ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న 4,5 విడతల బకాయిలను నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
4, 5 విడతలకు సంబంధించి రూ.7959.12 కోట్లు చెల్లింపును నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు లేకపోవడంతో రుణమాఫీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గత ప్రభుత్వం మార్చిలో విడుదల చేసిన జీవోను నిలిపివేసింది. తాజాగా జీవో 99 విడుల చేసిన ప్రభుత్వం.
ఇకపోతే బుధవారం రైతు భరోసా పథకంపై సమీక్ష నిర్వహించారు సీఎం వైయస్ జగన్. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య రుణమాఫీ రద్దు చేస్తూ జీవో 38ను రద్దు చేస్తూ కొత్త జీవోను విడుదల చేశారు.
అయితే రైతు భరోసా పథకం అమలు చేస్తున్న నేపథ్యంలోనే రైతు రుణమాఫీని రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు తెలుపుతూ జీవో 99ని విడదుల చేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక జీవోలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
అంతేెకాదు గత ప్రభుత్వంలో జరిగిన కీలక ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం ఆచితూచిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ ఖజానాను ఆదా చేసేందుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో రూ.780 కోట్లు ఆదా చేసిన విషయం తెలిసిందే.
Comments
Post a Comment