Skip to main content

Posts

Showing posts from August 30, 2020

జెనీలియా కు కరోన

  పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన జెనీలియా కూడా కరోనా బారిన పడిందట. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా ఆమె వెల్లడించింది. మూడు వారాల క్రితమే తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని... అయితే, లక్షణాలు లేవని ఆమె తెలిపింది. ఆ తర్వాత 21 రోజుల పాటు తాను ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను కోలుకున్నానని... తాజా టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని తెలిపింది.

చేతులకు పది గంటలు గ్లౌజ్ లు వేసుకుంటే... డాక్టర్ షేర్ చేసిన పిక్!

My hands after doffing #PPE due to profuse sweating in extremely humid climate. #COVID19 #Covidwarrior #Doctor pic.twitter.com/wAp148TkNu — Dr Syed Faizan Ahmad (@drsfaizanahmad) August 24, 2020   కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ లో వైద్యులే ముందు నిలిచారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. నిరంతరం వైద్యులు పడుతున్న శ్రమతోనే రికవరీల సంఖ్య అధికంగా ఉంటూ, మరణాల రేటు కనిష్ఠానికి పడిపోయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు నిద్రాహారాలు మాని, ఇంటికి దూరమై, ఆసుపత్రుల్లో చికిత్సలను కొనసాగిస్తున్నారు. ఇందుకోసం తమ ప్రాణాలను పణంగా కూడా పెడుతున్నారు. ఊపిరాడని విధంగా పీపీఈ కిట్లు ధరించడంతో పాటు, చేతులకు గ్లౌజులు వేసుకుని గంటల తరబడి విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ డాక్టర్, 10 గంటల పాటు గ్లౌజ్ లను ధరించడం వల్ల తన చేతులు ఇలా మారిపోయాయంటూ షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు, కరోనా రోగులకు చికిత్స చేసే నిమిత్తం గంటల తరబడి చేతులకు తొడుగులు తొడుక్కోవాల్సి వచ్చింది. ఓ వార్డులో నుంచి పది గంటల పాటు అతను బయటకు రాల...