Skip to main content

Posts

Showing posts from August 5, 2020

రాజ్యాంగంలోని సీతారాముల ఫొటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి..

Original document of the Constitution of India has a beautiful sketch of Lord Ram, Mata Sita and Laxman returning to Ayodhya after defeating Ravan. This is available at the beginning of the chapter related to Fundamental Rights. Felt like sharing this with you all. #JaiShriRam pic.twitter.com/jCV9d8GWTO — Ravi Shankar Prasad (@rsprasad) August 5, 2020 అయోధ్య రామమందిర నిర్మాణానికి ఈరోజు భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ప్రత్యేకమైన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. రాజ్యాంగంలోని సీతారాముల ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. 'రాజ్యాంగం ఒరిజినల్ ప్రతిలో రావణుడిని చంపిన తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్న రాముడు, సీత, లక్ష్మణుడి అందమైన చిత్రం ఉంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన చాప్టర్ ప్రారంభంలో ఈ చిత్రం ఉంది. ఈ అందమైన చిత్రాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది' అని రవిశంకర్ ట్వీట్ చేశారు. మరోవైపు రవిశంకర్ ప్రసాద్ కు శ్రీరాముడి న్యాయవాదిగా పేరుంది. అలబాద్ హైకోర్టులో రామజన్మభూమి వివాదం కేసులో ఆయన శ్రీరాముడి తరపున వాదనలు వినిప...

అయోధ్య భూమిపూజ సందర్భంగా రామాయణ పఠనం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

  దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో హిందువులంతా భక్తిశ్రద్ధలతో గడుపుతున్నారు. సామాన్యుల వద్ద నుంచి, ప్రముఖుల వరకు వారి ఇంటి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన అధికార నివాసంలో రాముడికి పూజలను నిర్వహించారు. తన సతీమణి ఉషతో కలిసి పూజలు చేశారు. రామాయణ పఠనం కూడా చేశారు. ఈ విషయాన్ని పూజ అనంతరం వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉప రాష్ట్రపతి భవన్ సిబ్బంది కూడా రామాయణ పఠనంలో పాల్గొన్నట్టు వెంకయ్య వెల్లడించారు. మరోవైపు అయోధ్యలో ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం ముగిసింది.

ఇది చరిత్రాత్మకమైన రోజు, ప్రధాని మోదీ

రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన ఈ రోజు చరిత్రాత్మకమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవలసిన అవసరం ఉందని, నేడు తానిక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన  చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన స్థలంలో వెండి ఇటుకను వేసి భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. భారత దేశమంతా నేడు రామజపాన్ని స్మరిస్తోందని పేర్కొన్నారు. ఇక్కడికి చేరుకున్న భక్తులందరినీ మోదీ అభినందించారు.’ దశాబ్దాల కల నెరేవేరింది. రాముడి ఔన్నత్యాన్ని భారతీయులందరూ అలవరచుకోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహత్తర  క్షణం కోసం తాను, ఈ దేశం ఎన్నేళ్లుగానో వేచి చూసినట్టు ఆయన చెప్పారు. రాముడు మన అందరిలో ఉన్నాడని, మన సంస్కృతికి రాముడే ఆధారమని మోదీ పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణం చరిత్రాత్మకమైనదే కాదు.. చరిత్ర పునరావృతమవుతుందని తెలిపే రోజిది.. దేశంలోని కోట్లాది భక్తుల కల నెరవేరబోతోంది అని ఆయన అన్నారు. సత్యం, అహింస, శాంతి, విశ్వాసం, త్యాగనిరతికి పెట్టింది పేరయిన  ఈ దేశం ధర్మాన్ని ప్రబోధిస్తుందంటే అది రాముడి చలవే అని ఆయన వ్యాఖ్యానించారు. రాముడు విశ్వజనీనుడని, కబీర్ దాస్, న...

ఆధునిక భారతదేశానికి ఇది చిహ్నం- రాష్ట్రపతి

ఆధునిక భారతదేశానికి ఇది చిహ్నం- రాష్ట్రపతిసాకేత పురంలో రాముడికి భూమి పూజ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ రామ్‌నాథ్ కోవింద్‌ ట్వీట్ చేశారు. అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిరం. రామాయణంలోని సిద్ధాంతాలు, విలువలకు అద్దం పడుతుందని, ఆధునిక భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చట్టబద్ధంగా నిర్మిస్తున్న రామాలయం భారతదేశం యొక్క సామాజిక సామరస్యం, ప్రజల ఆంకాక్షకు ప్రతిరూపమని పేర్కొన్నారు. భూమిపూజలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

అయోధ్యలో వైభవంగా భూమిపూజ

  అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా  రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌, ఇతర ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఆన్‌లైన్‌ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది.   భూమి పూజలో నక్షత్రాకారంలో ఉన్న అయిదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ఆ వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమ పండితుల భావన. అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ.. భద్రాద్రిలో ప్రత్యేక పూజ

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరికాసేపట్లో భూమి పూజ జరగనున్న నేపథ్యంలో భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తికావాలని కోరుకుంటూ స్థానాచార్యుడు స్థలసాయి, ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపంలో సీతారామచంద్రుల వారిని ఆరాధించి అర్చన చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో నెయ్యి, సమిధలు సమర్పించి హోమం నిర్వహించారు.  

ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా పాజిటివ్..

 కరోనా వైరస్.. ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఎస్పీబీ అభిమానులకు తెలియజేశారు. ”గత రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతున్నాను. వైద్య పరీక్షల అనంతరం కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. మీ అశీస్సులతో తొందరలోనే కోలుకుంటాను” . అని ఎస్పీబీ వీడియోలో పేర్కొన్నారు.

ఖైరతాబాద్ లో “ధన్వంత్రి నారాయణ మహా గణపతి” విగ్రహం తయారీ ప్రారంభం

వినాయక చవితి వస్తుంది అంటేనే అందరి చూపులు ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతి పైనే ఉంటాయి , భారీ గణపతి విగ్రహాల్లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణనాధుని తిలకించేందుకు లక్షలాది మంది వస్తుంటారు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్‌ మహాగణపతిని కేవలం 6 అడుగుల ఎత్తుతో మట్టితో తయారుచేస్తున్నామని ” ధన్వంత్రి నారాయణ మహాగణపతి” ఆకారంలో వినాయకుడి తయారు చేస్తున్నట్లు తెలిపారు ఖైరతాబాద్: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను బుధవారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగా..

 కృష్ణా నది నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం కనుక ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా  కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని బోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. నిజానికి నేడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా నిర్ణయించిన ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున సమావేశానికి హాజరు కాలేనని తెలిపారు. కాగా, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం కనుక ముందుకు వెళ్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టెండర్లు కూడా ఆహ్వానించడంతో నిన్న రాత్రి ఎలక్ట్రానిక్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం...

ముంబైలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం!

ఎడతెరిపిలేని వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 15 సంవత్సరాల్లో ఇంతగా వర్షం కురవడం ఇదే మొదటిసారి కాగా, చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల అపార్టుమెంట్లలోని సెల్లార్లలోకి నీరు ప్రవేశించి, వేలాది వాహనాలు పనికిరాకుండా పోయాయి. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబైతో పాటు థానె, పుణె తదితర జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారికి సాయపడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, శాంతాక్రజ్ లో ఓ ఇల్లు కూలిపోగా ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. వరద నీటిలో కొట్టుకుపోతూ, కనిపించిన కరెంట్ స్తంభాన్ని పట్టుకున్న ఓ బాలుడు విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఓ చేపల బోటు మునిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ముంబై నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ప్రజా రవాణాను మొత్తం నిలిపివేశారు. ప్రభుత్...

లెబనాన్ రాజధానిలో భారీ పేలుళ్లు.. భయానక దృశ్యాలు

వీడియో చూడండి: https://youtu.be/FSpm4PU8NVk లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో వణికిపోయింది. పేలుడు ధాటికి ఇళ్లలో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. బాల్కనీలు కుప్పకూలాయి. జనం భయంతో పరుగులు తీశారు.వందలాది మంది గాయపడినట్లు తెలుస్తోంది. 10 మంది మరణించినట్లు కొంత మంది మీడియా ప్రతినిధులు ట్విటర్ ద్వారా తెలిపారు. భారీ ప్రాణ నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పేలుళ్లతో జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా వెబ్‌సైట్లలో రాశారు.B   పేలుడు ధాటికి ఇళ్లలో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. పలు ఇళ్లలో బాల్కనీలు కుప్పకూలాయి. ఒక్కసారిగా భూమి కంపించినంత పని అయిందని సోషల్ మీడియాలో కొంత మంది కామెంట్లు పెట్టారు. పేలుడు అనంతరం దట్టమైన పొగ కమ్ముకుంది. కొన్ని వీడియోల్లో జనం ఆర్తనాదాలు చేయడం వినిపిస్తోంది. లెబనాన్‌ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లో వైరల్ అవుతున్నాయి. లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లోని పోర్ట్ ఏరియాలో మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదా...