Skip to main content

Posts

Showing posts from October 8, 2019

కేబుల్ టీవీ చందాదారులకు ఇప్పుడు 150 ఛానెల్స్ ఇప్పుడు రూ .130 మాత్రమే!

100 ఛానెళ్లకు బదులుగా రూ .130 ఎన్‌సిఎఫ్ ఛార్జీకి వినియోగదారులకు 150 స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డి) ఛానెళ్లను వినియోగదారులకు అందించాలని ఎఐడిసిఎఫ్ నిర్ణయించింది. 100 ఛానెల్‌లను పొందాలనుకునే చందాదారుల కోసం 25 ఛానెల్‌లకు అదనంగా రూ .20 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ సంవత్సరం ప్రారంభంలో డిటిహెచ్ మరియు కేబుల్ నెట్‌వర్క్‌ల కోసం కొత్త టారిఫ్ పాలనను తీసుకువచ్చింది. ఈ కారణంగా, డిటిహెచ్ మరియు కేబుల్ టివి చందాదారుల నెలవారీ చందా ఖర్చులు పెరిగాయి. credit: third party image reference ఒక వినియోగదారు చెల్లించాల్సిన నెలవారీ సభ్యత్వ ఖర్చులను తగ్గించడానికి కొత్త పాలనను అమలు చేశారు, కాని ఖర్చులు పెరగడం వల్ల, కొత్త పాలన ఎదుర్కొంటున్న లోపాలను తీర్చడానికి TRAI అప్పటి నుండి దిద్దుబాటు చర్యలను అమలు చేస్తోంది. credit: third party image reference ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (AIDCF) ఇప్పుడు ఒక చిన్న ధర మార్పును అమలు చేసింది, ఇది చందా ఖర్చులను తగ్గించటానికి సహాయపడుతుంది. 100 ఛానెళ్లకు బదులుగా రూ .130 ఎన్‌సిఎఫ్ ఛార్జీకి విన...

ఆర్టీసీ భూమలు లీజులు బయటపెట్టండి

భూములు కాజేసేందుకే ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర మండిపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. డీజిల్‌పై పన్నులతో ఆర్టీసీ కుదేలవుతోందన్నారు. విమానాల ఇంధనంపై వ్యాట్‌ను 16శాతం నుంచి ఒకశాతానికి తగ్గించారని తెలిపారు. ప్రభుత్వానికి ఏడాదికి రూ.300 నుంచి 500 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ డీజిల్‌పై వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని, వ్యాట్‌ తగ్గిస్తే ఆర్టీసీకి ఏడాదికి రూ.700 కోట్ల లాభం వస్తుందని తెలిపారు. విడిభాగాలపై రూ.150 కోట్ల పన్నులు విధిస్తోందని, బస్‌పాస్‌ రాయితీలు మూడేళ్లుగా రూ.700 కోట్లు బకాయిలున్నాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. నష్టాలను తగ్గించకుండా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన సీఎం కేసీఆర్‌కు ఇప్పటికిప్పుడు రాలేదు. ఎలక్టిక్ర్‌ బస్సుల తయారీ కంపెనీ కోసమే ఆర్టీసీ ప్రైవేటీకరణ. మేఘా ప్రణాళికతోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు పథక రచన చేస్తున్నారు. రూ.50 వేల కోట్ల భూములను లీజుల పేరుతో కేసీఆర్‌ కుటుంబం తీసుకుంది. గౌలిగూడలో భూములను టీ...

జూపూడి, ఆకుల చేరికతో వైసీపీ పార్టీకి లాభమా నష్టమా, గొర్రెల్లాగా టీడీపీలో చేరామని చెప్పిన జూపూడీ, వస్తూనే సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం, పొరపాట్లు సరిదిద్దుకుంటామన్న మాజీ ఎమ్మెల్సీ

 నిన్నటివరకు టీడీపీ నేతగా కొనసాగిన జూపూడి ప్రభాకర్‌, ఎన్నికల ముందు జనసేనలో కీలకంగా ఉన్న రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇద్దరు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జూపూడి తిరిగి సొంత గూటికి చేరారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ఆయన ప్రశంసలు గుప్పించారు. మంచి పరిపాలన రావాలని, రాజన్న పాలన తెస్తాడని ప్రజలు సీఎం జగన్‌ను ఆశీర్వదించారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ చేరుతున్న సంధర్భంలో అన్నారు. ఐదుగురు దళితులకు కేబినేట్‌లో సీఎం జగన్‌ స్థానం కల్పించారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఈ అంశాన్ని ఆదర్శంగా తీసుకుందని అన్నారు. అసెంబ్లీలో పెట్టిన బిల్లులను రాజ్యాంగ బద్ధంగా తీర్చిదిద్దారని అన్నారు. సీఎం జగన్‌ పరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. పొరపాట్లు తన వైపే ఉన్నాయని, సరిదిద్దుకుంటానని చెప్పారు. ఇదిలా ఉంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి ఏపీ సీఎం జగన్‌పై జూపూడి ఘాటైన విమర్శలు చేశారు. కానీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీ నేతలతో మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరారు. పొరపాట్లు తన వైపే ఉన...

ఆర్టీసీ కార్మికుల తొలగింపు సరైనది కాదు.... పవన్ కళ్యాణ్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయం ఆందోళనకరంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకోవాలని పరిశీలించాలని అంతేగాని కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచించారు credit: third party image reference ఈ మేరకు జనసేన పేరుతో సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నేపథ్యంలో 48 వేల ఆరు వందల అరవై మంది ఉద్యోగుల్లో 1,200 మందిని తప్ప మిగిలిన వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించడం ఉన్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు credit: third party image reference అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగ సంఘాలు మనం పాటించి చర్చలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజులపాటు తెలంగాణ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా నిలిచారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉందన్నారు

భారత్ రోబోలను రూపొందించదు... మనుషుల్ని తయారుచేస్తుంది: ప్రధాని మోదీ

 విజయదశమి సందర్భంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో నిర్వహించిన రావణవధ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం పండుగల పుణ్యభూమి అని, ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. మన పండుగలన్నీ ప్రజలను ఒకచోట చేరుస్తాయని, వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతాయని అన్నారు. వేల ఏళ్ల సంస్కృతి, పరంపరతో ప్రజల జీవితం ముడిపడి ఉందని మోదీ పేర్కొన్నారు. మన సంప్రదాయం చెడుపై పోరాటం చేస్తుందని తెలిపారు. భారత్ రోబోలను రూపొందించదని, మనుషుల్ని తయారుచేస్తుందని వ్యాఖ్యానించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సామూహిక శక్తి అనిర్వచనీయం అని, రాముడు సామూహిక శక్తితోనే వారధి నిర్మించి లంక చేరుకున్నాడని వివరించారు. దసరా వంటి ఉత్సవాలు ప్రజలకు అలాంటి సామూహిక శక్తినే అందిస్తాయని అన్నారు.   

అత్యంత దయనీయంగా 'నానో' పరిస్థితి... ఏడాదిలో ఒక్క కారు అమ్మకం!

  టాటా మోటార్స్ ను ప్రపంచ విపణిలో అగ్రగామిగా నిలబెట్టాలని, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వారు కూడా కారులో విహరించాలన్న అభిలాషతో రతన్ టాటా నానో కారును తీసుకువచ్చారు. కానీ, ఆయన ఆకాంక్షకు తీవ్ర విఘాతం ఏర్పడింది. నానో కారు అమ్మకాలు నానాటికీ తీసికట్టుగా తయారవడమే కాదు, సంస్థ చరిత్రలోనే అత్యంత దారుణ వైఫల్యంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమ్ముడైంది ఒక్కటే. గత తొమ్మిది నెలల్లో నానో కర్మాగారాల నుంచి ఒక్క కారు కూడా తయారుకాలేదు. 2008లో తెరపైకి వచ్చిన నానో మొదట్లో సంచలనం సృష్టించే విధంగా కనిపించింది. ఆ మరుసటి ఏడాది మార్కెట్లోకి వచ్చినప్పుడు తొలినాళ్లలో బాగానే అమ్మకాలు జరిగినా, ఆ తర్వాత తీవ్రస్థాయిలో పతనమైంది. ప్రస్తుతానికి తయారీకేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోగా, వచ్చే ఏడాదితో అధికారికంగా నానో అంతర్ధానం కానుంది.   

నేను మరణిస్తే ఒకే పార్టీ జెండా కప్పించుకుంటా... నాలుగు పార్టీల జెండాలు కప్పించుకోను: జూపూడిపై అయ్యన్న విమర్శలు

వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తల్లిలాంటి పార్టీ కష్టాల్లో ఉంటే, పార్టీని వదిలి పారిపోయేవాళ్లు పిరికిపందలతో సమానం అని, అలాంటివాళ్లు తమకు అవసరంలేదని అన్నారు.  తాను చనిపోతే ఒకే పార్టీ జెండా కప్పించుకుంటానే తప్ప నాలుగు పార్టీల జెండాలు కప్పించుకోనని వ్యాఖ్యానించారు. ఇలాంటి అవకాశవాదులు ఏ పార్టీలో ఉన్నా చీడపురుగులు వంటివారేనని, వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వారిని దూరంగా పారద్రోలినప్పుడే రాజకీయాలకు అంటిన మురికి వదిలిపోతుందని వ్యాఖ్యానించారు.   

తొలి 'రాఫెల్' కు టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి దిష్టి తీసిన రాజ్ నాథ్ సింగ్

 అత్యంత అధునాతన 'రాఫెల్' యుద్ధ విమానం ఇప్పుడు భారత్ అమ్ములపొదిలో చేరింది. ఈ ఫ్రెంచ్ తయారీ జెట్ ఫైటర్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు. వాయుసేన దినోత్సవంతో విజయదశమి కూడా కలిసిరావడంతో రాజ్ నాథ్ తొలి రాఫెల్ కు ఫ్రెంచ్ గడ్డపైనే ఆయుధపూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి, ఆ యుద్ధ విహంగంపై కుంకుమ మిశ్రమంతో 'ఓం' అని రాశారు. అంతేకాదు, విమానం టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి దిష్టి తీశారు. ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వద్ద ఉన్న డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు చెందిన రాఫెల్ తయారీ యూనిట్ లో ఈ అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఒప్పందం ప్రకారం భారత్ కు డసాల్ట్ ఏవియేషన్ సంస్థ 36 రాఫెల్ యుద్ధ విమానాలను అందించాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్ నాథ్ అందుకున్నది తొలి విమానం. దీనికున్న అద్భుత పోరాట సామర్థ్యాల దృష్ట్యా భారత్ అగ్రరాజ్యాలకు దీటుగా వాయుశక్తిని సముపార్జించుకున్నట్టయింది.

రైతు భ‌రోసా స‌రే.... ఈ లెక్కేంటి?

              ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకు రానున్న రైతు భ‌రోసాలో ఒక రైతు త‌న‌కున్న భూమిని ఎంత‌మందికి కౌలుకు ఇచ్చినా కేవ‌లం ఒక రైతుకు మాత్ర‌మే ఈ ప‌థ‌కం వ‌ర్తింప చేయాల‌ని నిర్ణ‌యించ‌డంపై రైతు సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. ఇది కౌలు రైతుల‌ను దెబ్బ‌తీసి, ప‌థ‌కం నుంచి త‌ప్పించ‌డ‌మేన‌ని పేర్కొన్నాయి. భూయ‌జ‌మానుల క‌న్నా కౌలు రైతులే ఏపిలో ఎక్కువ‌గా ఉన్న విష‌యాన్ని ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా ప‌క్క‌కు నెట్టిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. రైతు భ‌రోసా క్రింద 12500 పెట్టుబ‌డి సాయంగా అందించాల‌ని జ‌గ‌న్ ఇచ్చిన హామీని అమ‌లు చేస్తూ నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే. అయితే ఇందులో ప్ర‌ధాని కిసాన్‌స‌మ్మాన్ క్రింద రైతుల‌కు 6000 కేవ‌ద్ర సాయం అందుతుండ‌టంతో దానికి మ‌రి 6500 మాత్ర‌మే క‌లిపి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అయితే భూమ‌లేని కౌలు రైతుల‌కు రూ. 12500 అందిస్తామ‌ని ప్ర‌భుత్వం చెపినా తాజా నిబంధ‌న‌లతో ఆ సాయం హుళ‌క్కే అనిపిస్తోంది.  ఎందుకంటే కౌలు ఒప్పంద ప‌త్రాల...

బిడ్డను చూసుకుని తెగ మురిసిపోయిన అజింక్య రహానే!

భారత క్రికెటర్ అజింక్య రహానేకు శనివారం నాడు ఆడబిడ్డ పుట్టిందన్న సంగతి తెలిసిందే. రహానే భార్య రాధికా ధోపావ్ కర్ బిడ్డకు జన్మనివ్వగా, ఆ సమయంలో విశాఖలో సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ లో ఆడుతున్న రహానే, వెంటనే భార్యాబిడ్డల వద్దకు వెళ్లలేకపోయాడు. ఇక తొలి టెస్ట్ అనంతరం ముంబై చేరుకున్న రహానే, బిడ్డను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయాడు. ఆ చిత్రాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒకవైపు టెస్ట్ మ్యాచ్ లో విజయం, మరోవైపు తన ఇంట్లో బిడ్డ సందడితో రహానే ఆనందం రెండింతలైందనడంలో సందేహం లేదు.

ఫ్రాన్స్ లో నేడు రాజ్ నాథ్ సింగ్ ఆయుధపూజ... తొలి రాఫెల్ జెట్ వాయుసేనకు

భారత వాయుసేనను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్న రాఫెల్ తొలి జెట్ నేడు డెలివరీ కానుంది. ఇప్పటికే ఫ్రాన్స్ చేరుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేడు ప్రత్యేక ఆయుధపూజలను జరిపిన అనంతరం తొలి యుద్ధ విమానాన్ని డెలివరీ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన రాజ్ నాథ్, ఫ్రాన్స్ కు రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇండియాకు ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయని అన్నారు. భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య స్నేహబంధం కొనసాగుతుందని చెప్పారు. కాగా, నిన్న రాజ్ నాథ్, రాజధాని ఫ్రాన్స్ లోని ఎలిసీ ప్యాలెస్ లో మార్కన్ తో చర్చలు జరిపారు. గడువులోగా మిగతా అన్ని యుద్ధ విమానాలనూ డెలివరీ ఇవ్వాలని ఈ సందర్భంగా రాజ్ నాథ్ కోరారు. ఇక, నేడు ఐఏఎఫ్ 87వ వార్షికోత్సవం కాగా, ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రాజ్ నాథ్, ధైర్యానికి, అంకితభావానికి వాయుసేన నిదర్శనమని, దేశానికి సేవ చేస్తున్న వాయుసేన కుటుంబానికి శుభాకాంక్షలని అన్నారు.   

బ్యాక్ టూ వైసీపీ... నేడు జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న జూపూడి ప్రభాకర్!

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆపై కొంతకాలం జగన్ తో నడిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన జూపూడి ప్రభాకర్, తిరిగి సొంతింటికి చేరుకోనున్నారు. నేడు ఆకుల సత్యనారాయణతో కలిసి జగన్ ను కలవనున్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత జూపూడి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన క్రమంగా వైసీపీకి దగ్గరయ్యారు. గతంలో తనకున్న పరిచయాలతో పావులు కదిపిన జూపూడిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం జూపూడి, ఆకుల జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.   

విరిగిన పట్టాలు... విశాఖ - విజయవాడ మధ్య నిలిచిన రైళ్లు!

విశాఖపట్నం జిల్లా కశింకోట సమీపంలో రైలు పట్టాలు విరగడంతో, విజయవాడ - విశాఖ మధ్య నడిచే పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పట్టాలను సరిచేసే పనిలో పడ్డారు. దువ్వాడలో జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. వీటితో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే పలు రైళ్లు గంట నుంచి రెండు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. మధ్యాహ్నానికి పట్టాలను సరిచేస్తామని అధికారులు వెల్లడించారు.   

వర్షం పడవచ్చట... రావణాసురుడికి రెయిన్ కోట్ వేశారు!

 నేడు విజయదశమి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రావణ దహనం కార్యక్రమం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి నిత్యమూ వర్షాలు కురుస్తూ ఉండటంతో, రావణాసురుడు తడవకుండా రెయిన్ కోట్ వేసేశారు. ఈ ఘటన ఇండోర్ లోని జిమన్ బాగ్, రామ్ బాగ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రావణాసురుని వాటర్ ప్రూఫ్ ను చేశారు. ఎంత వర్షం పడినా దహన కార్యక్రమం వరకూ రావణుడు తడవకుండా ఉండేందుకు ఇటువంటి ఏర్పాట్లు చేశామని, ప్రతిమలకు రెయిన్ కోట్లు వేశామని నిర్వాహకులు తెలిపారు. ఇండోర్, ఉజ్జయిని ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో పలు ప్రాంతాల్లో రావణ ప్రతిమలకు ప్లాస్టిక్ కవర్లను కప్పి ఉంచారు.

ఇంద్రకీలాద్రిపై అవస్థలు పడ్డ రెబల్ స్టార్!

కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ గా సుపరిచితుడైన సీనియర్ నటుడు కృష్ణంరాజు, ఇంద్రీకీలాద్రిపై అవస్థలు పడ్డారు. తానెవరో తెలిసి కూడా, అధికారులు కనీస సౌకర్యాలను కల్పించలేదని, మెట్లు ఎక్కుతూ దిగుతూ, ఆరు అంతస్తులు ఎక్కాల్సి వచ్చిందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. దసరా సందర్భంగా నిన్న ఘాట్ రోడ్డు మీదుగా కృష్ణంరాజు కుటుంబం కొండపైకి రాగా, తాను కుంకుమార్చనకు వెళ్లాలని ఆయన పోలీసులను కోరారు. అయితే, వారు పట్టించుకోలేదు. ఆలయ సిబ్బందిని అడిగినా, అదే స్పందన వచ్చింది.  దీంతో ఆయన ఫ్యామిలీ మొత్తం ఈవో కార్యాలయానికి చేరుకుని, ఆ పక్కనే ఏర్పాటు చేసిన క్యూలైన్ లో కుంకుమ పూజలను జరిపిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. సాధారణ భక్తులతో పాటు అవస్థలు పడుతూ మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఆయన ఆరో అంతస్తుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన చాలా చోట్ల ఆయాస పడుతూ, గ్రిల్స్ పట్టుకుని నిలబడటం కనిపించింది. తాను నడవలేనని ఆలయ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడిని చూసిన భక్తులు, ఆయన పడుతున్న అవస్థలను చూసి ఆలయ సిబ్బందిపై విమర్శలకు దిగడంతో, ప్రత్యేక విశేష కుంకుమార్చన చేయించిన అధిక...

పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం... ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు

 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆగమోక్తంగా చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్‌ లను పల్లకిలో వరాహస్వామి ఆలయానికి చేర్చిన పూజారులు, ఉదయం 7 గంటల నుంచి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై చక్రత్తాళ్వార్‌ ను అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేయించారు.  ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ అధికారులు, ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సాయంత్రం బంగారు తిరుచ్చిపై శ్రీవారు విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగియనున్నాయి. కాగా, రేపటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులూ భక్తులు ఎంతో సహకరించారని తెలిపింది.