Skip to main content

Posts

Showing posts from August 29, 2020

సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి. . సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌-4

 దేశంలో సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌-4 అమలు కానుండగా.. మరిన్ని సడలింపులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లను పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించింది. దశలవారీగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను మరింత విస్తృతం చేసింది. కంటైన్‌మెంట్ జోన్‌లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు హోంశాఖ అవకాశం కల్పించగా.. కంటైన్‌మెంట్‌ జోన్లలోమాత్రం సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో విస్తృతమైన సంప్రదింపుల ఆధారంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు * సెప్టెంబర్‌ 21 నుంచి విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను ఇండోర్‌లో జరుపుకొనేందుకు అవకాశం. 100 మంది వరకు మాత్రమే అనుమతి * సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరిచేందుకు అనుమతి * సెప్టెంబర్‌ 21 నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు అనుమతి *...

రాజధాని తరలింపు వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలుకు జనసేన నిర్ణయం

 

ఆసుపత్రిలో ప్రముఖ గాయని .. పరిస్థితి విషమం

ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రముఖ సింగర్ ఆసుపత్రి పాలైంది అయ్యింది.ఇండియన్‌ ఐడల్ తో సింగర్ రేణు నగర్ పాపులర్ అయ్యింది. దేశంలో మంచి సింగర్ గా ఆమెకు మంచి పేరుంది . అయితే తన ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో రేణు ఆరోగ్యం క్షీణించింది. ఆమెను జైపూర్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అసలు విషయం ఏంటంటే .. సింగర్ రేణు నగర్ పెళ్ళైన రవిశంకర్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు ఇంటినుంచి పారిపోయారు. కూతురు కనిపించకపోవడంతో రేణు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు ఆగష్టు 24న వీరి జాడను కనిపెట్టి తిరిగి తీసుకువచ్చారు. ఈక్రమంలో బుధవారం రవిశంకర్ విషంతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెల్సుకున్న రేణు సృహతప్పిపడిపోయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో చిక్సిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

లిఫ్టులో వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన యువతి... వీడియో వైరల్

“All I want is to save her!” Surveillance camera captured the touching moment when a young mom put her child on the floor to help an elderly woman who fainted from a heart attack in Xunyang County, northwest China's Shaanxi Province. pic.twitter.com/mkoRMlJhsu — People's Daily, China (@PDChina) August 29, 2020  అపార్టుమెంటులోని లిఫ్టులో ఓ వృద్ధురాలు గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆ లిఫ్టులో ఆమె ఒక్కతే ఉంది. కాసేపటికి లిఫ్టు తెరుచుకున్నాక బయటి నుంచి లిఫ్టులోకి వచ్చిన ఓ యువతి ఆ వృద్ధురాలిని చూసింది. అంతే, ఆమెను కాపాడడమే లక్ష్యంగా ఆ యువతి తన పసిబిడ్డను లిఫ్టు బయట పడుకోబెట్టి వచ్చేసింది. ఆ వృద్ధురాలి గుండె పంపింగ్‌ తగ్గిపోవడంతో ఆమె దాన్ని సరిచేసేందుకు ప్రథమచికిత్సలో భాగంగా ఆ యువతి ప్రయత్నాలు మొదలుపెట్టింది.  తన పసిబిడ్డ లిఫ్టు బయట ఏడుస్తున్నప్పటికీ వృద్ధురాలిని బతికించేందుకు ఆమె ఆరాట పడి, చివరకు ఆమె ప్రాణాలను కాపాడింది. ఆ సమయంలో ఆ వృద్ధురాలిని కాపాడడమే తనకు ముఖ్యంగా అనిపించిందని ఆ యువతి చెప్పింది. ఈ ఘటన వాయవ్య చైనాలోని జున్యాంగ్ కౌంటీలో చో...

పులివెందుల ఎస్సై సాహసం.. ప్రాణాలకు తెగించి, కారుపై వేలాడుతూ మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట!

  మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పులివెందుల ఎస్సై గోపీనాథరెడ్డి ప్రాణాలకు తెగించి పోరాడిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. స్థానిక రాఘవేంద్ర థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన ఓ వాహనంలో పెద్ద ఎత్తున మద్యం ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితులు వారిని భయపెట్టేందుకు కారును ముందుకు, వెనక్కి వేగంగా కదిలించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ఎస్సై గోపీనాథ్‌రెడ్డి కారు ముందు భాగాన్ని పట్టుకున్నారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని నిందితులు కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. అప్రమత్తమైన ఎస్సై జారి కిందపడకుండా కారును గట్టిగా పట్టుకున్నారు. ఎస్సై కారుపై వేలాడుతుండగానే నిందితులు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కారును పోనిచ్చారు. ఈ క్రమంలో ఎస్సై గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలను పగలగొట్టారు. ఈలోపు కారును అనుసరించిన పోలీసులు వాహనాన్ని అడ్డుకోవడంతో నిందితుల ఆటకు అడ్డుకట్ట పడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారు నుంచి 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున...

అన్న స్థానంలో ఉద్యోగం చేస్తోన్న తమ్ముడు.. ఒకేలా ఉండడంతో 12 ఏళ్లుగా గుర్తు పట్టని వైనం

 వారిద్దరు కవలలు.. అచ్చం ఒకేలా ఉంటారు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏకంగా 12 ఏళ్లుగా అన్న ఉద్యోగాన్ని తమ్ముడు చేస్తున్నాడు. చివరకు ఈ విషయాన్ని గుర్తించిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలోని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రాందాస్‌, గాదె రవీందర్‌ సోదరులు. అప్పట్లో గాదె రాందాస్‌ కు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగం రాగా, అతడి పేరుతో తమ్ముడు గాదె రవీందర్‌ ఉద్యోగంలో చేరాడు. అనంతరం క్రమంగా లైన్‌మన్‌గా పదోన్నతి పొందాడు. వారి బాగోతాన్ని గుర్తించిన ఓ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. రాందాస్‌ పేరుతో రవీందర్‌ ఉద్యోగం చేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రవీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మీకోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన ట్రంప్

 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి అధికారికంగా నామినేషన్ స్వీకరించిన అనంతరం వైట్‌హౌస్‌లో ట్రంప్ దాదాపు 70 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘మీ కోసం పోరాటం’ పేరుతో 49 అంశాలతో కూడిన ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. గత నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి గురించి, తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే నాలుగేళ్లలో తాను ఏం చేయబోయేది వివరించారు. అమెరికాను మరోమారు సూపర్ పవర్‌గా నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు. చైనాకు తరలిపోయిన కంపెనీలు, ఉద్యోగాలను తిరిగి రప్పిస్తామన్నారు. చంద్రుడిపైకి మహిళను పంపడంతోపాటు అంగారకుడిపై అమెరికా జెండా ఎగురవేస్తామన్నారు.  చైనాపై ఆధారపడడాన్ని తగ్గిస్తామన్నారు. అమెరికా చరిత్రలోనే లేని విధంగా ఘనమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామన్నారు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలు అమెరికా కలలు, అరాచకవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా ట్రంప్ అభివర్ణించారు. అమెరికాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదని ట్రంప్ పేర్కొన్నారు. మనకు సాధ్యం కానిది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెబుతానన్నారు. అమెరికన్ జీవన విధానాన్ని కాపాడుకోవాలా? లేక విధ్వంసం సృష్టించే రాడికల్ ఉద్యమా...

రాజుగారి గది 4'కి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు!

 ఇటీవలి కాలంలో తెలుగులో సీక్వెల్స్ నిర్మాణం పెరుగుతోంది. ఒక సినిమా హిట్టయితే కనుక దానికి సీక్వెల్ ను ప్లాన్ చేసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా ముగింపును కూడా రూపొందిస్తున్నారు. చిత్రకథను కొనసాగించే అవకాశం ఉండేలా సినిమా ముగింపును ఇస్తున్నారు. ఈ క్రమంలో 'రాజుగారి గది' సినిమాకు త్వరలో నాలుగో ఎడిషన్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి, ఐదేళ్ల క్రితం 'రాజుగారి గది' పేరిట ఓ హారర్ థ్రిల్లర్ ను రూపొందించాడు. అది అనూహ్యమైన విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా 'రాజుగారి గది 2' చిత్రాన్ని నిర్మించారు. అందులో నాగార్జున కథానాయకుడుగా నటించడంతో దానికి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత 'రాజుగారి గది 3'ని తెరకెక్కించారు. ఇందులో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్ గా నటించారు. ఇది కూడా ఫరవాలేదనిపించింది. ఈ క్రమంలో 'రాజుగారి గది 4' చిత్ర నిర్మాణానికి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వ...