Skip to main content

Posts

Showing posts from August 24, 2020

ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా కలవరపెడుతోంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడ్డారు. .. తాజాగా విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ కు కరోనా సోకింది.గత కొద్దిరోజులుగా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. తాజాగా కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది . దీంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారాని తెలిపారు

కాంగ్రెస్ పార్టీ మధ్యంతర చీఫ్ గా సోనియానే!.. ఏ నిర్ణయం తీసుకోలేకపోయిన సీడబ్ల్యూసీ

  కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీనే మరికొంతకాలం పాటు అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏమీ తేల్చలేకపోయింది.  నేడు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ హైడ్రామా నడుమ సాగింది. అయితే, పార్టీ ప్రెసిడెంట్ పదవి ఎవరికి అప్పగించాలన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోనియానే మధ్యంతర చీఫ్ గా కొనసాగనున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ సోనియానే స్పష్టం చేసినా, ఈ పరిస్థితుల్లో మరో మార్గం లేక పార్టీ సీనియర్లు ఆమెపైనే భారం వేశారు.

అవినీతిపై గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి: సీఎం జగన్

  సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అవినీతి నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత రాష్ట్రాన్ని రూపొందించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణ మొదలవ్వాలని స్పష్టం చేశారు. 1902 నెంబర్ ను ఏసీబీకి, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు అనుసంధానం చేయాలని, అవినీతిపై గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలని అన్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదులను పరిశీలించి, వాటి పరిష్కారాలను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. 14400 నెంబర్ పై మరింత ప్రచారం నిర్వహించాలని, అవినీతి వ్యవహారాలతో పక్కా ఆధారాలతో దొరికిపోతే వారిపై చర్యలు తీసుకోవడానికి ఎక్కువ కాలం పట్టకూడదని పేర్కొన్నారు. అవినీతిపరులకు నిర్దిష్ట కాలావధిలో శిక్ష పడేందుకు తగిన చట్టం తీసుకువస్తామని, అసెంబ్లీలో ఈ చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలని సూచించారు.  

రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆజాద్, సిబల్ ఆగ్రహం

  కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై సీడబ్ల్యూసీ సమావేశంలో వాడీవేడీగా చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. 23 మంది సీనియర్లు లేఖ రాయడంపై రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్‌ , కపిల్ సిబాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  రాహుల్ ఆరోపించినట్లు ఒకవేళ తాను బీజేపీ ఏజెంట్‌నే అయితే, తాను వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతానని ఆజాద్ అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలి బాగోలేకపోవడంతోనే తాము లేఖ రాశామని చెప్పారు.   తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని అనడం ఏంటంటూ కపిల్ సిబాల్ కూడా ట్విట్టర్ లో  రాహుల్ గాంధీని ప్రశ్నించారు.  రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను కాపాడామని, మణిపూర్‌లో బీజేపీని దించి కాంగ్రెస్‌ను రక్షించామని, తాను  30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అని ప్రశ్నించారు.

పర్సనల్ విషయం చెబుతాడనుకుంటే.. జస్ట్ సినిమా గురించే చెప్పిన సాయితేజ్!

  ప్రతిరోజూ పండగే' సినిమా విజయం సాధించడంతో ఫుల్ జోష్ మీద ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే, సోమవారం ఉదయం 10 గంటలకు ఓ విషయం చెబుతానంటూ సాయితేజ్ తన ట్విట్టర్ ఖాతాలో నిన్న ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు. 'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి..' అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరోలు నిఖిల్, నితిన్‌తో పాటు రానాల పేర్లను ప్రస్తావించాడు. అలాగే, సింగిల్‌గా ఉన్న ప్రభాస్‌కు టాటా చెప్పాడు. అయితే, ఈ రోజు తన పెళ్లి గురించి సాయితేజ్‌ ప్రకటన చేస్తాడని అభిమానులందరూ భావించారు. తన పెళ్లి గురించి చెప్పకుండా సాయితేజ్‌ తన సినిమాలోని ఓ పాట గురించి ప్రకటన చేసి నిరాశపర్చాడు. ఇప్పటికే సోలో బతుకే సో బెటరు సినిమా  నుంచి ‘నో పెళ్లి’ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటలో టాలీవుడ్ హీరోలు రానా, వరుణ్ తేజ్‌లు కూడా కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పాటను విడుదల చేస్తున్నామంటూ ఆయన ప్రకటించాడు.   'అంత స్ట్రి...

టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్‌ కౌచ్ ఉంది.. నేనూ వేధింపులు ఎదుర్కొన్నాను: హీరోయిన్ అనుష్క‌

  సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్‌ విషయంపై హీరోయిన్ అనష్క స్పందించింది. ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తాను కూడా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్ వల్ల వేధింపుల బారిన ప‌డ్డాన‌ని పేర్కొంది. సినీ రంగంలో ఇటువంటి వేధింపులు ఎదురవుతాయన్న  విష‌యం అందరికీ తెలిసిన అంశమేనని, ఇందులో దాయడానికి ఏమీ లేదని ఆమె చెప్పింది. టాలీవుడ్‌లోనూ ఇది ఉందని ఆమె తెలిపింది. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండ‌డంతో క్యాస్టింగ్‌ కౌచ్‌ నుంచి త‌ప్పించుకోగ‌లిగానని ఆమె తెలిపింది. అందుకే తనతో ఎవరూ చెడుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది. అయితే, కొత్త‌గా సినీ పరిశ్రమలోకి వచ్చే వారికి క్యాస్టింగ్‌ కౌచ్‌ వంటి సమస్యలు త‌ప్ప‌వ‌ని తెలిపింది. తాను వేధింపులకు లొంగిపోకుండా సినీ పరిశ్రమలో నడుచుకునే దాన్నని చెప్పుకొచ్చింది.

ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్ ప్రభాస్: బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్రశంసలు

  బాహుబలి' తర్వాత మన దేశంలోని అగ్ర నటుల్లో ఒకరిగా ప్రభాస్ ఎదిగిపోయాడు. తాజాగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో 'ఆదిపురుష్' చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ వైరల్ అయింది. ఈ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషించనున్నట్టు సమాచారం. మరోవైపు, ప్రభాస్ పై ఓంరౌత్ ప్రశంసలు కురిపించారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో ప్రభాస్ అని ఓంరౌత్ కితాబిచ్చారు. 'మోర్ దేన్ లైఫ్' సినిమాలను చేయగల హీరో అని ప్రశంసించారు. ఇదే సమయంలో 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ చెప్పారు. ఓవైపు మౌనమునిలా ఉంటూనే... గర్జించే పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలిపారు. ఇప్పటి వరకు కనిపించని ఓ డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తాడని చెప్పారు. ఈ సినిమా కోసం విలువిద్యలో ప్రభాస్ శిక్షణ తీసుకోబోతున్నాడని వెల్లడించారు.  

కరోనా నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్

 బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆయన షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'కౌన్‌ బనేగా కరోర్‌పతి' 12వ సీజన్‌ షూటింగ్‌లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. షూటింగ్ సందర్భంగా అక్కడి సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించి ఉండడం ఇందులో కనపడుతోంది. బ్యాక్‌ టు వర్క్‌.. కేబీసీ 12వ సీజన్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ పీపీఈ కిట్లు ధరించి షూటింగ్‌లో పాల్గొంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది శుభపరిణామమని, కేబీసీ ప్రారంభమై ఈ ఏడాదితో 20 ఏళ్లు గడుస్తున్నాయని చెప్పారు.

నెమళ్లకు ఆహారం అందించిన ప్రధాని.. వీడియో వైరల్

వీడియో చూడండి.  Click here ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో మనందరికీ తెలుసు. పర్యావరణమన్నా.. జీవరాశులన్నా.. ఆయన అమితంగా ఇష్టపడతారు. అయితే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ త‌న రోజువారీ ఉద‌య‌పు దిన‌చ‌ర్య‌లోని కొన్ని క్షణాలను వీడియోగా మలిచి ఇన్‌స్టాగ్రాం‌మ్‌ ద్వారా ఆదివారం పంచుకున్నారు. ‌ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో మనందరికీ తెలుసు. పర్యావరణమన్నా.. జీవరాశులన్నా.. ఆయన అమితంగా ఇష్టపడతారు. అయితే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ త‌న రోజువారీ ఉద‌య‌పు దిన‌చ‌ర్య‌లోని కొన్ని క్షణాలను వీడియోగా మలిచి ఇన్‌స్టాగ్రాం‌మ్‌ ద్వారా ఆదివారం పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నెమళ్లకు ఆహారం    అందిస్తున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అయితే ప్రధానికి ప‌లు నెమ‌ళ్లు మ‌చ్చిక అయిన దృశ్యాలను ఈ వీడియోలో ఉంచారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని మోదీ విలువైన క్షణాలు అనే క్యాప్షన్‌తోపాటు హిందీలో రాసిన పద్యాన్ని సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  ప్ర‌ధాని నివాస ...