Skip to main content

Posts

Showing posts from October 5, 2019

జగన్ వాగ్ధానం చేస్తే అది శాసనమే, చంద్రబాబువి నీచ రాజకీయాలు: మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ప్రశంసలు కురిపించారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎం జగన్ వాగ్ఘానం ఇస్తే అది శిలా శాసనమేనని చెప్పుకొచ్చారు. లక్ష 73వేల మంది ఆటోకార్మికులకు ఒకే మీట నొక్కి రూ.10 వేలు అందించిన ఘనత జగన్ దేనని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. నలభై ఏళ్ల క్రితం విజయనగరం జిల్లాగా ఏర్పడినప్పుడు ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నామని అయితే మూడు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీకేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అభివృద్దిపై దృష్టి సారించలేదని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విజయనగరం జిల్లా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు ఆనందపడ్డాం గానీ, తర్వాత వాటిని ఒక్క జీవోతో రద్దు చేశారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడంతో పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ అందుకు తగ్గట్లుగా మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో విజయనగరం జిల్లాలో 100 పనులకు ఒకేసారి శంకుస్థాపన జరగను...

బస్సుల్లో మహిళల రక్షణ కోసం 5,500మంది మార్షల్స్

 దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. దేశ రాజధాని నగరంలో తిరుగుతున్న బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించాలని నిర్ణయించినట్లు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. బస్సుల్లో మహిళల భద్రత కోసం మాజీ హోంగార్డులను మార్షల్స్ గా దీపావళి పండుగలోగా నియమిస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కనీసం మూడేళ్ల పాటు హోంగార్డులుగా పనిచేసిన వారికి మార్షల్స్ గా నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంరక్షణ బాధ్యత మార్షల్స్ దేనని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ప్రజారంజక చర్యలు తీసుకుంటున్నారు

చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో, అద్భుతంగా పనిచేస్తున్న ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మిస్సయిందనే చింతను వదిలేయవచ్చు, ట్వీట్ చేసిన ఇస్రో

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. అయినా నిరాశపడనవసరం లేదు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌ ఇప్పుడు అద్భుతమైన ఫొటోలను తీసి పంపుతోంది. ల్యాండర్ తో పాటు చంద్రుని దక్షిణ భాగ ఉపరితలం దగ్గరగా వెళ్లిన ఆర్బిటర్ మాత్రం అద్భుతంగా పనిచేస్తోంది. చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇస్రో చేసిన సాహసోపేత ప్రయత్నం నిరూపయోగం అయిందని భావిస్తున్న తరుణంలో ఆర్బిటల్ కొత్త ఆశలు రేపుతోంది. ఈ మేరకు ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో ట్వీట్‌ చేసింది. ఆర్బిటర్‌లో అమర్చిన ఎంతో కీలకమైన హై రిజల్యూషన్‌ కెమెరా ఈ ఫొటోలు తీసింది. కాగా చంద్రుడి నైసర్గిక స్వరూపం తెలుసుకునేందుకు ఈ ఫొటోలు ఉపయోగపడతాయని ఇస్రో తెలిపింది. ఆర్బిటర్‌ సెప్టెంబరు 5న చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫొటోలను తీసింది. దక్షిణ ధ్రువంలో 14 కిలోమీటర్ల వ్యాసం, 3 కిలోమీటర్ల లోతుతో ఉన్న 'బోగుస్లాస్కై ఈ' బిలాన్ని ఇస్రో గుర్తించింది . ఇందులో 5 మీటర్ల కన్నా తక్కువ వ్యాసమున్న రెండు చిన్న బిలాలను, 1 నుంచి 2 మీటర్ల ఎత్తున ...

మహిళా టూరిస్టు కోసం కాన్వాయ్ ఆపేసిన సీఎం.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసేందుకు తన కాన్వాయ్‌ని నిలిపివేసి మరీ ముందుకొచ్చారు. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన తొలుత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, అనంతరం తన కాన్వాయ్‌లో సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ఘటనపై వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఓ అధికారిక పర్యటన కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన సావంత్... దాబోలిమ్ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తూ జురాయ్ బ్రిడ్జివద్ద కాన్వాయ్ నిలిపివేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళా టూరిస్టు రోడ్డుపై పడిపోయినట్టు గుర్తించి హుటాహుటిన సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వృత్తిరీత్యా ఆయన డాక్టర్ కావడంతో ఆమెకు స్వయంగా వైద్య పరీక్షలు చేశారు. ఆమె గాయాలకు ప్రధమ చికిత్స చేసి తన కాన్వాయ్‌లోని ఓ కారులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ఘటనా స్థలంలో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుత ఇది వైరల్‌గా మారింది.

మోదీతో జగన్‌ భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. జగన్ కంటె ఒక రోజు ముందుగానె తెలంగాణా సీఎం కేసీఆర్ మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం 04.30కి మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై దాదాపు 45 నిమిషాలు చర్చించారు. ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ ఆహ్వానించారు. అలాగే పోవలవరానికి సంబంధించిన పెండిగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఇంకా విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమతో పాటు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలు ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్ విన్నవించారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారం తదితర విషయాలపై ప్రధానితో సమావేశంలో చర్చించినట్లు సమాచారం.రివర్స్ టెండరింగ్ , పీపీఏలు ఇతర ఒప్పందాలపై తీసుకుంటున...

చంద్రబాబు తీరు.. దొంగే దొంగ అన్నట్లుంది!

వైసిపీలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్‌ వార్‌ నడుస్తోంది. అసభ్యకర పోస్టుల వ్యవహారంపై ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్‌ చేశారు. విూడియాలో అసత్య ప్రచారానికి ఆధ్యుడు బాబేనని, ఆయన ఆరోపణలు చేయడం దొంగే దొంగ అరుస్తున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుకూల విూడియాను అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు బురదజల్లడం చంద్రబాబుకు నలభై ఏళ్లుగా అలవాటేనని విజయసాయి విమర్శించారు. వైసీపీ మహిళా నేతలను అత్యంత నీచమైన భాషతో తిట్టించారని ఆరోపించారు. ఇప్పుడు ఆయనదాకా వచ్చే సరికి తనే బాధితుడినన్నట్టు అనుకూల విూడియాలో శోకాలు పెడుతున్నాడన్నారు. తన వరకు వస్తే కానీ ఆ బాధేమిటే తెలియలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు నుంచే పచ్చవిూడియాలో అభూత కల్పనలు రాస్తూ ప్రజలను మోసం చేశారని విజయసాయి ఆరోపించారు. 1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ విూడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే సోషల్‌ విూడియా పోస్టింగులపై విూడియా కాన్ఫరెన్స్‌ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడని విమర్శ...

అవ్వా... ఇంతటి అసత్యపు కథనాలా..? ఓ వార పత్రికపై జేసికి పిర్యాదు చేసిన రూరల్ ఎమ్మెల్యే

తనపై ఓ వార పత్రిక అసత్యపు కథనాలు ప్రచురిస్తోందని రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు..తన పావు వచ్చిన అసత్య కథనాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిశారు.. కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా తనపై ఇటీవల ఓ వార పత్రిక అసత్య ప్రచారాలు చేస్తూ వార్తలు రాస్తున్నారని జేసికి వివరించారు. తనతో పాటు పోలీస్, విజిలెన్స్ అధికారులపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై విచారణ జరిపి నిజమని తేలితే తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.వార్త అబద్దమని తేలితే పత్రిక ఎడిటర్, పాత్రికేయుడిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా అంటూ వార్తలు రాస్తూ ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తున్నారని జెసి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్ట్ ఎస్టేట్ గా ఉన్న మీడియా.. ఒక వర్గానికి కొమ్ము కాస్తుందన్నారు.. ఒక్కరినే టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా వార్తలు రాయడం సరైన పద్ధతి కాదన్నారు.. ప్రభుత్వంపై కూడా ఒక వర్గం మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు.. వైసీపీ అ...

వైసీపీ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసిన ఎంపిడిఓ.. కేసు నమోదు చేసిన పోలీసులు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై రురల్ పోలీసులు కేసు నమోదు చేశారు..ఎమ్మెల్యేతో పాటు వైసీపి జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిపై నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అనుచరులతో కలిసి ఎమ్మెల్యే తన ఇంటిపై దాడికి దిగాడని, నివాసంపై దౌర్జన్యంపై చేశారని వెంకటాచలం ఎంపిడిఓ సరళ పోలీసులను ఆశ్రయించారు.. వెంకటాచలం మండలంలోని గొలగమూడి వద్ద ఓ ప్రైవేటు లే అవుట్ కు సంభందించి పంచాయితీ పైప్ లైన్ కనెక్షన్ కావాలని తనకు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఎంపిడిఓ సరళకు అప్లికేషన్ పెట్టుకున్నారు.. అయితే ఎంపిడిఓ బిజీగా ఉండటంతో ఆ అప్లికేషన్ పక్కన పెట్టారు. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు, నియామకాలు తదితర అంశాల్లో తాను తీరిక లేకుండా ఉంటడంతో వారి ధరఖాస్తును పరిశీలించడం ఆలస్యమైందని ఆమె పిర్యాదులో తెలిపింది. అయితే ఈనెల 1వ తేదీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ లో తనను బెదిరించారని శుక్రవారం రాత్రి ఏకంగా కల్లూరు పల్లిలోని తన నివాసం వద్దకు వచ్చి కరెంటు తీసివేయించారని ఆరోపించారు. ఇంట్లో ఉన్న తన కుటుంబసభ్యులను బెదిరించారని పోలీసులకు తెలిపిం...

తనకు బొత్స, సుచరిత తెలుసని బండ్ల గణేశ్ నన్ను బెదిరించాడు: నిర్మాత పీవీపీ

టాలీవుడ్ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేశ్ ల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం కారణంగా వీళ్లిద్దరూ పోలీసులను ఆశ్రయించి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2013, నవంబర్ లో ‘టెంపర్’ సినిమాకు ఫైనాన్స్ చేశామని, 2015, ఫిబ్రవరి 13న ఈ సినిమా రిలీజు అయిందని చెప్పారు. అయితే, ఈ సినిమా రిలీజు అయిన రోజున బండ్ల గణేశ్ తమకు రూ.7 కోట్లు తక్కువగా చెల్లించారని ఆరోపించారు. ఈ డబ్బు చెల్లించకుండా గత ఐదేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని, తమ ఉద్యోగస్తులను ఇబ్బందికి గురిచేయడం వంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. మోసం చేసే మనస్తత్వంతో తమకు కట్టుకథలు చెబుతున్నాడని, లీగల్ గా తాము తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక నిన్న సాయంత్రం తన నివాసం వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చారని, తాను వాళ్లకు తెలుసని చెప్పడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది లోపలకి అనుమతించారని అన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి పేరు కిశోర్ అని, ఇద్దరు ముస్లిం వ్యక్తులని చెప్పారు. బండ్ల గణేశ్ తరపున మాట్లాడాలని కిషోర్ అనే వ్యక్తి తనతో చెప్పాడని, వారి బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉందని...

తీహార్ జైలులో చిదంబరానికి అస్వస్థత!

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు ఈరోజు తరలించారు. అక్కడ సంబంధిత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఆయనను జైలుకు తరలిస్తారని సంబంధిత వర్గాల సమాచారం.   ఇదిలా ఉండగా, తీహార్ జైల్లో ఖైదీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సాధారణంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలిస్తుంటారు. కానీ, చిదంబరం విషయంలో మాత్రం ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఒకవేళ చిదంబరానికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే కనుక ఆయన్ని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుపత్రి, లేదా సఫ్దార్ జంగ్ ఆసుపత్రికి తరలించాలన్న కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి

టీఎస్సార్టీసీ కార్మికులకు ఇంకా అందని జీతాలు!

టీఎస్సార్టీసీ కార్మికులు ఇంకా తమ జీతాలు అందుకోలేదు. మామూలుగా ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి వారికి జీతాలు అందుతుంటాయి. అయితే, ఈ నెల అప్పుడే ఐదో తేదీ గడుస్తున్నా టీఎస్సార్టీసీ కార్మికులకు జీతాలు అందలేదు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వారికి జీతాల చెల్లింపులో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు దిగింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టింది. నాలుగు వేల మంది డ్రైవర్లు, రెండు వేల మంది కండక్లర్లను నియమించింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు

పోలవరం నిధులు .. వెనక్కి.. సీఎం ఢిల్లీకి..

నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరో సారి పోలవరం అంశం తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు పనుల కోసం సిద్ధమై, రాష్ట్ర ఖజానాకు చేరడం ఖాయమని భావించిన 3 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్రం నిలిపివేసింది. రాష్ట్ర ఆర్థికస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఈ మొత్తం విడుదలైతే కొంతమేరకైనా ఊరట లభిస్తుందని ఆర్థికశాఖ భావించింది. అనూహ్యంగా దానికి సంబంధించిన ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైన తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం అధికారయంత్రాం గాన్ని విస్మయపరిచింది. దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శనివారం ప్రధాని మోడీతో జరగనున్న భేటీలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. ఆ సమావేశంలో చర్చకు వచ్చినా, రాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమై పూర్తి వివరాలతో ఒక లేఖ రాయాలని ఆర్థికశాఖ అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పర్యవేక్షిస్తున్న పోలవరం అథారిటీకి కేంద్రం నురచి దాదాపు ఆరు వేల కోట్ల వరకు పాత బకాయిలు కేంద్రం నురచి రావాల్సి ఉరది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా ...

ఎంపీడీవో సరళ ఆరోపణలు అబద్ధం: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి దాడికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోటంరెడ్డి స్పందించారు. ఈ విషయమై మీడియాకు ఆయన వివరణ ఇచ్చారు. ఒక వెంచర్ కు సంబంధించి అనుమతి ఇవ్వలేదని తనపై దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపణలు చేస్తున్నారన్న దానికి ఆయన స్పందిస్తూ, ఆ ఆరోపణలు అబద్ధమని కొట్టిపారేశారు. ‘జరిగిన సంఘటనను దగ్గరగా చూస్తే మీకే నిజాలు తెలుస్తాయి. నెల్లూరు జిల్లాలో ‘నుడా’, ‘రేరా’.. రెండు సంస్థల అనుమతులు ఉన్న ఏకైక లే-అవుట్  అది ఒక్కటే. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. దానికి అధికారిక అనుమతులు ఇచ్చి కూడా చాలా కాలం అయింది. మూడు నెలలుగా వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే నేను ఎంపీడీవో సరళ గారికి ఫోన్ చేసిన మాట వాస్తవమే’ అని అన్నారు. వాటర్ కనెక్షన్ ఇవ్వొచ్చుగా అని తాను అడిగితే, ‘ఎమ్మెల్యేగారు ఇవ్వొద్దంటున్నారు సార్’ అని ఆమె సమాధానం చెప్పింది. ‘ఏ ఎమ్మెల్యే’ అని ప్రశ్నిస్తే, ‘మా ఎమ్మెల్యే గారు సార్’ అని ఆమె బదులివ్వడంతో ‘ మీ ఎమ్మెల్యే గారితో నేను మాట...

గోదావరిలో బోటు ప్రమాదంపై ఎంపీ హర్షకుమార్ పిటిషన్.. విచారిస్తున్న సుప్రీంకోర్టు

గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ హర్ష కుమార్ పిటిషన్ వేశారు. ఈ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంత వరకు ఆచూకీ లేకుండా పోయిన మృత దేహాలను వెంటనే వెలికి తీసేలా ఆదేశాలను ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. బోటు ప్రమాదం విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా తోడయ్యేలా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేయాలని విన్నవించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. మరోవైపు, బోటు ప్రమాదానికి సంబంధించి ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 90 మందికి పైగానే ఉంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, హర్షకుమార్ పై పోలీసు కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసు టీములు గాలిస్తున్నాయి.

పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆయనతో పాటు మాజీ సీఎఫ్ఓ మూర్తిలను అదుపులోకి తీసుకున్నారు. నిధులను దుర్వినియోగం చేశారంటూ టీవీ9 యాజమాన్యం రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ల అనుమతి లేకుండానే చెక్కులతో డబ్బులు డ్రా చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కోట్లాది రూపాయలను రవిప్రకాశ్ దుర్వినియోగం చేశారని తెలిపింది. రూ. 18 కోట్లకు పైగా కుంభకోణం చోటు చేసుకుందని తెలిపారు. వీరిపై సెక్షన్ 409, 418, 420, 509ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, పీఎస్ లో విచారణ జరుపుతున్నారు.

జనసేనకు బిగ్ షాక్….పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత

జనసేన పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందని కాపు నేత మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా పవన్‌ కల్యాణ్‌ తీరుపై అసహనంగా ఉన్న ఆయన.. పార్టీకి రాజీనామా చేశాసిన లేఖను పవన్ కు పంపించారు. పవన్‌ నేతృత్వంలోని జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో కొన్ని రోజులుగా పలువురు సీనియర్‌ నేతలు పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్‌ రాజు జనసేనకు గుడ్‌బై చెప్పారు. తాజాగా సత్యనారాయణ కూడా పార్టీని వీడటం ఆపార్టీకి పెద్ద ఎదురు దెబ్బే. కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్‌ పాలడుగు డేవిడ్‌ రాజు… కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. నాయకులందరూ పార్టీని వీడుతున్నా పవన్ మాత్రం తన మౌనాన్ని వీడలేదు.

ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చరిత్ర ఈయనది: చంద్రబాబు

మహిళా ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విధి నిర్వహణలో నిజాయతీగా ఉన్నందుకు ఓ మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్ధరాత్రి వేళ ఆ మహిళా అధికారి పోలీస్ స్టేషన్ కు వెళ్తే... కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు జంకారంటే... ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు చెప్పిన అక్రమాలను చేయకపోతే మహిళలు అని కూడా చూడరా? అని చంద్రబాబు నిలదీశారు. ఆమె ఇంటికి కరెంట్ కట్ చేస్తారా? నీటి కనెక్షన్ కట్ చేస్తారా? ఇంటి ముందే చెత్తకుండీ పెడతారా? టీవీ కేబుల్స్ తెంపేస్తారా? ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రికి ఇవేమీ కనబడవా? అని ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో ఒక ముస్లిం మైనారిటీ జర్నలిస్ట్ ను చంపుతానని ఫోన్ లో బెదిరించారని తెలిపారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జమీన్ రైతు సంపాదకుడిపై దౌర్జన్యం చేసారని మండిపడ్డారు. ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చరిత్ర ఈయనది అని అన్నారు. అప...

ఎంతమంది ఉద్యోగులను తీసేస్తారో మేమూ చూస్తాం.. తగ్గే ప్రసక్తే లేదు: తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. గత అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లో చేరాలని... విధుల్లో చేరని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ ఆర్మీసీ కార్మికులు ఏమాత్రం తగ్గలేదు. తమ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, సమ్మె విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని చెప్పారు. ఎంత మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందో తాము కూడా చూస్తామని అన్నారు. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మరోవైపు, ప్రైవేట్ వాహనాలను నడిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రైవేట్ వాహనాలను పెడుతున్నారని ఆరోపించార...

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ మరో చాన్స్!

గత రాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఉదయం కొందరు ఉన్నతాధికారులు సీఎంను కలువగా, సమ్మెను విరమించి, వెంటనే విధుల్లోకి రావాలని మరోసారి పిలుపునివ్వాలని సీఎం సూచించినట్టు సమాచారం. కార్మిక సంఘాల నేతలు సానుకూలంగా స్పందిస్తే, కొన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి, కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, కార్మికులు విధుల్లోకి వచ్చినా, రాకున్నా సాధ్యమైనన్ని ఎక్కువ బస్సులను తిప్పాలని కేసీఆర్ సూచించినట్టు ఓ అధికారి వెల్లడించారు. అద్దె బస్సుల కోసం సాయంత్రంలోగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయనున్న సంగతి తెలిసిందే.

టీఎస్‌ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 3 నిమిషాలకో మెట్రోరైలు

ఎస్‌ఆర్టీసీ కార్మికులు సమ్మె శంఖం పూరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నది. ముఖ్యంగా నగర రవాణా సౌకర్యంలో మెట్రోరైలు కీలకం కానున్నది. నగరంలో ప్రతీరోజు నడిచే 3వేల బస్సులు రోడ్డెక్కని నేపథ్యంలో 3 నిమిషాలకో మెట్రోరైలు నడిపించనున్నారు. అంతేగాకుండా ప్రతీ మెట్రోరైలు ఉదయం 5 గంటల నుంచి అర్థ్ధరాత్రి 12.30 గంటల వరకు నడిపించనున్నారు. ఆర్టీసీ అధికారులతో జేటీసీ పాండురంగనాయక్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జంటనగరాల పరిధిలోని వేలాది బస్సులు, క్యాబ్‌లను అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

నేటి సాయంత్రమే డెడ్‌ లైన్‌.,

– 6 దాటిందో ఉద్యగోం ఊడింది – సాయంత్రం 6 గంటలకు డిపోలో రిపోర్టు చేసిన వారే ఉద్యోగులు – చేయని వారు మాజీ ఉద్యోగులు – సంఘాలతో ఎలాంటి చర్చలు ఉండవు – సీఎం కేసీఆర్‌ కఠిన నిర్ణయాలు శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది. ట్రాన్స్‌ పోర్టు కమిషనర్‌ గా సందీప్‌ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని, క్రమశిక్షణ కాపాడాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఢిల్లీ పర్యటన ముగించుకు...