Skip to main content

Posts

Showing posts from October 30, 2019

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చరణ్?

  ప్రస్తుతం చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది జూలై 30వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమాకి సంబంధించిన సమాచారం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తరువాత కొరటాలతోనే చరణ్ సినిమా వుంటుందనే టాక్ వినిపించింది. తాజాగా విక్రమ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత విక్రమ్ కుమార్ ఒక మంచి లైన్ అనుకుని, చరణ్ కి చెప్పారట. ఆ లైన్ చరణ్ కి బాగా నచ్చినట్టుగా సమాచారం. పూర్తి స్క్రిప్ట్ ను తయారుచేసి వినిపించమని చరణ్ చెప్పడంతో, విక్రమ్ కుమార్ ఆ పనిలోనే వున్నాడని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ తో చరణ్ ను విక్రమ్ కుమార్ ఒప్పించవలసి వుంది. మరి కొరటాల - విక్రమ్ కుమార్ లలో ఎవరితో ముందుగా చరణ్ సెట్స్ పైకి వెళతాడో చూడాలి. 

ఏపీ ఈఆర్ సీ ఛైర్మన్ గా జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం

  ఎం  ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్ సీ) ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,  డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం తర్వాత సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్  కొత్త ఏపీ ఈఆర్ సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.  

ఏపీలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త పథకం

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూములను గుర్తించి ప్రభుత్వ భవన నిర్మాణాలు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది. ‘బిల్డ్ ఏపీ’ అని ఈ పథకానికి పేరు పెట్టింది. బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నిర్ణయించింది. ఎన్ బీసీసీ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయనుంది. ఈ పథకంలో భాగంగా మొదట ప్రభుత్వ భూములు గుర్తించి భవన సముదాయాలు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వివరాలను సమర్పించాలని జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మిగతా భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపింది. అంతేకాక, ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను కూడా సేకరించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

లోకేశ్ ఇసుక దీక్ష అందుకోసమేనట.. వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి సెటైర్లు

  టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన దీక్షపై వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి.. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుకను అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక కొరతకు వరదలే కారణమని పేర్కొన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే మాటల్ని పట్టించుకోవద్దని, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమన్న శ్రీకాంత్‌రెడ్డి.. ఇసుక పంపిణీపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ లోకేశ్ చేపట్టిన దీక్షను ఎద్దేవా చేశారు. ఆయన దీక్ష ఇసుక కోసం కాదని, డైటింగ్ కోసమేనని అన్నారు. టీడీపీ చేసిన మోసాలు తెలిస్తే భవన నిర్మాణ కార్మికులు వారిని తరిమి కొడతారని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.  

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం భేష్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసలు

ఆర్టీసీ విలీనం విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించడం చర్చనీయాంశమైంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం ఎంపీ కేశినేని నాని కల్పించిన వసతి సౌకర్యాలను రవాణాశాఖ మంత్రి పేర్నినాని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం శుభపరిణామమని అన్నారు. కేశినేని వ్యాఖ్యలపై మంత్రి పేర్నినాని స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష ఎంపీ ప్రశంసించడాన్ని అభినందించారు. రోగుల సహాయకుల కోసం వసతి ఏర్పాటు చేసిన ఎంపీపై ప్రశంసలు కురిపించారు. ఆర్టీసీ విలీనంపై చంద్రబాబు మౌనం వహిస్తుంటే ఆ పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.  

విశాఖ ర్యాలీకి మద్దతు ఇవ్వండి.. చంద్రబాబుకు ఫోన్ చేసిన పవన్ కల్యాణ్

  ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. ఇసుక సమస్యపై వచ్చే నెల మూడో తేదీన విశాఖపట్టణంలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరారు. ఇదే విషయమై అంతకుముందు ఏపీ బీజీపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు కూడా పవన్ ఫోన్ చేసి ర్యాలీకి మద్దుతు కోరారు. కాగా, చంద్రబాబు-పవన్‌లు ఇసుక అక్రమ రవాణా, కార్మికుల ఆత్మహత్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇసుక సమస్య విషయంలో బాధితుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ చెప్పినట్టు సమాచారం. ఇరువురు నేతలు దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. పవన్ విజ్ఞప్తికి బాబు సానుకూలంగా స్పందించారని సమాచారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి  క్రితం ఫోన్ చేశారు. ఇసుక సమస్యపై వచ్చే నెల మూడో తేదీన విశాఖపట్టణంలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరారు. ఇదే విషయమై అంతకుముందు ఏపీ బీజీపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు కూడా పవన్ ఫోన్ చేసి ర్యాలీకి మద్దుతు కోరారు. కాగా, చంద్రబాబు-పవన్‌లు ఇసుక అక్రమ రవాణా...

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

  ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. కేబినెట్‌ నిర్ణయాలివే.. ⇒ 1 నుంచి 12 వరకు చదివే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తింపు. విద్యార్థుల తల్లులు లేదా వారి సంరక్షులకు అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం. ఏటా జనవరిలో ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ. ⇒ గర్భవతులు, బాలింతలు, ఆరునెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అదనపు పౌష్ఠికాహారం అందించాలని నిర్ణయం. గుర్తించిన 77 మండలాల్లో  ఈ పథకం అమలు. ⇒ కృష్ణా, గోదావరి కాల్వల శుభ్రం చేసేందుకు శుద్ధి మిషన్‌ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. సీఎం ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్‌ ఛైర్మన్‌గా మిషన్‌ ఏర్పాటు. ⇒ షెడ్యూల్డు కులాల కార్పొరేషన్‌ను మూడుగా విభజించాలని నిర్ణయం. మాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మాదిగ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రెల్లి, ఇతరకులాల కార్పొరేషన్‌గా విభజించేందుకు కేబినెట్‌ ఆమోదం. ⇒ వివిధ రంగాల ద్వారా ప...

బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం?

  . బంగారమంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.. మన దేశంలో పసిడి ప్రియులు ఎక్కువే. అయితే ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.  నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆదాయపు పన్ను ఆమ్నెస్టీ తరహాలో బంగారం కోసం ప్రత్యేక పన్నుమాఫీ పథకాన్ని తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పథకం కింద వ్యక్తులు వద్ద నిర్ణీత పరిమితికి మించి ఉన్న బంగారాన్ని వెల్లడించి దానిపై పన్నులు చెల్లించే అవకాశం కల్పిస్తారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆ పన్ను రేటు ఎంత ఉంటుంది..? పరిమితులకు సంబంధించిన ఇతర నిబంధనలను ఇంకా నిర్ణయించలేదని తెలిపాయి. వ్యక్తి లేదా కుటుంబం వద్ద పరిమితికి మించి బంగారం ఉంటే అది ఎంత మొత్తంలో ఉందో, మార్కెట్‌ ప్రకారం ఎంత విలువ ఉందో ఎప్పటికప్పుడు ప...

రామాయణంలో ఉడుతలాంటి వాళ్లమే మేం కూడా.. కేసీఆర్ బెదిరించారు: అశ్వత్థామరెడ్డి తీవ్ర ఆరోపణలు

  సకల జనుల సమరభేరి సభకు వస్తున్న వారిని అడ్డుకుంటున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ శివారు సరూర్‌నగర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న సకలజనుల సమరభేరికి జనం పోటెత్తారు. ఈ సభకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్టేడియం వద్ద సిగ్నల్స్ ఆపేశారని, 3జి, 4జి లైవ్‌లు పనిచేయడం లేదని అన్నారు. టీవీల్లోనూ లైవ్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని గుర్తు చేశారు. రామాయణంలో రాముడికి ఉడుత దారి చూపించకుంటే రామాయణమే లేదని, తాము కూడా ఉడుత లాంటి వాళ్లమేనని పేర్కొన్నారు. కేసీఆర్ తమను బెదిరించారని, భయపెట్టారని పేర్కొన్న అశ్వత్థామరెడ్డి.. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఆపినా అధైర్యపడలేదన్నారు. ఒక్క కార్మికుడు కూడా వెనక్కి తగ్గలేదని అన్నారు.  

చినజీయర్ స్వామికి టీఎస్ ఆర్టీసీ కార్మికుల మొర!

సీఎం కేసీఆర్ తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆర్టీసీ కార్మికులు చినజీయర్ స్వామికి మొరపెట్టుకున్నారు. 26 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చినజీయర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్, మహేశ్వరం డిపోలకు చెందిన కార్మికులు, జేఏసీ నేతలు  శంషాబాద్, ముచ్చింతల్లో ఉన్న ఆశ్రమానికి వెళ్లి చినజీయర్ స్వామిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలను స్వామీజీ సావధానంగా విన్నారు. మరోవైపు సరూర్ నగర్ స్టేడియంలో తలపెట్టిన సకల జనభేరి సభ నేపథ్యంలో స్టేడియంలోకి ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో చేరడంతో స్టేడియం నిండిపోయింది.

మహిళల స్పందనను తెలుసుకునేందుకట.. బస్సెక్కిన ఢిల్లీ సీఎం!

 రాజధాని ఢిల్లీలోని సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన పథకంపై మహిళలు ఎలా స్పందిస్తున్నదీ తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బస్సెక్కారు. సిటీ బస్సులో ప్రయాణించి ఈ పథకంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.  అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మంచి పని ఎప్పటికైనా గొప్పగానే ఉంటుందని అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టలేదని, వారి భద్రత కోసం 13వేల మంది మార్షల్స్‌ను నియమించినట్టు సీఎం వివరించారు.

బీజేపీ తీరు ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది: కశ్మీర్ లో ఈయూ ప్రతినిధుల పర్యటనపై శివసేన విమర్శలు

జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ సమాఖ్య (ఈయూ) ఎంపీల పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. 'ఈయూకి చెందిన ఎంపీలు కశ్మీర్ లోని పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. దేశంలో కశ్మీర్ అంతర్భాగం. ఆ ప్రాంతంలో జాతీయ జెండా ఎగిరింది.. ఇందుకోసం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా చేసిన కృషి పట్ల గర్విస్తున్నాం. అయితే, కశ్మీర్ లో పరిస్థితులన్నీ సరిగ్గానే ఉంటే విదేశీ ప్రతినిధులను ఆ ప్రాంతానికి ఎందుకు పంపారు? కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాదా?' అని శివసేన తమ పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. 'ఆ ప్రాంతం విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ, కశ్మీర్ కు విదేశీ ప్రతినిధులను పంపుతోంది. ఇలా విదేశీయులు కశ్మీర్ లో పరిస్థితులను గుర్తించడానికి వస్తే దేశంలోని స్వేచ్ఛపై దాడి చేసినట్లే. ఈ చర్య ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. భారత ఎంపీలు ఆ ప్రాంతంలో పర్యటించడానికి అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. విదేశీ ప్రతినిధులను మాత్రం ఎందుకు స్వాగతించింది? ఈ ప్రశ్నకు హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి. వారిని ఈ పర...

ఆర్టీసీ విలీనం చేసి తీరుతాం: ఏపీ సర్కారుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందన

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని నాని నిర్మించిన వసతి భవనాన్ని పేర్ని నాని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, దేశంలో చాలా వ్యవస్థలు ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో మాత్రం ఒక కార్పొరేషన్ ను సర్కారులో విలీనం చేయడమనేది గొప్ప విషయమని పేర్ని నాని అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దామని అన్నారని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి పెరిగిందని తెలిపారు. జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని ప్రకటన చేశామని, దాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందని పేర్ని నాని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యను తాము పాజిటివ్ గా తీసుకున్నామని చెప్పారు. కొన్ని నెలల్ల...

మళ్లీ తెరపైకి పవన్ 'సత్యాగ్రహి' టాపిక్

రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తానంటూ సినిమాలను దూరంపెట్టిన పవన్ కల్యాణ్, ఎన్నికల ఫలితాల తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో కొంతమంది నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్న ఆయన, ఇప్పుడు ఆ ప్రాజెక్టులను చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 'సత్యాగ్రహి' సినిమా టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా సూర్య మూవీస్ బ్యానర్ పై 2006లో 'సత్యాగ్రహి' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల షూటింగ్ అనంతరం కొన్ని కారణాల వలన ఆగిపోయింది. సామాజిక సమస్యలపై ఓ యువకుడి పోరాటంగా సాగే ఆ కథ అప్పట్లో పవన్ కి బాగా నచ్చిందట. అందువలన ప్రస్తుత పరిస్థితుల్లో తన రాజకీయ జీవితానికి ఆ కథ హెల్ప్ అవుతుందని భావించిన పవన్, క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నాడని చెప్పుకుంటున్నారు. ఎ.ఎమ్.రత్నం ఇచ్చిన అడ్వాన్స్ పవన్ దగ్గరే ఉండటం వలన, ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

శివసేనకు మద్దతివ్వడానికి మాకు అభ్యంతరం లేదు: కాంగ్రెస్

మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని తమకు ఇవ్వాలంటూ శివసేన పెట్టిన కండిషన్ కు బీజేపీ ససేమిరా అంటోంది. మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. శివసేనకు అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు హుస్సేన్ దాల్వాయి చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. శివసేనకు మద్దతివ్వడానికి కాంగ్రెస్ కు ఎలాంటి అభ్యంతరం లేదని హుస్సేన్ అన్నారు. అయితే, ఈ విషయంలో ముందుగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. బీజేపీతో కలిసి ఉంటారో? లేక విడిపోతారో? అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సింది థాకరేనే అని అన్నారు. మరోవైపు రెండు, మూడు రోజుల్లో ముంబైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నట్టు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పక్కా క్లారిటి వచ్చే అవకాశం ఉంది.
సుకుమార్ - బన్నీ సినిమా మొదలైంది    సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, వాళ్ల కార్యాలయంలో కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్ .. కొరటాల .. సురేందర్ రెడ్డి హాజరయ్యారు. దేవుడి చిత్ర పటాలపై అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. గతంలో సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య' .. 'ఆర్య 2' సినిమాలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్, తాజా చిత్రానికి కూడా సంగీతాన్ని అందించనున్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. ఈ సినిమాలో బన్నీ జోడీగా రష్మిక మందన కనిపించనున్న సంగతి తెలిసిందే.  

గుంటూరులో దీక్షకు కూర్చున్న నారా లోకేశ్

    రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ ఇసుక దీక్షకు దిగిరు. గుంటూరులో చేపట్టిన ఈ దీక్షకు భారీ ఎత్తున తెలగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కలెక్టరేట్ ఎదుట లోకేశ్ ఈ దీక్షను చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. దీక్షకు భవన నిర్మాణ కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు. భారీ సంఖ్యలో కార్మికులు దీక్షలో పాల్గొంటున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలను నిర్వహించడం సిగ్గు చేటని... ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలను జరపాలని అన్నారు. ఇసుక కొరత వల్ల చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10 వేలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పీకే‌ టీమ్ మెంబర్‌కు జగన్ బంపరాఫర్.. కీలక బాధ్యతలు..!

ఏపీ జగన్ సర్కారులో మరో ఇద్దరు భాగమయ్యారు. సీవీ రెడ్డి, బ్రహ్మానంద పాత్ర అనే ఇద్దరిని ఏపీ ప్రభుత్వంలో చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సమాచార పౌర సరఫరాల శాఖలోని సోషల్ మీడియా విభాగంలో వీరిద్దరు విధులు నిర్వహించనున్నారు. గతంలో గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనే వ్యక్తిని చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా జగన్ ప్రభుత్వం నియమించగా.. ఇప్పుడు మరో ఇద్దరికి ఆ అవకాశం ఇచ్చింది. కాగా తాజాగా నియమితులైన ఇద్దరిలో బ్రహ్మానంద పాత్ర అనే వ్యక్తి ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్ సభ్యుడు కావడం విశేషం. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి రావడం వెనుక ప్రశాంత్ కిశోర్ రచించిన వ్యూహాలు ముఖ్య పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ డిజిటల్ సపోర్ట్, స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. ఈ క్రమంలో జగన్‌ టూర్లపై పాటలు విడుదల చేయడం, ప్రత్యర్థి పార్టీలను కౌంటర్ చేయడం, వారి వ్యాఖ్యలకు దీటుగా బదులివ్వడం లాంటి బ్యాక్ గ్రౌండ్ వ్యవహారాలను ఆయన నిర్వహించారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశాంత్ కిశోర్ బీహార్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వ...

బిగ్‌బాస్’ పథకం.. శ్రీముఖిని విన్నర్ చేయడానికేనా..!

23 hours ago తెలుగు బుల్లితెరపై విజయవంతంగా కొనసాగుతోన్న ‘బిగ్‌బాస్’ మూడో సీజన్ ఈ వారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు ఉండగా.. ఈ సీజన్‌కు టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారు అన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ రేసులో శ్రీముఖి ముందు వరుసలో నిలిచింది. ఇటీవల పోలైన ఓట్లలో శ్రీముఖి ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీంతో టైటిల్ విన్నర్‌గా కూడా ఆమెనే నిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా శ్రీముఖిని చేసేందుకు తెరవెనుక వ్యూహాలు జరుగుతున్నాయని కూడా టాక్ నడుస్తోంది. దానికి తోడు ఇటీవల శ్రీముఖి గెలిచిన కొన్ని టాస్క్‌లు ప్రత్యేకంగా ఆమె కోసమే డిజైన్ చేశారా..? అన్నట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హిమజ, మహేష్ విట్టా, హేమలు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. హిమజ అయితే ఏకంగా బిగ్ బాస్ డైరెక్టర్లే శ్రీముఖి డెరెక్షన్‌లో షో నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది. హేమ కూడా ఇదే విషయంపై తాజాగా స్పందిస్తూ.. హౌస్‌లో ఎవరు ఎన్నాళ్లు ఉండాలి. ముందే ఫిక్స్ అయ్యి వచ్చారని దాని ప...

తమిళనాడులో కుండపోత వర్షం...వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం!

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.  

యానాం' ఏపీలో విలీనం కానుందా?

' కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో భాగమైన యానాం పట్టణాన్ని, పరిసర ప్రాంతాల్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనిపై కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయాని కొచ్చేసింది. దీనివెనుక రాజకీయ కారణాల్తో పాటు సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యానాం పట్టణం పుదుచ్చేరి రాష్ట్రంలోని ఒక అసెంబ్లి నియోజక వర్గం. అయితే పుదుచ్ఛేరి తమిళనాడును ఆనుకునుంటుంది. కానీ యానాం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి పక్కనే సముద్రతీరాన ఉంది. యానాం అధికార కేంద్రం పుదుచ్ఛేరిలో ఉంటుంది. ఈ రెండు పట్టణాలకు మధ్య దూరం 700 కిలోమీటర్లకు పైబడే. ప్రభుత్వ నిర్ణయాలన్నీ పుదు చ్చేరిలోనే జరుగుతాయి. అధికారుల బదలీల్నుంచి అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు వరకు అక్కడి ఆదేశాలకనుగుణంగానే యానాంలో అమలౌతాయి. యానాం ప్రజలు చిన్న బెయిల్‌ కావాలన్నా పుదుచ్ఛేరిలోకి పరుగులుదీయాల్సిందే. ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌లు, మోతుబరి దృవీకరణ పత్రాల జారీక్కూడా అక్కడికెళ్ళాల్సిందే. దీర్ఘకాలంగా యానాం పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలంటూ యానాం ప్రాంత రాజకీయ నాయకులు, కొన్ని వర్గాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పాలకపా...

శివసేన హెచ్చరికల బేఖాతరు... శుక్రవారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న దేవేంద్ర ఫడ్నవీస్!

  50-50 ఫార్ములాను అమలు చేయాలని, తమ నేత ఆదిత్య ఠాక్రేకు రెండున్నరేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలని, లేకుంటే బీజేపీకి సహకరించేది లేదని శివసేన పార్టీ అధిష్ఠానం చేస్తున్న హెచ్చరికలనులను పట్టించుకోని దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎంగా శుక్రవారం నాడు మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఈలోగానే శివసేనతో ఉన్న విభేదాలు సర్దుకుంటాయని బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల నేతల మధ్యా మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరినా, అది సుదీర్ఘకాల స్నేహాన్ని చెడగొట్టేంత తీవ్రమైనదేమీ కాదని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లూ బీజేపీ ప్రభుత్వమే ఉంటుందనడంలో సందేహం లేదని వార్సాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

కమలంపై బాణం గురి.. కార్టూన్ పోస్ట్ చేసిన ఎన్సీపీ నేత

  మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వ ఏర్పాటుపై జాప్యం కొనసాగుతోంది. ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్ చిరుత పులి చేతిలో కమలం (బీజేపీ ఎన్నికల గుర్తు) ఉన్నట్లు ఓ కార్టూన్ ను పోస్ట్ చేసి... రిమోట్ కంట్రోల్ తమ చేతిలో ఉందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా, ఎన్సీపీ నేత క్లైడ్ క్రాస్టో ఓ కార్టూన్ ను పోస్ట్ చేసి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలంపై శివసేన బాణం గుర్తు ఎక్కుపెట్టినట్లు ఉన్న కార్టూన్‌ వేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీజేపీని శివసేన గురి చూసి కొడుతుందనేలా ఈ కార్టూన్ ఉంది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ దక్కని నేపథ్యంలో బీజేపీకి శివసేన మద్దతు తప్పనిసరి అయింది. దీంతో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. అయితే, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాత్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవట్లేదు.

జగన్ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధం: బీజేపీ నేత రామ్ మాధవ్

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని, కేంద్రం అందిస్తున్న సంక్షేమం పేదలకు అందుతుందో లేదో ఓ కన్నేసి వుంటామని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ, క్షేత్ర స్థాయిలో బలపడాలన్న తమ వ్యూహాలను అమలు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను నివారించేందుకే, చంద్రబాబునాయుడు ఇప్పుడు తిరిగి బీజేపీతో పొత్తు అంశాన్ని తెరపైకి తెచ్చాడని రామ్ మాధవ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆయన, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. ఏ పార్టీకీ జూనియర్ గా వ్యవహరించాల్సిన అగత్యం బీజేపీకి పట్టలేదన్నారు

లవ్ యూ రాహుల్' అంటూ అరుదైన చిత్రాలను పంచుకున్న ప్రియాంకా గాంధీ!

తన సోదరుడు రాహుల్ తో చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు ప్రియాంకా గాంధీ. భాయ్ ధూజ్ (భగినీ హస్త భోజనం) పంగడ సందర్భంగా చిన్నతనం నుంచి ఇప్పటివరకూ రాహుల్, నానమ్మ ఇందిరా గాంధీ, తల్లిదండ్రులు రాజీవ్, సోనియాలతో కలిసి దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్ రూపంలో అమర్చి, తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోదరుడిపై ఉన్న ఆప్యాయతను వ్యక్తం చేస్తూ, "లవ్ యూ రాహుల్ గాంధీ... భాయ్ దూజ్" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

భారత్ కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తాం: పాకిస్థాన్ మంత్రి

  జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ల మధ్య వైరం మరింత ముదిరింది. ఇండియా ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన పాకిస్థాన్... మన దేశంపై సమరనాదాన్ని పూరిస్తోంది. తాజాగా పాకిస్థాన్ కు చెందిన కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమీన్ సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే యూద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, భారత్ కు మద్దతు పలికే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్ కు చెందిన ఎంపీలు పర్యటిస్తున్న సమయంలో అమీన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు, అమీన్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బీజేపీ ఎంపీ మూర్ముకు షాకిచ్చిన అమెజాన్

    పశ్చిమబెంగాల్ మాల్దా నార్త్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ ఖాజెన్ మూర్ముకు అమెజాన్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే, మూర్ము తన కుమారుడి చేత ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ ను బుక్ చేయించారు. అమెజాన్ నుంచి వారి ఇంటికి పార్సిల్ డెలివరీ అయింది. అయితే పార్సిల్ ను ఓపెన్ చేసిన వారికి షాక్ తగిలింది. తాము శాంసంగ్ ఫోన్ ఆర్డ్ చేస్తే రెడ్ మీ 5ఏ బాక్స్ వచ్చింది. సరే అని దాన్ని కాస్తా ఓపెన్ చేశారు. ఇక్కడ వారికి మరో షాక్ తగిలింది. ఫోన్ లో మొబైల్ స్థానంలో రాళ్లు కనిపించాయి. నిశ్చేష్టుడైన మూర్ము వెంటనే అమెజాన్ కు ఫిర్యాదు చేశారు.  

దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం.. వైసీపీకి రాజీనామా?

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జగన్ ను కలవడం, ఆయనతో మాట్లాడటం ఇష్టంలేని దగ్గుబాటి, పార్టీలోని మరో కీలక నేతకు ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో తన భార్య పురందేశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నందున, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా వీచి, ఆ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, దగ్గుబాటి మాత్రం విజయం సాధించలేకపోయారు. ఆపై భార్యాభర్తలిద్దరూ ఒకే పార్టీలో ఉండాలని జగన్ అల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆపై రెండు రోజుల క్రితం దగ్గుబాటి తన కార్యకర్తలతోనూ సమావేశమై, వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దగ్గుబాటి రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. పర్చూరు నియోజకవర్గంలో రామనాథం బాబును పార్టీలోకి తీసుకోవడం కూడా దగ్గుబాటికి ఆగ్రహం తెప్పించిందని ఆయన అనుచరులు అంటున్నారు.   

ఆలా ఎలా చెబుతారు? చిరంజీవి సలహాపై స్పందించిన కమలహాసన్!

  సినిమా స్టార్లు రాజకీయాల్లో ఇమడగలరా? అన్న ప్రశ్నపై ఎంతోకాలంగా జరుగుతున్న చర్చ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. నటుడిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ, రాజకీయాల్లో విఫలమైన చిరంజీవి, తన సహ నటీనటులైన కమలహాసన్, రజనీకాంత్ లకు రాజకీయాలు వద్దని సలహా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి మాట్లాడిన మాటలను విన్న కమల్ తనదైన రీతిలో స్పందించారు. అందరి అనుభవాలూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని చిరంజీవి ఇచ్చిన సలహాను ఓ మీడియా సమావేశంలో గుర్తు చేసిన ఆయన, మరెవరైనా ఈ సలహా ఇవ్వవచ్చేమోగానీ, పొలిటీషియన్ గా పనిచేసిన చిరంజీవి ఈ మాటలెలా చెబుతారని ప్రశ్నించారు. ఎవరి అనుభవాలు వారికే పాఠాలు నేర్పుతాయని అన్నారు.