రియాద్ (సౌదీ అరేబియా): భారత్‌లో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ సౌదీకి చెందిన సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో ప్రభుత్వం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ రియాద్‌లో జరిగిన భవిష్యత్ పెట్టుబడుల ఆరంభ సదస్సు (ఎఫ్‌ఐఐ) 2019లో పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఐదేళ్లలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్న మోదీ.. మౌలిక వసతుల రంగంలోనూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. ఒక్క ఈ రంగంలోనే రాబోయే ఐదేళ్లలో 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పర్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న విధానాలను మోదీ వివరించారు. ఈ నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్నోవేషన్ ఇండెక్స్, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్‌లో తమకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్‌లను ప్రస్తావించారు. అంతేకాక దేశంలోని 400 విలియన్ల యువతకు రాబోయే 3-4 ఏళ్లలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ‘‘2024 ...