Skip to main content

Posts

Showing posts from October 24, 2019

ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం.. మరో కీలక ముందడుగు వేసిన జగన్ సర్కార్..

వచ్చే నెల 15వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించింది. ప్రజా రవాణాశాఖ,పోస్టులు,పేస్కేల్ విధి విధానాలపై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలు సిద్దం చేయనుంది. ఆర్టీసీ విలీన ప్రక్రియను ఏపీ సర్కార్ వేగవంతం చేసింది. విలీన ప్రక్రియను పూర్తి చేసేందు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఆర్థిక,రవాణ,జీఏడీ,న్యాయశాఖలకు సంబంధించిన ఏడుగురు ఉన్నతాధికారులను గ్రూప్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వచ్చే నెల 15వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించింది. ప్రజా రవాణాశాఖ ఏర్పాటు,డిజిగ్నేషన్లు,పోస్టులు,పేస్కేల్ విధి విధానాలపై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలు సిద్దం చేయనుంది. వర్కింగ్ గ్రూప్ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం విలీనంపై తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా,ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా కార్మికుల నుంచి వినిపిస్తోంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే విలీనంపై నిర్ణయం తీసుకున్నారు. మంత్ర...

మమ్మల్ని అపారమైన అభిమానంతో దీవించారు: మహారాష్ట్ర, హర్యానా ప్రజలకు మోదీ కృతజ్ఞతలు

  మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మహారాష్ట్ర, హర్యానా ప్రజలు తమను అపారమైన అభిమానంతో దీవించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ట్వీట్ చేశారు. మరోసారి ప్రజల మద్దతు పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసం అహర్నిశలు శ్రమించిన బీజేపీ, శివసేనకు ప్రతి కార్యకర్తకు, యావత్ ఎన్డీయే కుటుంబానికి అభివందనం అంటూ పేర్కొన్నారు. హర్యానాలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ అభివృద్ధి అజెండాను వివరించిన బీజేపీ కార్యకర్తల కృషి శ్లాఘనీయం అని కొనియాడారు. కాగా, ఎన్నికల ఫలితాల్లో హర్యానాలో బీజేపీ మొత్తం 90 సీట్లకు గాను 40 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను 157 స్థానాల్లో నెగ్గి మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది

తెలుగు వారిని అవమానిస్తే ఊరుకోం: చలసాని శ్రీనివాస్

విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ బీజేపీపై స్పందించారు. బీజేపీ అహంకారంతో వ్యవహరిస్తోందని అన్నారు. తెలుగువారిని అవమానిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నిధులు కేటాయించాలని, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ తేవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. అటు సీఎం జగన్ పైనా చలసాని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంపై బాధ్యత ఉందని జగన్ మర్చిపోతున్నారని, రాష్ట్ర ప్రజల తరఫున విభజన హామీలపై కేంద్రం మీద జగన్ ఒత్తిడి తేవాలని సూచించారు. అంతేగాకుండా, రాష్ట్ర సర్కారు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. విభజన హామీల కోసం మరోసారి ఉద్యమాలు నిర్వహిస్తామని, ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపడతామని, ముందుగా వచ్చే నెలలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయమై జనవరి నుంచి ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని తెలిపారు

మహేష్ ఫ్యామిలీ యాడ్ చూసారా?

చూడ ముచ్చటగా ఉన్న మహేష్ బాబు కుటుంబం సందేశాత్మక చిత్రాలతో వరుస హిట్లు కొట్టి అభిమానులను అలరిస్తున్నాడు సూపర్‌స్టార్‌ మహేష్ బాబు. అయితే కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలోనూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తాడు. అంతేకాదు అందుకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులను ఆకట్టుకుంటాడు. ఇక టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్న మహేష్‌… ప్రచార ప్రకటనల్లోనూ అగ్ర స్థానంలోనే ఉన్నాడు. వరుస కమర్షియల్‌ యాడ్స్‌తో దూసుకుపోతున్నాడు. మహేష్‌బాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ అలాంటిది మరి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఏకంగా సూపర్‌స్టార్‌ ఫ్యామిలితో ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో మహేష్‌తో పాటు అతడి భార్య నమ్రతా శిరోద్కర్‌, పిల్లలు గౌతం, సితారలు కూడా నటించారు. ఇందుకు సంబంధించిన విశేషాలను ట్విటర్‌లో షేర్‌ చేసుకున్న మహేష్‌… తమ కుటుంబమంతా కలిసి నటించడం ఇదే తొలిసారి అని.. ఇదో గొప్ప విశేషం అని పేర్కొన...

సీపెట్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి: కేంద్ర మంత్రి సదానంద గౌడ

ప్లాస్టిక్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ గా దృష్టి సారించారని, ప్లాస్టిక్ నిర్మూలనకు కూడా పిలుపునిచ్చారని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం మండలం, సూరంపల్లిలో సీపెట్ భవన సముదాయాన్ని సీఎం జగన్ తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ తో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతను కలిగివున్న దేశం భారత్ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైంది. దాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణం కలుషితం కాకుండా కాపాడవచ్చు. ప్రధాని మోదీ ప్లాస్టిక్ నిర్మూలనకు పిలుపునిచ్చారు. సీపెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసేందుకు కృషిచేస్తుంది. విజయవాడలో పరిశ్రమలు నెలకొల్పడానికి మంచి అవకాశాలున్నాయి, దీనిపై నేను సీఎం జగన్ తో చర్చిస్తా. కొత్త రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో మరో సీపెట్ సంస్థ ఏర్పాటు చేస్తాం’ అని సదానంద గౌడ చెప్పారు.   

సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌

 రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. కార్మికులు ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనం అసంబద్ధమైన నినాదం ‘‘ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరు పడితే వారు కోరితే కలుపుతారా? ఎవర్ని మోసం చేయాలని? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత వారు కూడా విలీనం చేయాలని కోరితే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఓ పద్ధతి, విధానం ఉంటుంది. ఆర్టీసీని విలీనం చేశారు.. వీరిని ఎందుకు చేయరని ఇవే కోర్టులు మళ్లీ ఆదేశాలు జారీ చేస్తాయి. అప్పుడేం సమాధానం చెప్పాలి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, తెలివి తక్కువ నినాదం. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఔచిత్యం లేదు. ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది. ఆర్టీసీ ముగిసిపోయింది.. ఇట్స్‌ గాన్‌ కేస్‌. సమ్మెతో వెయ...

మంత్రులకూ తప్పని ఓటమి..

   హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార భాజపా కూటమి 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీని మాత్రం సాధించలేకపోయింది. మరోవైపు రాష్ట్రంలో కేబినెట్‌ మంత్రులే ఓటమి చవిచూడటం గమనార్హం.  హరియాణా కేబినెట్‌లో సీఎంతో కలిపి 9 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, అనిల్‌ విజ్‌ మినహా మిగతా ఏడుగురు మంత్రులు విజయతీరాలను చేరుకోలేకపోయారు. ఇప్పటికే మంత్రులు కెప్టెన్‌ అభిమన్యు, రామ్‌ విలాస్‌ శర్మ ఓడిపోగా.. మిగతా వారూ వెనుకంజలో ఉన్నారు. సహాయ మంత్రి కృష్ణ కుమార్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ బరాలా కూడా ఓటమి చవిచూశారు.  హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 సీట్లు అవసరం. అయితే ప్రస్తుతం ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌కు మెజార్టీ రాకపోవడంతో దుశ్యంత్‌ చౌటాలా నేతృత్వంలోని జేజేపీ కీలకంగా మారింది. ఆ పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింది. జేజేపీ ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయన...

ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యాణా బీజేపీ చీఫ్ రాజీనామా

మహారాష్ట్ర ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ... హర్యాణా ఫలితాలు మాత్రం ఆ పార్టీకి నిరాశను కలిగిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలను కూడా గెలవలేని స్థితిలో బీజేపీ ఉంది. ఇతరులను కలుపుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యాణా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. మరోవైపు, ఫలితాలు హంగ్ దిశగా వెలువడుతుండటంతో... జేజేపీ కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. 10 స్థానాల్లో ఈ పార్టీ ఆధిక్యంలో ఉంది.

ఉత్తమ్‌’ కంచుకోటను బద్దలుకొట్టిన సైదిరెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహించడంతో ప్రచారం కూడా ‘నువ్వా నేనా’ అన్నట్లు సాగింది. తెరాస ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చిన సంక్షేమ పథకాలతో ఆ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపుపై ధీమా ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్‌కు హుజూర్‌నగర్‌ కంచుకోట కావడంతో విజయంపై ఆ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి కూడా నమ్మకంగా ఉన్నారు. అనూహ్యంగా భాజపా, తెదేపా కూడా రేసులోకి వచ్చాయి. కమలం పార్టీ నుంచి కోటా రామారావు , తెదేపా నుంచి కిరణ్మయి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో 76 మంది అభ్యర్థులు పోటీ చేయగా..ప్రధాన పోరు మాత్రం తెరాస-కాంగ్రెస్‌ మధ్యనే నడిచింది. చివరికి గెలుపు మాత్రం గులాబీ నేతనే వరించింది. తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,233 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ప్రచారంలో పదునైన విమర్శలు ప్రచారానికి తక్కువ సమయం లభించడంతో కాంగ్రెస్‌-తెరాసలు వాడివేడి విమర్శలు చేసుకొన్నారు. హస్తం పార్టీ నుంచి ఎంపీలు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. తెరాస ప్ర...

చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ?

   దుశ్యంత్‌ చౌటాలా ఎవరు?.. మాజీ ఉపప్రధాని చౌదరీ దేవీలాల్‌ మునిమనవడు.. హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌటాలా మనవడు.. మాజీ ఎంపీ.. ఇప్పటివరకు తెలిసిందిదే.. కానీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనో కింగ్‌ మేకర్‌..! ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పే కీలక నాయకుడు.. ‘చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ’ అంటూ ప్రధాన పార్టీలు ఆత్రుతగా వెతుకుతున్న సరికొత్త ‘హంగ్‌ కింగ్‌’. రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితం హంగ్‌ దిశగా సాగుతోంది. భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నా.. రెండు పార్టీలకు స్పష్టమైన ఆధిక్యం దక్కే అవకాశాలు కన్పించట్లేదు. దీంతో ఇరు పార్టీల చూపు  చౌటాలా నాయకత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)పై పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కోసం భాజపా, కాంగ్రెస్‌లు ఇప్పుడు ఆయన మద్దతు కోరుతున్నాయి. రంగంలోకి కేంద్ర నేతలు.. ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తారుమారవడంతో భాజపా, కాంగ్రెస్‌ కేంద్ర నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఫలితాలు సంక్లిష్టంగా ఉండటంతో  భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. ...
 మహారాష్ట్ర ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ... హర్యాణా ఫలితాలు మాత్రం ఆ పార్టీకి నిరాశను కలిగిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలను కూడా గెలవలేని స్థితిలో బీజేపీ ఉంది. ఇతరులను కలుపుకుంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, ఫలితాలకు బాధ్యత వహిస్తూ హర్యాణా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. మరోవైపు, ఫలితాలు హంగ్ దిశగా వెలువడుతుండటంతో... జేజేపీ కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. 10 స్థానాల్లో ఈ పార్టీ ఆధిక్యంలో ఉంది.

ఆసక్తికరంగా మారిన హర్యానా రాజకీయాలు.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్

హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు కనపడట్లేదు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీ సాయం తీసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. జననాయక్ జనతా పార్టీ, ఐఎన్ఎల్డీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా మీడియాతో మాట్లాడుతూ... 'జేజేపీ, ఐఎన్ఎల్డీతో కలిసి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం' అని తెలిపారు. భూపిందర్ సింగ్ తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడారు. మరోవైపు, ఢిల్లీకి రావాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా నుంచి పిలుపువచ్చింది.

సీఎంకు జరిమానా విధించండి: డీజీపీని ఆదేశించిన కిరణ్ బేడీ

    ముఖ్యమంత్రికైనా, సామాన్యుడికైనా ట్రాఫిక్ రూల్స్ ఒకటేనని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన ముఖ్యమంత్రి నారాయణస్వామికి జరిమానా విధించాలంటూ డీజీపీని ఆదేశించారు. ఘటన వివరాల్లోకి వెళ్తే, ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ర్యాలీ సందర్భంగా నారాయణస్వామి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ పెట్టుకోకుండా ఆయన బైక్ నడిపారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రాఫిక్ రూల్స్ సామాన్యులకు మాత్రమేనా? ముఖ్యమంత్రికి వర్తించవా? అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో సీఎంకు జరిమానా విధించాలని కిరణ్ బేడీ ఆదేశించారు. మరోవైపు, కిరణ్ బేడీ, నారాయణస్వామి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఇద్దరూ పరస్పరం విమర్శలను గుప్పించుకున్నారు.   

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్.. చంద్రబాబు స్కెచ్: విజయసాయిరెడ్డి

    వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని... తద్వారా ఆ పార్టీని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఏపీలో తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా స్కెచ్ వేశారని తెలిపారు. అందుకే, ముందు నుంచి బీజేపీ జెండా మోస్తున్నవారిని ఎదగనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.

హంగ్ దిశగా హరియాణా... కింగ్ మేకర్ జేజేపీ... తీవ్ర ఉత్కంఠ!

90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హరియాణాలో ప్రజలు ఏ పార్టీకీ భారీ ఆధిక్యాన్ని ఇచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ, మరోసారి గద్దెనెక్కేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఒకటి, రెండు అడుగుల దూరంలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్, జేజేపీలు కలిస్తే, మ్యాజిక్ ఫిగర్ కు మరింత చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ దఫా హంగ్ ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ పరిశీలిస్తే, బీజేపీ 38, కాంగ్రెస్ 29, ఐఎన్ఎల్డీ 1, జేజేపీ 12, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మరో రెండు చోట్ల సాంకేతిక కారణాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. అధికార పీఠం దక్కాలంటే 46 సీట్లు అవసరం కాగా, ఏ పార్టీకీ అన్ని సీట్లు లభించే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. ఫలితాల సరళి తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండటంతో క్యాంప్ రాజకీయాలు సైతం మొదలైపోయాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అందరు అభ్యర్థులూ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. ఇదే సమయంలో జేజేపీని కలుపుకుని ముందుకు సాగే దిశగానూ ఆ పార్టీ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచ...

స్టన్నింగ్ స్టిల్స్... 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'లో జగన్ గా నటుడు అజ్మల్!

సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలు నేపథ్యంగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పలువురు ప్రస్తుత రాజకీయ నాయకుల పాత్రలు కనిపించనున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను ఎవరు పోషించారా? అన్న అభిమానుల ప్రశ్నలకు సమాధానం లభించింది. జగన్ పాత్రలో నటుడు అజ్మల్ కనిపించనున్నాడు. అతని స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్నాయి. అచ్చం జగన్ మాదిరిగానే నమస్కారం పెడుతున్న అజ్మల్ స్టిల్ ను చిత్ర పీఆర్ఓ రమేశ్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.

హుజూర్ నగర్ ఎన్నిక కౌంటింగ్... ఆధిక్యంలో సైదిరెడ్డి!

  తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.  తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సైదిరెడ్డి 17,476 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసిన సంగతి తెలిసిందే.  గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి విజయం సాధించిన ఉత్తమ్, ఆపై నల్గొండ లోక్ సభకు పోటీ చేసి గెలుపొందడంతో, హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. కాగా, మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ సాగనుండగా, మధ్యాహ్నం ఒంటిగంట లోపే తుది ఫలితం వెలువడుతుందని అధికారులు అంటున్నారు.   

మహారాష్ట్ర, హరియాణాలో కమలం జోరు

 మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో 142 చోట్ల భాజపా ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ 87, ఇతరులు 30 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక హరియాణాలో భాజపా 40 చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్‌ 23, జననాయక్‌ జనతా పార్టీ 11, ఇతరులు 9 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.  హరియాణాలోని కైతాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణ్‌దీప్‌సింగ్‌ సుర్జేవాలా వెనుకంజలో ఉన్నారు. హరియాణా దాద్రి నుంచి పోటీ చేస్తున్న రెజ్లర్‌ బబితా ఫొగట్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని వర్లీ నియోజకవర్గంలో శివసేన యువ నేత ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు.