగా జనసేనాని పవన్ కల్యాణ్ కు వర్మ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపాడు. "పవన్ కల్యాణ్, మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు... అయితే సరైన వ్యక్తులతోనే!" అంటూ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి, వర్మ చాచిన స్నేహ హస్తానికి పవన్ కల్యాణ్ స్పందిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

వివాహితను వేధించిన వ్యక్తి.. బాధితురాలితో రాఖీ కట్టించుకుని రూ. 11 వేలు ఇవ్వాలంటూ కోర్టు విలక్షణ తీర్పు

వివాహితను వేధించిన కేసులో మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ విలక్షణ తీర్పు చెప్పింది. 30 ఏళ్ల వివాహిత ఇంటికి వెళ్లి వేధించిన కేసులో ఉజ్జయినికి చెందిన విక్రమ్ బాగ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. నిందితుడు బెయిలు కోసం అప్పీలు చేసుకోగా రూ. 50 వేల వ్యక్తిగత పూచీపై ఇండోర్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే, బెయిలు మంజూరు చేస్తూనే న్యాయమూర్తి రోహిత్ ఆర్య కొన్ని షరతులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రక్షాబంధన్ రోజైన ఆగస్టు 3న (నేడు) ఉదయం 11 గంటలకు తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి స్వీటు బాక్సుతో వెళ్లి ఆమెతో రక్షాబంధన్ కట్టించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఆమెకు ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటానని ప్రమాణం చేసి రూ. 11 వేలు ఇవ్వాలని, ఆమె కుమారుడికి రూ. 5 వేలు ఖర్చు చేసి దుస్తులు, స్వీట్లు కొనివ్వాలని, బాధితురాలి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.  

కరోనా బారినపడిన కర్ణాటక సీఎం.. ఆసుపత్రిలో చేరిన యడి

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (77) నిన్న కరోనా వైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సంక్రమించిన విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని సూచించారు. తనలో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు. తనకు కరోనా సోకినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నానని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. కాగా, నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తనకు కరోనా సోకినట్టు ట్వీట్ చేశారు.