Skip to main content

Posts

Showing posts from October 6, 2019

50వేలమంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తారా?

ఏదైనా ఒక సంస్థ నష్టాల్లో ఉంటె ఆ సంస్థ నష్టాలను తగ్గించుకోవడానికి కొంతమంది ఉద్యోగులను తొలగిస్తుంది. అది మాములు విషయమే. అందుకు ఎవరూ అడ్డు చెప్పరు. కానీ ఏకంగా ఒకేసారి 50వేలమంది ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రభుత్వంతో అనుబంధంగా పనిచేసే సంస్థలు కూడా ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన సంఘటనలు లేవు. కానీ, మొదటిసారి తెలంగాణాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు సమ్మెపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు విధులకు హాజరైన 1200 మంది సిబ్బందిని మాత్రమే ఉద్యోగుల పరిగణిస్తామని, మిగతా వారిని విధుల నుంచి తొలగిస్తామని, వారు ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తింపబడరని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని, పండుగ సమయంలో ఇలా సమ్మె చేయడం వలన ఆర్టీసీకి మరింత నష్టం వస్తుందని, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలి అంటే ఇకపై ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు కూడా నడపాలని నిర్ణయించింది. తద్వారా ఆర్టీసీని లాభాల బాటలో నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే,...

పార్టీకి దూరం చెయ్యాలని చూస్తున్నారు.. - సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతల మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు.. తన అరెస్ట్ వెనుక పార్టీలోని కొందరి పాత్ర ఉందంటూ ఆరోపించారు.. వెంకటాచలం ఎంపిడిఓ సరళ నివాసంపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.. అనంతరం బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర దాగుందన్నారు.. పార్టీ నుంచి తనను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎంపిడిఓ సరళ ఇంటిపై తాను దాడికి పాల్పడలేదన్నారు.. తాను తప్పు చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.. ఇదే సమయంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు.. అధికారుల తీరుపై మండిపడ్డారు.. ఎంపీడీవో చేసిన ఆరోపణల్లో తన పాత్ర ఉందని తేలితే... షోకాజ్ నోటిస్ ఇవ్వకుండానే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయ్యమని సీఎం జగన్ ఆదేశిస్తే.. కొందరు ఉన్నతాధికారులు పక్షపాతంగా  వ్యవహరించారన్నారు.. ఎంపీడీవో ఇంటిపై దాడికి పాల్పడ్డానని నిరూపిస్తే ఆమెకు క్షమాపణ చెబుతానని ప్రకటించారు. ...

జగన్ ను చూసి నేర్చుకోవాలి... కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన జేఏసీ చీఫ్ అశ్వత్థామరెడ్డి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పండుగ సీజన్ లో సమ్మెకు దిగిన వారితో రాజీపడేది లేదని, కొత్తగా నియామకాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి దీటుగా స్పందించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ ను చూసి మన రాష్ట్రం నేర్చుకోవాలంటూ కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తమ పోరాటంలో ధర్మం, న్యాయం ఉందని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. తాము కూడా న్యాయపరంగానే ముందుకెళతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. అంతకుముందు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ సమ్మెలో పాల్గొన్నవారిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం.

జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ నేతల విమర్శలు

 ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. మోదీతో భేటీ అనంతరం ఆ వివరాలను మీడియాకు చెప్పకుండానే జగన్ వెళ్లిపోయారు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలు చెప్పడానికి వెళ్లారో? తనపై ఉన్న కేసుల మాఫీ కోసం వెళ్లారో? అంటూ జగన్ పై విమర్శలు చేశారు.వెంకటాచలం ఎంపీడీవో సరళపై ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రౌడీయిజం చేస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని అని ప్రశ్నించారు.

ప్రభుత్వం కావాలనే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టింది: జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి స్పందించారు. ప్రభుత్వం కావాలనే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని, ఆర్టీసీ ఆస్తులను దోచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని మూసివేసేందుకు సర్కారు కుట్రలకు పాల్పడుతోందని, విమానాలపై ఉన్న శ్రద్ధ ఆర్టీసీపై లేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టీఎస్సార్టీసీ సమ్మె.. హౌస్ మోషన్ పిటిషన్ పై ముగిసిన వాదనలు

టీఎస్సార్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేశారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా లేవని, సమ్మె చట్టబద్ధం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం కల్పించామని న్యాయమూర్తికి వివరించారు. తెలంగాణలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులపై ఈ నెల 10న నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని టీ-సర్కార్ కు, ఆర్టీసీ యాజమాన్యానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

చిరు వెంటే గంటా...!?

ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టినపుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహరించిన సంగతి తెలిసిందే. గంటా పార్టీ పటిష్టత కోసం తన వంతుగా క్రుషి చేశారు. దాని ఫలితంగా విశాఖ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దక్కారు. ఇక ఈ బలంతోనే గంటా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు మంత్రి పదవి సంపాదించారు. తరువాత చిరంజీవి రాజకీయ జీవితం అగిపోయింది. గంటా మాత్రం తన సైన్యంతో టీడీపీలో చేరి అక్కడ కూడా మంత్రి పదవి సంపాదించారు. ఇలా ఏడేళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన గంటాకు తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమితో బ్రేక్ వచ్చిపడింది. ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.అయితే ఆయన ఎపుడు చేరుతారు ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ ఇపుడు ఆయన చిరంజీవిని పట్టుకుని తిరుగుతుండడం వెనక మతలబు ఏంటన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. సైరా సక్సెస్ ఫంక్షన్ సందర్భంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మెగా పార్టీ ఇస్తే దానికి హాజరైన గంటా సందడి చేశారు. ఇక మహా నటుడు ఎస్వీయార్ విగ్రహావిష్కరణ తాడేపల్లిగూడేంలో జరిగితే చిరంజీవి వెంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన పక్కనే...

ఆర్టీసీలో సమ్మె ఉదృతం.సమ్మె ఆపాలని హైకోర్టులో పిల్.!

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రయాణికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని..సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు. అలాగే, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని పిల్ వేసిన పిటిషనర్ కోరారు.సాయంత్రం 4 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతించింది.అందువల్ల హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఓవైపు ప్రభుత్వం ఆల్రెడీ ఈ సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎట్టిపరిస్థితుల్లో సమ్మెను సమర్థించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సైతం... సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. తమ ఉద్యోగాలు ఊడిపోయినా సరే..తమ పోరాటం ఆగదంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూల దృక్పథంతో ఒప్పుకోవాలని కోరుతున్నారు.ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లేవారు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రయివేట్ ట్రావెల్స్ జనాలను నిలువుదోపిడీ చేస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం నుంచి స్వస్థలాలకు వెళ్...

హాట్ టాపిక్ గా మారిన చిరంజీవి 250 కార్ల మెగా టూర్ !

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నేడు తాడేపల్లిగూడెంలో విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ సభ అత్యంత ఘనంగా జరిగింది. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో 9 అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహా ఆవిష్కరణ కోసం చిరంజీవి ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు విమానాశ్రయంలో చిరంజీవికి పలు పార్టీలకు సంబంధించిన కీలక నేతలతో పాటు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరంజీవి తాడేపల్లి గూడెం చేరుకున్న దృశ్యం ఒక పొలిటికల్ రోడ్ షోలా జరిగింది అన్నవార్తలు వస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీల ఆరోపణ

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపణలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏపీ కోసం విడుదల చేస్తున్న నిధులను ‘నవరత్నాలు’ అమలు చేసేందుకు మళ్లిస్తోందని ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వం ఉపాధి హామీ కింద చేసిన పనుల బిల్లులను వైసీపీ ప్రభుత్వం ఆపి వేయడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని ఆరోపించారు. 2006లో నిర్వహించిన ఉపాధి హామీ నియామకాలను కాదని ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లను నియమించిందని విమర్శించారు. గ్రామ సచివాలయాలకు రంగులు మార్చి వైసీపీ పార్టీ కార్యాలయాలుగా మారుస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ తీరుతో పండగ పూట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: ఎంపీ కోమటిరెడ్డి

సీఎం కేసీఆర్ తీరుతో పండగపూట ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండలో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేయాలని కేసీఆర్ చూస్తున్నారని, సమస్యలు పరిష్కరించకుండా వారిని బెదిరించడం దారుణమని మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వేల కోట్లతో అవసరం లేని భవనాలు కడుతున్న కేసీఆర్ కు ఆర్టీసీని ఆదుకునేందుకు నిధులు లేవా? అని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు తొలిదెబ్బ కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

తమ ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల భాగస్వామ్యం విస్మరించలేనిదని, ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆర్టీసీ ఉద్యోగులు కూడా పోరాడారని రేవంత్ వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ చీఫ్ హోదాలో ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని మీరు కూడా అభినందించారని, తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మార్పు తెస్తానని హామీ ఇచ్చారని కేసీఆర్ కు గుర్తు చేశారు. "ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేసిన వారిలో మీరు కూడా ఉన్నారు. కానీ మీరు పాలన చేపట్టాక ఆర్టీసీని పట్టించుకోవడం మానేశారు. సీఎం అయ్యాక ఊసరవెల్లి స్థాయిలో రంగులు మార్చేశారు" అంటూ విమర్శించారు.

టెస్టు చాంపియన్ షిప్ లో ఎవరికీ అందనంత ఎత్తులో టీమిండియా

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టెస్టు క్రికెట్ లో అద్వితీయంగా రాణిస్తోంది. వైజాగ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచే అందుకు నిదర్శనం. అన్ని రంగాల్లోనూ రాణించి సఫారీలను 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ షురూ అయింది. ఇక మీదట ఆయా దేశాలు ఆడే టెస్టు మ్యాచ్ లు వరల్డ్ చాంపియన్ షిప్ లో భాగంగానే నిర్వహిస్తారు. ఈ క్రమంలో చాంపియన్ షిప్ మొదలయ్యాక భారత్ ఆడిన 3 టెస్టుల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇటీవలే విండీస్ గడ్డపై రెండు టెస్టుల్లోనూ జయభేరి మోగించిన భారత్, ఇప్పుడు సొంతగడ్డపైనా అదే ఒరవడి కొనసాగించింది. తద్వారా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 160 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ద్వితీయస్థానంలో ఉన్న న్యూజిలాండ్ కు, టీమిండియాకు మధ్య 100 పాయింట్ల అంతరం ఉంది. కివీస్ ఖాతాలో 60 పాయింట్లే ఉన్నాయి. అటు శ్రీలంక కూడా 60 పాయింట్లు సాధించింది. బలమైన టెస్టు జట్లుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా, ఇంగ్...

విశాఖ టెస్టు లో భారత్ ఘన విజయం

విశాఖపట్టణం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై 203 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం దక్కించుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత్ నిలిచింది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులతో మయాంక్ అగర్వాల్ రాణించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రోహిత్ శర్మ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్-  502/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్- 323/4 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్-  431, రెండో ఇన్నింగ్స్- 191 ఆలౌట్

బస్సును ఆపి యువతి టిక్ టాక్... తెగ వైరల్ అవుతున్న వీడియో

కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సుకు ఎదురెళ్లి, దాన్ని ఆపి, ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ టిక్ టాక్ చేసిన ఓ యువతి ఇప్పుడు కష్టాల పాలైంది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు పబ్లిక్ న్యూసెన్స్ కింద పోలీసులు ఆమెపై కేసును నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పుణె నగరంలో ఆసాబ్ సార్, బైక్రేయి నగర్ మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును ఓ యువతి ఆపింది. ఆపై వెంటనే తనలోని కళాకారిణిని బయటకు తీసి, డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అయింది. దీనిపై స్థానిక పోలీసులు స్పందించి, ఆమెపై కేసును నమోదు చేశారు.

ఆర్ఆర్ఆర్' టైటిల్ సీక్రెట్ లీక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి 'ఆర్ఆర్ఆర్' అన్న వర్కింగ్ టైటిల్ ను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సరిపోయే టైటిల్ ను చెప్పాలని ఫ్యాన్స్ ను రాజమౌళి కోరగా, ఎన్నో టైటిల్స్ వచ్చాయి. వచ్చే సంవత్సరం వేసవిలో జూలై 30న ఈ సినిమా విడుదలకు సిద్ధంకాగా, చిత్ర టైటిల్ కు సంబంధించిన ఓ లీక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిత్రానికి 'రామ రౌద్ర రుషితం' అన్న టైటిల్ ను రాజమౌళి సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఇక ఇతర భాషల కోసం 'రైజ్ రివోల్ట్ రివెంజ్' అన్న టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఫరూ‌క్ అబ్దుల్లాను కలిసిన ఎన్సీ ప్రతినిధి బృందం

జమ్మూ:  నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఆ పార్టీకి చెందిన 15 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఆదివారంనాడు కలుసుకుంది. రెండు నెలలుగా గృహనిర్బంధంలో ఉన్న ఫరూక్‌ను ఆయన నివాసంలో ప్రతినిధి బృందం కలుసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ సింగ్ రాణా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ ఉదయం శ్రీనగర్‌కు చేరుకుని నేరుగా ఫరూక్ నివాసానికి వెళ్లింది. ఫరూక్‌ను కలుసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎన్సీ ప్రతినిధి బృందం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కోరడంతో ప్రభుత్వ యంత్రాగం అందుకు అనుమతించింది.

బోటు వెలికితీతపై స్పందించిన మంత్రి అవంతి

రాజమండ్రి:  రాయల్ వశిష్ట బోటు వెలికితీతపై టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. బోటు ప్రమాదాన్ని ఇప్పటికీ కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. విషాద ఘటనపై రాజకీయాలు వద్దన్నారు. తనకు బోటు ఉన్నట్లు నిరూపిస్తే దానిని రాసిచ్చేస్తానన్నారు. బోటు వెలికితీతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. బోటును బయటకు తీసే వరకూ మానవ ప్రయత్నాలు కొనసాగిస్తామని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఎస్వీఆర్ ఉండుంటే శ‌భాష్ అనేవారు : చిరంజీవి

తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ``ఎస్‌.వి.రంగ‌రావుగారు నా అభిమాన న‌టుడు. ఆయ‌న‌తో మా తండ్రీగారికి న‌టించే అవ‌కాశం ద‌క్కింది. నాన్న‌గారు ఆయ‌న న‌ట‌నా కౌశ‌లం గురించి నాతో ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయ‌న న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ కార‌ణంగానే ఇప్ప‌టికీ అంద‌రి మ‌దిలో నిలిచిపోయారు. ఆయ‌న న‌ట‌నలోని గొప్ప‌ద‌నం వ‌ల్లే ఆయ‌న‌కు జ‌కార్తా అవార్డు వ‌చ్చింది. అలాగే ఆయ‌న న‌టుడిగా ఇచ్చిన‌ స్ఫూర్తితోనే నేను మ‌ద్రాసుకు వెళ్లాను. ఏడాది నుండి ఈ జిల్లాకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే ఇప్ప‌టికి కుదిరింది. న‌న్ను మీ బిడ్డ‌గా ఆద‌రిస్తున్నాను. అక్కున చేర్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఓ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి క‌థ‌ను సినిమాగా చేశాను. ఆ సినిమాను అంద‌రూ ఆద‌రిస్తున్నారు. య‌స్‌.వి.రంగారావుగారు ఉండుంటే శ‌భాష్ అని న‌న్ను మెచ్చుకుని ఉండేవారు`` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్ల‌మెంట్ స‌భ్యుడు ర‌ఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పైడి కొండ‌ల మాణిక...

జగనే అరెస్ట్ చేయించారు... మా నేతంటే అంతే...: బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత కోటంరెడ్డి!

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నది తమ అధినేత వైఎస్ జగన్ నమ్మకమని, ఆ నమ్మకమే తనను అరెస్ట్ చేయించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీడీఓ సరళ పెట్టిన కేసులో ఈ తెల్లవారుజామున కోటంరెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన అధికారులు, ఆపై ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, బెయిల్ మంజూరైంది. అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి, ఆధారాలుంటే, తమ పార్టీ నాయకుడైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారని, అటువంటి వ్యక్తి కలకాలం పాటు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఈ కేసులో పూర్తి విచారణ జరిపించాలని పోలీసులను కోరుకుంటున్నానని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తన దురదృష్టం కూడా ఉందని, జిల్లా ఎస్పీకి, తనకు విభేదాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని, డీజీపీ నుంచి ఆదేశాలు రాగానే ఆయన ఏ మాత్రమూ విచారించకుండా తనను అరెస్ట్ చేయించారని కోటంరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన...

ఏపీ డిప్యూటీ సీఎం,కలెక్టర్ కలిసి సినిమాలో నటిస్తున్నారంట

credit: third party image reference ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మరియు కలెక్టర్ హరిజవహర్ లాల్ ఇద్దరు ఒక సినిమాలో నటించనున్నారు.విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడలో మూవీ షూటింగ్ జరుపుతున్నారు.ఒక వైపు సినిమా లో నటిస్తూనే మరో వైపు తమ నిధులను నిర్వహిస్తున్నారు. credit: third party image reference ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను తెలుపుతూ  అమృత భూమి  అనే సినిమా చేస్తున్నారు.ప్రజలకు సందేశం ఇచ్చే సినిమా కాబట్టి డిప్యూటీ సీఎం నటించిటానికి ఒప్పుకున్నారు.కలెక్టర్ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తునరని చెప్పారు.పుష్ప శ్రీవాణి ఒక టీచర్ కారెక్టర్ చేస్తున్నారు.ఈ సినిమాకి ప్రముఖ రచయిత వంగపండు ప్రసాదరావు కథను అందించారు.

సడెన్‌గా బ్యాంకాక్‌కి రాహుల్ గాంధీ... కారణం అదేనా...

 ఈ నెల చివర్లో ఎన్నికలు జరగబోయే... మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి సమయంలో... పోరాడాల్సిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ... శనివారం సడెన్‌గా బ్యాంకాక్ ట్రిప్‌కి వెళ్లిపోయినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీయే అధికారంలో ఉంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా రెండు రాష్ట్రాల్లో బీజేపీయే దుమ్మురేపింది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తోడుగా ఉంటూ... పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది. ఆల్రెడీ మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉన్నందువల్ల... నేతలు కూడా రాహుల్ సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తుంటే... ఆయనేమో... బ్యాంకాక్ వెళ్లిపోవడం... రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది.
వైసీపీ వెనక్కి తగ్గిందా? కరకట్టపై కూల్చివేతలు ఆగినట్లేనా? ఏపీలో అధికారంలోకి రాగానే... వైసీపీ ప్రభుత్వం అత్యంత ఆవేశంగా... టీడీపీ అప్పటివరకూ వాడుకున్న ప్రజావేదికను కూల్చివేసింది. రూ.40 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని నేలమట్టం చెయ్యడమే కాక... కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారమే... ఇటీవల అధికారులు... టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న ఇల్లు సహా... అక్రమ నిర్మాణాలకు నోటీసులు పంపారు. వారంలోగా ఖాళీ చెయ్యాలన్నది ఆ నోటీసుల్లో సారాంశం. దాంతో ఈ విషయం రాజకీయంగా కలకలం రేపింది. అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని వైసీపీ నేతలు, కూల్చడానికి వీల్లేదని టీడీపీ నేతలూ వాదించారు. ఇంతలో... వారం గడిచిపోయింది. మరో మూడ్రోజులు కూడా అయిపోయాయి. కానీ... కూల్చివేతలు మాత్రం మొదలవ్వలేదు. కారణమేంటి? కూల్చివేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన వైసీపీ ఇప్పుడు ఎందుకు సైలెంటైపోయింది? వైసీపీ మౌనం వెనక టీడీపీ రాజకీయ ఎత్తుగడ ఉందని తెలుస్తోంది. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలున్న కొందరు టీడీపీ నేతలు... ఇటీవల బీజేపీలో చేరారు. తమ ఇళ్లను కూల్చనివ్వకుండా అడ్డుకోవాలని పార్టీ హైకమాండ్‌ని కోర...

ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. 729 మందిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. సమ్మె కార్మికుల హక్కు అని అన్నారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమనీ, కార్మికులు కాదన్నారు. రాయితీల డబ్బును ప్రభుత్వం చెల్లించాలని కోరారు. ఏపీలో ఆర్టీసీ విలీనమైందని గుర్తు చేశారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోవద్దని కోరారు. 2013లో ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఆర్టీసీ విలీనంపై ఉత్తర్వులు వెలువడ్డాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినందున ఆ ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. ఆర్టీసీ విలీనం అన్నది కొత్త డిమాండ్‌ కాదన్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసీఆర్‌ చొరవ చ...

వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం ఉదయం పోలీసులకు లొంగిపోయారు. తన ఇంటిపైకి వచ్చి ఎమ్మెల్యే బెదిరించి గొడవ చేసారని మహిళ ఎంపిడివో సరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు గత రాత్రి నుంచి ప్రయత్నాలు జరిగాయి. ఆయన ఇంటిదగ్గర హైడ్రామా జరిగింది. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే ఇంటిదగ్గర పోలీసులు అయన కోసం వేచి చూశారు. ఆయన లేకపోవడంతో రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు. కాగా ఈ ఉదయం కోటం రెడ్డి డైరెక్ట్ గా పోలీసులకు లొంగిపోయారు. రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది. ప్రైవేట్ అపార్ట్మెంట్ పంచాయితీ పైప్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోగా, గ్రామ సచివాలయ పరీక్షల ఉన్నందువలన ఆయన దరఖాస్తుకు సంబంధించిన విషయాలను పరిశీలించేందుకు ఆలస్యం అయ్యింది. దీంతో ఆయన ఎంపిడివో ను బెదిరించారట. దీంతో ఆమె తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పు చేస్తే ఎవరైనా సరే ఒక్కటే అని ముఖ్యమంత్రి ను...