Skip to main content

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!


tollywood comedian venumadhav passed away
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు.
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారని మంగళవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చికిత్స పొందుతూ ఆయన  మరణించినట్లు తెలుస్తోంది.
1979లో సూర్య పేట్ జిల్లాలో కోదాడ మండలంలో జన్మించిన ఆయన నాల్గవ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన 'సంప్రదాయం' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వేణుమాధవ్. 'తొలిప్రేమ' సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆయన నటించిన 'లక్ష్మీ' సినిమాకి ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 'సంక్రాంతి, 'హంగామా', 'పోకిరి', 'దిల్' ఇలా పలు సినిమాలలో హాస్య నటుడిగా కనిపించి మెప్పించాడు. అతడికి భార్య శ్రీవాణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Comments